Thursday 27 July 2017

శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం

శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం

          శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

           పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.

            మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

            అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.

            అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు.

         శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

28.07.2017 శుక్రవారం శ్రావణ పంచమి ఈ రోజే గరుడ పంచమి గా వ్యవహరిస్తారు.

28.07.2017 శుక్రవారం శ్రావణ పంచమి ఈ రోజే గరుడ పంచమి గా వ్యవహరిస్తారు.

            శ్రావణ శుద్ద పంచమిని మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరినది సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరిస్తున్నారు. పురాణ గాథలు విచారిస్తే నాగులకి, గరుడిడికి విరోధం ఉండడం తెలిసి వస్తుంది. ఆ గాథల్లో గరుడుడే విజేతగా ఉంటుంటాడు. కాని దీనికి భిన్నంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గరుడుడే తీసికట్టు అయినట్లు గాథలు ఉన్నాయి.

          గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకుడికి ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో గరుత్మంతుడు ఓడిపోయాడు. నాగవిగ్రహం కల యంత్రపు బిళ్లను మెడలో వేళ్లాడ కట్టుకుని ఉండే షరతు మిూద ఇద్దరికీ రాజీ అయింది. ఇది వంగదేశంలో వాడుకలో ఉన్న పురాణకథ. సర్పరాజుకు గరుత్మండు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్పఖండాలు ఉన్నాయి.

        వ్రతరత్నాకరంలో గరుడపంచమి ప్రస్తావన ఉంది. గోదావరి మండల ప్రాంతపు పంచాంగాలలో మాత్రము ఒకటి రెండింటియందు గరుడ పంచమి పేర్కొనబడుతుంది. విష్ణువుకు గరుడుడు వాహనం. విష్ణు ఆలయాల్లో ఆ వాహనాలు ఉండడం వాని మీద ఊరేగింపులు సాగడం ఉంటూ ఉంటుంది. గరుడిడికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండడం అరుదు.

          గురుడుకి వైనతేయుడని మరోపేరు ఉంది. గోదావరి ఏడుపాయల్లో ఒకదానికి వైనతేయ అని పేరు. అది వసిష్ఠ గోదావరి నుండి గన్నవరం అనే ఊరువద్ద నుండి విడిపోతుంది. ఆ గన్నవరం వద్ద గరుడేశ్వరస్వామికి ఒక ఆలయం ఉంది. గన్నవరాన గరుడేశ్వర స్వామిని గరుడుడు ప్రతిష్టించాడని ప్రతీతి ఉంది. వైనతేయ పాయను తీసుకువెళ్లింది వైనతేయుడైన గరుడుడు లేక వైనతేయ బుషి అంటారు.
            నాగపంచమి తిథికే గరుడపంచమి అనే పేరు కూడ ప్రవర్తితం కావడానికి ఏమిటి కారణం? ఈ జిజ్ఞాసకు సమాధానం బ్రహ్మాండపురాణంలో ఉంది. శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుడు అమృతాపహారణం చేశాడు. అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది.

             గరుడుడు అమృతం తెచ్చి సవతితల్లికి ఇచ్చి తన తల్లి దాస్యం బాపాడు. సవతి తల్లి పిల్లలైన నాగులు ఆ అమృతాన్ని తాగడానికి సిద్దపడులోగా దేవతలు దానిని తిరిగి కొనిపోయారు. గరుడుడు అమృతం తెచ్చిన రోజు కాబట్టి దీనికి గరుడపంచమి అనే పేరు వచ్చింది.

           అంతేకాని ఈనాటి పూజా విధానంలో గరుడిడి ప్రమేయం ఏమిన్ని లేదు. వ్రత రత్నాకరంలో గరుడపంచమివ్రత విషయం ఉంది. కాని అందలి పూజాదికాలలో నాగసంబంధమే కాని గరుడ సంబంధమేమిూ కానరాదు.

గరుడపంచమి వ్రత విధాన గురించి తెలుసుకుందాము

            ఈ వ్రతం శ్రావణ శుక్లపంచమిూ దినాన సోదరులు కల పది సంవత్సరాలు చేయతగింది. ఆనాడు ఆ స్త్రీ స్నానం చేసి చతురశ్రమైన మంటపం ఏర్పరచాలి. ఫలకుసుమాదులచే దానిని అలంకరించాలి. పంచవర్ణపు ముగ్గులు పెట్టాలి. నడుమ బియ్యం పోయాలి. సర్ప ప్రతిమను ఆ బియ్యం మిూద ఉంచాలి. దాని పడగ మధ్యలో గౌరీబింబాన్ని స్థాపించాలి. ఆ గౌరిని, పదిమళ్లు గల దోరమును షోడశోపచారాలతో పూజించాలి. ఆ తోరాన్ని తాను ధరించాలి.

              పూజా విధానం, వ్రతం పేరేమో గరుడ పంచమియా వ్రతమని ఆ వ్రతంలో పూజ అంతా సర్పప్రతిమకు, గరుడుడికి, సర్పాలకి సహజవిరోధం, అగుచో గరుడిడి పేర పరగే పర్వం నాడు నాగపూజ ఎట్లు ఏర్పడింది? గరుడుడు అమృతం తెచ్చి ఇచ్చాడు. అతడి పని వల్ల దాస్యం తీరింది. అమృతం మాత్రం నాగుల అనుభవానికి అందలేదు. అందుచేత నాగులు అతపులు కావడం సహజం. అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడం కోసం పూజలు సల్చడం వారి విరోధితో జతపడిన ఈ ప్రత్యేకింపబడింది.

          ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"

యజుర్వేద మంత్రం.

'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు మరలా మరలా నమస్కారము.

'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు
"శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ"
 
           గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తమ ఇష్టదైవమైన గరుడుని పై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోనూ అగ్రగన్యుడు గరుత్మంతుడు ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్రపక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు.

            ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రిలు తమ పుట్టే సంతానం గరుడుని లాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.

చక్కని సంతానాన్ని ఇచ్చే గరుడ పంచమి

              కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.

               శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.

             దీనిని సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.

             సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది
 నాగ పంచమి / శ్రావణ పంచమి/ గరుడ పంచమి  ఏర్పడడానికి గల కారణం.
             శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.

