Sunday 30 May 2021

గోత్రం అంటే ఏమిటి

 


*గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం  వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!

గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?

మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 

కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?

వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!

గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు.XY లో - X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.ఈ Y ప్రత్యేకమైనది మరియు అది X లో కలవదు. కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 

ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్  పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...

మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇదిమన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..

మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.


వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్

వడమాలపేట


Sunday 23 May 2021

కర్నూలు జిల్లా #అహోబిలంనవనారసింహక్షేత్రం


 *🚩కర్నూలు జిల్లా #అహోబిలంనవనారసింహక్షేత్రం గురించి తెలుసుకుందాం.🚩*


🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️


*అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.*


☘☘☘☘☘☘☘☘


*1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.*


*2.అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.*


*3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.*


*4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.*


*5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.*


*6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.*


*7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.*


*8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము.*


*9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.*

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Saturday 8 May 2021

తెలుసుకో వలసిన విషయాలు

 


ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*

 

1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 6. స్వసంతానం ( పుత్రుడు ).

 

*తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.


 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.

 10. లేడి పాలు.


 *యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*


 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 *అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*


 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.


 *గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*


 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 *వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు*

 కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 *పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 *దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?*

 శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 *తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?*

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 *శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?*

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 *నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?*

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .

  *ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?*

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లొను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.

 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.

 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?*

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 *గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?*

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.

 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*

 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 

 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.

 7. నారాయణాద్రి.

 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?*

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.

 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.

 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.

 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.

 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 *సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?*

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి బోజనానినికి కూర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 

4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 

 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 *శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?*

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 *పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు* 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 *శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?*

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .

 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .

 5. ఆనందమయ కోశం .

 *శౌచమంటే ఏమిటి ?*

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 1. బాహ్య శౌచం.

 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?*

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.

 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.

 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము.

 6. మాత్స్చార్యము 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసూయ11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 *భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?*

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?*

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.


 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?*


 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .

 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.

 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.

 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.

 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.


Friday 30 April 2021

జపము, హోమము


పురోహిత పరిషత్ యందు  రుత్విక్ లతో జపము,మరియు హోమము.

 

శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం*

*సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |*
*జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧*

*గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |*
*ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨*

*యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా |*
*విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః || ౩*

*సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే |*
*బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ || ౪*

*ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్ |*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 

వి.యస్.యస్.పి.పి వంట వెజిల్స్

 


          వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్, ఖాధికాలని, తిరుపతి యందు. మన బ్రాహ్మణ బంధువుల కు సంబందించి ఆబ్దికములు, మాసికములు, ఇతర పూజా కార్యక్రమములకు కావాల్సిన వంట చేసుకొనుటకు ప్రస్తుతం మిగిలిన వంట పాత్రలు.. 

        ఒక్కప్పుడు చాలా చాలా వెజిల్స్ ఉండేవి పెద్ద పెద్ద వంట పాత్రలు మొదలగునవి.ఇవన్నియు గౌరవ బ్రాహ్మణ బంధువులు, ఇతర బ్రాహ్మణేతరులు విరాళమిచ్చినవే. వాటిని ఒక్కొక్కటి దొంగతనం రూపంలో పోయినవి ప్రస్తుతం ఇవిమాత్రమే ఉన్నది...

   ఇందులో  వంట ష్టవ్ మన కిరణ్ క్యాటరింగ్ వారు, గ్రైండర్ కొత్త వట్యం. గురునాధ శర్మ గారు.  విరాళంగా ఇవ్వడం. ఇలా చాలా వెజిల్స్ పెద్దలు ఇవ్వడం తో మరి కొన్ని పరిషత్ ద్వారా కొనడం జరిగినది.

 

ఇట్లు

కార్యదర్శి
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Wednesday 14 April 2021

మీరు ఏ తెలుగు సంవత్సరం లో పుట్టారు

 

*_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*


_*మీరు ఏ తెలుగు సంవత్సరం లో జన్మిచ్చారో తెలుసా_

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి..


మీ

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

Monday 12 April 2021

ఉగాది చైత్ర మాసం లొనే జరుపుకోవాలి ఎందుకు

*ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?

           *''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. 

          అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది''* అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.

అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం


         పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు *"చిత్రా''* నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు *"చైత్రమాసం''* అనే పేరు వచ్చింది.


*ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?*

        ఉగాది చైత్ర మాసంలోనే ఎందుకు జరపాలి ఇతర మాసములలో  కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు ? 

      విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో  మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది ? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు ?

        ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. *''మాసానాం మార్గశీర్షోహం''* అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును , లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ? 

         ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో , భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి , కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు , తెలివి డబ్బు , ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. 

        పోనీ శ్రీరామనవమి , శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము ? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో , ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు , పర్వదినాలు ఉన్నాయి. 

       కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా , సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

        చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి.

         చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం , పగుళ్ళు , పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. 

        ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.


*ఉగాదిరోజున ఏం చేయాలి ?*

*నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి* *గృహ ధ్వజారోహణం   నింబ పత్రాశనం* *సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః*

     సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.


*ఉగాది పచ్చడి తినడంవల్ల ప్రయోజనం ఏమిటి?*


*శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ*

*సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం*

        పై శ్లోకం పటిస్తూ ఉగాది పచ్చడి స్వీకరించాలి

వేపపూత , బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.

        శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి.

          అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.

       చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.

          🙏🙏🙏 వి.యస్.యస్.పి.పి 

                🙏🙏🙏తిరుపతి

ఉగాది ప్లవ నామ సంవత్సరం

*🌈సమూహం లోని సభ్యులందరికీ ముందుగా “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు.

🙏🙏* *🌿🌼🙏ఉగాది పూజా విధానం🙏🌼🌿 ఉగాది పచ్చడి చేసే విధానం 🙏🌼🌿* *🌿🌼🙏


ఉగాది పర్వదినం.. పూజా విధానం🙏🌼🌿* ఉగస్య ఆదిః ఉగాది. 'ఉగ' అంటే నక్షత్రపు నడక అని అర్థం. నక్షత్రముల నడక ప్రారంభం అంటే సృష్ట్యారంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయింది. ఉగాది పండుగ చారిత్రకరీత్యా కూడా అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. జగద్విఖ్యాతి కాంచిన విక్రమార్కచక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్టాభిషిక్తుడు కాగా ఆ మహావీరుని సంస్మరణ చిహ్నముగా ఆ రోజు ఉత్సవాలు జరుపుట ఆచారమైనది.

       మాసములకన్న ఋతువులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని, ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి, చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగిర్చి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు సన్నజాజులు, మల్లెల పరిమళాలు, వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. 

          ఇదే రీతి మనుష్యుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పొట్టు పోయి చాలా స్ఫుటముగా కనిపిస్తుంది. వసంత ఋతువు మొదలవగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు, పకక్షులు (నెమలి మొ||వి) తమ ఈకలు రాల్చినట్లు, వృక్షములు ఆకులు రాల్చి చిగుళ్ళను సంతరించుకుటాంయి.

           కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించడం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్టు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవంతం అయి ఆనందంగా ఉంటాయి.

 *"ఉగాది"🥭 *ఈ సంవత్సరం అనగా 🌈2021లో ప్లవ నామ సంవత్సర ఉగాదిగా 🚩ఏప్రియల్ నెల 13వ తారీఖున జరుపుకోబడుతుంది.

* ఉగాది రోజు పాటించవలసిన నియమాలు : 

 1. తైలాభ్యంగనం : ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి.

 2. ప్రతిగృహద్వజారోహణం : దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పుడు లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాదారణంగా జెండాలు ఎగురవేస్తుంటాం. అదే విధంగా బ్రహ్మకు సంబంధించినది, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణ ఇంటి ముందు చేయాలట.

           మన రాష్ట్రాల్లో ఇలాటి పద్ధతులు కనిపించవు కనుమరుగై పోయింది కానీ మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు.

 3. నవవస్త్రాభరణధారణం, ఛత్రచామరాది స్వీకరణం : నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. 

        ఉగాది రోజు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకోవాలని సంకేతం. ఛత్ర ధారణం నేెత్ర శాంతికరం, ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచుతుంది. ఉగాదిరోజు చామరకు కూడా స్వీకరించాలి. ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం బాగా ఉంది. వాటిలో వ్టివేళ్ళతో చేసినవి, వెదురుతో చేసినవి, తాకులతో చేసినవి శ్రేష్ఠమైనవి, వాటితో విసురుకోవడం వలన మేహశాంతి కలుగుతుంది. నేత్రాలకి చల్లదనంగా ఉంటుంది. ఛత్రచామరాలని ఈ ఎండాకాలంలో దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. 

 4.దమనేన పూజ : దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజూ ఒక దేవతా మూర్తికి పూజ చేయాలి.


 చైత్రశుక్ల పాడ్యమి : బ్రహ్మకు; చైత్ర శుక్ల విదియ : ఉమ, శివ, అగ్నులకు ; చైత్ర శుక్ల తదియ : గౌరీ శంకరులకు; చైత్ర శుక్ల చతుర్థి : గణపతికి ; చైత్ర శుక్ల పంచమి : నాగులకు; చైత్ర శుక్ల షష్ఠి: కుమారస్వామికి; చైత్ర శుక్ల సప్తమి;సూర్యునకు ; చైత్ర శుక్ల అష్టమి:మాతృదేవతలకు; చైత్ర శుక్ల నవమి:మహిషాసుర మర్దినికి; చైత్ర శుక్ల థమి: ధర్మరాజుకు; చైత్ర శుక్ల ఏకాదశి : మునులకు; చైత్ర శుక్ల ద్వాదశి : శ్రీ మహావిష్ణువుకు; చైత్ర శుక్ల త్రయోదశి : కామదేవునకు; చైత్ర శుక్ల చతుర్దశి : శంకరునకు; చైత్ర శుక్ల పూర్ణిమ : శచి, ఇంద్రులకు సర్వాపచ్ఛాంతికర మహాశాంతి : సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగగా చెప్పబడి ఉంది. 

       మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలుగుతాయి. మహాశాంతి చేయవలసని పండుగలో ఇది ఒకి కాబట్టి పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాదిరోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. 


     పంచాంగపూజ, పంచాంగ శ్రవణం : ఉగాదిరోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని ప్టోలి. ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం ఉండాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకి అనువైన వాటిని చూపించే కరదీపికగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రామ్మణ ముఖంగా లేదా జ్యోతిష్కుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. అలా వినడం కాబట్టే పంచాంగ శ్రవణం అని పేరు.

       పంచాంగశ్రవణం వలన గంగాస్నానం చేసిన ఫలితం గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. దుస్వప్ననాశనం అవుతుంది. సంతానం, సంపత్తు కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. 

 ప్రపాదాన ప్రారంభం : అంటే బ్రహ్మాది సమస్త దేవతా స్వరూపమైన ధర్మఘట్టం దానం చేస్తున్నాను కాన నా మనోరథములన్నీ సమకూరాలని సంకల్పం చేసి నీటి కుండను దానం చేయాలి. 

 రాజదర్శనం : ఉగాదిరోజు రాజదర్శనం చేయాలాంరు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాదు కాబట్టి దేవతాదర్శనం వలన ఈశ్వరానుగ్రహం వలన అందరూ అనుకూలంగా ఉంటారు అని తెలుసుకొని దేవాలయ దర్శనం చేయడం విశేషం.


 వసంత నవరాత్రి ప్రారంభం : శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశస్థాపన చేసి అమ్మవారి పూజలు చేయాలి. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కాని, సుందరాకాండ పారాయణ కాని రామనామ జపాన్ని కాని ప్రత్యేకంగా చేస్తారు. 


 నింబకుసుమ భక్షణం : ఉగాదిరోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం అని కొన్ని చోట్ల ఉంటే నింబ పత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్యగ్రంథాలనుంచి తీసుకున్నదిగా దీన్ని చెబుతారు. నింబ కుసుమం అంటే వేప పువ్వు. నింబ పత్ర అంటే వేప ఆకు. ఇలాటి వాటిని తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది.

          దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు. 

           కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఎప్పుడూ ఆ శ్రీమాత దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 


 *🌿🌼🙏ఉగాది పచ్చడి విశిష్టత🙏🌼🌿*

 "ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. పచ్చి మిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది. ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం ఒకటిన్నర కప్పు నీరు. రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు. కొద్దిపాటి వేప పువ్వులు. మూడు టేబుల్ స్పూన్ల బెల్లం. తగినంత ఉప్పు. రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.


 🌿🌼🙏ఉగాది పంచాంగ శ్రవణం 🙏🌼🌿 

        ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు. *


🌿🌼🙏ఉగాది శుభాకాంక్షలు 🙏🌼🌿* 

 ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఒకరినొకరు "నూతన ఉగాది శుభాకాంక్షలు" తెలియపరచుకోవటం పరిపాటి. పిల్లలు పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొంటారు. 


 ఒక చిన్న మనవి : 

 మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, తెలుగు సంవత్సరాల పేర్లు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, కనీసం మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏదీ ఆలస్యం కాదు, అందరూ శాస్త్రోక్తంగా మన తొలి పండుగ ఉగాదిని జరుపుకుంటారని, భగవంతుని అనుగ్రహం పొందుతామని ఆకాంక్షిస్తూ 



వి.యస్.యస్.పి.పి 
తిరుపతి

ఉగాది (ప్లవ నామ సంవత్సరం)

🌺 ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం🙏 రేపు సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గావున రేపు ఉగాది. (13.04.2021) వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం.కారణం? ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనేభూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారి,శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా.మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని,వికాసాన్ని కలిగిస్తాయి.అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే, ప్లవనామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం! సర్వే జనా సుఖినోభవంతు. వి.యస్.యస్.పి.పి తిరుపతి

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు

తెలుగు సంవత్సరాలు 60మాత్రమే ఎందుకు తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది... తెలుగు సంవత్సరాలు అరవై అని అందరికీ తెలుసు.ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకూ ఉంటాయి. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? కేవలం అరవై మాత్రమే ఉండటానికి కారణం ఏంటి? పురాణగాథ ఏం చెబుతోంది? ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తానొక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువును 360 డిగ్రీల కోణంలో మనం చూడవచ్చు. అదే మనిషి కేంద్రం అయినా వర్తిస్తుంది. మనిషి ముందువైపు 180 డిగ్రీలు ఉంటే, వెనుకవైపు మరో 180 డిగ్రీలు ఉంటుంది. అంటే వెనుక ఉన్న గతం 180.. ముందు ఉన్న వర్తమాన, భవిష్యత్ లు మరో 180డిగ్రీలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది. ఇలా రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు.. ఇలా నవగ్రహాలు మన ఆయుర్థాయాన్ని పంచుకుంటే 120ఏళ్లు బతకాలి. మన తెలుగు సంవత్సరాల పేర్లు : 1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ. అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది. ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి షష్టిపూర్తి చేస్తారు. ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు... ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి. ఇప్పుడు మనం పాటించే అర్థంపర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. అదే ఉగాది అయింది. వి.యస్.యస్.పి.పి తిరుపతి

Monday 22 March 2021

పురోహిత పరిషత్

తిరుపతి, ఖాధికాలని, అన్నారావు సర్కిల్ దగ్గరలో మన బ్రాహ్మణలకు సంబంధించి ఆబ్దికములు, మాసికములు ఇక్కడే అయ్యవార్లను ఏర్పాటు చేసి నిర్వహించ బడును , లేదా యజమానులే అయ్యవార్లు ఏర్పాటు చేసుకున్న వారికి వేదిక, వంట పాత్రలు ఇవ్వబడును ముఖ్యం అత్యంత మడుగు గా, శుభ్రంగా,పద్దతి గా వారు అలవాటు ప్రకారం ఏ వంటలు చేయవలయునో వారు చెప్పిన వంటలు రుచిగా చేసి సంతృప్తి కరంగా కార్యక్రమము నిర్వహించబడును. ముఖ్యంగా:: ఇక్కడ వ్యాపార నిమిత్తమై నిర్వహించడం లేదు; మన బ్రాహ్మణ సభ్యులకు సేవా భావంతో చేయబడుచున్నది. రోజుకు ఒక్క ఆబ్దికము నిర్వహించబడును. అందరి లాగా సామూహిక కార్యక్రమాలు చేయబడదు.మరియు ఇతరులకు పూజ,జపములు, హోమాలు మొదలగునవి జరిపించుకొనుటకు అన్నివిధాల సౌకర్యంగా పద్దతి గా నిర్వహించబడును. ముఖ్య గమనిక. ఎవ్వరైనా ఇంటిలో కార్యక్రమము చేసుకొన్నచో వారి ఇంటికి అయ్యవార్లు ని కూడా పంపబడును. వంట వారిని కూడా ఏర్పాటు చేయబడను వి.యస్.యస్.పి.పి, తిరుపతి

పరిషత్ కార్యవర్గ సమావేశము









వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్,ఖాధికాలని, తిరుపతి యందు గౌరవ అధ్యక్షులు శ్రీయుతులు రామకృష్ణ శాస్ర్తి గారి అధ్యక్షతన, కోశాధికారి, శ్రీ చక్రాల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సభ్యులందరి సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో గత ఆర్థిక ( 2020-2021) ఆదాయము, వ్యయములు, నిర్వహణ మొదలగు న విషయాలు చర్చించి మరియు ఉత్తరోతర పరిషత్ అభివృద్ధి సంబందింది సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది..


కోశాధికారి

వి.యస్.యస్.పి పి

ఖాదీ కాలనీ, తిరుపతి