Monday 24 October 2022

కేదారేశ్వర వ్రత కథ

కేదారేశ్వర వ్రత కథ

పరమేశ్వరుని  పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను.

శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురుష - యక్ష - గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించు చుండిరి. ఋషులు - మునులు - అగ్ని - వాయువు - వరుణుడు - సూర్యచంద్రులు - తారలు - గ్రహాలు - ప్రమదగణాలు - కుమారస్వామి - వినాయకుడు - వీరభద్రుడు - నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల - సాల - తమలా - వకుళ - నరికేళ - చందన - పనస - జంభూ వృక్షములతోను చంపక - పున్నాగ - పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి.

అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగాగల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా ! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ ! పరమార్థ విదులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది.

ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా ! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.

అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని ఆసీవీజ మాసంలో శుక్ల పక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను., ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శివభక్త పరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా ! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞ నియ్యవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.

ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి ! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.

అప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది.

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివిన, విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.

శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.

కేదారేశ్వర వ్రతం

కేదార గౌరీ వ్రతం

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యో నమః

హరిః ఓం శుచిః :-

శుచిః :-

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం

గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద సంకీర్తనం ఘంటానాదం :-

ఘంటానాదం :-

అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ దీపారాధనం :-

దీపారాధనం :-

దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే

భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్

యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ

దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు

పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

గురుర్ర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం

అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

ఓం గణానామ్ త్వా గణపతిగ్‍మ్ హవామహే కవిం కవీనామ్ ఉపమశ్ర వస్తవమ్

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి

సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు

యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా

తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం

తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘియుగం స్మరామి

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః

ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

ఆచమనం:

ఓం మహేశ్వరాయ నమః

ఓం మహాదేవాయనమః

ఓం సర్వెశ్వరాయనమః

ఓం శివాయనమః

ఓం శంకరాయనమః

ఓం శాశ్వతాయనమః

ఓం పశుపతేనమః

ఓం ఉమపతేనమః

ఓం బ్రహ్మ ధిపతే నమః

ఓం పరమేశ్వరాయనమః

ఓం భస్మాం గరాగాయనమః

ఓం మహేష్వాయనమః

ఓం నిత్యాయనమః

ఓం శుద్దయన ద్ద మః

ఓం మృత్యుం జయాయనమః

ఓం భూతేశాయనమః

ఓం మృదాయనమః

ఓం శర్వాయనమః

ఓం సదాశివాయనమః

ఓం అభవాయనమః

ఓం సర్వజ్ఞాయనమః

ఓం భీమాయనమః

ఓం వాసుదేవాయనమః

ఓం త్రిపురాంతకాయనమః

ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమ

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ,

ఓం శ్రీ ఉమామహేస్వరాభ్యా మ్నమః

ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః,

ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః

ఓం శ్రీ అరుంధతీవశిష్టాబ్యాం నమః,

ఓం శ్రీ సీతారామాబ్యాం నమః

ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః,

ఓం శ్రీ గ్రామదేవతాబ్యాం నమః,

ఓం శ్రీ గృహదేవతాబ్యాం నమః,

ఆదిత్యా ది నవగ్రహదేవతాబ్యాం నమః

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

ఓం సర్వేభ్యొ మహాజనేభ్యొ నమః

అయం ముహుర్తస్సు ర్త సుముహూర్తొ అస్తు

భూతోచ్ఛాటనము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

*అథః ప్రాణాయామః*

ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్

ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం సంకల్పము:

సంకల్పము:

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......... నామ సంవత్సరే, ......ఆయనే, ...... ఋతౌ, ...... మాసే ......పక్షే, ...... తిథౌ, ...... వాసరే, ...... నక్షత్రే, ......యోగే, ......కరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్ ......గోత్రస్య ...... నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష ఐశ్వర్య పంచవిధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్ర పౌత్రాది వృద్యర్ధం నానావిధ సౌభాగ్య సిద్యర్ధం మనోవాంచా ఫల సిద్యర్ధం భక్తి జ్ఞాన వైరాగ్య యోగ ప్రాప్త్యర్ధం చారాచార ప్రాణి కోటీనామ్ క్షేమ సిద్యర్ధం ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్ధం ఆవాహతేభ్యో,సర్వేభ్యో, దేవేభ్యః సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ కేదారేశ్వర షోడశోపచార పూజాం కరిష్యే. కలశ పూజ:

కలశ పూజ:

తదంగ కలశ పూజాం కరిష్యే...

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః

కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః

పూజాద్రవ్యాణి  దేవం ఆత్మానం సంప్రోక్ష్య.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా షోడశోపచార పూజ:

షోడశోపచార పూజ:

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.

ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్కం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- స్నానం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణాయ నమః,

ఓం లంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం ధూమకేతవే నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచం ద్రాయ నమః,

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః,

ఓం శూర్పక ర్ణాయ నమః,

ఓం హేరంభాయ నమః,

ఓం స్కందపూర్వజాయ నమః,

ఓం గణాధిపతయే నమః.

షోడశ నామ పూజా సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

సత్యం త్వర్తేన పరిషం చామి

అమృతమస్తు  అమృతోపస్తర ణమసి

ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --ఓం పరబ్రహ్మణే నమః

ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి

శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే

పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ

త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప

ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి,

గజనారోహమావాహయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.

అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ

శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.

ఓం శ్రీమహాగణపతయే నమః :-

కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణాయేతి సమర్పయామి


అర్పణం:

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు:

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం

మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన,

యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే,

అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో వరదో భవతు.

శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి.


ఉద్వాసన:

'ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి, ప్రధమాన్యాసన్

తేహ నాకం మహిమానస్ప చంతే యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః

షోడచోపచారాలు

ధ్యానం

శూలం ఢమరుకంచైవ - దదానం హస్త యుగ్మకే

కేదారదేవ మీశానం ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్,

శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి

ఆవాహనం

కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో

ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి

ఆసనం

సురాసుర శిరోరత్న - ప్రదీపిత పదాంబుజ

కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి

పాద్యం

గంగాధర నమస్తేస్తు - త్రిలోచన వృషభద్వజ

మౌక్తికాసన సంస్థాయ - కేదారాయ నమోనమః

శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం

అర్ఘ్యం గృహాణ భగవన్ - భక్త్యాదత్తం మహేశ్వర

ప్రయచ్ఛమే మనస్తుభ్యం - భక్తానా మిష్టదాయకం

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం

మునిభిర్నా రథప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః

కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి

పంచామృత స్నానం

స్నానం పంచామృతైర్ధేవ శుద్ధ శుద్ధోద కైరపి

గృహాణగౌరీరమణత్వద్బక్తేన మయార్పితం

శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి

స్నానం

నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం

స్నానం స్వీకురుదేవేశ - సదాశివ నమోస్తుతే

శ్రీ కేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి

వస్త్రం

వస్త్ర యుగ్మం సదాశుభ్రం - మనోహర మిదం శుభం

దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం

శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి

యఙ్ఞోపవీతం

స్వర్ణ యాఙ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం

రుద్రాక్షమాలయా యుక్తం - దదామి స్వీకురు ప్రభో

శ్రీ కేదారేశ్వరాయ నమః యఙ్ఞోపవీతం సమర్పయామి

గంధం

సమస్త గ్రంథద్రవ్యాణాం - దేవత్వమసి జన్మభూః

భక్త్యాసమర్పితం ప్రీత్యా - మయాగంధాది గృహ్యతామ్

శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి

అక్షతలు

అక్షతో సి స్వభావేన - భక్తానామక్షయం పదం

దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్

శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పం

కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః

కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా

శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాణి పూజయామి

తతః ఇంద్రాది లోకపాలక

పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే {కుడివైపు} బ్రాహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః


అథాంగ పూజ

మహేశ్వరాయ నమః - పాదౌ పూజయామి,

ఈశ్వరాయ నమః - జంఘే పూజయామి,

కామరూపాయ నమః - జానునీ పూజయామి,

హరాయ నమః - ఊరూ పూజయామి,

త్రిపురాంతకాయ నమః - గూహ్యం పూజయామి,

భవాయ నమః - కటిం పూజయామి,

గంగాధరయ నమః - నాభిం పూజయామి,

మహాదేవాయ నమః - ఉదరం పూజయామి,

పశుపతయే నమః - హృదయం పూజయామి,

పినాకినే నమః - హస్తాన్ పూజయామి,

శివాయ నమః - భుజౌ పూజయమి,

శితికంఠాయ నమః - కంఠం పూజయామి,

విరూపాక్షాయ నమః - ముఖం పూజయామి,

త్రినేత్రాయ నమః - నేత్రాణి పూజయామి,

రుద్రాయ నమః - లలాటం పూజయామి,

శర్వాయ నమః - శిరః పూజయామి,

చంద్రమౌళయే నమః - మౌళిం పూజయామి,

పశుపతయే నమః - సర్వాణ్యాంగాని పూజయామి


అష్టోత్తర శతనామ పూజ

  • ఓం శివాయ నమః
  • ఓం మహేశ్వరాయ నమః
  • ఓం శంభవే నమః
  • ఓం శశిరేఖాయ నమః
  • ఓం పినాకినే నమః
  • ఓం వాసుదేవాయ నమః
  • ఓం విరూపాక్షాయ నమః
  • ఓం నీలలోహితాయ నమః
  • ఓం శూలపాణయే నమః
  • ఓం విష్ణువల్లభాయ నమః
  • ఓం అంబికానధాయ నమః
  • ఓం భక్తవత్సలాయ నమః
  • ఓం శర్వాయ నమః
  • ఓం శితికంఠాయ నమః
  • ఓం ఉగ్రాయ నమః
  • ఓం కామారయే నమః
  • ఓం గంగాధరాయ నమః
  • ఓం కాలకాలయ నమః
  • ఓం భీమాయ నమః
  • ఓం మృగపాణయే నమః
  • ఓం కైలాసవాసినే నమః
  • ఓం కఠోరాయ నమః
  • ఓం వృశాంకాయ నమః
  • ఓం భష్మోద్ధూళిత విగ్రహాయ నమః
  • ఓం సర్వమయాయ నమః
  • ఓం అశ్వనీరాయ నమః
  • ఓం పరమాత్మవే నమః
  • ఓం హవిషే నమః
  • ఓం సోమాయ నమః
  • ఓం సదాశివాయ నమః
  • ఓం వీరభద్రాయ నమః
  • ఓం కపర్థినే నమః
  • ఓం శంకరాయ నమః
  • ఓం ఖట్వాంగినే నమః
  • ఓం శిపివిష్టాయ నమః
  • ఓం శ్రీకంఠాయ నమః
  • ఓం భవాయ నమః
  • ఓం త్రిలోకేశాయ నమః
  • ఓం శివాప్రియాయ నమః
  • ఓం కపాలినే నమః
  • ఓం అంధకాసురసూదనాయ నమః
  • ఓం లలాటక్షాయ నమః
  • ఓం కృపానిధయే నమః
  • ఓం పరశుహస్తాయ నమః
  • ఓం జటాధరాయ నమః
  • ఓం కవచినే నమః
  • ఓం త్రిపురాంతకాయ నమః
  • ఓం వృషభారుఢాయ నమః
  • ఓం సోమప్రియాయ నమః
  • ఓం త్రయిమూర్తయే నమః
  • ఓం సర్వఙ్ఞాయ నమః
  • ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
  • ఓం యజ్జమయాయ నమః
  • ఓం పంచ్వక్త్రాయ నమః
  • ఓం విశ్వేశ్వరాయ నమః
  • ఓం గణనాధయ నమః
  • ఓం పజాపతయే నమః
  • ఓం దుర్ధర్షాయ నమః
  • ఓం గిరీశాయ నమః
  • ఓం భుజంగభూషణాయ నమః
  • ఓం గిరిధన్వినే నమః
  • ఓం కృత్తివాసనే నమః
  • ఓం భగవతే నమః
  • ఓం మృత్యుంజయాయ నమః
  • ఓం జగద్వాయ్యపినే నమః
  • ఓం వ్యోమకేశాయ నమః
  • ఓం చారువిక్రమాయ నమః
  • ఓం భూతపతయే నమః
  • ఓం అహిర్భుద్న్యాయ నమః
  • ఓం అష్టమూర్తయే నమః
  • ఓం సాత్వికాయ నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం అజాయ నమః
  • ఓం మృణాయ నమః
  • ఓం దేవాయ నమః
  • ఓం అవ్యయాయ నమః
  • ఓం పూషదంతభిదే నమః
  • ఓం దక్షాధ్వరహరాయ నమః
  • ఓం భగనేత్రవిదే నమః
  • ఓం సహస్రాక్షాయ నమః
  • ఓం అపవర్గప్రదాయ నమః
  • ఓం తారకాయ నమః
  • ఓం హిరణ్యరేతసే నమః
  • ఓం ఆనఘాయ నమః
  • ఓం భర్గాయ నమః
  • ఓం గిరిప్రియాయ నమః
  • ఓం పురారాతయే నమః
  • ఓం ప్రమధధిపాయ నమః
  • ఓం సూక్ష్మతనవే నమః
  • ఓం జగద్గురువే నమః
  • ఓం మహాసేన జనకాయ నమః
  • ఓం రుద్రాయ నమః
  • ఓం స్థాణవే నమః
  • ఓం దిగంబరాయ నమః
  • ఓం అనేకాత్మనే నమః
  • ఓం శుద్ధవిగ్రహాయ నమః
  • ఓం ఖండపరశువే నమః
  • ఓం పాశవిమోచకాయ నమః
  • ఓం పశుపతయే నమః
  • ఓం మహాదేవాయ నమః
  • ఓం అవ్యగ్రాయ నమః
  • ఓం హరాయ నమః
  • ఓం సహస్రపాదే నమః
  • ఓం అనంతాయ నమః
  • ఓం పరమేశ్వరాయ నమః
  • శ్రీ కేదారేశ్వర స్వామినే నమః