         అంతా అనుకూలంగా ఉంటుంది. చలి చీమ నుండి  చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

నాగ జాతి జనము :
         కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

          దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

        "విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి .

          మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

         పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.

            చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

          శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (ఈ రోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

           ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి.

    ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

         పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను .

          ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది.
మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి..
          ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది.
           మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

         స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారుఅందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ.

           జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి.

             క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.

           కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Wednesday 26 July 2017

నాగ చతుర్థి (నాగ పంచమి. 27.07.2017 గురువారం నాగ చతుర్థి తదుపరి నాగ పంచమి.


ఈ రోజు అనగా 27.07.2017 గురువారం నాగ చతుర్థి తదుపరి నాగ పంచమి.

నాగ చతుర్థి (నాగ పంచమి)

           శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.

         నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

         చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు

నాగ జాతి జనము :

        కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకుఅనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

            సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్ఠించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

            "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

          ఆజ్ఞ మేరకు దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

          వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

          పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఇలా వివరించడం జరిగినది

          ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి.

          లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

           శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

           అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున ( చతుర్థి తిది పంచమి తో కూడి ఈ శ్రావణ మాసం లో ఇప్పుడు వచ్చినది) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

చేయవలసిన విధానం
          ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి.

           నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

        పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు .

          విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది .

 నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

         ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విస్వాశము వారిది

    మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు.

           ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి.
         ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

         స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ.
          జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

       నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.

         కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది.
         ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Tuesday 25 July 2017

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం (ఆండాళ్ అవతరించిన రోజు)

శ్రీ ఆండాళ్ తిరునక్షత్రం (ఆండాళ్ అవతరించిన రోజు)

         కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది.

          విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కలవాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం.

          ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.

కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ

స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

           విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి, భగవంతుని అనుగ్రహంచే, తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. ఆ పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు ఆ రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం, ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు.

          తులసివనం పెంచి, తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో, ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు, ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు.

              సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి,అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే, వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి.

            ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా, తన చుట్టూ వారినే గోపికలవలె, ఆ వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించింది.  ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు, సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా.

              ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది.అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి, తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని, శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు.

           అమె స్వామి సన్నిదానంలో చేరిపోయింది.  తండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే, భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు ఆ విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి, నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.

          విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్, అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే, కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక, గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది.

          ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా. ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో, అలా గోదాదేవి తిరుప్పావై, నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి ఈ జీవరాశినంతా పోశిస్తుంది.

          రామచంద్రుడిని వివాహమాడిన సీతాదేవి కంటే గోదాదేవే ఒక్క అడుగు ముందు అని అంటుంటారు. ఇద్దరూ అయోనిజలే, భూమిలో లభించినవారు. యజ్ఞానికి అని మామూలు క్షేత్రాన్ని దున్నుతుంటే సీతమ్మ లభించింది, పరమాత్మకు అర్పించదగిన పరిశుద్దమైన తులసివనంలో మన అమ్మ గోదా లభించినది.

            తులసికి వేరు మొదలుకొని చివరిదాకా అణువణువునా పరిమళం నిండి ఉన్నట్టుగానే గోదాదేవి తనలో ఉండే ప్రతి ప్రవృత్తిలో కూడా శ్రీకృష్ణ ప్రేమ పరిమళం నిండి ఉంది. ఇక పెంచినవాడిని చూస్తే, జనక చక్రవర్తి కర్మ యోగి, పరిపాలకుడు. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తులు భక్త శిఖామణి, పరమ వైదికోత్తముడు. వంశంలో కూడా గోదా ఒక మెట్టు ఎక్కువే!

              ఇక చేపట్టిన వాడిని చూద్దామా అంటే ఆయన రాముడు, మరి గోదా చేపట్టిన ఆయన రంగనాథుడు, శ్రీరాముని ఇలవేల్పు. అంటే గోదాదేవి సీతారాములకే ఆరాధ్య స్థానాన్ని పొందింది. సీతాదేవి ఇలా చెయ్యండి అంటూ మనకేమి చెప్పలేదు, కాని గోదా దేవి మనకు ఎన్నో నియమాలు, ధర్మాలు నేర్పింది.

           రామచంద్రుడు ప్రక్కన ఉండగా లేడిని కోరి కష్టాలను తెచ్చి పెట్టుకుంది సీత, కానీ ఆండాళ్ తల్లి "ఉన్నై అరిత్తిత్తు వందోం"  మెం నిన్ను కోరివచ్చాం, "పఱై తరుతియాగిల్" నీవు ఇచ్చేవి కోరి రాలేదు అని చెప్పింది. దొంగని కాదు దండించేది, దొంగలోని దొంగ అనే ప్రవృత్తిని దండించాలి అని ఈనాడు పెద్ద పెద్ద దేశాలు చెబుతున్నారే ఆమాటలు గోదా మనకు ఎప్పుడో చెప్పింది. "మత్తారై మాత్త్-అఱిక్క వల్లాన్" శత్రువులలోని శత్రుత్వాన్ని దండించి తొలగించ గలిగేవాడు మా స్వామి అని ఎన్నో గొప్ప గొప్ప మాటల్ని తెలిపింది అమ్మ గోదా.

         ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది అమ్మ గోదా. శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాల్ని అందమైన పాటలుగా అందించింది గోదా. అలా గోదాదేవి ఒక మెట్టు ఎక్కువే, ఆమెకు సాటి ఎవ్వరులేరు. ఆమె పేరు పెట్టుకున్నందుకు గోదావరి నది పవిత్రం అయ్యింది. ఆమె శ్రీరంగంలో రంగనాథుడిని చేరినందువల్ల కావేరీ నది పవిత్రం అయ్యింది. తను స్వామి సన్నిదానం చేరే ముందు మనల్ని అందరిని భాగుచేస్తానని వాగ్దానం చేసింది.

         మరి స్వామి ఫలింప చేస్తాడా అంటే, ఆమెను పాణిగ్రహణం చేసాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా. ఆ మార్గాన్ని మనం ఆశ్రయిస్తే చాలు మనం పరమాత్మను  తప్పక అందుకోగలం. గోదాదేవి ధరించి విడచిన మాలని కదా స్వామి ధరించాడు. అందుకే ఈనాటికి శ్రీవెంకటేశుడు బ్రహ్మోత్సవాల్లో శ్రీవిల్లి పుత్తూర్ నుండి గోదా ధరించిన మాలనే తెప్పించుకొని ధరించి, గోదా చేపట్టిని చిలుకనీ తాను చేత ధరించి, పొంగిపోతూ ఊరేగుతాడు. భగవంతుడికి గోదా ధరించిన మాల అంటే అంత ప్రేమ. ఆమె పాటలని మనం పాడుకోగల్గితే తరించిపోతాం.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

శ్రావణ మాసం తృతీయ రోజు (బుధవారం,26-07-2017) స్వర్ణ గౌరి వ్రత్రం దీనినే షోడశ గౌరి వ్రతము అని కూడా అంటారు

   శ్రావణ మాసం తృతీయ రోజు (బుధవారం,26-07-2017)  స్వర్ణ గౌరి వ్రత్రం దీనినే  షోడశ గౌరి వ్రతము అని కూడా అంటారు

స్వర్ణ గౌరీ నోము(షోడశ గౌరి వ్రతము)

            శ్రావణ మాసంలో  స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో వివిధ నోములు నోచుకుంటారు. శుక్ల పక్ష తృతీయ రోజు వివాహిత స్త్రీలు 'స్వర్ణ గౌరీ నోము' జరుపుకుంటారు. ఇది వారి కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని భావిస్తారు.


            స్వర్ణ గౌరీ నోమును ఆచరించే స్త్రీలు, తదియ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజా వేదికను  పసుపు కుంకుమలతో అలంకరించి గౌరీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. పదహారు ముడులుగల తోరం ధరించి షోడశోపచార పూజ చేయాలి. పదహారు రకాల పూలను, పండ్లను, పిండి వంటలను గౌరీ దేవికి సమర్పించాలి.

               పూజ  తరువాత కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. స్వర్ణ గౌరీ వ్రత పూజా విధానము లో షోడశోపచార పూజ కోసం మంగళగౌరి వ్రతంలోని పూజ ను పాటించవచ్చు. ఈ నోమును పదహారు సంవత్సరాల పాటు ఆచరించాలి.


       స్వర్ణ గౌరి వ్రతం లోని కథ ఈ విధంగా ఉంటుంది. పూర్వ కాలంలో  ఒక రాజు వేటకి వెళ్ళిన సందర్భంలో ఓ నదీ తీరాన కొందరు ఏదో పూజ చేస్తున్నట్టుగా కనిపించడంతో  ఏం చేస్తున్నారని వాళ్లని అడుగుతాడు. వారు రాజుకు తాము స్వర్ణగౌరీ నోమును నోచుకుంటున్నట్టుగా చెప్పడంతో వారివద్ద విధి విధానాలు తెలుసుకున్నవాడై  ఇంటికి తిరిగివస్తాడు.

         రాజు తన ఇద్దరు భార్యలకి ఈ నోము గురించి చెప్పి, ఆచరించ వలసిందిగా కోరతాడు. పెద్ద రాణి ఈ మాటలను పెడచెవిన పెట్టి కష్టాల పాలవుతుంది. చిన్న రాణి పాటించి ఆశించినవి లభిస్తాయి. తర్వాత పెద్ద రాణి కూడా తన తప్పును తెలుసుకుని నోముని ఆచరించి కష్టాల నుండి విముక్తి పొందుతుంది.

భూ శుద్ధి :
           ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్దిచేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ,ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు .పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరి పిండి (బియ్యపు పిండి )తో ముగ్గు వేయాలి సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు .పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి

             .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్రపటం గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి , పిదప ఒక పళ్ళెంలో గాని ,క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు ఉంచి ,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావాల్సిన వస్తువులు
దీపారాధన విధానం
         దీపారాధన చేయుటకు   కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడి ది గాని ,మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో ) వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో(కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను.

       తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను . తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను . కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను.
           దీపారాధనకు నువ్వుల నూనెగాని ,కొబ్బరి నూనెగాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును . ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

ఘంటా నాదము :
 శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్
కుర్యా ద్ఘంటారవం తత్ర దేవతా హ్వాహన లాంచనమ్

         మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

         షోడస గౌరీ దేవి ఏ వ్రతమును (పూజను ) ఆచరించు చున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము ,మండపమునకు మామిడి ఆకులు ,అరటి మొక్కలు ,కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు ,పసుపు ,కుంకుమ , గంధం, హారతి కర్పూరం , అక్షతలు ,అగ్గి పెట్టె , అగరువత్తులు ,వస్త్ర, యజ్నోపవీతములు , తోరములు, (తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరుసలు (పోగులు ) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి ,ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజచేసిన వారందరూ కుడి చేతికి ధరిస్తారు. ప్రత్యేక నివేదన (పిండి వంటలు )
(పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.

1 ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7. ఓం త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11. ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13.ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15.ఓం ప్రద్యుమ్నాయ నమః 16. ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17.ఓం పురుషోత్తమాయ నమః18. ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19.ఓం నార సింహాయ నమః 20ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21.ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23.ఓం హరయే నమః24 ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను, ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య:

       ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము:

      మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే

         శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ),

          సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన . సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము .

           జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )

          ...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న

             సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ షోడస గౌరీ దేవి ముద్దిశ్య శ్రీ షోడస గౌరీ దేవి ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని )

         సంభ వద్భి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో ,నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోప చార పూజాం కరిష్యే తదంగ కలశ పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

           కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు.

            బ్ధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ షోడస గౌరీ దేవి
పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను.

ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు . స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .
శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజానన

వక్రతుండ శ్శూర్ప కర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సర్వ కాసంగ్రామే ర్యేషు విఘ్నస్తస్య నజాయతే |
పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహన ,ఆసనం ,అర్ఘ్యం , పాద్యం , ఆచమనీయం ,స్నానం , వస్త్రం, యజ్ఞోపవీతం ,గంధం ,పుష్పం ,ధూపం ,దీపం, నైవేద్యం,తాంబూలం ,నమస్కారం, ప్రదక్షణములు మొదలగునవి.
షోడశోపచార పూజా ప్రారంభః

ధ్యానం :
శ్లో || కురు పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే
భక్తా బీష్ట ప్రదేదేవి సుప్రీతా భవ సర్వదా
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి
అని షోడస గౌరీ దేవిని మనస్సున ధ్యానించి నమస్కరించ వలెను .

ఆవాహనం :

శ్లో || గచ్చా గచ్చ దేవిత్వం సర్వ మంగళ దాయిని
శ్రద్దా భక్తి సమాయుక్త ధ్యాయామి పరమేశ్వరి .
శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను .

ఆసనం :
శ్లో || విచిత్ర స్వర్ణ సంయుక్తం చిత్రవ వర్ణ సుశోభితం
గౌరీ సింహాసనం దేవి దాస్యామి శుభ లోచిన
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి .సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి
దేవుడు కూర్చుండు టకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం :

శ్లో || గగాజల సమాయుక్తం సుగంధం గంధ సంయుతం ,
గృహాణర్ఘ్యం మయాదత్తం మంగళం కురుమే శివే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి
దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ ,ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదల వలయును.

పాద్యం :

శ్లో || పుణ్య తీర్ధం సమానీతం పవిత్రం ద్రవ్య సంయుతం
పాద్యంచ పరి గృహ్నాతు గౌరీ దేవి నమోస్తుతే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పాదౌ : పాద్యం సమర్పయామి .
దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను .

ఆచమనీయం :

శ్లో|| సర్వ తీర్ధ సమధ్బూతం పవిత్రం విమలం జలం
గృహాణాచ మనం దేవి శంకరార్ధ శరీరణి||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆచమనీయం సమర్పయామి .
అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను .
సూచన :

అర్ఘ్యం ,పాద్యం ,ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను .అరవేణం (పంచ పాత్రకు క్రింద నుంచు పళ్ళెము) లో వదలరాదు .

మధుపర్కం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః మధుపర్కం సమర్పయామి .
అని దేవునికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ ,ఈ మధుపర్కం ను దేవి ప్రతిమకు

అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుదాన్ని మధుపర్కం అంటారు).

పంచామృత స్నానం :

శ్లో || శర్కరా మధు సంయుక్తం దధి క్షీర ఘ్రుతం తధా
పంచామృతం గృహాణ త్వం గౌరీ దేవి నమోస్తుతే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పంచామృత స్నానం సమర్పయామి .
అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి ,ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరిణెతో చల్ల వలెను.

శుద్దోదక స్నానం :

శ్లో || గంగాజల సమానీతం సర్వ తీర్ధ సముద్భవం,
స్నానార్దంచ గృహాణత్వం సర్వ కామ ఫల ప్రదే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .

వస్త్ర యుగ్మం :

శ్లో|| దివ్యాంబరం సమానీతం విచిత్రం చోత్తరీయకం
గృహాణత్వం మాయాదేవి సర్వ మంగళ దాయిని ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః వస్త్ర యుగ్మం సమర్పయామి .
(యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును .ఇటువంటివి రెండు చేసుకొనవలెను.) దేవి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఉపవీతం సమర్పయామి
అనగా జందెమును ఇవ్వవలెను ,ఇదియును ప్రత్తితో చేయవచ్చును ప్రత్తిని తీసుకుని పసుపుచేత్తో బొటన వ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమను అద్దవలెను .దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం :

శ్లో || శ్రీ ఖండం చందనం చైవ కర్పూరాగరు సంయుతం
విలేపర సుర శ్రేష్టే ప్రేత్ ర్ధం ప్రతి గుహ్యతాం .

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః గంధాన్ సమర్పయామి .ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలితో దేవి ప్రతిమపై చల్లవలెను .

ఆభరణం :

శ్లో || అంగుళ్య ముక్తా భరణాది యుక్తం హస్తాన లంకృత్యక రైశ్చ బంధం
మాణిక్య ముక్తా ఫల విద్రమేశ్చ గోమేదీ వైడూర్య కృతాంశ్చహారా ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆభరణాన్ సమర్పయామి .
అని దేవికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను. లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు దేవి పై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించ వలెను.

అక్షతలు :

శ్లో || అక్షతాన్ ధవళాన్ రమ్యా హరి ద్రాళంయుతా శుభా
అవి గృహ్ణా తుమే దేవి వాంచి తార్ద ఫలప్రదే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః అక్షతాన్ సమర్పయామి .
(అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలపవలెను ) అక్షతలు తీసుకొని దేవి ప్రతిమపై చల్లవలెను.

పుష్ప సమర్పణ :

శ్లో || శత పత్రై ర్జాతి సుమై : మల్లికాది మనోహరై
కేతకీ కర వీరైశ్చ అర్చయామి హరప్రియే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పుష్పాణి సమర్పయామి .దేవికి పువ్వులతో అలంకారము చేయవలెను . పువ్వులను దేవిపై వేసి నమస్కరించ వలెను .పిదప అధాంగ పూజను చేయవలెను.ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను .

అధాంగ పూజ

మహా దేవ్యై నమః పాదౌ పూజయామి
కమలోద్భవాయైనమః గుల్ఫౌ పూజయామి
సర్వలోక జనన్యై నమః జానునే పూజయామి
పుణ్య మూర్త్యే నమః జంఘే పూజయామి
విశ్వ మూర్త్యై నమః ఊరూ పూజయామి
మహా గౌర్యై నమః కటిం పూజయామి
అదోక్షజాయై నమః హృదయం పూజయామి
కంబు కంట్యై నమః కంటం పూజయామి
పరమాత్మనే నమః స్కంధౌ పూజయామి
అంభోజ హస్తాయై నమః హస్తౌ పూజయామి
రమ్య ముభాయై నమః ముఖం పూజయామి
ధర్మ కృతాయై నమః కర్ణౌ పూజయామి
శర్వాన్యై నమః లలాటం పూజయామి
విష్ణుమూర్త్యై నమః శిరః పూజయామి
శ్రీ మహా గౌర్యై నమః సర్వాణ్యం పూజయామి ||
అధ గ్రంధి పూజా || తోరగ్రంధి పూజ ||
దేవ్యై నమః ప్రతమ గ్రంధి పూజయామి
కమలోద్భవాయై నమః ద్వితీయ గ్రంధి పూజయామి
ఇందు చూడామణ్యై తృతీయ గ్రంధి పూజయామి
సర్వలోక జనన్యై నమః చతుర్ధ పూజయామి
పుణ్య మూర్త్యై నమః పంచమ పూజయామి
పరమాత్మనే నమః షష్ఠ పూజయామి
ధర్మ కృతాయై నమః సప్తమ పూజయామి
సరస్వత్యై నమః అష్టమ పూజయామి
మహా గౌర్యై నమః నవమ పూజయామి
మన్మధ వాసిన్యై నమః దశమ పూజయామి
పుణ్య మూర్త్యై నమః ఏకాదశ పూజయామి
శుబ్ర వర్ణాయై నమః ద్వాదశ పూజయామి
సరస్వత్యై నమః త్రయోదశ పూజయామి
ధర్మ కృతాయై నమః చతుర్దశ పూజయామి
కనకా భరణాయై నమః పంచదశ పూజయామి
సర్వలోక జనన్యై నమః షోడశ పూజయామి

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ దీనియందు 108 మంత్రములుండును ఈ మంత్రములను చదువుచు పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని దేవిని పూజించవలెను. పిదప అగరుబత్తిని వెలిగించి

ధూపం :

శ్లో || దశాంగం గుగ్గులం ధూముత్త మంగంధం సంయుతం
తన ప్రియార్ధ మానీతం గృహాణ పరమేశ్వరి ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపవలెను

దీపం :

శ్లో || సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరా పహే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః సాక్షాత్ దీపం దర్శయామి .
అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్నఅదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం :

శ్లో || ఆ పూపాన్వి విధా స్వాదూశాలి గోధుమ పాచితా
షోడశే కాగు యుక్తా గృహాణ పరమేశ్వరి .
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నైవేద్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క ,పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒక పళ్ళెము లోనికి తీసుకుని దేవి వద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ "ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ,ధియోయోనః ప్రచోదయాత్ ,సత్యం త్వర్తేన పరిషించామి, (ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా ,ఓం సమానాయ స్వాహా , మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో ) దేవికి నివేదనం చూపించాలి . పిదప ఓం శ్రీ గౌరీ దేవి నమః నైవేద్యానంతరము "హస్తౌ ప్రక్షాళయామి " అని ఉద్దరిణెతొ పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి తరువాత "పాదౌ ప్రక్షాళయామి " అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతొ వదలాలి . పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక మారు నీరు వదలాలి.

తాంబూలం :

శ్లో|| పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః తాంబూలం సమర్పయామి
అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు ,రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి ) దేవి వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :

శ్లో || చిత్రం నీరాజనం దేవి గృహాణ హరి వల్లభే ||
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః కర్పూర నీరాజనం సమర్పయామి .
అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించి న దీపంతో వెలిగించి ,మూడు మార్లు తిప్పుచూ ,చిన్నగా గంట వాయించ వలెను .అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనం అనంతరం శుద్దచామనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకుని ,

మంత్ర పుష్పం :

శ్లో || అక్షతాన్శ్వేత దూర్వాంశ్చ మల్లికా కుమాన్వితా||
పుష్పాంజిలిం ప్రదాస్యామి గృహాణ కరుణా నిధే ||
శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి
అని చెప్పుకుని అక్షతలు ,పువ్వులు ,చిల్లర దేవి వద్ద ఉంచవలెను.పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి .

ప్రార్ధన మంత్రం :

శ్లో || నృత్యైశ్చ గీత వాద్యైశ్చ పురాణ శ్రవణా దిభి :
రాజోపచారై ర్బహు భి : స్సంతుష్టా బహు సర్వదా ||
దేహి గౌరి సదారోగ్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ,
త్వత్పాద పద్మ యుగళం పూజయామి హరప్రియే ||

తోర బంధనం :

శ్లో || సర్వ మంగళ మాంగల్యే సర్వ మంగళ దాయినీ ,
సర్వ సంపత్కర శీఘ్రం గౌరీ దేవి నమోస్తుతే ||

వాయన మంత్రం :

శ్లో || ఏవం సంపూజ్య బక్త్యాచ గౌరీ దేవీం స్వ శక్తితః
దాతవ్యం షోడశా పూపా నావాయ నంతు ద్విజాయచ ,
గందాదిభి నలం కృత్య బ్రాహ్మణాయ ప్రదీయతాం ||
శ్రీ గౌరీ ప్రతి గృహ్ణాంతు శ్రీ గౌరీ వైద దాతిచ ,
శ్రీ గౌరీ తారకో భాభ్యాం మహా గౌర్యై నమోస్తుతే ||

ప్రార్ధన :

యస్స్య స్మృత్యాచ ,వరదా భవతు ||
పుష్పములను ,అక్షతలను చేతియందు ఉంచుకుని ,వ్రతకధను చదివి వాటిని దేవిపై వేయవలెను.

ప్రదక్షిణం :

శ్లో|| ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన ||
శ్లో || ప్రమద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక ,
ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి .
శ్రీ దేవికి చేతిలో అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నెలకు ఆన్చి , ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి ) తరువాత దేవిపై చేతిలో నున్న అక్షతలు ,పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ

పునః పూజ :

ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః పునః పూజాంచ కరిష్యే
అని చెప్పుకుని ,పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి, అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

షోడశోపచారములు :

ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి , నృత్యం దర్శయామి ,గీతం శ్రావయామి ,వాద్యం ఘోషయామి ,సమస్త రాజోపచార ,శక్త్యోపచార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .

పూజాఫల సమర్పణమ్ :

శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ షోడశ గౌరీ దేవి సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు .

ఏతత్ఫలం శ్రీ షోడశ గౌరీ దేవి అర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను .పిమ్మట ' శ్రీ షోడశ గౌరీ దేవి ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకుని స్వామి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను .ఆపిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై ఉంచవలెను దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ షోడశ గౌరీ దేవి నమః యధాస్థానం ప్రవేశాయామి శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.
పూజావిధానం సంపూర్ణమ్

తీర్ధ ప్రాశనమ్ :

శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |
సమస్త పాప క్షయ కరం శ్రీ షోడశ గౌరీ దేవి పాదోదకం పావనం శుభం ||
అని తీర్ధమును చేతిలో వేసుకుని మూడు సార్లు నోటిలోనికి తీసుకొనవలెను .

వ్రతకదా ప్రారంభము

కైలాస పర్వతం పైన ఒకనాడు స్కందుడు (అనగా 'కుమార స్వామి ' పుత్రులు (కొడుకులు ) పౌత్రులు అనగా (మనుమలు ) కలుగు వ్రత మేదైనా ఉన్నచో తెలుపుము అనగా పరమ శివుడు " కుమారా ! మంచి ప్రశ్న అడిగితివి అన్ని సంపదలను యిచ్చునట్టి స్వర్ణ గౌరి (అనగా షోడశ గౌరీ వ్రతం )ఒకటి కలదు. ఈ వ్రతము యొక్క కధను వినుమని ఇలా చెప్పు చుండెను.
పూర్వము సరస్వతీ నదీ తీరంలో 'విమలము ' అనే పేరుగల నగరము ఉండెను .చంద్ర ప్రభుడు అను రాజు ఉండెను. ఈ రాజ్యానికి ఈయన అధిపతి ఇతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య యందు ఇతనికి ప్రేమ ఎక్కువ ఒకనాడు ఇతడు వేటకు చాలా దూరం వెళ్లి ఒక చెట్టు దగ్గర అనేక అంటే చాలా మంది స్త్రీలను చూచాడు .వాళ్ళంతా దీక్షతో స్వర్ణ గౌరి (షోడశ గౌరి ) వ్రతమును చేయుచుండిరి . చంద్ర ప్రభుడు ఆ వ్రత విధానమును ,దాని ఫలమును వారి వలన తెలుసుకుని వెంటనే ఆ వ్రతమును చక్కగా శ్రద్దా భక్తులతో చేసి పదహారు గ్రంధులు (అనగా పదహారు పోగులు ) కల తోరమును కట్టుకొని ఇంటికి వచ్చి తన భార్యలకు ఆ వ్రతమును ఉపదేశించాడు . పెద్ద భార్య చంద్ర ప్రభుని చేతికి ఉన్న తోరమును చూచి అపార్ధం చేసుకుని ,దుర్భాష లాడుతూ (అనగా అతనిని తప్పు పట్టి ) దానిని త్రెంపి తోటలోని ఎండిపోయిన చెట్టు పైకి విసిరివేసెను .తోరము తగిలిన వెంటనే ఆ చెట్టు చిగిర్చెను. ఇది అంతా చూసి ,అతని చిన్న భార్య ఆశ్చర్యము చెంది ఆ తోరము తీసుకుని తాను కట్టుకొనెను . ఆ ప్రభావము చేత తన భర్తకు ఇష్ట మయ్యెను .అపచారము (చెడుపని) చేయుట చేత చంద్ర ప్రభుడు విడిచి పెట్టెను. విడువబడిన పెద్ద భార్య అనేక కష్టములు అనుభవించుచూ అడవుల పాలై దిక్కు తెలియక ఏడ్చు చుండెను .ఈమె ఏడ్చుట చూచి మహాగౌరి సాక్షాత్కరించెను. (అనగా కనిపించెను ) మహా గౌరిని చూచి నమస్కరించుచూ జయదేవి నమస్తుభ్యం జయ భక్త వరప్రదే ! అని ఈ విధముగా ప్రార్ధించి తన తప్పును క్షమింప చేయమని కోరెను. కరుణామయి అయిన గౌరి యొక్క అనుగ్రహమును పొంది స్వర్ణ గౌరి వ్రతమును చేసి ,ఇహ లోకమున (ఈ లోకమున ) అన్ని విధములైన సౌభాగ్య సుఖములను పొంది చివరకు శివుని సన్నిధికి చేరెను
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 24 July 2017

మంగళగౌరీ వ్రతం

   మంగళగౌరీ వ్రతం
          శ్రావణ మంగళవారం వ్రతం హిందూ సనాతన ధర్మం లో చేసుకొనే ఒక పుణ్యవ్రతం. దీనిని శ్రావణమాసములో మంగళవారం నాడు (అనగా రేపు25.07.2017) జరుపుకుంటారు.సకల శుభప్రదమైన శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించి..భక్తి శ్రద్దలతో చేసే వ్రతాల్లో ‘మంగళగౌరీ వ్రతం' కూడా ముఖ్యమైనది.
          శ్రావణ మాసంలో వచ్చే మంగళ వారల్లో మహిళలు చేసే ఈ పూజను ‘శ్రావణ మంగళగౌరీ పూజ' అని కూడా అంటారు. కుంటుంబానికి సకల శుభాలను, సంతోషాలను అందించి, చల్లగా కాపాడు తల్లీ..' అని ఆ జగజ్జనని పార్వతీ మాతను వేడుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు,
పురాణాల ప్రకారం:

         కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృత క్షీరసాగర మథనం చేసే సమయంలో ముందు కాలకూట విషం పుట్టింది. దాన్ని చూసి భయపడిన దేవదానవులు పరమేశ్వరుడిని వేడుకున్నారు. ఈ సమయంలో పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చేయాలి?అన్నట్లు పార్వతి వైపు చూశాడట.

        ఆ సర్వమంగళ స్వరూపిణియైన జగన్మాత తన భర్త చూపులోని ఆంతర్యాన్ని గ్రహించింది. దేవతలైనా, దానవులైనా, మానవులైనా మన భక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక ఇంకెవరు రక్షిస్తారు? అని భావించి .

          నిరంతరం స్త్రీల సౌభాగ్యసంపదను కాపాడే ఆ సర్వమంగల స్వరూపిని అయిన పార్వతీ దేవి తన మాంగల్యంపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశనానికి కారణమైన విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతించిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి కరుణారూపిణి, సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీ దేవిని కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ‘మంగళగౌరీ వ్రతం' ద్వారా పూజిస్తే వారికి గౌరీమాత కటాక్షం లభిస్తుందని, అలాగే వారికి సౌభాగ్యం, సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం.

           భాద్రపద మాసంలోనూ: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణంలో వచ్చే మొదటి మంగళవారం ఈ వ్రతాన్ని ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని ఆచరించాలి.
          ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఎదురైనా లేదంటే, ఏదైనా ఒక వారం గానీ, రెండు వారాలు గానీ చేయలేకపోయినా, అందుకు ప్రత్యామ్నాయంగా భాద్రపద మాసంలో వచ్చే మంగళవారల్లో వ్రతాన్ని చేసుకోవచ్చు అని పురాణాలు సూచిస్తున్నాయి. శ్రావణంలో ఎన్ని మంగళవారాలు వ్రతం చేయడానికి వీలు కలగదో, అన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాల్లో చేయవచ్చు.

         అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్లయిన సంవత్సరం నుంచి వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేస్తే ఆ గౌరీదేవి కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుతుందని భక్తుల విశ్వాసం

ఈ వ్రతానికి ఏమేం కావాలి?

         మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెగుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారం, కొబ్బరికాయ, పసుపు తాడు, దీపం కుందులు 2, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి సెమ్మెలు లేదా గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరుబత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు మొదలైనవి.

వ్రత విధానం

           శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన

          అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలనుఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు.
ఎలా చేయాలి?

1. వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి.

2. ఎర్రటి లేదా ఆకుపచ్చటి వస్త్రాన్ని తీసుకొని పూజ ప్రదేశంలో పరచాలి.

3. బియ్యంతో నవగ్రహాలను తయారుచేయాలి. తర్వాత గోధుమ పిండితో పదహారు మంది అమ్మవార్లను తయారుచేసుకోవాలి.

4. మనం ఎక్కడైతే పూజ నిర్వహిస్తామో(మంగళగౌరీ విగ్రహం ముందు) ఆ మండపానికి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.

5. మనం అన్ని పూజలకు ఎలాగైతే కలశాన్ని అలంకరిస్తామో ఈ పూజకు అలాగే కలశాలంకరణ చేయాలి. తర్వాత దీపాలు వెలిగించాలి.

6. గౌరీదేవి పూజ ప్రారంభానికి ముందు వినాయకుడి పూజ నిర్వహించాలి. అందుకోసం..పసుపు కుంకుమ, గంధం, తమలపాకులు, అక్షతలు పూలు, పండ్లు మొదలైనవన్నీ ముందుగానే సిద్దం చేసుకోవాలి.

7. ఇలా వరుసగా వినాయకుడికి నవగ్రహాలకు, పదహారు మంది అమ్మవార్లకు పూజ చేసిన తర్వాత మంగళగౌరీ దేవికి షోడశోపచార పూజ నిర్వహించాలి.

8. పదహారు రకాల పూలు, పండ్లు, అద్దం, దువ్వెన, గాజులు..ఇవన్నీ అమ్మకు భక్తితో సమర్పించాలి. అనంతరం వ్రత కథ చదివి వ్రతాన్ని పూర్తి చేయాలి.

9. ప్రసాధం, కుంకుమ, పసుపు.మొదలైనవాటితో ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడంతో పూజ ముగుస్తుంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?
       శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.  అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’.

          శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

         అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.
వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)

         ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.


మంగళగౌరీ వ్రత విధానం :
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః
మధుసూదనాయ నమః  
త్రివిక్రమాయ నమః  
వామనాయ నమః    
శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః    
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః  
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః  
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
 అధోక్షజాయ నమః  
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః  
జనార్ధనాయ నమః  
ఉపేంద్రాయ నమః    
హరయే నమః    
శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః    
శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః    
శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః  
శ్రీ  సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః  
మాతృభ్యో నమః,
పితృభ్యో నమః

       ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, భౌమ వాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం,

 శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే, అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య, శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి…
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :
       తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం  –

  శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :
ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి
ఓం శ్రీ  గౌరీ రత్నసింహాసనం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ  అర్జ్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.

తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

వ్రత కథ

        అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేని కూతురు కావాలా?” అని అడిగాడు.

          అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది.

         తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు.

           అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార అమ్మా, నాన్నా అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు.

         ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది.

         తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.

           విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు.
         బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.

         అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి, ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది.
         ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా, ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు.

         ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్ళి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్ళివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్ళి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్ళి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెళ్ళివారి నుండి కబురు అందుతుంది.

         వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్ళి జరిపించాడు.

        ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును.నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.

         ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.

           కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది.

    ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.

         అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది.

         ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు.

           అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది.

          అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు.

        రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది.

          అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.

         ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.

          అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.
          అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహాత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె.

         అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Sunday 23 July 2017

రేపటి నుండి అనగా 24-07-17 శ్రావణ మాసం ప్రారంభ శ్రావణ మాస విశిష్టత


రేపటి నుండి అనగా 24-07-17 శ్రావణ మాసం ప్రారంభ

శ్రావణ మాస విశిష్టత

      శ్రావణ మాసం  అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.
         ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయన్తి  ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా,  చంద్రుడు మనఃకారకుడు.

             అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది.

             మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

           శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంక వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది.
            సోమ, శుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవని

            భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి  శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం.

            శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణ సోమవారం

      ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు
శ్రావణ మంగళవారం
      శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు.

         కొత్తగా పెళ్ళైన వారు తప్పక  ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని  నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం

      ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని  షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు.
       ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి.
         లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం.

           శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం

శ్రావణ శనివారాలు

      ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పౌర్ణమి

      శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .

      జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

రక్షా బంధనం

      శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి.
          అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక, కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

*(శ్రావణ సోమవారాలు)*

1). 24౼7౼2017

2). 31౼7౼2017

3). 07౼08౼2017

4). 14౼08౼2017

5). 21౼08౼2017

*(5 సోమవారాలు)*


*(శ్రావణ శనివారాలు)*

1). 29౼07౼2017

2). 05౼08౼2017

3). 12౼08౼2017

4). 19౼08౼2017

*(4 శనివారాలు)*

🎋 *(శ్రావణ మాసం పండుగలు)*

*27౼07౼2017౼గురువారం౼నాగుల చవితి (ఉపవాసం)*


*28౼07౼2017౼శుక్రవారం౼నాగుల పంచమి*

*04౼08౼2017౼శుక్రవారం౼వరలక్ష్మీ వ్రతం*

*05౼08౼2017౼శనివారం౼శని త్రయోదశి*

*07౼08౼2017౼సోమవారం౼రాఖీ పౌర్ణమి (చంద్ర గ్రహణం)*

*15౼08౼2017౼మంగళవారం౼గోకులాష్టమి*

*19౼08౼2017౼శనివారం౼శని త్రయోదశి*

*25౼08౼2017౼శుక్రవారం౼శ్రీ వినాయక చవితి*

*29౼08౼2017౼మంగళవారం౼వినాయక నిమజ్జనం*


 🗣 *గమనిక:*

●  తేదీ 07౼08౼2017 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి చంద్ర గ్రహణం కలదు.

● ఈ గ్రహణం రాత్రి 10:56 నిముషాల నుండి తెల్లవారు జామున 1:05 నిముషాల వరకు ఉండును.

● ఈ గ్రహణంను శ్రావణ నక్షత్రం మరియు మకర రాశి వారు చూడరాదు.
 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Saturday 22 July 2017

ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా మరియు భీమన అమావాస్య అని కూడా పిలుస్తుంటారు

     ఈ రోజు అనగా 23.07.2017 ఆదివారం,అమావాస్య.
    ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా మరియు భీమన అమావాస్య అని కూడా పిలుస్తుంటారు

           సాధారణంగా అమావాస్య అనేది పితృదేవతలను ఆరాధించే ముఖ్యమైన రోజుగా భావిస్తుంటారు. ఇక ఈ విషయంలో ఆషాఢ అమావాస్య మరింత ముఖ్యమైనదిగా చెబుతుంటారు. ఈ రోజున పితృకార్యాలను నిర్వహిస్తూ, వారి ఆత్మలకు సంతృప్తిని చేకూరుస్తుంటారు. వారి ఆశీస్సులే తమను నడిపిస్తాయని నమ్ముతుంటారు.

           ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా కూడా పిలుస్తుంటారు. వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజున వ్రతాన్ని చేస్తుంటారు. దీప స్తంభానికి సున్నపు చుక్కలు పెట్టడం ... నైవేద్యంగా పచ్చి పిండితో చుక్కలు పెట్టడం, వెండి చుక్కను గానీ బంగారు చుక్కను గాని దానంగా ఇవ్వడం ఈ వ్రత విధానంలో ప్రత్యేకంగా కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే దీనిని చుక్కల అమావాస్య అని అంటారు.

           ఈ రోజున కొన్ని ప్రాంతాలలో 'దీపపూజ'ను నిర్వహిస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఒక వేదిక వంటిది ఏర్పాటు చేసుకుని, దానిపై ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో ప్రమిదలు వుంచి వెలిగించి, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
            ఈ రోజున సాయంత్రం కూడా ఇదే విధంగా దీపాలను పూజించి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శుభం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.

         ఈ రోజున స్త్రీలు అందరు గౌరీ అమ్మవారికి పూజ చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ ముద్దలను చుక్కలుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, 100 చుక్కలను, దారమును వంద వరుసలు పోసి దండగా చేసి మరుసటి రోజు వరకు దానిని ధరించడం, అమావాస్య రోజు సాయంత్రం కేవలం పాయసం, కొంత అల్పాహారం మాత్రమే తినడం జరుగుతుంది.
మరుసటి రోజు నుండి శ్రవణ మాసం ప్రారంభం అవుతుంది

ఆషాడ అమావాస్య మరొక విశేషం

           పుష్యమి నక్షత్రం ఆదివారం అమవాస్య రావడం ఎంతో విశేషం చాలా సంవత్సరాలకి ఒకసారి ఇలా వస్తుంది. ఈ అమావాస్య పుష్యర్క యోగం ఉండటం వలన మనం చేసేటువంటి పూజ జపం దానం కొన్ని కోట్ల రేట్ల ఫలితం ఇస్తుంది

             సకలాబీష్ట ప్రదాత , ఆర్థజన రక్షకుడు అయిన నరసింహ స్వామి ని ఆదివారం అమావాస్య రోజు పూజించడం వలన సకల దోషాలు పరిహార మవుతాయి

            ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం  చాలా విశేషం ఈ రోజున నరసింహ స్వామి సన్నిధిలో బియ్యం పిండి తో దీపం చేసి నేతి తో  దీపారాధన చేసి తీర్థ ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది

           ఆడి అమావాస్య రోజు తమిళనాడు లో అహోబిల మఠం అధిన క్షేత్రం అయిన తిరువల్లూర్ అనే క్షేత్రం లో వెలసిన వైద్య వీర రాఘవ స్వామి వారిని ఎంతో అద్భుతం గా పూజిస్తారు

          అలాంటి విధంగా మన అహోబిల మఠం భద్రాచలం లో అదే తరహా పద్దతి లో వైభవంగా ఆరాధన జరుగుతుంది.కావున నృసింహ స్వామి ని ఆదివారం అమావాస్య నాడు ఆరాధించడం వల్ల  అసంఖ్యాక మైన ఫలితం పొందుతము

           ఈ విశ్వం మొత్తం సకల ప్రాణికోటి ముక్కోటి దేవతలు నవగ్రహాలు నక్షత్రలు అన్ని కూడా నృసింహ ఆజ్ఞ మేరకే నడుస్తారు అని పెద్దల మాట

           భద్రాచలం శ్రీ అహోబిల మఠం లో ఆడి అమావాస్య పూజ కొరకు  విశేష ఏర్పాట్లు చేయడం అయినది
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
    
ఉపవాసం అంటే ఏమిటి

          దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.

        ‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’

(వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’

          మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి.
         భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

          విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే

శివవ్రతము.

         శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

               వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి.

          అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి.
           ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – 'పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

            అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు.

          అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

           శివరాత్రికి లొంగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు.

            అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.

            శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు.

           శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

ప్రదక్షణ విధులు…
           శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

బిల్వ దళం ప్రాముఖ్యత:

          బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు.

         ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి