Friday 27 January 2023

సూర్యాష్టకం,సూర్యమండలస్తోత్రం,ద్వాదశ ఆదిత్య స్తుతి

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
 *సూర్యాష్టకం*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*సూర్యమండలస్తోత్రం/సూర్యమండలాష్టకం (భవిష్యోత్తర పురాణ అంతర్గతం)*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతీ స్థితినాశహేతవే*
*త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరంచి* *నారాయణ శంకరాత్మన్*
*నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే* *సహస్రశాఖాన్వితసంభవాత్మనే*
*సహస్రయోగోద్భవభావభాగినే సహస్రసంఖ్యాయుగధారిణే నమః*

*యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం*
*దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥1॥*

*యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదం*
*తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥2॥*

*యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం*
*సమస్త-తేజోమయ-దివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥3॥*

*యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానాం*
*యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥4॥*

*యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుఃసామసు సంప్రగీతం*
*ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥5॥*

*యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణ-సిద్ధసంఘాః*
*యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥6॥*

*యన్మండలం సర్వజనైశ్చ పూజితం జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే*
*యత్కాలకాలాద్యమనాదిరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥7॥*

*యన్మండలం విష్ణుచాతుర్ముఖాఖ్యం యదక్షరం పాపహరం జనానాం*
*యత్కాలకల్పక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥8॥*

*యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధముత్పత్తి-రక్షా-ప్రలయ-ప్రగల్భం*
*యస్మింజగత్సంహరతేఽఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥9॥*

*యన్మండలం సర్వగతస్య విష్ణోరాత్మా పరం ధామ విశుద్ధతత్త్వం*
*సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥10॥*

*యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణ-సిద్ధసంఘాః*
*యన్మండలం వేదవిదః స్మరంతి పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥11॥*

*యన్మండలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగపథానుగమ్యం*
*తత్సర్వవేద్యం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం ॥12॥*

*సూర్యమండలసుస్తోత్రం యః పఠేత్ సతతం నరః*
*సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ॥13॥*

*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీకృష్ణార్జునసంవాదే సూర్యమండలస్తోత్రం సంపూర్ణం*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ద్వాదశ ఆదిత్య స్తుతి* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు || ౧ ||

నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే |
క్రమమాణ యోజనానాం నమోఽస్తు తే నళిననాథాయ || ౨ ||

కర్మ-జ్ఞాన-ఖ-దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ || ౩ ||

త్వం హి యజూ ఋక్ సామః త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ || ౪ ||

శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి || ౫ ||

త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేంద్రియజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్ రోషాగ్నినా దహతు || ౬ ||

ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంశుః || ౭ ||

యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలం |
ధృతబోధం తం నళినీభర్తారం హర్తారమాపదామీడే || ౮ ||

యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమాంశుబింబగతః |
భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః || ౯ ||

తిమిరమివ నేత్రతిమిరం పటలమివాఽశేషరోగపటలం నః |
కాశమివాధినికాయం కాలపితా రోగయుక్తతాం హరతాత్ || ౧౦ ||

వాతాశ్మరీగదార్శస్త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ |
గ్రహణీభగంధరాఖ్యా మహతీస్త్వం మే రుజో హంసి || ౧౧ ||

త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో || ౧౨ ||

ఇత్యార్యాద్వాదశకం సాంబస్య పురో నభఃస్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్తరోగక్షయశ్చ స్యాత్ || ౧౩
🙏🌸🌸🌸🌸🌸🙏

ఓం ఆదిత్యాయ నమః


⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏

💥మాఘశుద్ధ సప్తమి - #రధసప్తమి💥

నమస్సవిత్రే జగదేక చక్షుషే
జగత్ప్రసూతిస్థితినాశ హేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే

💥సూర్యుడు... సమస్త జగతికీ మూలాధారం.
కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతో పాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు "రథసప్తమి"

సూర్య భగవానుడు ఉదయం వేళలో "బ్రహ్మ" స్వరూపంగా ప్రకృతిలో జీవం నింపి,
మధ్యాహ్నం వేళలో తన కిరణాల ద్వారా "మహేశ్వరుడి"లా దైవిక వికారాలను రూపుమాపి,
సాయంకాలం సంధ్య వేళలో "విష్ణుమూర్తి" అవతారంలోలా భాసిల్లే కిరణాలను మనో రంజకంగా ప్రసరింపజేస్తూ మనకి ఆనందాన్ని ఇస్తాడు.
అంతే కాదు ఈ లోకంలో అంధకారం తొలగించి, మనకు వెలుగుని ప్రసాదిస్తాడు.

💥సప్తాశ్వరధం మీద సంచరించే సూర్యభగవానుడు తన సంచారగతిని మార్చుకునే రోజు "రథసప్తమి"
ఈనాటి బ్రహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రముఖ నక్షత్రాలన్నీ రధాకారంలో అమరి వుండి సూర్య రథాన్ని తలపింపజేస్తాయని ప్రతీతి.

ఈరోజు నుండి పూర్తిగా ఉత్తరదిశగా సూర్యుని గమనం సాగుతుంది. ఉత్తర మార్గ గమనమును ఊర్ధ్వ ముఖ గమనంగా చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు.

శ్లో ||
సూర్యగ్రహణ తుల్యాతుశుక్లామాఘస్య సప్తమి
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్
మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద:

- షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం.

💥స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానిస్తూ, జిల్లేడు, రేగు ఆకులను తలపై భుజాలపై పెట్టుకొని స్నానమాచరించాలి.

నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః |
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే ||

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు |
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ ||

ఏతజ్జన్మ కృతం పాపం యజ్ఞన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః ||

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే |
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరీ సప్తమీ ||

- జన్మ మొదలుగా చేసినదియూ, జన్మంతరాలలో చేయునదియూ అగు శోక రోగ రూపంలోనూ వుండు పాపమంతయూ మకరంలోని సప్తమీ హరించుగాక. 

ఈ జన్మయందు, జన్మాంతరమందు మనో వాక్కు ఇంద్రియాలచే తెలిసీ తెలియక చేసిన ఏడు విధాలుగా రోగం రూపంలో వుండే సప్తవిధ పాపమంతయూ ఈ స్నానంచేత నశించాలన్నది ఈ మంత్రార్ధమని ధర్మసింధు తెలుపుతుంది. 

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

💥సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకునే వృక్షాలలో జిల్లేడు, రేగు ప్రధానమైనవి.
ఈ ఆకుల్ని స్పృశిస్తూ స్నానం చేయడం వలన వీటిలోని శక్తి, నీటిలోని విద్యుచ్చ్చక్తి శరీరంపై ప్రభావాన్ని చూపి, ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది.

ఈ ఆకుల్లో నిల్వచేయబడిన ప్రాణశక్తి, శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి, నాడుల్ని ఉత్తేజపరుస్తూ మానసిక దృఢత్వం, జ్ఞాపకశక్తిని పెంచి, శిరస్సంబంధమైన రోగాలను నశింపజేస్తుంది. 

అందుకే  'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని శాస్త్రాలు శ్లాఘిస్తున్నాయి. 

💥స్నానానంతరం -

సప్తసప్తివహ ప్రీత సప్తలోకప్రదీపన |
సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||

- అంటూ సూర్యునకు ఆర్ఘ్యమివ్వాలి.

💥తదుపరి ఎర్రచందనం, ఎర్రని పుష్పాలతో సూర్యభగవానుని అర్చించడం విశిష్టమైనది.

💥రథసప్తమి రోజు... ఆరుబయట సూర్యకిరణాలు పడే దగ్గర ఇంటి ముందు ఆవుపేడ పిడకలను కాల్చి ఈ వేడిలో పరమాన్నం చేసి సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరుబయట సూర్య కాంతిలో పొంగేపాలు 'సిరులు పొంగు' కి సంకేతంగా భావిస్తారు

ఆ క్షీరాన్నాన్ని చెఱుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.
దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు.

💥చిక్కుడుకాయలతో చేసిన రథం పై సూర్య భగవానుణ్ణి ఉంచి పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి.

ఆదిత్యున్ని ఆరాధించడం వలన ఆరోగ్యం, ఆయుష్షు, తేజస్సు, ఐశ్వర్యం సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. 

💥ఇన్ని శ్లోకాలు చదవలేని వారు...
"ఓ సూర్యనారాయణ తెలిసీ, తెలియక చేసిన నా పాపములను నశింపజేసి, సద్బుద్ధిని ప్రసాదించు" అని అనుకుంటూ,

మనసార సూర్యుణ్ణి నమస్కరిస్తూ, సప్త సప్త మహాసప్త, సప్తమీ రధసప్తమి అని ఏడుసార్లు జపిస్తూ స్నానం ముగించాలని,

అదీ కష్టమనుకుంటే "ఓ సూర్యనారాయణమూర్తీ నీకివే నా హృదయపూర్వక నమస్సులు" అని భక్తి పూర్వకంగా పెడితే చాలు,

ఆయన నమస్కారప్రియుడు.
'నమస్కార ప్రియో భాను:' - భక్తిగా నమస్కరిస్తే చాలు అనుగ్రహిస్తాడు ఆదిత్యుడు.
సేకరణ💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

కూష్మాండ దీపం


🪔 *కూష్మాండ దీపం :* 🪔


👉 కూష్మాండ(గుమ్మడికాయ)దీపం అంటే ఎంటి ?
ఎలా వెలిగిస్తారు ? దేని కోసం వెలిగిస్తారు ? 

👉 కూష్మాండ దీపం ఎలా పెడతారు ?
ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చెయ్యాలి.
ఒక వ్యక్తికి దృష్టి దోషం, నర ఘోష, శని దోషం, ఆర్ధిక సమస్యలు, ఇంట్లో నెగిటి్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం పిల్లలు మాట వినకపోవడం మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం, మంచి పరిహారం ఇది అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే.

👉 ఒక చిన్న గుమ్మడి (బూడిద) కాయ తీసుకుని చిన్నది పెద్దది కాదు. దాన్ని అడ్డగ కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి.

👉 ఆ దీపానికి పంచ ఉపచర పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి.

👉 ఎప్పుడు చెయ్యాలి? ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యాలి.

👉 ధన యోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి. 
జన ఆకర్షణ కోసం అమావాస్య రోజు చెయ్యాలి.

👉 ఎన్ని సార్లు చెయ్యాలి 19 అష్టములు కానీ 19 అమావాస్య లు కానీ చెయ్యాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి.

👉 ఆ రోజు ఉపవాసము ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో చెయ్యాలి.
సంకల్ప మాత్రం చెప్పుకోవాలి కోరిక చెప్పుకోవాలి.

👉 మీ జీవితం లో ఉన్న పూర్తి దృష్టి గ్రహ వాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి.
ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
వి.యస్.యస్.పి.పి.
తిరుపతి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Tuesday 24 January 2023

శ్రీవేంకటేశశరణాగతి స్తోత్రమ్


*శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం* 
🙏🌸🙏🌸🙏🌸🙏
శేషాచలాసమాసాద్య కశ్యపాద్యా మహర్షయః |
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా || ౧ ||

కలిసంతారకం పుణ్యం స్తోత్రమేతత్ జపేన్నరః |
సప్తర్షి వా ప్రసాదేన విష్ణుః తస్మై ప్రసీదతీ || ౨ ||

కశ్యప ఉవాచ –
కారి హ్రీమంత విద్యాయాః ప్రాప్యైవ పరదేవతా |
కలౌ శ్రీవేంకటేశాఖ్యః త్వామహం శరణం భజేత్ || ౩ ||

అత్రీ ఉవాచ –
అకారాది క్షకారాంత వర్ణైః యః ప్రతిపాద్యతే |
కలౌ శ్రీవేంకటేశాఖ్యః శరణం మే రమాపతీ || ౪ ||

భరద్వాజ ఉవాచ –
భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక |
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః || ౫ ||

విశ్వామిత్ర ఉవాచ –
విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః |
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః సదా || ౬ ||

గౌతమ ఉవాచ –
గౌర్గాలీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః |
శరణం గౌతమాస్యాస్త వేంకటాధి శిరోమణిః || ౭ ||

జమదగ్నిరువాచ –
జగత్కర్తా జగత్భర్తా జగన్నాథో జగన్మయా |
జమదగ్నిః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః || ౮ ||

వసిష్ఠ ఉవాచ –
భక్తిజ్ఞానమాత్రం చ యన్ నిర్విశేషం సుఖం చ సత్ |
తత్ర హైవాహమస్మీతి వేంకటేశం భజేత్ సదా || ౯ ||

సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యః పఠేన్ నరః |
సోఽభయం ప్రాప్నుయాన్ సత్యం సర్వత్ర విజయీ భవేత్ || ౧౦ ||

ఇతి శ్రీవేంకటేశశరణాగతి స్తోత్రమ్ సంపూర్ణమ్ |


🙏🌸🌸🌸🌸🌸🙏
సేకరణ.💐💐
వి.యస్.యస్.పి.పి
💐💐💐💐💐💐

సంతాన గణపతి స్తోత్రం

*సంతాన గణపతి స్తోత్రం  :*
*ౙౙౙౙౙౙౙౙౙౙౙౙౙ*

నమోఽస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ ।
సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ ॥ 1 ॥

గురూదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే ।
గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే ॥ 2 ॥

విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే ।
నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే ॥ 3 ॥

ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః ।
ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే ॥ 4 ॥

శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు ।
భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయక ॥ 5 ॥

తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరోమతః ।
పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ ॥ 6 ॥

ఇతి సంతానగణపతిస్తోత్రం సంపూర్ణమ్ ॥

 *ౙౙౙౙౙౙౙౙౙౙౙౙ*
*సేకరణ :వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత,పరిషత్.*
శాంతి.నగర్,ఖాధికాలని,తిరుపతి
*ౙౙౙౙౙౙౙౙౙౙౙౙౙ*

Monday 23 January 2023

విద్యాదాన వాక్సరస్వతీ హృదయస్తోత్రం

విద్యాదాన వాక్సరస్వతీ హృదయస్తోత్రం

ఓం అస్య శ్రీ వాగ్వాదినీ శారదామంత్రస్య మార్కండేయాశ్వలాయనౌ ఋషీ,
స్రగ్ధరా అనుష్టుభౌ ఛందసీ, 
శ్రీసరస్వతీ దేవతా . శ్రీసరస్వతీప్రసాదసిద్ధ్యర్థే వినియోగః .. 

ధ్యానం .. 
శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం .
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేష్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం .. 1..

బ్రహ్మోవాచ .
హ్రీం హ్రీం హృద్యైకవిద్యే శశిరుచికమలాకల్పవిస్పష్టశోభే 
భవ్యే భవ్యానుకూలే కుమతివనదహే విశ్వవంద్యాంఘ్రిపద్మే .
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసంపాదయిత్రి 
ప్రోత్ప్లుష్టా జ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే .. 2..

ఐం ఐం ఐం ఇష్టమంత్రే కమలభవముఖాంభోజరూపే స్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే .
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిషయే నాపి విజ్ఞానతత్త్వే
విశ్వే విశ్వాంతరాళే సురవరనమితే నిష్కళే నిత్యశుద్ధే .. 3..

హ్రీం హ్రీం హ్రీం జాపతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తాం .
విద్యే వేదాంతగీతే శ్రుతిపరిపఠితే మోక్షదే ముక్తిమార్గే
మార్గాతీతప్రభావే భవ మమ వరదా శారదే శుభ్రహారే .. 4..

ధ్రీం ధ్రీం ధ్రీం ధారణాఖ్యే ధృతిమతినుతిభిః నామభిః కీర్తనీయే
నిత్యే నిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే .
పుణ్యే పుణ్యప్రభావే హరిహరనమితే వర్ణశుద్ధే సువర్ణే
మంత్రే మంత్రార్థతత్త్వే మతిమతిమతిదే మాధవప్రీతినాదే .. 5..

హ్రీం క్షీం ధీం హ్రీం స్వరూపే దహ దహ రుదితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాచారచిత్తే స్మితముఖి సుభగే జంభనిస్తంభవిద్యే .
మోహే ముగ్ద్ధప్రబోధే మమ కురు సుమతిం ధ్వాంతవిధ్వంసనిత్యే
గీర్వాగ్ గౌర్భారతీ త్వం కవివరరసనాసిద్ధిదా సిద్ధిసాద్ధ్యా .. 6..

సౌం సౌం సౌం శక్తిబీజే కమలభవముఖాంభోజభూతస్వరూపే 
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే .
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే జాప్యవిజ్ఞానతత్త్వే
విశ్వే విశ్వాంతరాళే సురగణనమితే నిష్కళే నిత్యశుద్ధే .. 7..

స్తౌమి త్వాం త్వాం చ వందే భజ మమ రసనాం మా కదాచిత్ త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే జాతు పాపం .
మా మే దుఃఖం కదాచిద్విపది చ సమయేఽప్యస్తు మేఽనాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధిః మాఽస్తు కుంఠా కదాచిత్ .. 8..

ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినమ్రః
దేవీం వాచస్పతేరప్యతిమతివిభవో వాక్పటుర్నష్టపంకః .
సః స్యాదిష్టార్థలాభః సుతమివ సతతం పాతి తం సా చ దేవి 
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితావిఘ్నమస్తం ప్రయాతి .. 9..

బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః .
సారస్వతో నరః పాఠాత్ స స్యాదిష్టార్థలాభవాన్ .. 10..

పక్షద్వయేఽపి యో భక్త్యా త్రయోదశ్యేకవింశతిం .
అవిచ్ఛేదం పఠేద్ధీమాన్ ధ్యాత్వా దేవీం సరస్వతీం .. 11..

శుక్లాంబరధరాం దేవీం శుక్లాభరణభూషితాం .
వాంఛితం ఫలమాప్నోతి స లోకే నాత్ర సంశయః .. 12..

ఇతి బ్రహ్మా స్వయం ప్రాహ సరస్వత్యాః స్తవం శుభం .
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వం ప్రయచ్ఛతి .. 13..

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే నారదనందికేశ్వరసంవాదే బ్రహ్మప్రోక్తే
విద్యాదానవాక్సరస్వతీహృదయస్తోత్రం సంపూర్ణం ..

ఏవం రుద్రయామలే తంత్రే దశవిద్యారహస్యే సరస్వతీస్తోత్రం .

👉విద్యకు ఆటంకాలు తొలగి పోతాయి.



మాఘ పురాణం - 2 వ అధ్యాయము

_*మాఘ పురాణం - 2 వ అధ్యాయము*_

*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*

మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.

సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.

ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.

నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది. పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని

అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.

ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.

Sunday 22 January 2023

శ్రీకృష్ణ పరమాత్మ, ఉడిపి

*కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం*

దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -

1. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 

2. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.

కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 

3. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

4. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.

5. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.

*సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః /*
*పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ //*

యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -

ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ

శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.

శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 

"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము  

  *కృష్ణం వందే జగద్గురుమ్*

శ్యామల దండకం

శ్యామలా దండకమ్ 

ధ్యానమ్-
మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి  ౧ 

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః  ౨ 

వినియోగః-
మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ  ౩ 

స్తుతి-
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే  ౪ 

దండకమ్-
జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే, కృత్తివాసప్రియే! (హృద్యన్మణి - పాఠాంతరం)

సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలీ సనాథత్రికే, సానుమత్పుత్రికే!

శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీనద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే,  లోకసంభావితే!

కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్పసందేహ కృచ్చారు గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే,  

ప్రోల్లసద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికామండలోద్భాసి గండస్థలన్యస్త కస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంతభృంగాంగనా గీతసాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే, సుస్వరే, భాస్వరే,

వల్లకీవాదన ప్రక్రియాలోల తాలీదలాబద్ధ తాటంకభూషా విశేషాన్వితే సిద్ధసమ్మానితే, 

దివ్యహాలా మదోద్వేల హేలాలసచ్చక్షురాందోలన శ్రీసమాక్షిప్త కర్ణైక నీలోత్పలే, 

పూరితాశేష లోకాభి వాంఛా ఫలే! శ్రీఫలే!

 స్వేదబిందూల్లసత్ ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే! సర్వమంత్రాత్మికే! కాళికే!

కుంద మందస్మితోదార వక్త్ర స్ఫురత్పూగ కర్పూరతాంబూల ఖండోత్కరే! జ్ఞానముద్రాకరే!

కుందపుష్పద్యుతిస్నిగ్ధ దంతావలీ నిర్మలాలోల కల్లోల సమ్మేలన స్మేరశోణాధరే! చారువీణాధరే! పక్వబింబాధరే!

సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణ వావిర్భవత్కంబు బింబోక హృత్కంథరే! మంథరే!

బంధురచ్ఛన్న వీరాది భూషాసముద్యోత మానానవద్యాంగ శోభే! శుభే!

రత్నకేయూర రశ్మిచ్ఛటా పల్లవ ప్రోల్లసద్దోర్లతా రాజితే! యోగిభిః పూజితే!

విశ్వదిఙ్మండలవ్యాప్త మాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే! సాధుభిస్సత్కృతే!

వాసరారంభవేలా సముజ్జృంభ
మాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్ద్వయే!

దివ్యరత్నోర్మికా దీధితిస్తోమ సంధ్యాయమానాంగులీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే! ప్రోల్లసత్కుండలే!

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్య వల్లీ వలిచ్ఛేద వీచీ సముల్లాస సందర్శితాకార సౌందర్యరత్నాకరే! వల్లకీ భృత్కరే! శ్రీకరే!

హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే! త్రిలోకావనమ్రే!

లసద్వృత్తగంభీర నాభీ సరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావలీ భూషణే! మంజుసంభాషణే!

చారుశింజత్కటీసూత్ర నిర్భత్సితానంగ లీలాధనుశ్శింజినీ డంబరే! దివ్యరత్నాంబరే!

పద్మరాగోల్లసన్మేఖలా భాస్వరశ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్తలే! చంద్రికాశీతలే!

వికసిత నవ కింశుకా తామ్రదివ్యాంశుక చ్ఛన్న చారూరుశోభా పరాభూత సిందూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గలే! శ్యామలే!

కోమలస్నిగ్ధ నీలోత్పలాపాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే! చారులీలాగతే!

నమ్ర దిక్పాలసీమంతినీ కుంతల స్నిగ్ధ నీలప్రభా పుంజసంజాత దుర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్జ్వలే! ప్రోజ్జ్వలే!

దేవ! దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని కోటీర మాణిక్య సంఘ్రుష్ట కోటీర బాలాతపోద్దామ లాక్షారసారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మద్వయే! అద్వయే!
 
సురుచిర నవరత్న పీఠస్థితే! సుస్థితే!
 
శంఖపద్మద్వయోపాశ్రితే!

దేవి! దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే, మత్తమాతంగకన్యా సమూహాన్వితే! భైరవైరష్టభిర్వేష్టితే!

దేవి! వామాదిభిస్సంశ్రితే,  లక్ష్మ్యాదిశక్త్యష్టకా సేవితే! భైరవీసంవృతే!

పంచబాణేన రత్యా చ సంభావితే, ప్రీతిశక్త్యా వసంతేన చానందితే, భక్తిభాజాం పరం శ్రేయసే, కల్పసే!

ఛందసా మోజసే భ్రాజసే,
యోగినాం మానసే ధ్యాయసే, 
 
గీతవిద్యానుయోగా వితృప్తేన కృష్ణేన సంపూజ్యసే,

విశ్వహృద్యేన గద్యేన పద్మేన విద్యాధరైర్గీయసే,

యక్షగంధర్వసిద్ధాంగనా మండలైర్మండితే, 

సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే,

సర్వవిద్యావిశేషాన్వితం చాటు గాథా సముచ్ఛారణం, కంఠములోల్ల సద్వర్ణరేఖాన్వితం కోమలం,  
శ్యామలోదారపక్షద్వయం, తుండశోభాతిదూరీ భవత్ కింశుకాభం  శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయే నాపరేణాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీ యేన సంచింత్యసే, తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్,

యేన వా త్వం సనాథాకృతిర్భావ్యసే, సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, 

కిం న సిద్ధ్యేద్వపు శ్యామలం కోమలం చారు చంద్రావచూడాన్వితం ధ్యాయతే 

తస్య లీలాసరో వారిధిః తస్య కేలీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య గీర్దేవతా కింకరీ, తస్య వాచాకరీ శ్రీ: స్వయం,

సర్వ యంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే,  సర్వ ముద్రాత్మికే, సర్వ శక్త్యాత్మికే, సర్వ వర్ణాత్మికే, సర్వరూపే! జగన్మాతృకే!
హే జగన్మాతృకే! పాహిమాం పాహిమాం పాహిమాం పాహి పాహి!!

వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

చోల్లంగి అమావాస్య

*_చొల్లంగి అమావాస్య_*

*తెలుగునాట మౌని అమావాస్య /  "చోలంగి అమావాస్య" గా, తమిళ నాట "తై" అమావాస్య గా జరుపుకుంటారు*
మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితమైన రోజు. 
ఈ పద్ధతి దేశంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. 
ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చాలా ప్రత్యేకమైనవి. 
ప్రయాగ్ (అలహాబాద్) లోని కుంభమేళా సందర్భంగా, మౌని అమావాస్య పవిత్ర గంగానదిలో స్నానం చేయడానికి చాలా ముఖ్యమైన రోజు మరియు దీనిని "కుంభ పర్వ"  లేదా "అమృత్ యోగా" అని పిలుస్తారు.  
తెలుగు రాష్ట్రాలలో మౌని అమావాస్యను "చోలంగి అమావాస్య" గా జరుపుకుంటారు మరియు దీనిని భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో "దర్శ్ అమావాస్య" అని కూడా పిలుస్తారు. 
అందువల్ల మౌని అమావాస్య జ్ఞానం, ఆనందం మరియు సంపదను పొందే రోజు.

*మౌని అమావాస్య సమయంలో ఆచారాలు*
సూర్యోదయ సమయంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడానికి మౌని అమావాస్య రోజున భక్తులు లేస్తారు. 
ఈ రోజు ఒక వ్యక్తి ఏ తీర్థయాత్రను సందర్శించలేకపోతే, అతను / ఆమె స్నానం చేసే నీటికి చిన్న గంగా 'జలము' ను తప్పక చేర్చాలి. 
స్నానం చేసేటప్పుడు, నిశ్శబ్దంగా ఉండాలి అనే నమ్మకం విస్తృతంగా ఉంది. 
ఈ రోజు భక్తులు బ్రహ్మను ఆరాధిస్తారు మరియు 'గాయత్రి మంత్రాన్ని' పఠిస్తారు.

స్నాన కర్మ పూర్తయిన తరువాత భక్తులు ధ్యానం కోసం కూర్చుంటారు. 
ధ్యానం అనేది అంతర్గత శాంతిని సాధించడానికి సహాయపడే ఒక అభ్యాసం, మౌని అమావాస్య రోజున ఏదైనా తప్పుడు చర్యలకు దూరంగా ఉండాలి, వీలైనంత మందికి భీదలకు, శక్త్యానుసారం అన్న ప్రసాదమును పెట్టాలి...

కొంతమంది భక్తులు మౌని అమావాస్య రోజున పూర్తి 'మౌనా' లేదా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. 
వారు రోజంతా మాట్లాడటం మానేస్తారు మరియు స్వయంగా ఏకత్వం యొక్క స్థితిని సాధించడానికి మాత్రమే ధ్యానం చేస్తారు. 

*మౌని(చోలంగి) అమావాస్య యొక్క ప్రాముఖ్యత*
నిశ్శబ్దం లేదా 'మౌనా' సాధన ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అంతర్భాగంగా ఉంటుంది.
'మౌని' అనే పదం మరొక హిందీ పదం 'ముని' నుండి వచ్చింది, దీని అర్థం 'సన్యాసి' (సాధువు), అతను నిశ్శబ్దం పాటించే వ్యక్తి.  అందువల్ల 'మౌనా' అనే పదం స్వీయంతో ఏకత్వాన్ని సాధించడాన్ని సూచిస్తుంది.

జగత్ గురువు శ్రీ ఆది శంకరాచార్య స్వయంగా 'మౌనం'' ఒక సాధువు యొక్క మూడు ప్రధాన లక్షణాలలో ఒకటిగా పేర్కొన్నాడు. 
శ్రీ రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధన కోసం మౌన సాధనను ప్రచారం చేశారు. 
నిశ్శబ్దం ఆలోచన లేదా ప్రసంగం కంటే శక్తివంతమైనది మరియు అది సాధకునికి తన స్వభావంతో ఏకం చేస్తుంది.
చంచలమైన మనస్సును శాంతపరచడానికి సాధకుడు మౌనాన్ని అభ్యసించాలి.

మౌని అమావాస్య పవిత్ర రోజున, పవిత్రమైన గంగా నదిలోని నీరు తేనెగా మారుతుందని నమ్ముతారు.
అందువల్ల ఈ రోజున దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తారు. 
ఇది మాత్రమే కాదు, పౌష్ పూర్ణిమ నుండి మాఘ పూర్ణిమ వరకు 'మాఘా' నెల మొత్తం స్నాన కర్మకు అనువైనది...

               *_🌸శుభమస్తు🌸_*
        🙏సర్వే జనా సుఖినోభవంతు🙏
    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శ్యామల నవరాత్రులు

*శ్యామలా నవరాత్రులు*
(2023 జనవరి 22 ఆదివారం నుండి జనవరి 30 సోమవారం వరకు)
 *జ్ఞాన సింధు* 
బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్రమూర్తి. 
 
   *మాఘ శుద్ధ పాడ్యమి నుండి శ్యామలా దేవి నవరాత్రులు జరుపుకోవటం ఆనవాయితీ.*

   *దశ మహావిద్యలలో మాతంగిగా అలరారుతున్న దేవత ఈ తల్లి కటాక్షంతో వాక్సుద్ధి.*

 *దశమహావిద్యలు తప్పనిసరిగా గురుముఖంగా అభ్యసించాలి. ఎవ్వరూ స్వతంత్రించి ప్రయత్నించ కూడదు.*

 శాక్తేయమత తంత్రములో, వామాచార పద్ధతిలో అర్హులైన సాధకులు గురునేపథ్యంలో ఉపాసన చేస్తారు.

దక్షిణాచార తంత్రములో కూడా తల్లి ఉపాసన కి అవశ్యం గురువు ఉండాలి.
 
*బ్రహ్మాండ పురాణంలో శ్రీమాత ఆవిర్భావము ప్రకాశిస్తుంది. ఆ జగన్మాత మేధోశక్తిగా శ్యామలా దేవి గోచరిస్తుంది. తల్లి పరివార దేవతలలో ప్రధానమంత్రిణి శ్యామలా శక్తి.  సంగీతము, నృత్యము, ప్రవచనం ఇత్యాది కళలకి ఆధిపత్య శక్తి.*

 రాజ శ్యామల, మాతంగి,
  మంత్రిణి, రాజమాతంగి ఇలా
 పలు నామధేయములతో
 మహా విద్యలలో తొమ్మిదవ శక్తి గా అలరారుతుంది.

 ఒకే దేవత ఇన్ని పేర్లతో ఉండటంలోని సంకేతార్థం ఏమిటంటే,  అనేక ప్రయోజనాలు కలిగించే వివిధ మంత్రములు భిన్న ఉపాసనా రీతులుగా గ్రహించాలి.

 అందుకే ఆ తల్లి రూపములో ఆకుపచ్చని వర్ణముతో , కొన్ని మార్పులు ఎర్రటి వర్ణముతో, శ్యామలా దేవి అనేక విధములుగా రూపములుగా గోచరిస్తుంది.

 *బృహత్ తంత్రసార* గ్రంథములో, ఉచ్చిష్ట మాతంగిణి గురించి వివరణ కలదు...  

 శాక్తేయ తంత్రం సాధనలో త్రైలోక్య వశీకరణ శక్తిగా స్థితమైన దేవత మహారాజ్ఞి అనుగ్రహం పొందాలంటే మంత్రి అయిన శ్యామల దేవి అనుమతి, కటాక్షములు ఉండాలి.

 *'పరమాత్ముని పలుకులే'* వేదమంత్రములు.  ఆ మంత్రార్ధములను క్రియాశీలంగా వినియోగించుకొని జీవులు ఉత్తీర్ణత పొందుటకు గురువు అవసరం.
  
సంప్రదాయం తెలిసిన గురువులు, సాధకుని జాతకము పరిశీలించి, వక్రీకరణలు లేని ఆధ్యాత్మిక సంక్షేమాన్ని కలిగించే పద్ధతిని అనుగ్రహిస్తారు.  ఇష్టదేవతా అనుగ్రహానికి  సదాచార మార్గం శ్రేష్ఠం...  జ్ఞానానికి, మోక్షప్రాప్తికి అర్హత, ప్రాతిపదిక ఇదే. 

 *అష్టాదశ శక్తి పీఠములలో  'యోని' ముద్ర కామాఖ్య దేవి.*
  
 కామాఖ్య టెంపుల్ కాంప్లెక్స్ లో శ్యామల దేవాలయము కలదు. దక్షిణభారతంలో మధుర మీనాక్షి, రాజమాతంగి రూపిణిగా సంప్రదాయులు ప్రకటిస్తారు. 
    
 శ్యామల నవరాత్రులలో
1) *లఘు శ్యామల*
2) *వాగ్వాదినీ*
3) *నాకులేశ్వరి*
4) *కళ్యాణ శ్యామల*
5) *జగద్రంజని మాతంగి* 
6) *వశ్యమాతంగి*
7) *సారిక*
8) *సుఖ శ్యామల*
9) *రాజ్య శ్యామల*
  
 ఇలా తొమ్మిది రూపాల్లో నవరాత్రులు అర్చన కొనసాగుతోంది
  
 *ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులలో - ప్రధానమైన జ్ఞానస్వరూపమే శ్యామలా దేవి తాంత్రిక విధానాలలోని సరస్వతిగా గ్రహించాలి.*
 *సర్వులూ నిత్యం గృహంలో ఆరాధించే  ఇష్ట దేవత యందు ఆ తల్లిని భావన చేసి తమ నిత్యపూజ  నియమానుసారం కొనసాగించి ఆశీస్సులు అందుకోగలరు.*

 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏

వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

_మాఘ మాసారంభం

🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
        🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ    ... 22 - 01 - 2023,
వారం ...  భానువాసరే ( ఆదివారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
శిశిరఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిధి     :  పాడ్యమి రా12.59 వరకు,
నక్షత్రం :  ఉత్తరాషాఢ 8.01 వరకు,
               తదుపరి శ్రవణం తె6.17వరకు,
యోగం :  వజ్రం మ12.05 వరకు,
కరణం  :  కింస్తుఘ్నం మ2.09 వరకు,
                తదుపరి బవ రా12.59 వరకు,

వర్జ్యం               :  ఉ11.43 - 1.12,
దుర్ముహూర్తము :  సా4.16 - 5.00,
అమృతకాలం    :  రా8.37 - 10.06,
రాహుకాలం       :  సా4.30 - 6.00,
యమగండం      :  మ12.00 - 1.30, 
సూర్యరాశి        :  మకరం,
చంద్రరాశి          :  మకరం,
సూర్యోదయం       :  6.38,
సూర్యాస్తమయం  :  5.45,

               *_నేటి విశేషం_*

*_మాఘ మాసారంభం - " మాఘ మాస విశిష్టత "_*

"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. 
ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *_శుక్ల పక్ష చవితి_* దీనిని *_తిల చతుర్థి_* అం టారు. 
దీన్నే *_కుంద చతుర్థి_* అని కూడా అంటారు, నువ్వులను తింటారు, నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. 
ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.
"కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. 
అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.
మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. 
ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు 
*_దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!_*
అని చేసిన తరువాత 

*_సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!_* అని చదవాలని శాస్త్రాలు చెబుతున్నాయి...

*_సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి._*

ఈ మాసాన్ని *_కుంభమాసం_*  అని కూడా అంటారు.
కొంతమంది *_ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు_*
ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. 
నువ్వులను దానమివ్వాలట, రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.
ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. 

*_మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి_* అంటారు.
ఈ పంచమి నాడే *_సరస్వతీదేవి_* జన్మించిందట. 

ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.
ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు.
బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట.
అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. 
ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.

ఇక...  *_మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"_* అని కూడా పిలువబడుతుంది.
ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.
ఈ రోజున *_అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట_*.
స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు...
*_నమస్కార ప్రియ:సూర్య:_* అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.
ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం_*.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు.
హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు,
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. 
రథసప్తమి నాటి స్నానం *_సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్_* అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.

భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో *_మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట._* 
స్వచ్చంద మరణం ఆయనకి వరం. 
ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. 
అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. 
కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు...
*_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. 
ఇక మాఘమాసంలో వచ్చే *_ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే._* 

 .... ఈ విధంగా... *_మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే..._*

               *సర్వేజనాః సుఖినోభవంతు

మాఘ మాస మహిమ


మాఘ పురాణం - 1 వ అధ్యాయము
*మాఘ మాస మహిమ*

💐💐💐💐💐💐💐💐

*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*
*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*
*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*
*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*
           ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది  పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.

పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో  అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పేంపొందించేవి.

ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల  సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.

సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి  వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.
అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే  విషయాన్ని అడిగింది.  గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.

పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను ,  వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.
రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.

మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.

ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.

పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.

దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*

దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 

పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.సుబ్బారెడ్డి

ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.

భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును  యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కెగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

మాఘ శీర్షం పిండ ప్రదానం


మాఘ మాసం "పితృదేవతల అర్చనలకు" మహీ దివ్యమైన మాసం !!!*

మనిషి మరణించిన తర్వాత కర్మ జరిగిన పిమ్మట నెలనెలా మాసికాలు పెడుతుంటారు ఆమాసికాల_రహస్యం_ఇదే*!
 *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?*
*అన్ని_మాసికాలు_పెట్టాలా?*
*కొన్నిమానేయవచ్చా?*

 వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 

*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*

*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 

చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.

*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*

దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 

*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.

*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.*

*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*

*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 

*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*

*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*

*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*

*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*

*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*

*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.*

*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*

*వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.*

*దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*

*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 

*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*

*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 

*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*

*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 

*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*

*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 

*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*
[1/22, 6:43 PM] +91 94932 23345: *ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* 

*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ

్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*
 
*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*

*వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*

*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*

*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*

*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*

*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 

*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*

*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 

*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*

*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   

ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.

*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*

*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 

అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 

గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.

 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  

వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 

ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.