Thursday 26 January 2017

దేవుడు ఉంగారాన్ని ఏ స్థితిలో ధరించాలి?

దేవుడు ఉంగారాన్ని ఏ స్థితిలో ధరించాలి?
           మనలో చాలా మంది ఉంగరాల్లో, చైన్ లలో దేవుడి ప్రతిమ లు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు ఆదుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తారు. ఆ ప్రతిమ లలో దైవత్వం ఆపాదించుకుంటాం. అసలు దేవుడి ఉంగారాలు ఎలా ధరించాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దా0
         ఉంగరాలు కాని, గొలుసులు కాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు,అభిషేకాలు చేయించి జాతక రిత్యా ధారణ చేయాలి. అలా చేస్తే నే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్త్లు అనేకం ఉంటాయి.
          ఉంగరం లో ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు గోర్ల వైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమి ని చూస్తూ ఉంటాయి. కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.
         ఇక స్త్రీలు అయితే బహిష్టు సమయం కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్ర పరుచుకోవాలి. ఆ సమయం లో ధరించ కూడదు. అంతే కాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం భుజించకూడదు. ఎందుకంటె మాంసాహారం తినేటప్పుడు ఆ మాంసం దేవుడి ప్రతిమ కు తగులుతుంటే ఒక్క సారి ఊహించుకోండి, మనం ఎంత తప్పు చేస్తున్నామో?

         ఇక మగ వారు ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమ కు తగులకూడదు. తెలిసి తెలిసి చేసే తప్పును ఆ భగవంతుడు క్షమించడు. అంతే కాదు మద్యపానం కూడా అంతే ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలి, లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉన్నది.
          ఉదాహరణకు ఏదైనా ప్రమాదం జరిగితే…అయ్యో ఆయన ఎంతో మంచి వాడండి, భగవంతుడు ఇలాంటి వారికే ఎందుకు శిక్షిస్తాడు అని జాలిపడతాం. ఆయన మనసు మంచిది కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణాల మీదకు తెస్తాయి. అందుకే భగవంతుడి విషయం లో జాగ్రత్త గా ఉండాలి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment