Friday 31 March 2017

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి) మరియు నాగపూజ శ్రేష్ఠం

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి) మరియు
నాగపూజ శ్రేష్ఠం

       ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది. అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.
       అలాంటి లక్ష్మీదేవిని 'చైత్రశుద్ధ పంచమి' రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
       ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఈ చైత్ర శుద్ధ పంచమి నాడు నాగపూజ శ్రేష్ఠం

          ఈ మాసమంతా ఆధ్యాత్మిక సాధనలకు చాలా విశేషం. మొదటి తొమ్మిదిరోజులు అత్యంత ప్రధానమైనటువంటివి.
చైత్ర శుద్ధ పంచమి నాడు నాగపూజ శ్రేష్ఠం. “అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ” అని మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించాలి.

అనంతం వాసుకిం చైవ కాళీయం చ ధనంజయం
కర్కోటకం తక్షకం చ పద్మ మైరావతం తథా!!

మహాపద్మం చ శంఖుం చ శంఖం సంవరణం తథా
ధృతరాష్ట్రం చ దుర్ధర్షం దుర్జయం దుర్ముఖం బలం!!

గోక్షం గోకార్ముకం చైవ విరూపాదీంశ్చ శౌనక
న తేషాం ప్రవరాశ్చైవ యావత్యః సర్పజాతయః!!

కన్యకా మనసా దేవీ కమలాంశ సముద్భవా
తపస్వినీనాం ప్రవరా మహా తేజస్వినీ శుభా!!

యత్పతిశ్చ జరత్కారుః నారాయణ కులోద్భవః
ఆస్తికః తనయో యస్యాః విష్ణు తుల్యశ్చ తేజసా!!

ఏతేషాం నామమాత్రేణ నాస్తి నాగభయం నృణాం
కద్రూ వంశో నిగదితః వినతాయాః శృణుష్వమే!!

నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమో నిశి నమోస్తు నర్మదే తుభ్యం త్రాహి మాం విషసర్పతః అస్సేతిం చార్తసిద్దిమ్చ సునీతిం చ యః స్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాస్తి సర్పభయం భవేత్ .!!
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు..?

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు..?

కార్యసాధనామంత్రములు:-  ఏడు విధములైన  కోరికలు నెరవేరుటకు  మంత్రములు ఇక్కడ పొందు పరచుచున్నాను.

1.    మం\\  ఓం క్లీం హ్రీం రుం ద్రుః ఘ్రీం హ్రీం భైరవాయ నమః ||

 ఈ మంత్రమును 24000  పర్యాయములు జపించిన యెడల భైరవ స్వామి స్వప్న దర్శన మగును.  శివుని సన్నిధిలో స్థిర చిత్తముతో ఏకాంతముగా జపము చేయవలెను. అట్లైన ప్రయత్నము లేకుండానే మనస్సు లోని కోరికలు నెరవేరగలవు.

2    మం\\     ఓం క్రీం క్రీం క్రీం హూం హుం హ్రీం హ్రీం భైం భద్రకాళీ భైం హ్రీం హ్రీం హుం హూం క్రీం క్రీం క్రీం స్వాహా ||
         
ఈ మంత్రమును శక్తి ఆలయంలో  ధ్యాన పూర్వకముగా 10000 సార్లు జపించి ఇష్ట బలి గావించిన కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించగలవు. ( కాని మనో నిగ్రహం బాగా ఉండాలి )

3.  మం\\   ఓం శ్రీం హ్రీం జయ లక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహయ శ్రీం హ్రీం నమః ||

ఈ మంత్రమును నృశింహ స్వామిని పూజిస్తూ 40 రోజులు లక్ష పర్యాయములు జపించిన ఊహాతీతముగా అన్ని కోరికలు నెరవేరగలవు.

4.  మం\\  సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళమ్
                  సర్వక్లేశ హరం  వందే స్మర్తృగామీ సనోనతు ||

ఈ మంత్రమును ప్రతి నిత్యము పఠించు చున్న అభీష్టసిద్ధి జయము కలుగును. జప సంఖ్య లేదు.

5. మం\\  వందే పద్మకరాం ప్రశన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
                హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానావిధై ర్భూషితాం
                 భక్తా భీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మా దిభి స్సేవితాం
                పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సధా శక్తిభిః  ||

ఈ మంత్రమును  ఆసనమున కుర్చుండి లేవకుండా 108 పర్యయములు పఠించిన భాగ్యవంతులగుట తథ్యం . దారిద్య బాధలంతరించి కోరికలన్నీ నెరవేరుతాయి.

6. మం\\  రోగానశేషా నపహంసి తుష్టా
                 దదాసికామాన్ సకలానభిష్టాన్
                 త్వామాశ్రితానాం నవిపన్నరాణాం
                 త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ||

ఈ మంత్రమును ప్రతినిత్యము 24 మార్లు భక్తిగా పఠించిన అనతి కాలంలోనే కష్టములు తీరి కోరికలు నెరవేరి సుఖపడగలరు .
       
  7.   మం\\   ఓం ఐం క్లీం సౌః క్లీం ఐం

ఈ మంత్రమును  లక్ష సార్లు జపించి జాకి పూలతో దేవి పూజ గావించి పాయస నైవేద్య మిచ్చిన తలచిన కోరికలు సత్వరమే నెరవేరగలవు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

* 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

           వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నవి.
     
1. శ్రీరంగం 2. ఉరైయూర్ 3. తంజమా మణిక్కోయిల్ 4. తిరువన్బిల్ 5. కరంబనూర్ 6. తిరువెళ్లరై 7. పుళ్ళం పూదంగుడి 8. తిరుప్పేర్ నగర్ 9. ఆదనూర్ 10. తిరువళందూర్ 11. శిరుపులియూర్ 12. తిరుచ్చేరై 13. తలైచ్చంగణాన్మదియం 14. తిరుక్కుడందై 15. తిరుక్కండియూర్ 16. తిరువిణ్ణగర్ 17 తిరువాలి తిరునగరి 18. తిరుకన్నాపురం 19. తిరునాగై 20. తిరునరైయూర్

21. తిరునందిపురం 22. తిరువిందళూరు 23. తిరుచిత్రకూటం 24. శ్రీరామవిణ్ణగర్ 25. కూడలూర్ 26. తిరుక్కణ్ణంగుడి 27 తిరుక్కణ్ణ మంగై 28. కపిస్థలం 29. తిరువెళ్లియం గుడి 30. తిరుమణి మాడక్కోయిల్ 31. వైకుంఠ విణ్ణగరం 32. తిరుఅరిమేయ విణ్ణంగరం 33. తిరుత్తేవనార్ తొగై 34. తిరువణ్ పురుషోత్తమం 35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్ 36. తితుతైత్తియంబలం 37. తిరుమణిక్కూడం 38. తిరుక్కావళంపాడి 39. తిరువెళ్లక్కుళం 40. తిరుపార్తాన్ పళ్ళి

41. తిరుమాలిరుం శోలైమలై 42. తిరుక్కోటియూర్ 43. తిరుమెయ్యం 44. తిరుప్పల్లాణి 45. తిరుత్తంగాల్ 46. తిరుమోగూర్ 47. తెన్ మధురై 48. శ్రీ విల్లిపుత్తూరు 49. తిరుక్కురు గూర్ 50. తిరుతులై విల్లి మంగళం 51. శిరీవర మంగై 52. తిరుప్పళింగుడి 53. తెన్ తిరుప్పేర్ 54. శ్రీ వైకుంఠం 55. తిరువరగుణ మంగై 56. తిరుక్కళందై 57. తిరుక్కురుం గుడి 58. తిరుక్కోళూరు 59. తిరువనంతపురం 60. తిరువణ్ పరిశరాం

61. తిరుకాట్కరై 62. తిరుమూరీక్కళం 63. తిరుప్పలియూర్ 64. తిరుచిత్తార్ 65. తిరునావాయ్ 66. తిరువల్లవాళ్ 67. తిరువణ్ వండూరు 68. తిరువాట్టర్ 69. తిరువిత్తు వక్కోడు 70. తిరుక్కడిత్తానం 71. తిరువారన్ విళై 72. తిరువహింద్ర పురం 73. తిరుక్కోవలూర్ 74. పెరుమాళ్ కోయిల్ 75. శ్రీ అష్టభుజం 76. తిరుత్తణ్ కా 77. తిరువేళుక్కై 78. తిరుప్పాడగం 79. తిరునీరగం 80. తిరునిలాత్తింగళ్ తుండం

81. తిరువూరగం 82. తిరువెక్కా 83. తిరుక్కారగం 84. తిరుకార్వానం 85. తిరుక్కల్వనూర్ 86. తిరుపవళ వణ్ణం 87. పరమేశ్వరవిణ్ణగరం 88. తిరుప్పళ్ కుళి 89. తిరునిర్రవూర్ 90. తిరువెవ్వుళూరు 91. తిరునీర్మలై 92. తిరువిడ వెండై 93. తిరుక్కడల్ మల్లై 94. తిరువల్లిక్కేణి 95. తిరుఘటిగై 96. తిరుమల 97. అహోబిలం 98. అయోధ్య 99. నైమిశారణ్యం 100. సాలగ్రామం 101. బదరికాశ్రమం 102. కండమెన్రుం కడినగర్ 103. తిరుప్పిరిది 104. ద్వారక 105. బృందావనం 106. గోకులం 107 క్షీరాబ్ది 108. పరమపదం.

దివ్యదేశాలు

శ్రీరంగం
ఉరైయూర్
తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
తిరువెళ్ళరై (శ్వేతగిరి)
తిరుప్పుళ్ళం పూతంగుడి (కుంభ.కోణము 10 కి.మీ.)
తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
శిరుపులియూర్తి తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాండ్రు)
తిరుక్కుడందై (కుంభకోణము)
తిరుక్కండియూర్తి తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
తిరునాగై (నాగపట్నం)
తిరునరైయూర్ (కుంభకోణం 10 కి.మీ.)
నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాథన్ కోయిల్)
తిరువిందళూరు (మాయావరం) (తిరువళందూర్)
తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (శీర్గాళి)
కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
కపి స్థలమ్
తిరువెళ్ళియంగుడి మణిమాడక్కోయిల్ (తిరునాంగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
వైకుంద విణ్ణగరమ్
అరిమేయ విణ్ణగరమ్
తిరుత్తేవనార్ తొగై (కీళచాలై)
వణ్ పురుడోత్తమ్
శెంపొన్ శెయ్ కోయిల్
తిరుత్తెట్రియమ్బలమ్
తిరుమణిక్కూడమ్ (తిరునాంగూర్ తిరుపతి)
తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
తిరుపార్తన్ పళ్ళి
తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అంగర్ కోయిల్)
తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
తిరుప్పుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
తెన్ మధురై (మధుర) (తిరుక్కూడల్)
శ్రీవిల్లి పుత్తూరు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
తిరుప్పుళింగుడి తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
శ్రీ వైకుంఠము తిరువరగుణమంగై (నత్తం)
తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకొళమ్)
తిరుక్కురుంగుడి
తిరుక్కోళూరు
తిరువనంతపురమ్
తిరువణ్ పరిశారమ్
తిరుక్కాట్కరై
తిరుమూళక్కళమ్
తిరుప్పులియూర్ (కుట్టనాడు)
తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
తిరునావాయ్
తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
తిరువణ్ వండూరు
తిరువాట్టార్
తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
తిరుక్కడిత్తానమ్
తిరువాఱన్ విళై (ఆరుముళై)
తిరువయిందిర పురమ్
తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
అష్ట భుజమ్ (కాంచీ)
తిరుత్తణ్ గా (కాంచీ)
తిరువేళుక్కై (కాంచీ)
తిరుప్పాడగమ్ (కాంచీ)
తిరునీరగమ్ (కాంచీ)
నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
ఊఱగమ్ (కాంచీ)
తిరువెంకా (కాంచీ)
తిరుక్కారగమ్ (కాంచీ)
కార్వానమ్ (కాంచీ)
తిరుక్కళ్వనూర్ (కాంచీ)
పవళవణ్ణమ్ (కాంచీ)
పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
తిరుప్పుళ్ కుం (కాంచీ)
తిరునిన్ఱవూర్
తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
తిరువిడవెన్దై
తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
తిరువల్లిక్కేణి (చెన్నై)
తిరుక్కడిగై (చోళసింహపురము)
తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
తిరువయోధ్యై
నైమిశారణ్యం
శాళక్కిణామం (సాలగ్రామమ్)
బదరికాశ్రమం (బదరీనాథ్)
కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
వడమధురై (ఉత్తరమధుర)
శ్రీ ద్వారకతిరువాయిప్పాడి (గోకులము)
తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
పరమపదమ్ (తిరునాడు)
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday 28 March 2017

శ్రీ హేవళంబి నామ సంవత్సర రాశిఫలాలు

శ్రీ హేవళంబి నామ సంవత్సర రాశిఫలాలు

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 3

             శ్రీ హేవళంబినామ సంవత్సరంలో మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు అనుకూలిస్తాయి.
              ఆస్తులు పెంపొందించుకుంటారు. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పట్టుదలతో కృషి చేసినప్పుడే ఉన్నత చదువుల్లో లక్ష్యాలు సాధించగలుగుతారు.
               ఈ ఏడాది 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి.
            హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సెప్టెంబర్‌ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లభిస్తుంది.
             కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. స్నేహ, బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఏడాది 8, 9 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు.
           ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ 7- ఆగస్టు 26 తేదీల మధ్య స్పెక్యులేషన్లలో నష్టం సంభవం.
             ఆరోగ్యం మందగిస్తుంది. క్రయవిక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. పైచదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. 5, 4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా శ్రీ హేవళంబి సంవత్సరంలో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది.
             కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటపడతారు. సంతతి విషయంలో ఆందోళనకు గురవుతారు. 11, 10 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో ప్రోత్సాహకరం.
              వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాస్త ఫలితం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పైఅధికారులతో వ్యవహారాల్లో మౌనం మంచిది. దత్తాత్రేయస్వామి ఆరాధనతో చిక్కులు తొలగుతాయి.

వృషభం

(కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
 ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 7 అవమానం: 6

      హేవళంబినామ సంవత్సరంలో అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.

           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. 5-6 స్థానాల్లో గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు.

             ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్‌ వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.
             ఆరోగ్యం, విద్య పట్ల అధిక శ్రద్ధ చూపాలి. సెప్టెంబర్‌ 13 నుంచి గురువు తులారాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఉద్యోగ యత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. ఈ సంవత్సరం శని 7, 8 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

           స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. శతృబాధలు, రుణ బాధలు అధికం. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పనిచేసేవారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

            వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరంలో 4, 3 స్థానాల్లో రాహుసంచారం కారణంగా కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆటంకాలను అధిగమించి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బదిలీలకు అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధి స్తారు.

              ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. 10, 9 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో చికాకులు, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఖర్చులు అంచనాలు మిం చుతాయి. స్నేహానుబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షేర్ల లావాదేవీల్లో నష్టం తప్పకపోవచ్చు. ఉన్నత చదువుల్లో పట్టుదలతో శ్రమించి ఫలితం సాధిస్తారు. ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం.

మిథునం

(మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 6

           హేవళంబినామ సంవత్సరంలో స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు.
           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచరిస్తాడు. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
            పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. గురువు వక్రగమనంలో ఉండే ఉగాది నుంచి జూన్‌ వరకు మధ్య రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

          న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నుంచి సంవత్సరాంతం వరకు గురువు పంచమంలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభప్రదం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. శని ఈ సంవత్సరమంతా 6, 7 స్థానాల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

         శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శని వక్రించిన ఏప్రిల్‌ 7- ఆగస్టు 26 మధ్య ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

           వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 3, 2 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు ఆస్కారం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
            వయసులో చిన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. చెడుస్నేహాలకు దూరంగా ఉండాలి. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది దూరంగా ఉండటం శ్రేయస్కరం. 9, 8 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి.

            ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆంజనేయస్వామి ఆరాధనతో సత్ఫలితాలొస్తాయి.

కర్కాటకం

(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష) ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 6 అవమానం: 6

        శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఈ రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్స ల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం.

           విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చు కుంటారు. ఉగాది నుంచి జూన్‌ వరకు విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురుగ్రహం సెప్టెంబర్‌ 12 వరకు కన్యలో ఆ తరువాత తులారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. దూరప్రయాణాలకు అనుకూలం.

          ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 19 వరకు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.సెప్టెంబర్‌ తరువాత స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

          ఈ ఏడాది 5, 6 స్థానాల్లో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు.

             భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. శని వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం.

           వివాహ యత్నాలు నెమ్మదిగా నెరవేరతాయి. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 2, 1 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో నిలవదు. 8, 7 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం మంద గిస్తుంది.

         మానసిక ఆందోళన అధికం. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభాలనిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఆదాయం: 2 వ్యయం: 14 రాజపూజ్యం: 2 అవమానం: 2

        శ్రీ హేవళంబిలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.ఆరోగ్యం మెరుగవుతుంది.

          ఏప్రిల్‌ -జూన్‌ మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు.

          సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనందం కలిగిస్తాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.

           సెప్టెంబర్‌ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. 4,5 స్థానాల్లో శని సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

          ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌ 7 - ఆగస్టు 26 తేదీల మధ్య ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం.

           స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 1, 12 స్థానాల్లో రాహు సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు.

          ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. 7, 6 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యభగవానుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

కన్య

(ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు)
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 5 అవమానం: 2

          శ్రీ హేవళంబినామ సంవత్సరంలో అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. వివాహ, ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం.

          ఏప్రిల్‌ -జూన్‌ మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీవారు, శ్రీమతి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బాంధవ్యాలు బలపడతాయి.
         కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా అశాంతికి లోనవుతారు.
           అలర్జీలు బాధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సెప్టెంబర్‌ 13 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించు కుంటారు. శని 3, 4 స్థానాల్లో సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి.
          విద్యార్థులకు చదువుల పట్ల అఽశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్రమగమనంలో ఉన్న ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం అవుతాయి.
              శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 12, 11 స్థానాల్లో రాహుగ్రహ సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసంతా చికాకుగా ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. 6, 5 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల లాభం కలుగతుంది.

తుల

(చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 1 అవమానం: 5

         శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ప్రమోషన్లు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాల వారికి శుభప్రదం. ఉగాది నుంచి జూన్‌ వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.
           విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. గురువు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలు ఉన్నత పదవులు అందుకుంటారు. సినీరంగానికి చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
            విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు అధికం. ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఇల్లు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికవిషయాల్లో నిదానంగా కానీ పనులు జరగవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
          పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. 2, 3 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సోదరీసోదరులు, సన్నిహితుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబపరమైన గొడవలు తలెత్తుతాయి. చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది.
           వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురైనా చివరకు సానుకూల ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు పట్టుదలతో కృషి చేసి చదువుల్లో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య విషయాల్లో మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 11, 10 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
          పట్టుదలతో ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 5, 4 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
           ఆస్తులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. గృహనిర్మాణ కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. శ్రీరామచంద్రుడి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 5

          శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది.

            ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది.
          వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం.

             ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. ఉగాది నుంచి జూన్‌ వరకు పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.ఖర్చులు పెరుగుతాయి. 1, 2 స్థానాల్లో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో అటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. స్నేహ, బాంధవ్యాల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది.
             ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. రుణబాధలు అధికం. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. దీర్ఘకాలిక దృష్టితో చేసే పెట్టుబడులు కొంతవరకు లాభిస్తాయి. వేరేవారి ఆర్థిక విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి లక్ష్యాలు సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు.

             శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 10, 9 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదని గ్రహించాలి. అనుభవం ఉన్న వారి సహకారంతో ఒక నిర్ణయానికి వస్తారు.
               4, 3 స్థానాల్లో కేతు సంచారం కారణంగా కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
 ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 7 అవమానం: 1

      శ్రీ హేవళంబిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకారరంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

        విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. గురువు ఈ ఏడాది 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
           తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందర పాటు నిర్ణయాలు తగవు. సెప్టెంబర్‌ 13 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

              పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. 12, 1 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సహకారం, సలహాలు తీసుకుని ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి.
              ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు శని వక్రించి ఉన్న కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఓరిమితో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 9, 8 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

             ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు ఏ మాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. 3, 2 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు అధికం. సంతానం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు పరధ్యానం కారణంగా నష్టపోతారు. మనసు చికాకుగా ఉంటుంది. గణపతి ఆరాధన వల్ల సత్ఫలితాలు సాధిస్తారు.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)
 ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 1

             శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీగమన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి.
              వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం.
             కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి.

           మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. 11, 12 స్థానాల్లో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికం. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు.

           రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు భాగస్వామి సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 8, 7 స్థానాల్లో రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించాలి.

             వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్లే అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. 2, 1 స్థానాల్లో కేతు సంచారం కారణంగా అనవసర ఖర్చులు అధికం. చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

కుంభం

(ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
 ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 6 అవమానం: 1

         శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం.

           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆర్థిక విషయాల కారణంగా ఆందోళన అధికం అవుతుంది. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 8-9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు సంభవం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం.
             ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

             ఈ ఏడాది 10, 11 స్థానాల్లో శని సంచారం ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు.

            కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఒత్తిళ్లు అధికమౌతాయి. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల్లో నష్టం సంభవం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు.

            శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 7, 6 స్థానాల్లో రాహు సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకావం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. రుణబాధలు అధికం. 12, 1 స్థానాల్లో కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడి ఆరాధన శుభప్రదం.

మీనం

(పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4

            శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆందోళనలు పెరుగుతాయి.

            వృత్తిపరమైన ఒత్తిళ్ళు, న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. సెప్టెంబర్‌ 13 వరకు 7వ స్థానంలో గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు.

          ఆస్తులు పెంపొందించుకుంటారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

              శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది శని 9, 10 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల్లో చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు ఆస్కారం ఉంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది.

          మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 6, 5 స్థానాల్లో రాహు సంచారం వల్ల రుణ బాధలు అధికం.

              ఆర్ధిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సర్జరీ చేయించుకోవాల్సి రావచ్చు. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 12, 11 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఇంటి కోసం ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. పార్వతీదేవి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

ఉగాది. శ్రీ హేవళంబి నామ సంవత్సరం



ఉగాది శ్రీ హేవళంబి నామ సంవత్సరం

                        ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం

"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"

                    అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడా "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.

ఉగాది ప్రాముఖ్య0.

                                 చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాథ.

                            "ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

               ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు వారు నూతన సంవత్సరం జరుపుకుంటారు.  ఉగాది రోజున క్రొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి.

             ఉదయాన లేచి తలంటు స్నానం చేసి, క్రొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవాలయములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

                    ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
ఉగాది సాంప్రదాయాలు

              ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి.

ఉగాదిరోజు

తైలాభ్యంగనం

            తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి.

          కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం

 (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.


నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)

" శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "

ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)

               ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.
               యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

            మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగ్రంథ నిర్దేశితం.ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

          ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

           మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

     
పండుగ తయారి:
                  ఒక వారం ముందే పండుగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం, పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ.

                            ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి, రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలని కోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు. ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం.

పంచాంగ శ్రవణం:

                         ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది.

             తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

            ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు.

              ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

              లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

 ఉగాది కవి సమ్మేళనం. ఊరగాయల కాలం:

                        ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యంఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది

ఊరగాయల కాలం:

                      మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది” సర్వేజనా సుఖినోభవంతు
           
ఉగాది పూజ

                        అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి

                          "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం.షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

                     ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
లేక
" శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "

                      ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.

                      ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట.
                    అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది.
                     పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.

ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత

                   ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
 ఉగాది పచ్చడి చేసే విధానం
                దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-1కప్పు, బెల్లంపొడి-1కప్పు, కొబ్బరికోరు-1కప్పు, బాగాముగ్గిన అరటి పండ్లు-6, మామిడికాయ-1, కొత్తకారము-చిటెకెడు, ఉప్పు-అరస్పూను, శనగట్నాల) పప్పు పొడి-1కప్పు, చింతపండు-నిమ్మకాయంత, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరుశనగపప్పు-అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.

ఉగాది ప్రసాదం

                    ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రసాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినవలసిన ఆవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా వడపప్పులో వాడే పెసరపప్పు చలవ చేస్తుంది కనుక వేసవిలో కలిగే అవస్థ లను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్తుత కాలంలో ఉన్న పంఖా లాంటి, ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది.

ఉగాది పంచాంగ శ్రవణం

                   కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

                  నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా.శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము"ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి.
                  ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

                   ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday 26 March 2017

సోమవతి అమావాస్య అమ సోమవతి వ్రతం - సోమవారం + అమావాస్య

సోమవతి అమావాస్య

అమ సోమవతి వ్రతం - సోమవారం + అమావాస్య

        సోమవారం + అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచు . శనివారం రోజున మాత్రమే చెట్టుని తాకాలి , సోమవారం రోజున చెట్టుని తాకకూడదు . సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలం వేప చెట్టు రావి చెట్టు కింద నాగ శిలలు ఉన్న దగ్గర , ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. శిలలు  నిలతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి.

          ఆమ సోమ వార వ్రత కధ పుస్తకం లో శ్లోకాలు చుదువుకోవాలి. ఒక వేల కధ పుస్తకం దొరకక పోతే కూడా కింద శ్లోకం చడుకుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్య వతిగ దీవించమని వెడుకోవాలి. పండు నైవేద్యం నివేదించాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.

వ్రత కథ - విధానము

             అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.

              అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,"సముద్రాలను దాటడమెలాగా?" అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది. అన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి.అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.

             అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసాడు,

            ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,"ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?" అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.
           చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు.వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తుతించారు.

          కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది.దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.

          ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నారు.
పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది.

విధానం:

            ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.

శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ | మద్యతో విష్ణురూపిణే |
అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |

            ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండో ఫలమో,మణో,మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి.అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.

ఉద్యాపన:

       108 వ అమావాస్య సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి,బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను
స్థాపించి ఆరాధించాలి.ఆఖరున మండపాన్ని,కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి. ముత్తయిదువలకు 108 ఫలాలను గాని,రత్నాలను గాని వాయనదానమివ్వాలి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday 24 March 2017

శని త్రయోదశి రోజున చేయవలసిన పనులు, నేడు శ్రీ శని త్రయోదశి శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి


శని త్రయోదశి రోజున చేయవలసిన పనులు,
నేడు శ్రీ శని త్రయోదశి

           చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. 
            మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. 

               వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

శనిదోష పరిహారానికి...

          శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
 భైరవ స్తోత్రం  చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.

        శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. 

           కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.

శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి

          నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం
ఛాయా మార్తాండ సంభూతం నమామి శ్రీశనైశ్చరం- శనీశ్వరుడు గ్రహాధిపతి. నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ప్రభావశాలి. మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మకర కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞ, ఆమె సంతానం వైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు, యమున.

          సంజ్ఞ సూర్యుని తేజాన్ని భరించలేక తననుంచి ఛాయను సృజించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయింది. ఛాయకు సూర్యుడికి సావర్ణుడు, శనైశ్చరుడు జన్మించాడు.

        శనీశ్వరుని గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విభిన్న విషయాలు వివరిస్తున్నాయి. శని మందగమనం గలవాడు గనకు మాదుడు అంటారు. ఇతని వాహనం కాకి, నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం.

శని భార్య జ్యేష్ఠాదేవి.

       సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి.

           శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు.అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం.కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి.
          శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనదంటారు. అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు. దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి.
          లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. కోణస్థ, పింగల తదితర శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం. శనిత్రయోదశి అయిన నాడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!

తిల దీపం ఎలా పెటాలి : 
         నల్ల నువ్వులు నల్ల గుడ్డలో కట్టి ఇనుము ప్రమదిలొ దీపం పెట్టలి. నల్ల నువ్వుల మూట పెట్టి సనీస్వరుడుకి ఎదురుగ పెటాలి. శని త్రయోదశి అంటే శని హోర లో పూజ చేసుకోవాలి.

తిల దానం : తిల దానం  చేస్తారు సాని జపం చేయించుకుంటారు . జపం అయిన తరువాత ఇనుప పాత్రలో నల్ల నువూలు పోసి, ఇనుమ శని ప్రతిమ కానీ లేదా ఇనుమ మేకు కానీ పెట్టి నల్ల గుడ్డ కప్పి దానం ఇవాలి.శని ప్రదోషం రోజున - శని దోషం పోవాలని శివుడిని పూజ చేయటం, శని ప్రదోషం రోజున శని పూజ , శివ పూజ కూడా వుంటుంది.

             శని అంతర్దసలు,ఏలినాటి శని , అర్దాష్టమి శని కానీ , శని అష్టమంలో శని కి దోష పరిహారం చేయించుకోవాలి. ఇ కాలం(శని దోషం) లో శనివారం రోజున సంకల్పం చేపుకోవాలి ఈ రోజు నేను శని ప్రదోషం వుంటాను అని సాయంత్రం శివాలయానికి వెళ్లి శనికి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నునె తలమీద నుంచి పోసి (అభిషేకం) చేసి నువ్వుల నునె తో దీపం పెటాలి. (తిల దీపం పేటనవసంరం లేదు ) శని ఆశ్తోత్రం , స్తోత్రం చదువుకోవాలి. శివుడికి దీపారాధన చేయాలి -రెండు వోతులు.

చండి ప్రదక్షిణ చేయాలి:

             శివుడికి అబిషేకించిన జలాని (సోమసుత్రం ) దాటకూడదు. నంది దగరనుంచి సోమసుత్రం వరుకు ప్రదక్షిణ చేసి మల్లి వెనకి తిరిగి నంది వరుకు వస్తే అది ఒక ప్రదక్షిణ  ఇలా 11 సార్లు చేయాలి. అని దేవత విగ్రహాలు పక్క పక్క నే వుంటే అందరి దేవులకు ప్రదక్షిణ కలిపి చేసేటపుడు సోమసుత్రం ఎలాగో దాటం కాబటి అప్పుడు పర్వాలేదు. శివుడికి అబిషేకించిన జలాని మాత్రం ఎట్టి పరిస్థితులోనూ దాట కూడదు (సోమసుత్రం ) దాటకూడదు.

           అర్చన కానీ అభిషేకం , హారతి పండో పుష్పం శివుడికి నివేదించి ఎవరికైనా పళ్ళుకానీ సంపర్పించి ఈశ్వర ఎ రోజు నేను శని ప్రదోషం వున్నాను. నాకు శని దోషాలు పోవాలి అని సంకల్పం చేపుకోవాలి. తరువాత పెదవాలకి కానీ బ్రాహ్మణునికి కానీ భోజనం పెటాలి, లేదా బ్రాహ్మణునికి స్వయపాకం ఇవాలి. లేదా షాకాధానం (కూరగాయలు వండుకోవడానికి వీలయినంత ఉప్పు కూడా ఇవాలి). లేదా 2/3 పండ్లు దానం ఇవాలి. అంటే శివ దర్శనం అయి దానం అయిన తరువాత మాత్రమే భోజనం చేయాలి.

శని ప్రదోషం చేసే వారు పాటించాల్సిన నియమాలు : బ్రహ్మచర్య చేయాలి , ఉల్లి వెల్లులి  తినకూడదు , మద్యపానం చేయకూడదు.

శని కి చదువుకోవలిసిన స్తోత్రాలు : శని జపం బ్రాహ్మణుని చేత జపం చేయించుకోవాలి. శని కవచం :శని కవచం చదవటం వలన శని రక్షణ కవచం లాగా వుంటాడు. హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణాలు చేయటం, రావి  చెట్టు కి శనివారం ప్రదక్షిణాలు చేయటం , రవి చెట్టు దగర దత్త పారాయణం చేయటం వలన కూడా శని దోషాలు పోతాయి.( రావి చెట్టు కి ప్రదక్షిణాలు కేవలం శనివారం మాత్రమె చేయాలి , ఎందుకంటే రవి చెట్టు లో జేష్ట దేవి ఉంటుంది ).

శని వలన సారీరకంగా కలిగే భాదలు: శని వలన గస్త్రిక్ , పాదాలు , ఒంటి నెప్పులు శని కారకుడు. కళ్ళకి , కనురేప్పలకి , కళ్ళలోని కోర్నియ కి శని కారకుడు .

శని త్రయోదశి ప్రాముఖ్యత

           నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

           జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం  చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

           బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

          శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి  , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

           క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

           ఆ సమయం లో శివుడు ,  మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.  ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

           ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

               ఈ సమయం లో శివుడికి చేసే  పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,

శనిత్రయోదశి రోజున  ఉపవాసం ఉండడం,

రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం,

 నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం.

నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం,

నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.

వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం

ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి

మద్యమాంసాదులను ముట్టరాదు.

వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

        ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

శని మహత్యం:

         శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు.

            చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి.

           శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

           బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు.

         శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు.

              తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 23 March 2017

ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు ఏకాదశి అని అంటారు


ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు

ఏకాదశి అనగా ఏమి, వాటి ఫలితము ఏమిటి?.

        ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.

                మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి ఫలములు:
           ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం నుండి జేష్ఠ మాసం వరకు  వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరంలో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;

1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.
2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.
3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.
4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి
5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.
6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును
7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;
8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;
9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.
10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .
11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.
12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.
13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.
14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.
15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.
17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం
18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.
19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:
20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం
21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి
22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం
23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }
24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..
ఇవి సంవత్సరలో వచ్చే ఏకాదశులు

ఇందులో ఈ రోజు అనగా 24-03-2017 శుక్రవారము పాప విమోచన ఏకాదశి: పాప సంహారము

పాప విమోచన ఏకాదశి

           పాల్గుణ బహుళ ఏకాదశిని ” పాప విమోచన ఏకాదశి” లేక ” సౌమ్య ఏకాదశి” అని అంటారు. పూర్వం కుబేరుని పుష్పవాటికలో అప్సరసలు విహరించసాగారు. ఎంతో సుందరమైన ఆ పుష్పవాటికలో దేవతలతో పాటు మునీశ్వరులు కూడా తపస్సు చేస్తు ఉంటారు. ఆ పుష్పవనానికి చైత్ర,వై శాఖమాసాలలో ఇంద్రుడు తన పరివారంతో వస్తూ ఉంటాడు.
            ఆ వనంలో మేధావి అనే పేరు గల ఓ మునీస్వరుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు.ఇంద్రుని పరిజనంతో పాటు వచ్చిన వారిలో మంజుఘోష అనేఅప్సరస , మేధావి ముని తపాస్సుకు భగ్నం చెయ్యాలని చూస్తూ ఉండేది. ఒకరోజు ఆమే పట్ల మోహావేశుడైన మేధావి,తపస్సును వదిలి ఆమేతో గడుపుతూండగా,ఒక రోజు మంజుఘోష తన లోకానికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వమని అడిగింది.

             ఆమే అలా అడిగినప్పుడు అల్లా అతను వద్దు అని అంటూ ఉండేవాడు. అలాగ 57 సంవత్సరాలు 9 నెలలు 3 రోజులు గడిచాయి. చివరకు ఆమే తనతో గడిపిన కాలాన్ని లెక్కవేసుకొమని చెప్పగా, లెక్కలు వేసుకున్న మేధావి ఇన్ని సంవత్సరలు వ్యర్ధం అయిపొయాయని చింతించి, కోపావేసంలో ఆ అప్సరసను శపించాడు. మేధావి శాపానికి మంజుఘోష శాపవిమోచనాన్ని అభ్యర్దించింది.

           పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పిన మేధావి ,తన తండ్రి సలహాను అనుసరించి,తను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తగిన ఫలితం పొందాడు.

            ఈ రోజున పొద్దున్నే సూర్యొదయానికి ముందు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము ఆచరించి, ఆ రోజు ఉపవసం ఉండి, ఎదైన ఆలయం దర్సించుకుని, విష్ణు సహస్రనామ పారయణం పఠనం అనంతమైన ఫలితం కలిగిస్తుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 15 March 2017

వైశాఖ మాసం, కృష్ణ పక్షం బహుళ చవితి ఆదివారము ఈ రోజు(14-05-2017)సంకట హర చతుర్థి

వైశాఖ మాసం, కృష్ణ పక్షం బహుళ చవితి ఆదివారము

  ఈ రోజు(14-05-2017)సంకట హర చతుర్థి

              సుద్ధ చవితి రోజున ఉదయం పూట పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం అంటే ఈ రోజు పొద్దున పూజ చేసిన చ0ద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి.

                సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు,ఆ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చ0ద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి .రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యహ్నం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచ్చితంగా తిధి సమయం చూసుకోవాలి.

         సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు.కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

           జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.

సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :

          సంకటాలు ఉన్నపుడు , వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తేలవరుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటె అభిషేకం చేసుకోవచు (గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం ).

          గుడిలో పూజ చేసుకోవచు లేదా ఇంట్లో నే గణపతి పటానికి గణపతి స్తోత్రాలు ,గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం , వీలయితె గణపతి మంత్రాని "ఓం గం గణపతయే నమః" అనే నామని జపించుకోవచ్చు.

చవితి రోజు చంద్రుడు కనిపించక పోతే?

         గరిక , ఎర్రని గన్నేరు పూలు , ఎర్రని మంధర పూలు , ఎర్రని గులాబీలు , ఎర్రని రక్త చందనం పెట్టి గణపతి కి పూజ చేయాలి . తెల్ల జిలెడు పూలతో పూజ చేస్తే మహా విశేషం. మోదకం , లడ్లు నైవేద్యం చేసి చద్రుడికి కూడా నివేదన చేసి , చంద్రుడికి కూడా నమస్కారం పెట్టి , ఎవరికైనా నైవేద్యం లేదా భోజనం పెట్టి వారు తినాలి . నిష్ఠగ చేయాలి అనుకునే వారు ఇంకా ఆ రోజు కి ఉపహారం చేసి మర్నాడు దీపం పెట్టి అప్పుడు తినాలి . ఉండలేని వాలు ఇంకా చవితి రోజే చంద్రోదయం పూజ అయిన తరువాత తినే యవచ్చు. ఆకాశం వంక చూసి చంద్రుడిని ,విఘ్నేశ్వరుడు తలచుకుని నమస్కరించి వ్రతం నిష్క్రమించవచ్చు.

సంకష్టహరచవితి వ్రత  విధానం .

               సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

           ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
                ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

            సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్దిస్తుందని ప్రతీతి
ఈ మొత్తం వ్రతం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
ఓం గం గణపతయే నమః

సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

ఏకవింశతి నామ పూజ :

ఓం సుముఖాయ నమఃమాలతీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమఃఅపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమఃజంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమఃగణ్డకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి

          వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము.


సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.

            ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు.

           అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
             అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు…

           ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి.

         నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

              అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

           అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు.
           ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

         ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి