Monday 18 December 2023

తిరుప్పావై నాల్గవరోజు పాశురం

తిరుప్పావై నాల్గవరోజు పాశురం

4.పాశురము :


*   ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
    ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
    ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
    పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
    ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
    తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
    వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
    మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.


భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!

    అవతారిక

సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.
    (ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)

ప.    వెనుదీయబోకుమా! వర్జన్యమా!
    కనికరముంచుమ! వర్షాధిదైవతమ!

అ. ప.    పానము చేయుమ! సాగర జలముల
    ఘనమౌ గర్జన చేయగరమ్మా!

1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని
    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ

2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని   
    అసదృశమగు చక్రమువలె మెరసి
    ఆశనిపాత శంఖముగ గర్జించి
    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా

3 చ.    ఆశల, లోకము సుఖముల నొందగ
    మాస మార్గళిని మాకై వర్షింపుమా
    వెనుదీయబోకుమా! పర్జన్యమా!

***సేకరణ***

వి.యస్.యస్.పి.పి, తిరుపతి

Sunday 17 December 2023

తిరుప్పావై మూడవ రోజు పాశురం ....

తిరుప్పావై మూడవ రోజు పాశురం .... 

3. పాశురము :

*    ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
    నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
    తీఙ్గిన్ఱి  నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
    ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
    తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
    వాఙ్గ-  క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
    నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.


భావము: ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!
   
    3వ మాలిక

ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.

        (మోహనరాగము - ఆదితాళము)

ప.    హరి తిరువడులను కొలిచెదము
    తిరు నామములనె పాడెదము

అ.ప..    పెరిగి లోకముల గొలిచిన పాదము
    పరసాధనమని తెలిసి పాడుదము

1 చ.    వ్రతమును చేయగ స్నానమాడెదము
    ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
    వితత సస్యముల నెగయు మీనములు
    మత్తిలి కలువల సోలు భ్రమరముల

2 ఛ.    బలసిన గోవుల పొదుగుల తాకగ
    కలశముల క్షీరధారలు కురియగ
    శ్రీలెయెడతెగని ప్రసారములో యన
    ఇల సిరులదూగు చేతుము వ్రతమును.

***సేకరణ***

వి.యస్.యస్.పి.పి, తిరుపతి

Saturday 16 December 2023

తిరుప్పావై రెండవరోజు పాశురం


తిరుప్పావై రెండవరోజు పాశురం

2.పాశురము :

    వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
    శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
    పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
    నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
    మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
    శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
    ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
    ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.


భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.

    అవతారిక :

ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

    2వ మాలిక

    (మధ్యమావతి రాగము - ఆదితాళము)

..    వినుడోయమ్మ! వినుడు
    భూమిని సుఖముల బడయ దలచిన
    భాగ్యవతులార! వినుడు
    వినుడోయమ్మ!వినుడు
అ..ప..    మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు
    వినుడోయమ్మ వినుడు
1. చ..    పాలకడలిపై పవళించిన స్వామి - పరమాత్ముని పాదముల కామించి   
    పాడిపాడి ఉజ్జీవించు విధమెరిగి - పరమ పవిత్రులె కావలె వినుడు
2. చ...    పూజ్యులకు భిక్ష, పేదకు దానము - పొసగ జేయవలె నిరతమును
    సృతమానము, పాలను ద్రావము - పగటుగా కనుక కాటుక దీర్పము
3 చ..    ప్రాతఃకాలము నీరాడుదుము - పగటుగా కనుక కాటుక దీర్పము
    పూవులతోడ కురులనే ముడువము
    పెద్దలు చేయని పనులను చేయము
    మిత్రం చేయగరాని పనలనే చేయము
    చేటు మాటలను చెప్పగబోము
    చేరదలచు నా గమ్యము వీడము
    చేరగ శ్రీ పతి వేడుకొందుము
    వినుడోయమ్మ! వినుడు

Friday 15 December 2023

తిరుప్పావై పాశురాలు

తిరుప్పావై పాశురాలు
30 పాశురాలు

తిరుప్పావై ప్రాముఖ్యత

            భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని గోదాదేవి (ఆండాళ్) ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. 

       ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.

             పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. 

            కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. 

                   మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. (గోదాదేవి చేసింది కాత్యాయనీ వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో ఉంది.) తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. 

              అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.

పాశురాలు గురించి

         మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి; దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తే, పాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.

            పక్షుల కిలకిలారావములు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. 

            తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు.

చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

.పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

2.పాశురము

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

3.పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

4.పాశురము
 
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

'5.పాశురము '

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

6.పాశురము

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్

మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

7.పాశురము

కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

8.పాశురము

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

9.పాశురము

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

10.పాశురము

నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

11.పాశురము

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

12.పాశురము

కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్

13.పాశురము

పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్

      ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్

పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

14. పాశురము

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

15. పాశురము

ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

16.పాశురము

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
 నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

24.పాశురము

అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.

25.పాశురము

ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.

26.పాశురము

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.

27.పాశురము

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్

28.పాశురము

క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

29.పాశురం

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

30.పాశురము
 
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్
      
 శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

****సేకరణ****
వి.యస్.యస్.పి పి
తిరుపతి


తిరుప్పావై మొదటిరోజు పాశురం


తిరుప్పావై మొదటిరోజు పాశురం

తిరుప్పావై

1.    పాశురము :

    *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
    నారాయణనే నమక్కే పఱై దరువాన్
    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

        తిరుప్పావైగీతమాలిక

    అవతారిక:
వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)
ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!
అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!
1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని
    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి
2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.   

***సేకరణ***

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

Sunday 10 December 2023

కార్తీక పురాణం - 28 వ అధ్యాయం

*కార్తీక పురాణం - 28 వ అధ్యాయం 

 *విష్ణు సుదర్శన చక్ర మహిమ :*

             జనక మహారాజా ! వింటివా దుర్వాసుని అవస్ధలు ! తాను ఎంతటి కోపవంతుడైనను , వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున , ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

             అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి *"అంబరీషా , ధర్మపాలకా ! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము , నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి , కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. 
              నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్దించితిని . ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"* మని అనేక విధాల ప్రార్ధించగా , అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి , *"ఓ సుదర్శన చక్రమా ! నీకివే నా మనఃపూర్వక వందనములు. 
            ఈ దూర్వాస మహాముని తెలిసియో , తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన , ఈతనిని చంపవలదు , ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని , ముందు నన్నుచంపి , తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి , నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు , దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు.                 ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా ! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు , నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.*

                *నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును , శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము"* అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి *"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా ! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు , మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు ఏకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ! 
              ఈ లోకములో దుష్టశిక్షణ , శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే , ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి , నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి , ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.*

           *ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని , శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను , కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు.     
              నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.*

                 *ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి , శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు"* మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి , *" నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును , స్త్రీలయందును , గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా అభిలాష. కాన , శరణుగోరిన ఈ దుర్వాసుని , నన్నూ కరుణించి రక్షింపుము.
                 వేలకొలది అగ్నిదేవతలు , కోట్ల కొలది సూర్య మండలములు ఏక మైననూ నీ శక్తీకి , తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి , వారిని శిక్షించి , తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన , నికివే నామనఃపూర్వక నమస్కృతులు"* అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. 
             అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి *"అంబరీషా ! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో , ఎవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో , ఎవరు పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబట్టక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి , ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన , నిన్నూ , దుర్వాసుని రక్షించుచున్నాను , నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు."* అని చెప్పి అతన్నీ ఆశీర్వదించి , అదృశ్యమయ్యెను.

          స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తం.*

*-సేకరణ.*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Saturday 9 December 2023

కార్తీకపురాణం 27వ అధ్యాయం




కార్తీకపురాణం 27వ అధ్యాయం

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట

                  అత్రిమహాముని తిరిగిఅగస్త్యునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు.

            శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం.

          నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది.

                  ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… వాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

                  బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! అంబరీషుని గురించి తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.

స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం – ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం

Friday 8 December 2023

*కార్తీక పురాణం - 26 వ అధ్యాయం


*కార్తీక పురాణం - 26 వ అధ్యాయం 

 *దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట -
 శ్రీహరి హితబోధ :*

              ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి , మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

         ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము , భువర్లోకము , పాతాళలోకము , సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి *"వాసుదేవా ! జగన్నాథా ! శరణాగతరక్షణ బిరుదాంకితా ! రక్షింపుము. 
           నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"* దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. 
           ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"దూర్వాసా ! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా ! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను.
          ప్రతియుగమందున గో , దేవ , బ్రాహ్మణ , సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. 
              అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని , అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడ , నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి , నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను !
             చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని , పవిత్రతకును చేయదగినదే కదా ? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే ? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. 
           ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని , తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి , దయాశాలి , ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

              అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము , సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. 
          నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి , ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. 
                 పిదప , యదువంశమున శ్రీకృష్ణునిగను , కలియుగమున బుద్దుడుగను , కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట *"కల్కి"* యను పేరున జన్మించి , అశ్వారూడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

* స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము -

ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తం.*

* సేకరణ*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Thursday 7 December 2023

కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

కార్తీక పురాణం - ఇరవైఐదవ అధ్యాయము

దుర్వాసుడు అంబరీషుని శపించుట

             మహారుషులు అంబరీషుడి మీమాంసని విని , ఇలా చెబుతున్నారు…. ”ఓ అంబరీషా! పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది. అయితే నీకు ఒకరు చెప్పడం కంటే… నీ బుద్దితో దీర్ఘంగా ఆలోచించి, నీకెలా అనిపిస్తే అలా చేయి”అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయారు .           దాంతో అంబరీషుడు ”ఓ పండితోత్తములారా! మీరు వెళ్లేముందు నా అభిప్రాయం కూడా వినండి. ద్వాదశి నిష్టను వీడడం కంటే.. విప్ర శాపం అధికమైనది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరిచినట్టు కాదు . ద్వాదశి వ్రతాన్ని కూడా నిలుపుకున్నట్టు అవుతుంది . అప్పుడు దుర్వాసులవారు నన్నెందుకు నిందిస్తారు? . దీనివల్ల దూర్వాసులవారిని అవమానించకుండా,నా వ్రతాన్ని దక్కించుకున్నట్టు అవుతుంది .నా పుణ్యఫలం నశించదు” అని చెప్పి నీళ్లు తాగాడు. ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నానజపాదులు పూర్తిచేసుకుని, అక్కడకు వచ్చారు .

             వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడై… కళ్ల వెంట నిప్పుకక్కుతూ… ”ఓరీ మధాంధా ! నన్ను భోజనానికి పిలిచి, నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు? ఎంత దుర్మార్గం? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నం పెడతానని ఆశచూపించి, నాకు పెట్టకుండా నీవు తినగలవా? అలా తినేవాడు మాలభక్షకుడవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. 

            నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భుజించావు. కాబట్టి, నీవు నమ్మకద్రోహివి అవుతావేకానీ, హరిభక్తుడివి కాలేవు. శ్రీహరి బ్రాహ్మణావమానాన్ని సహింపడు. మమ్మల్ని అవమానిస్తే… శ్రీహరిని అవమానించినట్లే. నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు. నీవు మహాభక్తుడివనే అహంకారం, గర్వంతో ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి, అవమానపరచావు. నిర్లక్ష్యంగా జలాపానం చేశావు. అంబరీషా! నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు? నీ వంశం కళంకం కాలేదా?” అని కోపంతో నోటికి వచ్చినట్లు ధూషించాడు.

             అంబరీషుడు గజగజావణుకుతూ… ముకుళిత హస్తాలతో ”మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను. నన్ను క్షమించి, రక్షించండి… బ్రాహ్మణులకు శాంతి ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలున్నవారు” అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు. దయార్ద్ర హృదయమేలేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని ”దోషికి శాపమీయకుండా ఉండరాదు. 

            నీవు మొదటిజన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగానూ, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహంగానూ, అయిదో జన్మలో వామనుడిగా, ఆరోజన్మలో క్రూరుడవైన బ్రాహ్మణుడిగా, ఏడో జన్మలో ముధుడవైన రాజుగా, ఎనిమిదో జన్మలో రాజ్యంగానీ, సింహాసనంగానీ లేని రాజుగా, తొమ్మిదో జన్మలో పాషండమతస్తునిగా, పదో జన్మలో పాపబుద్దిగలిగి, దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవు గాక” అని శపించాడు. 

             ఇంకా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపించేందుకు ఉద్యుక్తుడవ్వగా… శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృథాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా – అంబరీషుని హృదయంలో ప్రవేశించి ”మునివర్యా! అలాగే… మీ శాపాన్ని అనుభవిస్తాను” అని ప్రాధేయపడ్డాడు. కానీ, దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా… శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు.

              ఆ సుదర్శనం ముక్కోటి సూర్య ప్రభలతో, అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయింది . అంతట దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి  పరుగు ప్రారంభించాడు. మహాతేజస్సుతో ఆ చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులు, దేవలోకంలో దేవేంద్రుడిని, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని , కైలాసంలో శివుని  ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు. వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు . 

శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, కార్తీక మహత్యంలోని ఇరవైఐదవ  అధ్యాయము , 

***సేకరణ***

వి.యస్.యస్.పి.పి

తిరుపతి


Wednesday 6 December 2023

కార్తీక పురాణం - 24 వ అధ్యాయం

*కార్తీక పురాణం - 24 వ అధ్యాయం 

 *అంబరీషుని ద్వాదశి వ్రతము :*

                 అత్రి మహాముని మరల అగస్త్యునితో *"ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావమునెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.*

           *"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.*

             *కార్తీక శుద్ధదశమి రోజున,పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"* అని ఇట్లు చెప్పుచున్నాడు.

అంబరీషుని ద్వాదశి వ్రతము

           పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను.

               అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు.    

             బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. 

          ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."* అని అలోచించి

                *"బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"* దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

             *"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను.

              ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"* దని కోరెను. 

            అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి *"మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు.

          ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. 

           అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* అని విశదపరచిరి.

* స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము 

- ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తం.*

*-సేకరణ.*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Tuesday 5 December 2023

కార్తీక పురాణం - 23 వ అధ్యాయం

*కార్తీక పురాణం - 23 వ అధ్యాయం 

  *శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట :*

              అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి *"ఓ మునిపుంగవా ! విజయమొందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"* మని అడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా 
                పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము ,శత్రుశేషము వుండకూడదని తెలిసి,తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు , పవిత్రుడు , సత్యదీక్షాతత్పరుడు , నిత్యాన్నదాత , భక్తప్రియవాది , తేజోవంతుడు , వేదవేదాంగవేత్తయై యుండును. 
            అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై , విష్ణు సేవాధురంధరుడై , కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల ? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు , సదాచార సత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున , యే కాలమున , యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా ? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి *"పురంజయా ! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు"* అని పలికెను.

          అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని , రాజ్యభారమును మంత్రులకు అప్పగించి , సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు , ఆయా దేవతలను సేవించుచు , పుణ్యనదులలో స్నానము చేయుచు , శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది , చేతులు జోడించి , 

*"దామోదరా ! గోవిందా ! గోపాలా ! హరే ! కృష్ణా ! వాసుదేవా ! అనంతా ! అచ్యుతా ! ముకుందా ! పురాణపురుషా ! హృషికేశా ! ద్రౌపదీమాన సంరక్షకా ! దీనజన భక్తపోషా ! ప్రహ్లాదవరదా ! గరుడధ్వజా ! కరివరదా ! పాహిమాం ! పాహమాం ! రక్షమాం రక్షమాం ! దాసోహం పరమాత్మ దాసోహం"* 
              విష్ణు సోత్త్రమును పఠించి , కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల , మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో , పాడిపంటలతో , ధనధాన్యాలతో , ఆయురారోగ్యములతో నుండిరి.

              అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహా గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై , రాజనీతి గలవారై , వైరిగర్భ నిర్బేదకులై , నిరంతరము విజయశశీలురై , అప్రమత్తులై యుండిరి.
     
      ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ , పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము , విశాల కటిత్వము , సూక్ష్మ మద్యత్వము , సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు , శీలవతులనియు , గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి
       ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై , ప్రౌఢలై , వయోగుణ రూప లావణ్య సంపన్నలై , సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

                  పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు , కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని , తన కుమారునికి రాజ్యభారము అప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. 
                అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున , ఓ అగస్త్యా ! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి , చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

* స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - 
ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తం.*

*సేకరణ*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Monday 4 December 2023

కార్తీక పురాణం 22 వ అధ్యాయం

కార్తీక పురాణం 22 వ అధ్యాయం

పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమాచరించుట

అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు

               వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి

            *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్న నీ సైన్యమును కూడాదీసుకొని ,యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*

            ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !

            హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. 

           బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును.

          ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.

            శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.


 స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య 

మందలి ద్వావింశోధ్యాయము - 

ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తం.*


*_ సేకరణ.*

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

Sunday 3 December 2023

కార్తీక పురాణం 21 వ అధ్యాయం


కార్తీక పురాణం 21 వ అధ్యాయం :*

పురంజయుడు కార్తీక ప్రభావం

             అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు- రథికుడితో, అశ్వసైనికుడు -అశ్వసైనికుడితో, గజ సైనికుడు- గజ సైనికుడితో, పదాతులు -పదాతి దళాలతో, మల్లులు -మల్లయుద్ధ నిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు- అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు.

          ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు.

           ఆ రణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. 

              యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించసాగాడు .

       ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి,పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు.

        ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో స్వామిని  అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు , విష్ణుమూర్తిని   సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. 

            కాబట్టి… రేపు అలా చేసినట్లయితే… పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.

శ్లో// అపవిత్ర:  పవిత్రోవా సర్వావస్థాంగతోపివా

యః  స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరః  శుచి:||


శ్రీ స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త, 

కార్తీక మహత్యంలోని 

ఇరవయ్యొకటవ అధ్యయము , 

ఇరవయ్యొకటవ రోజు పారాయణము సమాప్తం . 


సేకరణ

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

Saturday 2 December 2023

కార్తీక పురాణం - 20 వ అధ్యాయం

*కార్తీక పురాణం - 20 వ అధ్యాయం

*పురంజయుడు దురాచారుడగుట :*

            జనక మహారాజు , చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో 
          *"గురువర్యా ! కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా ! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయుడనెను. అ మాటలకు వశిష్టుల వారు మందహాసముతో *"ఓ రాజా ! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి , అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు"* మని అ కథా విధానమును ఇట్లు వివరించిరి.

           పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి , *"ఓ అత్రిమహామునీ ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును , కాన దానిని నాకు వివరింపుము"* అని కోరెను. అంత అత్రిమహముని *"కుంభసంభవా ! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరమగుటచే ఉత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు.
            అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను , శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను , లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము.

                త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను , రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని , పరమలోభియై , చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. 
             ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ , కొంకణ , కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ , గజ , తురగ , పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి , నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భంధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.

             అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి , చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై - వారిని యెదుర్కొన భేరి మ్రోగించి , సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తం.*

* సేకరణ*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Friday 1 December 2023

కార్తీక పురాణం - 19 వ అధ్యాయం

*కార్తీక పురాణం - 19 వ అధ్యాయం

 *చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ :*

               ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహామును లందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి *"ఓ దీనబాంధవా ! వేద వేద్యుడవని , వేద వ్యాసుడవని , అద్వితీయుడవని , సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని , సర్వాంతర్యామివని , బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని , నిత్యుడవని , నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా ! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. 
                సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా ! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు , మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా ! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి , మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా , యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు.
            ఓ గజేంద్రరక్షకా ! ఉపేంద్రా ! శ్రీధరా ! హృషీకేశా ! నన్ను కాపాడుము"* అని మైమరచి స్తోత్రము చేయగా , శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"జ్ఞానసిద్దా ! నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము"* అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు *"ప్రద్యుమ్నా ! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకోనుచున్నాను. కనుక , నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు"* అని వేడుకొనెను. 
         అంత శ్రీమన్నారాయణుడు *"ఓ జ్ఞానసిద్దుడా ! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక , మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై , బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.
        *నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి , నా సన్నీధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు , వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. 
            వ్రతము చేసినవారికి జన్మ , జరా , వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును , శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు."* అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.
               వశిష్టుడు జనకమహారాజుతో *"రాజా ! ఈ విధముగా విష్ణుమూర్తి , జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు , అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

* స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త 
కార్తీక మహాత్మ్యమందలి 
ఏకోనవింశోధ్యాయము - 
పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తం.*

*సేకరణ.*
వి.యస్.యస్.పి.పి
తిరుపతి