అధసూత్ర గ్రంథిపూజ

  1. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి
  2. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి
  3. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి
  4. ఓం వృషభద్వజాయ నమః చతుర్ధ గ్రంథిం పూజయామి
  5. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి
  6. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి
  7. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి
  8. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి
  9. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి
  10. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి
  11. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి
  12. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి
  13. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి
  14. ఓం శంభవే నమః చతుర్ధశ గ్రంథిం పూజయామి
  15. ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి
  16. ఓం సదాశివాయ నమః షోఢశ గ్రంథిం పూజయామి
  17. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి
  18. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి
  19. ఓం శ్రీకంఠాయ నమః ఏకోన వింశతి గ్రంథిం పూజయామి
  20. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి
  21. ఓం మృత్యుంజయాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి


ధూపం:

దశాంగం ధూపముఖ్యంచ హ్యంగార వినివేశితం

ధూపం సుగంధై రుత్పన్నం త్వాంప్రీణయతుశంఖర

శ్రీ కేదారేశ్వరాయనమః ధూపమాఘ్రాపయామి


దీపం:

యోగీనాం హృదయే ష్వేవ ఙ్ఞానదీపాంకురోహ్యపి

బాహ్యదీపో మయాదత్తో గృహ్యతాం భక్త గౌరవాత్

శ్రీకేదారేశ్వరాయనమః దీపం సమర్పయామి


నైవేద్యం:

తైలోక్యమసి నైవేద్యం తత్తే తృప్తిస్తథాబహిః

నైవేద్యం భక్తవాత్వల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా

శ్రీ కేదారేశ్వరాయనమః మహానైవేద్యం సమర్పయామి


తాంబూలం:

నిత్యానంద స్వరూపస్త్యం మోగిహృత్కమలేస్థితః

గౌరీశభక్త్యామద్దత్తం - తాంబూలం ప్రతిగృహ్యతామ్

శ్రీకేదారేశ్వరాయనమః తాంబూలం సమర్పయామి


అర్ఘ్యం:

అర్ఘ్యం గృహాణ్ భగవాన్ భక్త్యాదత్త మహేశ్వర

ప్రయచ్చ మే మనస్తుభ్యం భక్త్యాన మిష్టదాయక

శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం సమర్పయామి


నీరాజనం:

దేవేశ చంద్ర సంకాశం జ్యోతి సూర్యమివోదితం

భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః

శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర నీరాజన దర్శయామి


మంత్రపుష్పం:

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్

నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే

శ్రీ కేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి


ప్రదక్షిణం:

భూతేన భువనాదీశ సర్వదేవాది పూజిత

ప్రదక్షిణం కరోమిత్యాం వ్రతం మే సఫలం కురు

శ్రీ కేదారేశ్వరాయనమః ప్రదక్షిణం సమర్పయామి


నమస్కారం:

హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ

శివశంకర సర్వాత్మా నీలకంఠ నమోస్తుతే

శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాన్ సమర్పయామి


విశేషోపచారాలు:

ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి,

సమస్తరాజోపచార,దేవోపచార,శక్త్యుపచార,భక్త్యుపచార,పూజాం సమర్పయామి


క్షమాప్రార్థన :-

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర

యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే

అనయా ధ్యానావహనాది (సద్యోజాత విధినా)

షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః

శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు


ఆశీర్వచనము :-

స్వస్తి మత్రార్ధస్స ఫలాస్సంత్వితి శ్రమంతో మహాంతోను గృహంతు

వేదోక్తం పరిపూర్ణ భూయాస్తామితి భవంతో మహాంతును గృష్ణాంతు

శ్రీ కేదారేశ్వర ప్రసాద శిద్ధిరస్తు

వ్యాపారేన అఖండ శ్రీ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు

సత్యాస్సంతు యజమానస్య కామాః

శ్రీ కేదారేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి


తీర్థం :-

అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం

సమస్తపాపక్షయకరం శివపాదోదకం పావనం శుభం


స్వస్తి మంత్రం:-

స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।

గోబ్రాహ్మణేభ్య-శ్శుభమస్తు నిత్యం లోకా-స్సమస్తా-స్సుఖినో భవంతు ॥

భవంతో భృవంతు  శుభం భూయాత్...


శాంతి మంత్రం:-

అసతోమాసద్గమయా। తమసోమాజ్యో తిర్గమర్గ యా।

మృత్యోర్మా అమృతంగమయా।। ఓం శాంతిః శాంతిః శాంతిః


(పూజా తోరము తీసుకొనునపుడు పఠించు మంత్రం)

అభీష్టసిద్దిం కురమే శివావ్యయ మహేశ్వర !

భక్తానాం మిష్టదానార్ధం మూర్తీకృతకళేభరః


(తొరము కట్టుకొనుటకు పఠించు మంత్రం)

కేదారదేవదేవేశ భగవన్నంభికా పతే!

ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యహం ప్రభో!!


(వాయనమిచ్చునపుడు పఠించునది)

ఆయుశ్చ విద్యాం చ తథా సిఖంచ సౌభాగ్యవృద్దిం కుర దేవ దేవ

సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే

కేదారం ప్రతి గృహ్ణాతు కేదారో వైదరాతి చ

కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః


ప్రతిమాదాన మంత్రం:

కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ

తస్మాదస్యాః ప్రదనేన మమాస్తు శ్రీ రచంచలా!!

శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సిప్రీతః సుప్రసన్నోవరదోభవతు

మమ ఇష్టకామ్యార్ధ సిద్దిరస్తు

పూజా విధానము సంపూర్ణము

శ్రీ కేదారేశ్వర వ్రత కథ

పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను.

శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురుష - యక్ష - గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించు చుండిరి. ఋషులు - మునులు - అగ్ని - వాయువు - వరుణుడు - సూర్యచంద్రులు - తారలు - గ్రహాలు - ప్రమదగణాలు - కుమారస్వామి - వినాయకుడు - వీరభద్రుడు - నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల - సాల - తమలా - వకుళ - నరికేళ - చందన - పనస - జంభూ వృక్షములతోను చంపక - పున్నాగ - పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి.

అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగాగల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా ! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ ! పరమార్థ విదులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది.

ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లీ నీవెవ్వరవు ఎవరిదానవు ఎచటనుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా ! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది.

అందుకు గౌతముడు పార్వతీ ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని ఆసీవీజ మాసంలో శుక్ల పక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను., ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య - భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తి పరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను.

కొంతకాలమునకు శివభక్త పరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

ఆతదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుఙ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా ! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుఙ్ఞ నియ్యవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు.

ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యము నుండి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి ! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు.

అప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీ మార్భలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది.

ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివిన, విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు.

శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.

అథా0గపూజ

మహేశ్వరాయ నమః - పాదౌ పూజయామి,

ఈశ్వరాయ నమః - జంఘే పూజయామి,

కామరూపాయ నమః - జానునీ పూజయామి,

హరాయ నమః - ఊరూ పూజయామి,

త్రిపురాంతకాయ నమః - గూహ్యం పూజయామి,

భవాయ నమః - కటిం పూజయామి,

గంగాధరయ నమః - నాభిం పూజయామి,

మహాదేవాయ నమః - ఉదరం పూజయామి,

పశుపతయే నమః - హృదయం పూజయామి,

పినాకినే నమః - హస్తాన్ పూజయామి,

శివాయ నమః - భుజౌ పూజయమి,

శితికంఠాయ నమః - కంఠం పూజయామి,

విరూపాక్షాయ నమః - ముఖం పూజయామి,

త్రినేత్రాయ నమః - నేత్రాణి పూజయామి,

రుద్రాయ నమః - లలాటం పూజయామి,

శర్వాయ నమః - శిరః పూజయామి,

చంద్రమౌళయే నమః - మౌళిం పూజయామి,

పశుపతయే నమః - సర్వాణ్యాంగాని పూజయామి


Tuesday 4 October 2022

మహర్నవమి మహోత్సవం భక్తి సంగీత కచ్చేరి

దేవి శరన్నవరాత్రి మహోత్సవం 





 

దేవి శరన్నవరాత్రి మహోత్సవం మహార్నవమి

మన వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్, శాంతినగర్, ఖాధికాలని,తిరుపతి యందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు అనగా 04.10.2022 మంగళ వారము మహర్నవమి శుభ సందర్భంగా పొద్దున సంకల్పం, చండి హోమము వేద పండితులతో గౌరవ పెద్దలు శ్రీ మహంకాళి శివప్రసాద్ అవధాని గారి ఆధ్వర్యంలో మన పరిషత్ కార్యదర్శి గౌరవ శ్రీ.చక్రాల కోటేశ్వర రావు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగినది.

తదుపరి సాయంత్రం సంగీత విభావరి సంగీత విద్వాంసులు శ్రీమతి  వందన గారు మరియు బృందం తరుపున భక్తి సంగీత గీతాలపన కార్యక్రమము నిర్వహించడం జరిగినది. 


వి.యస్.యస్.పి.పి
శాంతి నగర్
ఖాధికాలని
తిరుపతి


Monday 3 October 2022

దుర్గాష్టమి


మన వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్ శాంతి నగర్, ఖాధికాలని తిరుపతి యందు గౌరవ పెద్దలు మహంకాళి శివప్రసాద్ అవదానిగారు అద్వర్యం లో దేవి శరన్నవరాత్రి మహోత్సవం లో భాగంగా దుర్గాష్తమీ 03.10.2022 న సాయంత్రం విశేషంగా పూజ కార్యక్రమము నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగినది

Friday 24 June 2022

కుంకుమ పువ్వు గురించి పూర్తి వివరణ*


కుంకుమ పువ్వు గురించి పూర్తి వివరణ*

కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇది శీతల ప్రదేశంలో పండుతుంది. కుంకుమ పువ్వులో ఉపయోగ పడే భాగం ఎర్ర కేశరాలు మాత్రమే. ఒక కిలో కేశరాలు కావాలంటే కనీసం రెండు లక్షల పువ్వులు అవసరం అవుతాయి. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము.

ఈ కేశరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా ఉంటాయి.ఈ భూభాగంలో అత్యంత ఖరీదైనది, అద్భుత ఔషథ గుణాలు కలదీ ఈ కుంకుమ పువ్వు మాత్రమే. నాటి రాచరిక దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. క్రీ.పూ. 500 ఏళ్లకు ముందే దీని ప్రస్తావన ఉంది. మన వేద కాలం సంస్కృతిలోనూ సౌందర్య పోషణకు విరివిగా వాడకం ఉంది.
మనదేశంలో ఈ కుంకుమ పువ్వును కాశ్మీర్‌లో విరివిగా పండిస్తారు. శీతాకాలం చివరలో కుంకుమ పువ్వు కోతకు వస్తుంది. కుంకుమ పువ్వు మొక్క చూడడానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుండి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు పూస్తాయి.

కాశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబర్- నవంబర్‌లలో విరబూసిన కుంకుమ పువ్వులతో నిండిపోతుంది. ముందుగా మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది. అదే కుంకుమ పువ్వు అనుకుంటే పొరబాటు. అందులోముచ్చటగా మూడు అండకోశాలు, రెండు ఎర్రరంగులో కేశరాలు ఉంటాయి.

కిందభాగంలో పసుపు, పైన ఎరుపు రంగులో ఉండే ఈ అంకోశాలనే కుంకుమ పువ్వు అని పిలుస్తారు. ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను వేరుచేసి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి సువాసనతో ఉంటాయి.

ఒక్కరోజు పూలు కొయ్యడంలో ఆలస్యం చేసినా అవి వెంటనే వాడిపోతాయి. అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే ఉదయమే పువ్వులను కోసేస్తారు. అన్ని పూలనుంచీ చేతులతోనే అండకోశాలను వేరుచేయాలి. ఇది చాలా శ్రమతో కూడిన పని. మన కాశ్మీర్‌లో గ్రాము కుంకుమ పువ్వు ధర రూ.60నుండి రూ.600 వరకూ వుంటుంది. నాణ్యతను బట్టి ధర మారుతుంది. అయితే మనిషి వాడిన మొట్టమొదటి సుగంధ ద్రవ్యం ఇదేనంటారు.
కుంకుమ పువ్వును రంగు పదార్ధంగానూ, సువాసన కోసం తినుబండారాల్లోనూ, తాంబూలంలోనూ వాడతారు.

నేత్రవ్యాధులలోనూ, ముక్కు సంబంధ వ్యాధులలోనూ మందుగా కుంకుమ పువ్వును వాడతారు. కుంకుమ పువ్వును గంధంలా తయారు చేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా, ఆకర్షణీయంగా తయారౌతుంది. అదనపు రంగు, సువాసన కోసం దీన్ని అన్ని వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వు కంటికి చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యం మీదపడుతున్న కొద్దీ చాలామందికి కంటి చూపు మందగిస్తుంది. అందుకే తరచూ ఆహారంలో కుంకుమ పువ్వును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.

రక్తప్రసరణను మెరుగుపరచి రక్తపోటును తగ్గిస్తుంది. మెనోపాజ్ సమస్యలకు కూడా కుంకుమ పువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు.

దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశోధనల్లో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాల ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో ఉంది కాబట్టి కుంకుమ పువ్వును ఎక్కువ వాడవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. గర్భవతులే కాదు, ఎవరైనా కుంకుమపువ్వును తీసుకోవచ్చు. అయితే కొన్ని నకిలీ పువ్వులు కూడా మార్కెట్లో కనిపిస్తాయి. దానిమ్మ పూరేకులను, బీట్‌రూట్ తురిమిన తురుమును కుంకుమ పువ్వు శాప్రాన్‌గా అమ్ముతారు. కొనేది మంచిదా కాదా అనేది తెలుసకొనేందుకు కొన్ని రేకులను నీటిలో వేస్తే వెంటనే రంగు వస్తే అది నకిలీదని తెలుసుకోండి.

కుంకుమ పువ్వు నీటిలో రంగు రావడానికి నానిన 15 నిమిషాల తర్వాత గానీ రంగురాదు. కాబట్టి కుంకుమ పువ్వును కొనేప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి


మీ

వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్


Monday 20 June 2022

జనరల్ బాడీ మీటింగ్


వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్, శాంతి నగర్ ,ఖాధికాలని తిరుపతి  అధ్యక్షులు శ్రీ రామ కృష్ణ శాస్త్రి గారి అధ్యక్షతన, కార్యదర్శి శ్రీ.చక్రాల.కోటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో సాధారణ సర్వే సభ్య సమావేశము 19.06.2022 (ఆదివారం) సాయంత్రం 4.00 గలకు నిర్వహించడం జరిగినది.
 ఇందులో కార్యవర్గ సభ్యులు
శ్రీ.రాధేశ్యామ్ గారు, శ్రీ చిద్విలాష్ గారు, శ్రీ.గురుమూర్తి గారు, శ్రీ వేణుగోపాల్ శర్మ గారు, యం.దొరస్వామి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇందులో ముఖ్య అతిగా మన పరిషత్ సంభందించి చార్టెట్ అకౌంటెంట్ శ్రీ వెంకటనాద్ గారు సమావేశము నకు హాజరై విలువైన సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగినది.

ఇందులో ప్రతి కార్యవర్గ సభ్యులు విధిగా కొంత మందిని సభ్యులుగా చేర్చుకోనుటకు ప్రయత్నం  చేయవలయును, పరిషత్ ని బలోపేతం చేయవలయునని సలహా ఇవ్వడం జరిగినది.

ప్రతి పండుగ పరిషత్ లో నిర్వహించి అందుకు సంబంధించి ఫొటోలు, మినిట్స్, పేపర్ క్లిపింగ్స్, మొదలగునవి చేయగలిగితే మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం వుంటుంది అని. 

మన సాంప్రదాయం విలువ మరింత పెంపొందించే ముఖ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

Wednesday 18 May 2022

శని శింగణాపూర్ -విశిష్టత!!

శని శింగణాపూర్ -విశిష్టత!!
🌾ఇది ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. మహా రాష్ట్ర లోని శని శింగణాపూర్ గ్రామం లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్య క్షేత్రం. ఈ గ్రామం షిరిడి కి, ఔరంగాబాద్ కి మధ్య లో ఉన్నది …ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం.

🌾ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో తెలియదు కానీ ఒక గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం శని దేవుడు ఇక్కడ అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది ..కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు … గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం గా చారిత్రిక కద ఈ రకంగాఉన్నది …

🌾గొర్రెల కాపరి పదునైన చువ్వ తో రాతి ని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటన తో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు .. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తానూ శనీశ్వరుడు ని అని .. రాతి విగ్రహం లో వెలిసానని చెప్తాడు.

🌾నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శని ని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని …. తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు …. అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు … కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు ..

🌾శని దేవుడు ఆ రకం గా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడి కి ఉండదు … ఆరు బయట ప్రదేశం లోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి పూజిస్తారు .. ఇక్కడ ప్రతి రోజు వేల మంది నువ్వుల నూనెతో, నువ్వులతో … దేవుడికి అభిషేకం చేస్తారు ..

🌾ఇంకో విషయము ఏమిటి అంటే ఇప్పటివరకు ఈ గ్రామం లో ఏ ఇంటికి కూడా తలపులు లేవు...ప్రభుత్వ ఆఫీస్లకి, ప్రైవేట్ సంస్థలకి ఒకటి ఏమిటి ప్రతి ఒక్కదానికి తలుపులు వుండవు ..దాని వెనుక కద, ఏంటి అంటే లోగడ దొంగతనం చేసిన వాళ్ళు గ్రామా పొలిమేరలు దాటేలోపే చనిపోయారు … ఇక అప్పటినుంచి ఎవ్వరు కూడా దొంగతనం చేయడానికి సాహసించరు …

ఇక ఈ క్షేత్రం కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే …. ప్రతి మనిషి కి జీవితం లో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది… ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు.. ఈ క్షేత్రం లో శని త్రయోదశి నాడు ఇసుక వేస్తె రాలని జనం వుంటారు …

🌾చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ కూడా మహిళలకి ప్రవేశం లేదు అయితే చాలా మహిళా సంఘాలు పోరాటం చేసి శని దేవుడి గుడి లో ప్రవేశానికి అర్హత ఉందని కోర్ట్ ద్వారా విజయం సాధించారు .. అయితే కొన్ని దశాబ్దాలు గా మహిళలు ఎదురుకొన్న నిషేధాన్ని ఇప్పటికి ఛేదించగలిగారు … ఇక ఇప్పుడు శని దేవుడి ఆలయాన్ని చూడటానికి నీరు గా మహిళలకే పగ్గాలు అప్పగించారు … దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు మొదట గా షిరిడి ని దర్శించాక ఆ తరువాతా శని దేవుడి ని దర్శించుకుంటారు ..

🌾నవ గ్రహాలలో ఏడో వాడు, సూర్య భగవానుడికి ఛాయా దేవి కి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడు ని భక్తి తో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి .. శనీశ్వరుడి కుడి చేతి లో దండం, ఎడమ చేతి లో కమండలం, ఖడ్గం ఉంటుంది ..శనీశ్వరుడి వాహనం కాకి ..

🌾ఇక శని భార్య ఎవరో తెలుసా మీకు.. మందాదేవి మరియు లక్ష్మి దేవి సోదరి అయినా జేష్టాదేవి. ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు.. శని భగవానుడు విషుణువు కి తోడల్లుడు, యమధర్మరాజు కి సోదరుడు… గ్రహాలకి యువరాజు.. ఇక … నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు , సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తన తో సుఖాలను పొందారు.. శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడం తో సమానమని చెప్తారు… ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు.. త్రేతాయుగం లో లంక లో రావణుండై అధీనం లో ఉన్న ఆంజనేయుడు ని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం ..అందుకే హనుమత్ దీక్ష లో ఉన్న వారిని, మందుడు కి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు…

🌾యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు.. త్రేతాయుగం లో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞత గా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యం గా శనివారం లో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు… శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు… అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.

 మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?*

*రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?*

👉 కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. 'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'.

👉 'శివ' అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. 

👉 శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.

👉 ఈ శర్వాది అష్టమూర్తులే పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను అధిష్టించి ఉన్నాయి. 

👉 ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వతోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.

*'ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ:*
*ఓం భవాయ జలమూర్తయే నమః*
*ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ:*
*ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః*
*ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః*
*ఓం పశుపతయే యజమానమూర్తయే నమః*
*ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః*
*ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః*
*జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు.*

👉 అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి పెట్టి 'సో హం' భావంతో సదాశివుని , పూజించాలి.

👉 ' దేహో దేవాలయః ప్రోక్తో జీహాదేవ సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్ '
'రుద్రో జనానాం హృదయే సన్నివిష్టః ప్రాణేష్యంతర్మనసో లింగమాహుః'
హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి. 

👉
అందుకే మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్దా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాథి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి. బ్రహ్మచారులు యాజ్ఞవల్క్యుని చేరి 'ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు?” అని అడిగారు.

👉 దానికాయన 'శతరుద్రీయేణేతి' శతరుద్రీయంచేత అన్నాడు.. అని జాబాలోపనిషత్తు చెపుతున్నది.
'శతం రుద్రా దేవతా యస్య'
నూరు మంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రీయం అని తైత్తరీయసంహిత చతుర్థకాండ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.

👉 మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరమ్' (శ్వేతా.ఉ) మాయ అంటే ప్రకృతి. దానికి అధిపతి మహేశ్వరుడు. అందుకే ప్రకృతిలోని అనంతమైన శివశక్తిని శివపూజతో, భజనతో, శ్రవణాదికాలతో మేల్కొల్పాలి.

👉 తానే శివుడై సర్వాన్ని శివమయంగా భావించి తాదాత్మ్యం చెందాలి. అదే శివపూజలోని ఆంతర్యం.

👉 అప్పుడు శివపూజలో సాయుజ్యం, శివభజనలో సామీప్యం, శివుని విషయాలను ప్రసంగించడంలో, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరుల ఉపదేశం.

👉 శివుని ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయడం యోగ శాస్త్రరీత్యా మన సహస్రార కమలంలో ప్రకాశించే సదాశివతత్యామృతం వర్షించడానికి ఒక ప్రతీక.

👉 'సర్వయజ్ఞ తపోదాన తీర్థదేశేషు యత్సలం
తత్పలం కోటిగుణితం శివలింగార్చనాత్సలం'.

👉 'అన్ని యజ్ఞాలవల్ల, తపస్సులవల్ల, దానాలవల్ల, తీర్థాలను సందర్శించడంవల్ల కలిగే ఫలానికి కోటి రెట్లు శివలింగార్చనవల్ల కలుగుతుందని పెద్దలంటారు.

👉 ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించ కూడదు ('నారుద్రో రుద్రమర్చయేత్) ముందుగా మహాన్యాసంతో ఆ యోగ్యతను సంపాదించుకొని, తరవాత ఆయనను నమక చమక పారాయణతో అభిషేకిస్తాం.

👉 ఏకాదశరుద్రాభిషేకం చేస్తాం. మన జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు కలిపి పదకొండు. అదే ఏకాదశ రుద్రాభిషేకంలోని అంతరార్థం.

👉 అంతే కాదు. మనలో ప్రాణాపానాది ఐదు వాయువులూ, నాగకూర్మాది ఐదు ఉపవాయువులూ ఉన్నాయి. ఈ పదింటికీ మూలమైనది ఆత్మ. దాంతో పదకొండు. ఇవే ఏకాదశరుద్ర స్వరూపం. రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఇవన్ని శుద్ధమవుతాయి.


మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతినగర్,ఖాధికాలని,తిరుపతి

Monday 16 May 2022

శివాలయ దర్శన విధానం

శివాలయ దర్శన విధానం

🌟 సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.

🌟 శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.

🌟 5 ముఖాలకి, 5 పేర్లు న నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా, పూజ చేయోచ్చు అంటారు.

🌟 శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా, అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

🌟 శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..

🌟 ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే, ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.

🌟 తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. …

🌟 మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే, ఆ శివలింగం పేరుని స్మరించాలి.

🌟 5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు, పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.


🌟 శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

🌟 శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం, అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని, లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ, మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల, భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

🌟 ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.

🌟 ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఉత్తరం వైపు చూసే ముఖంని, “వామదేవ” ముఖం అని అంటారు.

🌟 ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..

🌟 ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని “ఈశాన ముఖం” అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.

🌟 ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.

🌟 ఉత్తరం వైపు చూసే “వామదేవ ముఖం” నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.

🌟 వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు…

🌟 శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.

🌟 శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు.

🌟 వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ, పొరపడుతున్నారు..

🌟 క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.

🌟 ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు…

🌟 అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి,

1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ, మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు.

2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.

3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.

🌟 తదుపరి, ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.

🌟 శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి.

జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి.

దేహమే దేవాలయం

           ఋషి "దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు .ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు.

          ఇదే విషయాన్ని శృతి "జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి!!? అని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన నాలుగు మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) "అహం బ్రహ్మాస్మి"=నేనే పరబ్రహ్మమును (2) "అయమాత్మాబ్రహ్మ"=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) "ప్రజ్ఞానం బ్రహ్మ"= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) "తత్వమసి"=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.

          పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అనే జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత .తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి (1)వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుట (2) శ్రుతి ప్రమాణాన్ని ఆచరించి అనుభూతి పొందిన మహాత్ముల 'పాదాలు ' ఆశ్రయించడమే.


              పై మార్గములలో (1)వ మార్గము కొంత ప్రయాసతో కూడుకొనినటువంటిది. (2)వ మార్గాన్ని గూర్చి కొంత విచారణ అవసరం.అసలు మహాత్ములు, ఋషులు అంటే ఎవరు? సృష్టి ఆరంభంలో తొలుత దేహధారణ చేసి తద్వారా ఈ ప్రపంచ రూపకల్పనకు మూల పురుషులు ఋషులే. అందుకే ఇది ఋషి పరంపర.. మనమంతా వారి సంతతి వారమే.. కావున మన పేరున అర్చన చేసుకొనేటప్పుడు మన గోత్రం అడుగుతారు పూజారి, అప్పుడు మనం అంగీరస మహాముని గోత్ర, గౌతమ ఋషి గోత్రమని,కాశ్యపస అని ఇలా చెబుతుంటాం. అంటే ఇక్కడ మనం వాడే పేర్లు ఋషులవే. మానవజాతి అంతా ఋషి సంతతే ఇదే మన భారతీయ సంస్కృతి.

                'శృతి ' చెప్పినట్లు (వేదం చెప్పినట్లు) నడిచేవాడు 'మానవుడు '. 'మతి ' చెప్పినట్లు నడిచేవాడు 'వానరుడు '. శృతి మాత చెప్పినట్లు మహర్షులు మంచిని ఆచరించి తన స్వార్ధానికి కాకుండా వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి లోక కల్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం చూస్తూనే ఉన్నాం. వారు పొందే ఆనందాన్ని అందరూ పొందాలనేదే వారి కోరిక. అందుకే కాబోలు ప్రవచనాల ద్వారా, హోమాల ద్వారా, యాగాల ద్వారా, సంకీర్తనల ద్వారా, నిస్వార్ధ విగ్రహ ప్రతిష్ఠల ద్వారా, క్రియా యోగము ద్వారా శాంతిని మనకు అందజేస్తున్నారు.

               అసలు మహర్షిని గుర్తించడం ఎలా? ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఉచ్చ జాతి వారైనా లేక నీచజాతి వారైనా అతని వద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంత సేపు ఒత్తిడిలో నుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే అతను నిస్వార్ధ జీవన విధానావలంబుడై ఉంటే, అతడే మహర్షి, మహాత్ముడు, సాధువు, భగవంతుడు, అల్లా, యేసు, గురునానక్, అలాంటి సాధువుల చేతులు మంచి పనులే చేస్తాయి, కాళ్ళు లోక కళ్యాణ నిమిత్తమే నడుస్తాయి, కనుల ద్వారా చల్లని చూపు.

             అంతెందుకు శరీరంలోని ప్రతి అంగము పరిశుద్ధం గావింపబడి ఉంటాయి. "ప్రతి జీవిని తనవలె" చూచె ఉత్తమోత్తమ ఆలోచన వారి మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. పవిత్ర భారత దేశంలో, నివురు గప్పిన నిప్పులా ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు వారి జీవితాలను, తృణ ప్రాయంగా పెట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి (1) మౌనం (2) పయోహారం (గోవు పాలు) మాత్రమే ఆహారంగా తీసుకొని (3) ఏకాంతవాసం చేసి (4) దిగంబరత్వం ఉండి గడుపుతున్నారు.

"సాధూనాం దర్షనం పుణ్యం స్పర్శనం పాపనాశనం" 

            అందుకే సాధువును దర్శించుకుంటే పుణ్యమనీ, వారి పాదాలను స్పృశించడం ద్వారా పాపాలు నాశనమవుతాయని పెద్దల మాట. జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి. జ్ఞాన సహిత సాధువు దేహమే పవిత్ర దేవాలయం.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ

శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ

          ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు. సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు, భూములు, ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.

శ్రీ భూ వరాహ స్తోత్రం
ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||


నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పురోహిత
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

చనిపోయిన వారింటికి పరామర్శకు వెళ్ళాలంటే


*చనిపోయిన వారింటికి పరామర్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయా?*

       *బంధువుల ఇళ్ళలో కానీ లేదా మనకు తెలిసిన వారి ఇళ్ళలో కానీ ఎవరైనా చనిపోతే ఆ రోజు వెళ్ళలేని వారు తర్వాత పరామర్శించడానికి వెళ్ళాలను కునే వారుకానీ లేదా భర్త చనిపోయి* *వైధవ్యము ప్రాప్తించిన స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు పరామర్శించడానికి వీలులేదు. అందుకు శాస్త్ర ప్రకారంగా ఈ క్రింది నియమాలను పాటించాల్సి ఉంటుంది.*

*పరమార్శకు పనికి వచ్చే వారలు:-*
*సోమవారం, బుధవారం, ( ఆదివారం ) అనుకూలమైనవి.*
 
*పరమార్శకు పనికి వచ్చే తిధులు:-*
*విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు అనుకూలమైనవి.*

 *పరామర్శకు పనికి వచ్చే నక్షత్రాలు:-* 
 *అశ్విని, భరణి, ఆరుద్ర, పుబ్బ, ఆశ్లేష, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలమైనవి.*

 *పరమార్శకు పనికిరాని వారాలు :-*    *మంగళవారం, గురువారం, శుక్రవారములు పరమార్శకు అనుకూలం కాదు.*

 *గమనిక :-*  *పరామర్శించడానికి నెలరోజుల వీలుకాక పోయినచో సరిమాసలలో మాత్రం పరామర్శించ కూడదు.భేసి మాసలలో పరామర్శించ వచ్చును.* *పరామర్శకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పరిగడుపున వెళ్ళకూడదు. ఏదైనా తిని వెళ్ళాలి.*

 *పరామర్శకు వెళ్ళేప్పుడు వెంబడి తీసుకు వెళ్ళకుండా జాగ్రత్త పడవలసినవి:-* 
   *జాతి రత్నాలతో చేయబడిన ఉంగరాలు, ఆభరణాలు, రక్షాయంత్రాలు, పట్టు వస్త్రాలు మొదలైనవి ఒంటిమీద లేకుండా జాగ్రత్త పడాలి, వాటిని ఇంట్లో పెట్టి వెళ్ళాలి. పొరపాటున అవి ధరించుకుని వెళితే అవి శక్తిని కోల్పోతాయి. తిరిగి వాటికి శాస్త్రోక్తకంగా శుద్ధిని చేయించి ప్రాణప్రతిష్ఠ జరిపించుకోవాలి.*

*సేకరణ :*
*-- వరలేఖరి.నరసింహశర్మ.*




మీ.
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం

*సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం*

మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.

*ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.*

*1.* మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.

ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

*2.* రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.

*౩.* ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.
ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.

*4.* ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.

*5.* తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.

*కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కథల ద్వారా తెలుసుకుంటాం :*

1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.

2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.

3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.

4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.

5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది.
ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.

*ఓం శ్రీ సత్యదేవాయైనమః*🙏

*సేకరణ :*

మీ
*-వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్

శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి.*

*శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కల్పము :*🙏

*శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కల్పము :*🙏

*శ్లో..శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే!*

*ఆచమనం:*  
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః అనుచూ నీళ్ళను క్రిందకు వదల వలెను.

(తదుపరి నమస్కారము చేయుచు ఈ క్రింది మంత్రములను పఠించవలెను)

ఓం గోవిందాయనమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయనమః, ఓం హృషీకేశాయనమః, ఓం పద్మనాభాయనమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయనమః, ఓం వాసుదేవాయనమః , ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్ధాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అధోక్షజాయనమః, ఓం నారసింహాయనమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనాయనమః, ఓం ఉపేంద్రాయనమః, ఓం హరయేనమః, ఓం శ్రీకృష్ణాయనమః

*సంకల్పమ్ :* 

*మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాఙ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్విదీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ధక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి యోర్మద్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.. సంవత్సరే.. ఆయనే.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే.. శుభనక్షత్రే,శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్.. గోత్రః.. నామధేయః.. ధర్మపత్నిసమేతః శ్రీమతః.. గోత్రస్య.. నామధేయస్య ధర్మపత్నీసమేతస్య మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్వధ పురుషఫలావ్యాప్త్యర్ధం, చింతితమనోరథ సిద్ధ్యర్ధం,* *శ్రీసత్యనారాయణముద్దిశ్య శ్రీసత్యనారాయణప్రీత్యర్ధం అనయాధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే,* *ఆదౌనిర్విఘ్నపరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగకల శారాధానం కరిష్యే.*

*కలశారాధన:*
 (కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను). 

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

*శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి*
*నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః*

అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.

సత్యనారాయణస్వామి ప్రతిమను తమలపాకు పై ఉంచి ఈ క్రింది విధముగా పంచామృములతో శుద్ధి చేయవలెను.

*పాలు:* 
ఆప్యాయస్వసమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం, భవా వాజస్య సంగథే.

*పెరుగు:* 
దధిక్రావుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్యవాజినః సురభినో
ముఖాకరత్ర్పణ ఆయూగం తారిషత్.

*నెయ్యి:* 
శుక్రమసి జ్యోతిరసి తేజోషి దేవోవస్సవితోత్పునా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః.

*తేనె:*
 మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మాధ్వీ ర్నస్సంత్వోషధీః
మధుసక్తముతోసి మధుమత్సార్థివగం రజః,
మధుద్యౌరసునః పితా, మధుమాన్నో వనస్పతి
ర్మధుమాగం అస్తుసూర్యః, మాధ్వీర్గావో భవంతునః.

*శుద్దోదకం:*
 స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే
స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే
బృహస్పతయే మధుమాంగం అదాభ్యః.

*శుద్ధోదకస్నానం :*

ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే,
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః,
ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో
యస్యక్షయాయ జిస్వథ, ఆపోజనయథాచనః.

*ప్రాణాప్రతిష్ఠాపనమ్ :*

ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణుమహేశ్వరా ఋషయ, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠాజపే వినియోగః, 

*కరన్యాసమ్ :*

హ్రాం అంగుష్ఠాభ్యాంనమః,
హ్రీం తర్జనీభ్యాంనమః,
హ్రూం మధ్యమాభ్యాంనమః,
హ్రౌం కనిష్ఠికాభ్యాంనమః,
హ్రః కరతలకర పృష్ఠాభ్యాంనమః,
హ్రైం అనామికాభ్యాంనమః.

*అంగన్యాసమ్:*

హ్రాం హృదయాయనమః,
హ్రీం శిరసేస్వాహా,
హ్రూం శిఖాయైవషట్,
హ్రైం కవచాయహుం,
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః ఆస్తృయఫట్
భూర్భువస్సువరోమితి దిగ్భంధః

*ధ్యానం :*

శ్లో: ధ్యాయోత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం,
లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం
పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం
గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం
శ్రీసత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

*ఆవాహనమ్ :*

మం: ఓం సహస్రశీర్షాపురుషః, సహస్రాక్షస్సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ఠ ద్డశాంగులమ్
శ్లో: జ్యోతి శ్శాంతం సర్వలోకాంతరస్థ మోంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం
సాంగం శక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. 

*ఆసనమ్ :*

మం: ఓం పురుష ఏ వేదగం సర్వం, యద్భూతం యచ్ఛభవ్యం
ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతి రోహతి
శ్లో: కల్పద్రుమూలే మణిమేదిమధ్యే సింహాసన్మ్ స్వర్ణమయం విచిత్రం
విచిత్రవస్త్రావృతమచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత,
శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి.

*పాద్యమ్ :*

మం: ఏతావానస్య మహిమాఅతోజ్యాయాగ్శ్చపూరుషః
పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతందివి.
నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి.

*ఆర్ఘ్యమ్ :*

మం: త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదోస్యేహాభవాత్పునః
తతోవిష్పజ్వ్యక్రామత్ సాశనానశనే అభి
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః 
మయా నివేదితో భక్త్యా హ్యర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి.

*ఆచమనీయమ్ :*

మం: తస్మాద్విరాడజాయత, విరాజో అధి పూరుషః
స జాతోత్యరిచ్యత, పశ్ఛాద్భూమి మధోపురః
మందాకిన్యాస్తుయద్వారి సర్వపాపహరం శుభం
తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ఢఃఆచమనీయం సమర్పయామి.

*స్నానమ్ :*

మం: యత్పురుషేణ హవిషా, దేవా యఙ్ఞ మతస్వత,
వసంతో అస్యాసీ దాజ్యం, గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః.
శ్లో: తీర్ధోదకై: కాంచనకుంభసం స్థై
స్సువాసితై ర్దేవ కృపారసార్ద్రైః,
మయార్పితం స్నానవిధిం గృహాణ
పాదాబ్జ నిష్ఠ్యూత నదీప్రవాహ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః స్నపయామి.

*పంచామృతస్నానమ్ :*

(పాలు) ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్ణియం. భవా వాజస్య సంగధే: (పెరుగు) దధిక్రాపుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్య వాజినః, సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషత్: (నెయ్యి) శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః (తేనె) మధువాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః, మాధ్నీర్నస్సంత్వోషధీః, మధుసక్తముతోషి మధుమత్పార్ధివగం రజః, మధు ద్యౌరస్తు నః పితా, మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతునః, (శుద్ధోదకం) స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే, మధుమాగం అదాభ్యః. 
శ్లో: స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ
అనాధనాధ సర్వఙ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి. 

*శుద్ధోదకస్నానం :*

ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే,
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః,
ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో
యస్యక్షయాయ జిస్వథ, ఆపోజనయథాచనః.
శ్లో: నదీనాం చైవ సర్వాసా మానీతం నిర్మలోదకం
స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర
శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

*వస్త్రమ్ :*

మం: సప్తాస్యాసన్పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః
దేవాయద్యఙ్ఞం తన్వానాః, అబధ్నన్పురుషం పశుం

శ్లో: వేదసూక్త సమాయుక్తే యఙ్ఞసామ సమన్వితే
సర్వవర్ణ ప్రదే దేవ వాససీ తే వినిర్మితే
శ్రీ సత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

*యఙ్ఞోపవీతమ్ :*

మం: తం యఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే

శ్లో: బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం
గృహాణ భగవాన్ విష్ఠోసర్వేష్టపలదో భవ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః యఙ్ఞోపవితం సమర్పయామి.

*గంధమ్ :*

మం: తస్మా ద్యఙ్ఞా త్సర్వ హుతః సంభృతం వృషదాజ్యం
పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే

శ్లో: శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం 
శ్రీ సత్యనారాయణస్వామినే నమః దివ్యశ్రీచందనం సమర్పయామి.

*ఆభరణమ్ :*

మం: తస్మాద్యఙ్ఞా త్సర్వ హుతః ఋచస్సామానిజజ్ఞిరే
చందాగ్ సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత

శ్లో: హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః
సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి.

*పుష్పమ్ :*

మం: తస్మాద్శ్వా అజాయంత, యేకే చోభయా దత: 
గావోహ జజ్ఞిరే తస్మాత్, తస్మా ఙ్ఞాతా అజావయః

శ్లో: మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో
మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, పుష్పాణి సమర్పయామి.

*అథాంగపూజా:*

ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
అనఘాయ నమః జానునీ పూజయామి
జనార్ధనాయ నమః ఊరూ పూజయామి
విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
శంఖ్చక్రగదాశార్జ్గపాణయేనమః నమః బాహూన్ పూజయామి
కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్తృం పూజయామి
కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రే పూజయామి
సహస్రశిరసే నమః శిరః పూజయామి
శ్రీ సత్యనారాయణస్వామినే సర్వాణ్యంగాని పూజయామి

*శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ :*

ఓం నారాయణాయ నమః    ఓం నరాయ నమః    ఓం శౌరయే నమః    ఓం చోంఅక్రపాణయే నమః    ఓం జనార్ధనాయ నమః    ఓం వాసుదేవాయ నమః    ఓం జగద్యోనయే నమః    ఓం వామనాయ నమః    ఓం ఙ్ఞానపంజరాయ నమః    ఓం శ్రీవల్లభాయ నమః    ఓం జగన్నాథాయ నమః    ఓం చతుర్మూర్తయే నమః    ఓం వ్యోమకేశాయ నమః    ఓం హృషీకేశాయ నమః    ఓం శంకరాయ నమః    ఓం గరుడధ్వజాయ నమః    ఓం పరంజ్యోతిషే నమః    ఓం ఆత్మజ్యోతిషే నమః    ఓం శ్రీ వత్సాంకాయ నమః    ఓం అఖిలాధారాయ నమః    ఓం సర్వలోకపతిప్రభవే నమః    ఓం త్రివిక్రమాయ నమః    ఓం త్రికాలఙ్ఞానాయ నమః    ఓం త్రిధామ్నే నమః    ఓం కరుణాకరాయ నమః    ఓం సర్వఙ్ఞాయ నమః    ఓం సర్వగాయ నమః    ఓం సర్వస్మై నమః    ఓం సర్వేశాయ నమః    ఓం సర్వసాక్షికాయ నమః    ఓం హరిణే నమః    ఓం శార్జినే నమః    ఓం హరయే నమః    ఓం శేషాయ నమః    ఓం హలాయుధాయ నమః    ఓం సహస్రభాహవే నమః    ఓం అవ్యక్తాయ నమః    ఓం సహస్రాక్షాయ నమః    ఓం అక్షరాయ నమః    ఓం క్షరాయ నమః    ఓం గజారిఘ్నాయ నమః    ఓం కేశవాయ నమః    ఓం నారసింహాయ నమః    ఓం మహాదేవాయ నమః    ఓం స్వయంభువే నమః     ఓం భువనేశ్వరాయ నమః    ఓం శ్రీధరాయ నమః    ఓం దేవకీపుత్రాయ నమః    ఓం అచ్యుతాయ నమః    ఓం పార్థసారథయే నమః    ఓం ఆచంచలాయ నమః    ఓం శంఖపాణయే నమః    ఓం కేశిమర్ధనాయ నమః    ఓం కైటభారయే నమః    ఓం అవిద్యారయే నమః    ఓం కామదాయ నమః    ఓం కమలేక్షణాయ నమః    ఓం హంసశత్రవే నమః    ఓం ఆధర్మశత్రవే నమః    ఓం కాకుత్థ్సాయ నమః    ఓం ఖగవాహనాయ నమః    ఓం నీలాంబుదధ్యుతయే నమః    ఓం నిత్యాయ నమః    ఓం నిత్యతృప్తాయ నమః    ఓం నిత్యానందదాయ నమః    ఓం సురాధ్యక్షాయ నమః    ఓం నిర్వకల్పాయ నమః    ఓం నిరంజనాయ నమః    ఓం బ్రహ్మణ్యాయ నమః    ఓం పృథివీనాథాయ నమః    ఓం పీతవాససే నమః    ఓం గుహాశ్రయాయ నమః    ఓం వేదగర్భాయ నమః    ఓం విభవే నమః    ఓం విష్ణవే నమః    ఓం శ్రీమతే నమః    ఓం త్రైలోక్యభూషణాయ నమః    ఓం యఙ్ఞమూర్తయే నమః    ఓం అమేయాత్మనే నమః    ఓం వరదాయ నమః    ఓం వాసవానుజాయ నమః    ఓం జితేంద్రియాయ నమః    ఓం జితక్రోధాయ నమః    ఓం సమదృష్టయే నమః    ఓం సనాతనాయ నమః    ఓం భక్తప్రియాయ నమః    ఓం జగత్పూజ్యాయ నమః    ఓం పరమాత్మనే నమః    ఓం అసురాంతకాయ నమః    ఓం సర్వలోకానామంతకాయ నమః    ఓం అనంతాయ నమః    ఓం అనంతవిక్రమాయ నమః    ఓం మాయాధారాయ నమః    ఓం నిరాధారాయ నమః    ఓం సర్వాధారాయ నమః    ఓం ధరధరాయ నమః    ఓం నిష్కళంకాయ నమః    ఓం నిరాభాసాయ నమః    ఓం నిష్ప్రపంచాయ నమః    ఓం నిరామయాయ నమః    ఓం భక్తవశ్యాయ నమః    ఓం మహోదరాయ నమః    ఓం పుణ్యకీర్తయే నమః    ఓం పురాతనాయ నమః    ఓం త్రికాలఙ్ఞాయ నమః    ఓం విష్టరశ్రవసే నమః    ఓం చతుర్భుజాయ నమః    శ్రీ సత్యనారాయణస్వామియే నమః   
శ్రీ సత్యనారాయణస్వామియేనమః నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.

*ధూపమ్ :*

మం: యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్
ముఖం కిమస్య కౌ బాహూ కాపూరూ పాదావచ్యేతే

శ్లో: దశాంగం గుగ్గూలూపేతం సుగంధంసమనోహరం
ధూపం గృహాణ దేవేశ సర్వదేవనమస్కృత
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రపయామి.

*దీపమ్ :*

మం: బ్రాహ్మణోస్యముఖమూసిత్ బాహూరాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత

శ్లో: ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నిన యోజితం ప్రియం
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యమితిమిరాపహమ్
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

*నైవేద్యమ్ :*

మం: చంద్రమా మనసోజాతః చక్షస్సూర్యో అజాయత
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత

శ్లో: సౌవర్ణస్థాలిమధ్యేమణిగణఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్
భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యానపరిమితరసాన్ చోష్యంమన్నం నిధాయ
నానాశాకైరూపేతం దధిమధు సగుడక్షీర పానీయయుక్తం
తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి
రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం
ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్.
ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్.
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణమసి,
ఓం ప్రాణాయాస్వాహా - ఓం ఆపానాయస్వాహా - ఓం వ్యానాయస్వాహా - ఓం ఉదానాయ స్వాహా - ఓం సమానాయ స్వాహా - ఓం బ్రహ్మణేస్వాహా
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, మహానైవేద్యం సమర్పయామి
అమృతాపిధానమసి, ఉత్తరపోశనంసమర్పయామి.
హస్తౌప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్ 

మం: నాభ్యా ఆసీదతరిక్షంశీర్ ష్ణోద్యౌస్సమ వర్తత
పధ్భ్యాం భూమిర్ధిశశ్శ్రోత్రాన్ తథాలోకాగం అకల్పయన్

శ్లో: పూగీఫలై స్సకర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

*నీరాజనమ్ :*

శ్లో: నీరాజనం గృహాణేదేవం పంచవర్తి సమన్వితం
తేజో రాశిమయం దత్తం గృహాణత్వం సురేస్వర.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్ప

*మంత్రపుష్పమ్ :*

శ్లో: ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైవ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణోదదాతు
కుభేరాయ వై శ్రవనాయ మహారాజాయ నమః
ఓం తద్భ్రహ్మాం ఓం తద్వాయః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం 
ఓం తద్గురోర్ణమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యఙ్ఞస్త్వం వషట్కార స్త్వమింద్ర స్త్వగం రుద్రస్తం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరామ్. నారాయణాయ విద్మహే 
వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్.
శ్రీ సత్యనారాయణస్వామినే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.

*ప్రదక్షిణ నమస్కారమ్:*

శ్లో: యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రిహిమాం కృపయాదేవ శరణాగతవత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 
తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన
ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం
సంసారసాగరాన్మాం త్వంముద్దరస్వ మహాప్రభో
శ్రీ సత్యనారాయణస్వామినే నమః, ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి.

*సర్వోపచారమ్:*

ఛత్రం సమర్పయామి. చామరం సమర్పయామి. గీతంశ్రావయామి,నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి.

*ప్రార్ధన:*

శ్లో: అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం
హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకమ్
సగుణం చ గుణాతీతం గోవిందం గరుడఢ్వజం
జనార్ధనం జనానందం జానకీవల్లభం హరిమ్
ప్రణామామి సదా భక్త్యా నారాయణ మజం పరం
దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే
విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ
నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్
సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం
లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః
శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రార్ధనా నమస్కారమ్ సమర్పయామి.

*ఫలం:*

శ్లో: ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ
తేన మే సఫలావాప్తిర్భవే జ్జన్మని జన్మని
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి.

శ్లో: యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం.

శ్లో: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్సర్వాత్మకః

శ్రీ సత్యనారాయణ స్సుప్రీతోవరదో భవతుః
శ్రీ సత్యనారాయణ ప్రసాదం శిరసా గృహ్ణామి.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ 

*1).ప్రథమోధ్యాయః :*
***********************

పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిశారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేషప్రఙ్ఞకలవాడైన శ్రీసూతమహర్షిని, శౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి. 

ఓ పౌరాణిక బ్రహ్మా! సూతమహర్షి! మానవులు ఏవ్రతము చేసిన కోరిన కోరికలు ఫలించి ఇహ, పరలోకసిద్దిని పొందెదరో, ఏ తపస్సు చేసిన లబ్దిపొందెదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి. అని అడిగారు. 

అదివిన్న సూతుడు ఓ మునిశ్రేష్టులారా! పూర్వమొకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లె అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పినదానినె మీకు చెప్పెదను శ్రద్దగా వినండి" అన్నాడు. 

పూర్వమొకప్పుడు, లోకసంచారప్రియుడైన నారదుడు సర్వలోకాలను దిరుగుచూ సర్వలోకానుగ్రహకాంక్షితుడై భూలోకానికి వచ్చాడు.భూలోకములో పూర్వజన్మకర్మఫలములచే పలుజన్మలనెత్తుతూ పలుకష్టములనుభవించుచున్న మానవులను జూచి, జాలిపడి వీరి కష్టములను కడతేర్చు ఉపాయమేదియని విచారించుచూ విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్షియైన నారదమహర్షి, విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరంగలవాడును, శంఖ, చక్ర గదా పద్మవనమాల విభూషితుడును, అగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. 

మనస్సుకుగాని మాటలకుగాని ఊహించిచెప్పుటకు అలవికాని అతీతమైన రూపముకలవాడును, ఆదిమధ్యాంతరహితుడు నిర్గుణుడు, సుగునాత్మకుడైన ఆదిపురుషా! భక్తుల బాధలను తొలగించు భగవంతుడా! శ్రీమన్నారాయణా! నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీమహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లన్నాడు. ఓ నారదమహర్షీ! నీరాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు తీరుస్తాను అన్నాడు. 

ఓ లక్ష్మీవల్లభా! శ్రీమన్నారాయణా! జగద్రక్షకా! భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మములనుభవించుచున్నారు. వారికష్టములను కడతేర్చు ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్ధించాడు. 

శ్రీమహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు " ఓ నారదా! లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్నడిగావు! చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదలి సుఖసంతోషాలనొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను, వినమన్నాడు. భూలోకమందును, స్వర్గలోకమందునుకూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతమొకటి కలదు. నీయందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నానువిను. అదే సత్యన్నారాయణ వ్రతము. దానిని విధివిధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించినవారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. నారదుడడుగుచున్నాడు! ఓ మహాప్రభూ! ఆ వ్రతాన్నాచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్నాచరించుటెట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్నిచేసి ఫలితం పొందినవారెవరైనకలరా? ఈ వ్రతాన్నెపుడు ఆచరించాలి అంతయు నాకు సవిస్తరంగా తెలుపవలసిందని కోరాడు. 

భగవంతుడు చెప్పుచున్నాడు! ఈ వ్రతము ప్రజల కష్టనష్టాలను విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యములను వృద్దినొందించును. సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తీక మాసములందుగాని, ఏదైనా శుభదినమందుగాని ఆచరించవలెను. యుద్ద ప్రారంభమందును, కష్టములొచ్చినపుడును, దారిద్ర్యము సంభవించినపుడును, అవి తొలగిపోవుటకు ఈ వ్రతమాచరించాలి.దీనిని శక్తిగలవారు ప్రతినెలా ఆచరింపవచ్చును. లేదా శక్తిని బట్టి సంవత్సరములో ఒక్కసారైనను జరుపుకోవచ్చును. 

ఏకాదశి రోజునగాని , పౌర్ణమి రోజునగాని ,సూర్యసంక్రమణం రోజునగాని, ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేచి దంతధావనాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి శుచిర్భూతుడై భగవోతునికి నమస్కరించి "స్వామి సత్యన్నారాయణ! నీ అనుగ్రహప్రాప్తికై భక్తిశ్రద్దలతో నేనీవ్రతము ఆచరించుచున్నాను , నాపై దయ చూపుము" అంటూ నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించాలి. 

అట్లు సంకల్పించి మధ్యాహ్నసమయమునందు కూడా సంధ్యావందనాదులను నెరవేర్చుకొని సాయంకాలం మరల స్నానమాచరించి, ప్రదోషకాలము[అసుర సంధ్యవేళ] దాటిన పిమ్మట వ్రతపూజ ఆరంభించాలి. పూజాప్రదేశాన్ని స్థలశుద్ది చేయాలి. మట్టిఇండ్లు కలవారు గోమయంతో అలికి చక్కనిముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా అయిదు రంగుల పొడులతో అందమైన, శుభకరమైన ముగ్గులు పెట్టి, ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యముపోసి మధ్యలో శక్తినిబట్టి వెండిగాని రాగిగాని, ఇత్తడితోగాని చేసిన కలశాన్నుంచాలి. మరీ బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైననూ ఉంచవచ్చును. శక్తిఉండి లోభత్వము చూపరాదు. శక్తికొలది సకలము ఆచరించాలి. కలశముపై మరల కొత్తవస్త్రాన్ని పరచాలి. 

ఆ నూతనవస్త్రముపై సత్యన్నారాయణ స్వామి ప్రతిమనుంచి పూజించాలి. ఎనబై గురిగింజలయెత్తు బంగారముతోగాని దానిలో సగముగాని, లేక ఇరవైగురిగింజలయెత్తు బంగారంతోగాని చేసిన సత్యనారాయణస్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో(పాలు,పెరుగు,నెయ్యి,తేనె,నీరు) శుద్ది చేసి మండపములో ఉంచవలెను. ప్రధమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని , శివుడుపార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను ,ఇంద్రాదిఅష్టదిక్పాలకులను, ఆదిదేవతలను, ప్రత్యధిదేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహనము చేయాలి. ఓం ప్రధమంగా మొదట కలశమునున్న వరుణదేవుని ఆవాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మున్నగు ఐదుగురు దేవతలను కలశంకు ఉత్తరదిశయందు., మంత్రములతో ఉదకసమాప్తిగా ఆవాహనము చేసి పూజించాలి. సూర్యాదిగ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి.అటు పిమ్మట సత్యనారాయణస్వామి కలశమందు ప్రతిష్టించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు ఎనిమిది దిశలందు ప్రతిష్టించి పూజించాలి పిమ్మట సత్యదేవుని(సత్యనారయణ స్వామి) కలశమీద పూజచేయాలి. 

నాలుగు వర్ణాలవారు అనగా బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు,ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైధికపురాణ మంత్రములతోను, బాహ్మణులు కాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోను పూజించవలెను. మనుషులైనవారు భక్తిశ్రద్దలతో ఏ రోజునైనను ఈ వ్రతమును చేసికొనవచ్చును. కాని పగలు ఉపవాసముఉండి సాయంసమయమందే సత్యనారాయణస్వామిని పూజించాలి.ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలసిచేసుకోవాలి.అరటిపండ్లు,ఆవుపాలు,ఆవునేయి,శేరుంబావు,గోధుమనూకగాన, వరినూకతోగాని వాటికి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. చక్కెరలేనిచో బెల్లముగూడా ఇవి అవిఅన్నియు 1 1/4కేజి చొప్పున చేర్చి ప్రసాదముచేసి స్వామికి నివేదనచేయాలి. 

ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తికొలది దక్షిణతాంబులాదులతో సత్కరించి, దీవెనలందుకొని, బ్రాహ్మణులతో సహా అందరూ షడ్రసోపేత భోజనమారగించాలి. సత్యనారాయణస్వామిని నృత్యగీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చేయాలి. కలియుగంలో భూలోకమందు,మానవులు తమ కామితార్దములను తీర్చుకొనుటకు సులభమైన వ్రతమార్గమిదియే. మానవులు తమ కోర్కెలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభవ్రతమార్గం ఇంకొకటిలేదు.అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించెనని, సూతమహర్షి శౌనకాదిమునులకు విన్నవించాడు. 

*2).ద్వితీయాధ్యాయః :*
************************

ఓ మునులారా! పూర్వము ఈ వ్రతమాచరించిన వారిని గురించి చెప్పెదను వినండి. పూర్వము కాశీనగరములో కటికదరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండెవాడు.అతడు దరిద్రబాధననుభవిస్తూ అన్నవస్త్రములు లేక నిత్యము ఆకలిదప్పులతో అలమటిస్తుండేవాడు. పడరానిపాట్లుపడుతూ తిరుగుచుండేవాడు. బ్రాహ్మణప్రియుడగు భగవంతుడు బాధపడుచున్న బ్రాహ్మణుని జూచి దయతలచి,వృద్దబ్రాహ్మణ రూపమును ధరించి అతని ఎదుట నిలచి "ఓయి! విప్రోత్తమా! నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుచున్నావు? నీ వృత్తాంతమంతయు చెప్పుమన్నాడు". 

అంతట బ్రాహ్మణుడు"ఓ మహాత్మ! నేనొక విప్రుడను! మిక్కిలి దరిద్రుడనై బిక్షాటనముతో జీవించుచున్నాను. పడరానిపాట్లుపడుచూ ఇంటింటికి తిరుగుతున్నాను.నా దరిద్ర్యము పోయే మార్గమేదైన ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి" అని వేడుకున్నాడు. అంతట వృద్దబ్రాహ్మణుడు "ఓ ద్విజోత్తమా! శ్రీసత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే గదా! ఆ సత్యనారాయణస్వామిని పూజించు. నీ కష్టములన్నీ తొలగిపోతాయి.సత్యనారాయణవ్రతమును ఆచరించుము. అని చెప్పి,వ్రతవిధివిధానమును విన్నవించి ఆ వృద్దబ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యుడాయెను. అదివిన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్దబ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణస్వామి వ్రతమును రేపుచేసుకొనెదనని సంకల్పించుకొని దానినే తలంచుకొనుచు నిద్రగూడరాక ఎట్లో మరునాడు ప్రొద్దున్నే లేచి "ఈ రోజు తప్పక సత్యనారాయణవ్రతము చేసుకొందునని" మరల అనుకొన్నవాడై యధావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవలన ఆ రోజున బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను,బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తిశ్రద్దలతో ఆచరించాడు. 

ఆ వ్రత మహిమవలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్యవిముక్తుడై సర్వదుఃఖములను తొలగించుకొన్నవాడై సకలసంపదలతో విలసిల్లినాడు. అదిమొదలు ఆ బ్రహ్మణుడు నెలనెలా విడువక సత్యనారాయణస్వామి వ్రతమును భక్తిశ్రద్దలతో ఆచరించసాగాడు.ఆవిధంగా నెలనెలా సత్యనారాయణ వ్రతం చేయటంవలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడై సర్వపాపములనుండి విముక్తిపొందినవాడై, మరణాంతరమున మోక్షమును పొందాడు. భూలోకమందెవరైన ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతమును చేసినచో వారి సర్వదుఃఖములు తొలగి సుఖసంతోషాలతో ఉండగలరు.ఓ మునులారా!ఈ విధముగా శ్రీమన్నారాయణుడు నారదమహర్షికి చెప్పినవ్రతమును మీకు విన్నవించాను అని సూతమహర్షి చెప్పాడు. 

అంతట ఋషులు మరల సూతమహర్షినిట్లడిగారు "ఓ మహర్షీ! ఆ బ్రహ్మణునివలన విన్నవారెవరైననూ ఈవ్రతమును ఆచరించారా! చెప్పండి మాకు వినాలనియుంది" అని అడిగారు. సూతమహర్షి చెబుతున్నాడు "మునులారా! ఆ బ్రాహ్మణుడొకనాడు తన విభవముకొలది బ్రాహ్మణులను, బంధువులను బిలిచికొని వ్రతము చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనువాడు అచ్చటకు వచ్చి కట్టెలమోపును బయటకు దింపుకొని, లోపలికివచ్చి వ్రతమును చూడసాగాడు. అతడు మిక్కిలి దప్పిక గలవాడైనను, బ్రాహ్మణుడుచేయుచున్న వ్రతమునంతయు ఓపికతో చూసి దేవునికి, బ్రాహ్మణునికి నమస్కారము చేసి "ఓ బ్రాహ్మణోత్తమా! మీరిప్పుడు చేసిన పూజపేరేమి? దానివలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని" అర్ధించాడు. విప్రుడిట్లు చెప్పెను . ఓయీ! ఇది సత్యన్నారాయణవ్రతము ఈ వ్రతమునుచేసినచో సర్వకార్యసిద్ది కలుగును. కోరినకోరికలు ఫలించును.సకలైశ్వర్యవంతులుకావచ్చును.ఆ బ్రాహ్మణుడు చెప్పినదానిని శ్రద్దగావిన్న ఆ కట్టెలమ్మువాడు మిగుల సంతోషించి తనదాహం తీర్చుకొని, స్వామివారి ప్రసాదమును స్వీకరించి తనయూరికి పోయెను. 

అతడు సత్యన్నారాయణ స్వామినే మనసులో ధ్యానించుచు వ్రతముచేయ సంకల్పించుకున్నవాడై, ఈ కట్టెల మోపును అమ్మగా వచ్చిన ధనముతో సత్యన్నారాయణవ్రతము చేయుదునని తలచాడు. అతడు కట్టెలనమ్ముటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్లవైపు పోయెను. స్వామి అనుగ్రహముచే అతనికానాడు రెట్టింపులాభం వచ్చింది. దానికతడు మిక్కిలి సంతోషించి అరటిపండ్లు, పంచదార,ఆవు నెయ్యి, ఆవు పాలు,శేరుంబావు గోధుమనూక, పూజాసామాగ్రినంతటిని తీసుకొని ఇంటికి పోయాడు. అతడు బంధువులందరిని పిలిచి విధివిధానమున సత్యన్నారాయణవ్రతమును చేసాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యములతోను, పుత్రపౌత్రాదులతోను సర్వసంపత్కరుడై, సకల సౌఖ్యములనుభవించి అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. 

*3).తృతీయోధ్యాయః :*
*************************

సూతుడు మరల చెప్పుచున్నాడు."ఓ మునులారా! మీకు మరొక కథను చెప్పెదను వినండి. పూర్వం ఉల్కాముఖుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియములను జయించినవాడై,సత్యవంతుడై ప్రతిదినము దేవాలయమునకు బోయి అచట బ్రాహ్మణులకు ధనమునిచ్చి వారిని సంతృప్తిపరచి,దైవదర్శనం చేసుకొని పోయెవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి,సుగుణవతి ఆరాజొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నదీతీరమున సత్యనారాయణవ్రతము చేయసాగాడు. ఇంతలో సాధువనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోను,వస్తువులతోను ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజుదగ్గరకు వచ్చి వినయముతో నిట్లడిగాడు. 

సాధువు, ఓ రాజా! భక్తిశ్రద్దలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి. తెలుసుకోవాలనుంది" అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు! పుత్రసంతానప్రాప్తికై మేము ఈ సత్యనారాయణవ్రతము చేయుచున్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు " ఓ రాజా! నాకు గూడా సంతానంలేదు. ఈ సత్యనారాయణవ్రతమును చేసినచో సంతానము కలుగుచున్నచో నేనుగూడా ఈ వ్రతమాచరించెదనన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికివచ్చి భార్యయైన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గూర్చి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరించెదనన్నాడు. 

ఒకనాడు లీలావతి ధర్మపరాయణురాలై, భర్తతో సుఖించింది. తత్ఫలితముగా గర్భవతియై పదవమాసమున పండంటి భాలికను ప్రసవించింది.ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె దినదినప్రవర్ధమానమవుతొంది. తల్లిదండ్రులామెకు "కళావతి" అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి,భర్తతో "నాధా! మనకు సంతానము కలిగినచో సత్యనారాయణవ్రతమును చేసెదనంటిరి గదా! మనకు పుత్రిక ఉదయించినదిగదా! కనుక వ్రతంచేయండి అంది. దానికావర్తకుడు, "లీలావతి మన అమ్మాయి వివాహసమయంలో తప్పక వ్రతంచేద్దామని భార్యను సమాధానపరచి వ్యాపారంపనిమీద నగరానికి పోయాడు.ఇట్లు కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది. అది గమనించి సాధువు తన సహచరులతోనాలోచించి వరుని వెదుకుటకు దూతను పంపాడు. సాధువట్లు ఆఙ్ఞాపించగా దూత కాంచననగరానికి బోయి అక్కడొక చక్కని యోగ్యుడైనా వర్తకుని కుమారునిజూచి, వెంట తోడ్కొనివచ్చాడు. అందగాడైన ఆ వైశాల్యబాలకుని జూచిన సాధువు తన కుమార్తెనిచ్చి విధివిధానమున పెండ్లిచేసాడు. పుత్రికావివాహానందములో పడిన ఆ సాధువు పెండ్లివేడుకలలోబడి సత్యనారాయణవ్రతమును మరిచాడు. అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది. తరువాత కొంతకాలానికి, వ్యాపారదక్షతగల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లునితోసహా బయలుదేరి, సముద్రతీరమునవున్న రత్నసానుపురమనే నగరానికి బయలుదేరాడు. 

ఆ పురమును చంద్రకేతుడనే మహారాజు పాలించుతుండేవాడు. కోపించిన సత్యనారాయణస్వామి వ్రతప్రతిఙ్ఞను మరచిపోయిన సాధువును శపించబూనుకొన్నాడు. వ్రతము చేస్తానని మరచిన సాధువును, "అత్యంత దారుణము,కాఠిన్యతగల దుఃఖమతనికి కలుగుగాక! యని శపించాడు. శాప ప్రభావంవలన ఆ నాడే రాజుగారి ధనాగారములోనికి కొందరు దొంగలు ప్రవేశించి,ధనమును అపహరించి రాజ భటులు వెంట తరుముతుండగా, సాధువు వర్తకులు ఉన్నవైపుకు పరుగెత్తారు. రాజుభటులను చూచిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు ,వర్తకులు ఉన్నచోట పడవైచి పారిపోయారు. రాజభటులు వచ్చి, వర్తకుల వద్దనున్న రాజధనమును జూచి ఆ వర్తకులే దొంగలనుకొని నిశ్చయించుకొన్నవారై సాధువును, అల్లుడిని బంధించి రాజువద్దకు తీసుకొనిపోయారు. ఆ రాజభటులు,మహారాజా! దనముతోకూడా దొంగలను పట్టి తీసుకొనివచ్చాము.విచారించి శిక్షించండి. అని సంతోషముతో చెప్పారు. అంతట రాజు, విచారణవసరము లేదనుకొనుచు "వీరిని చెరసాలలో బంధించండి" అన్నాడు.భటులా ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు.వర్తకులెంత మొత్తుకున్నా, సత్యదేవుని మాయచేత వారినెవ్వరు పట్టించుకొనలేదు. ఇంకను చంద్రకేతుమహారాజు వారి పడవలయందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవునిశాపముచే ఇంటియందున్న సాధువు భార్యకూడా కష్టాలపాలయ్యింది. వారియింటనున్న ధనధాన్యములంతటిని దొంగలుపడి అపహరించుకొనిపోయారు. వర్తకునిభార్య తీవ్ర మనోవేధనతో రోగగ్రస్తురాలాయెను. తినటానికి తిండిలేక, ఇంటింటికి తిరిగిభిక్షమెత్తుకొని బ్రతుక సాగింది. కుమార్తె కళావతికూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొన సాగింది. అలాతిరుగుతూ ఒకనాడొక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది. అక్కడాబ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేయుచుండగా చూచింది. కధ అంతయు విని, కరుణించి కాపాడమని స్వామిని మనఃస్ఫూర్తిగా వేడుకొన్నది. ప్రసాదాన్ని గూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లుచేరుకున్నది. ఆలస్యంగావచ్చిన కళావతిని జూచి లీలావతి ప్రేమతో ఇట్లన్నది. 

అమ్మాయి! ఇంతరాత్రివరకు ఎక్కడున్నావు? నీ మనస్సులో ఏమున్నది? చెప్పుమన్నది. వెంటనే కళావతి "అమ్మా! నేనొక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణవ్రతం జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా! ఆ వ్రతం కోరినకోరికలు తీర్చునటగదా!" అన్నది. అంతట లీలావతి పుత్రిక మాటలు విని వ్రతంచేయసంకల్పించింది. వర్తకునిభార్యయైన లీలావతి బంధుమిత్రులతో కలిసి,మిక్కిలి భక్తిశ్రద్దలతో సత్యనారాయణవ్రతం చేసి "స్వామీ! మా అపరాధము మన్నించండి. మమ్మల్ని క్షమించి నా భర్తయు,అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి. అని ప్రార్ధించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆరాత్రి చంద్రకేతుమహారాజు కలలో కనిపించి "రాజా! నీవు బంధించినవారిద్దరూ దొంగలుకారు. వారు వర్తకులు, రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి, వారిధనం వారికిచ్చి పంపివేయుము లేనిచో నీవు సర్వనాశనమగునట్లు చేసెదనని చెప్పాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులనాఙ్ఞాపించాడు. వారట్లే చేసి, వర్తకులిద్దరినీ రాజువద్దకు తెచ్చి రాజా వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గతసంగతులు తలంచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచూ భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు. అపుడారాజు వర్తకులను జూచి "వర్తక శ్రేష్టులారా! మీకీ ఆపద దైవవశమున సంభవించినది. భయపడకండి". అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేసి, వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి, వారిద్దరిని సంతోషపరచాడు. రాజు ఇంకను వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనంచేసుకొన్న ధనమునకు రెట్టింపుఇచ్చి వారిద్దరిని సంబరపరిచాడు. చంద్రకేతుమహారాజు వారిద్దరిని సకలమర్యాదలతో సత్కరించి మీరింక సుఖముగా మీఇంటికి పోవచ్చును అనిచెప్పాడు. వర్తకులు పరమానందభరితులై రాజును అనేకవిధాల కొనియాడి సెలవుతీసుకొని తమ నివాసములకేగిరి. 

*4).చతుర్ధోధ్యాయః :*
************************

సూతమహర్షి చెబుతున్నాడు. అటుపిమ్మట వైశ్యులిద్దరు, విప్రులకు దానధర్మములొసంగి తీర్ధయాత్రలు చేయుచు స్వనగరమునకు బయలుదేరాడు. సముద్రమునందు వారావిధముగా కొంతదూరము ప్రయాణము చేసిరి సత్యదేవునికి మరల వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపమును ధరించి "నాయనలారా! మీ పడవలో ఏమున్నది" అని అడిగాడు. ధనమదాంతులైన ఆ వైశ్యులు, సన్యాసిని జూచి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు,అలములు తప్ప మరెమియు లేవు. వెళ్ళమని బదులు చెప్పారు. అంతట సన్యాసి చిరునవ్వునవ్వి "అట్లే అగుగాక" అన్నాడు. 

అట్లు పలికిన ఆ సన్యాసి నదీతీరమునందే కొంతదూరములో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలావెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకునివచ్చి, పడవలోనికిజూచి,ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్చిల్లాడు, తెలివివచ్చిన తరువాత తమ ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవోనని విలపించసాగాడు. అంతట అల్లుడు మామనుజూచి "మామయ్యా! ఏడ్వటంవలన ప్రయోజనమేమి? సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలననే మనకీ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపంవల్లనే సర్వస్వం కోల్పోయాము. కనుక ఆయననే వేడుకొందాం. ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు" అన్నాడు. అల్లుని మాటలనాలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో "స్వామి! ఙ్ఞానశూన్యుడనై మిమ్ములను పరిహసించాను. నా తప్పును మన్నించండి. క్షమించి నాపై దయ చూపండి" అని పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. భోరున విలపించాడు. అంతట ఆ సన్యాసి "ఓయీ! నా వ్రతము చేసెదనని చెప్పి మరిచిపోవుట భావ్యమ! దుష్టబుద్దితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపంవల్లనే నీకీ దుస్థితి సంభవించింది. యిప్పటికైనా తెలుసుకొంటివా! అన్నాడు. 

అంతట సాధువు "స్వామీ! పుండరీకాక్షా! లోకమంతయు నీ మాయమోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాదిదేవతలే నీ మాయనుగానలేకున్నారు.నిన్ను తెలుసుకొనలేకున్నారు. మానవమాత్రుడను, నేనెంతవాడను తండ్రీ! నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అఙ్ఞానిని. నీ అనుగ్రహమునకు దూరమై తపించుచున్న అభాగ్యుడను నిన్ను తెలుసుకొనుట నా తరమ స్వామీ! నా అపరాధమును మన్నింపుము. ఇకమీదట నిన్నెపుడు మరువక పూజించెదను. శరణన్నవారిని రక్షించు కరుణాసముద్రుడవు, నన్ను అనుగ్రహించు నా విత్తమును నాకిప్పించమని" పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. సాధుయొక్క ప్రార్ధనను మన్నించిన స్వామి ఆతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యెను. అటుపిమ్మట సాధువు తన నావవద్దకు వచ్చిచూడగా అది అంతయు ధనరాశులతో నిండియుండుటను గమనించి సంతుష్ఠాంతరంగుడై ఆ సత్యదేవుని దయవల్లనే తనకోరిక తీరినదనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో "అల్లుడా! మనం మన రత్నపురమునకు చేరాము" అంటూ తమ రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపెను.ఆ దూత నగరానికిపోయి లీలావతితో అమ్మా! నమస్కారము, మన అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రాదులందరితో కలిసి వేంచేసారు. ఇప్పుడే పడవవచ్చింది. అని వార్తను చెప్పాడు.  అంతట లీలావతి, దూతమాటలు విని ,సంబరపడి, అమ్మాయీ కళావతీ! సత్యనారాయణవ్రతం త్వరగా ముగించిరామ్మా! నేను నావ వద్దకు పోవుచున్నాను, నీ తండ్రిని, భర్తను చూచుటకు త్వరగా రా! అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరచి పరుగుపరుగున తన పతిని జూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితోసహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేసాడు. అదిచూసి ఒడ్డునున్నవారు హాహాకారాలు చేసారు. లీలావతి, కళావతి మిక్కిలి దుఃఖించసాగారు.హఠాత్తుగా పడవ మునిగిపోవుటను జూచిన తల్లి నెత్తినోరూ బాదుకుంటూ, విలపిస్తూ, భర్తతోఇట్లన్నది. "ఏమండి! అల్లుడు అంత హఠాత్తుగా పడవతోసహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి? అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడ్వసాగింది. తన భర్త తనకళ్ళెదుట మునిగిపోవుటను జూచిన కళావతి అతని పాదుకలను తీసుకొని, వాటితో సహా సహగమనము చేయటానికి సిద్దపడింది. సాధువు ఇదంతయుజూచి, మిగులదుఃఖించుచు, ఆలోచించి, "ఇదంతా స్వామి మహిమే అయివుంటుందని" ఊహించి శక్తికొలది స్వామిని పూజించెదనని తలంచి అందరితోబాటు స్వామిని వేడికొనసాగాడు. అంతట స్వామి సాధువును కరుణించి అదృశ్యరూపములో ఉండి అతనితో ఓయీ! నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నాప్రసాదమును ఆరగించుట మరచినది. ఆమె మరల ఇంటికిపోయి ప్రసాదమును భుజించివచ్చినచో అంతయు శుభమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులువిన్న కళావతి, వెంటనే ఇంటికివెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్రతీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తనభర్త నావతోసహా నీటిపై తేలియుండుటజూచి సంతోషపడింది. అందరు ఆనందించారు. అంతట కళావతి తండ్రితో "తండ్రీ! ఇక ఆలస్యమెందుకు? ఇంటికి పోవుదమురమ్ము" అనెను అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసికొని ఇంటికి పోయాడు. అటుపిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతకాలమువరకు ప్రతి పౌర్ణమి తిధియందును, రవిసంక్రమణ సమయమందును, సత్యనారాయణస్వామి వ్రతము చేస్తూ సర్వసౌఖ్యములనంది అంత్యమున అమరలోకానికేగాడు. 

*5). పంచమోధ్యాయః :*
***********************

సూతమహర్షి చెబుతున్నాడు, ఓ మునిశ్రేష్టులరా! మీకు మరొక కథను విన్నవించెదను. శ్రద్దగావినండి పూర్వము తుంగధ్వజుడనే రాజు మిగుల ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలవలేజూచుచు రాజ్యపాలన చేస్తున్నాడు.ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికిబోయి తిరిగివచ్చుచు మార్గ మంధ్యంలో విశ్రాంతి తీసుకొంటూనొక మారేడుచెట్టు క్రింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతోసహా వ్రతముచేసుకొనుచుండగా చూచియు స్వామికి నమస్కారమైనను చేయక నిర్లక్ష్యముచేసాడు. వ్రతము పూర్తయినతరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు. గొపాలురందరూ ప్రసాదాన్ని తిన్నారు. కాని రాజుగారికి అహంకారంఅడ్డొచ్చి మీరుపెడితే నేను తినటమేమిటనుకొని, ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతట స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు.తత్ఫలితంగా రాజుయొక్క వందమంది కుమారులు చనిపోయారు.సర్వసంపదలు సర్వనాశనమైనాయి.క్రమంగా దారిద్ర్యం సంభవించింది. అష్టకష్టాలపాలయ్యాడు. ఇదంతయు చూచిన రాజు ఆలోచించి, ఇట్లు తలపోసాడు "ఆహా! నాడు గొల్లలుఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహముచెంది నాకిట్లు శాస్తి గావించాడు". అనుకొని వెంటనే గొల్లలుచెంతకు పోయి నియమనిష్టలతో, భక్తిశ్రద్దలతో సత్యదేవుని వ్రతము ఆచరించాడు. అంతట స్వామి దయతలచి మరల ధనధాన్యాదిక సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్యసుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖములను అనుభవించుచు క్రమంతప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంత్యకాలమున సత్యలోకమునకేగాడు. 

మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్దలతో చేసినవారును, వ్రతమునుచూచినవారును, కథవిన్నవారును సత్యనారాయణస్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్యసంపత్తులను, పుత్రపౌత్రాదిసంతతిని పొందగలరు ఇహపరలోకాల్లో సర్వసౌఖ్యములనుభవించుచు మోక్షమునొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్ర్యులు ధనవంతులు కాగలరు. బంధవిముక్తినొందగలరు. భయముతోలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభిష్టిసిద్దినొంది అంత్యమున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా! మానవులను సర్వదుఃఖములనుండి విముక్తి చేయు మహిమగల శ్రీసత్యనారాయణవ్రతవిధానమును, దానిఫలితములను ఆచరించి ముక్తినొందినవారి కథలను, విన్నవించాను. విశేషించి కలియుగములో సత్యనారాయణవ్రతమును మించినదిలేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణయని, సర్వేశ్వరుడని పిల్చుకొంటారు. ఎవ్వరేపేరుతో పిలిచిన కోర్కెలుతీర్చే స్వామి సత్యనారాయణస్వామియే. 

మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్దలతో చేసినవారును, వ్రతమునుచూచినవారును, కథవిన్నవారును సత్యనారాయణస్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యెదరు. ఆయన కృపచే ధనధాన్యసంపత్తులను, పుత్రపౌత్రాదిసంతతిని పొందగలరు ఇహపరలోకాల్లో సర్వసౌఖ్యములనుభవించుచు మోక్షమునొందగలరు. ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్ర్యులు ధనవంతులు కాగలరు. బంధవిముక్తినొందగలరు. భయముతోలగును. అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభిష్టిసిద్దినొంది అంత్యమున స్వర్గలోకమునకేగుదురు. కావున ఓ మునులారా! మానవులను సర్వదుఃఖములనుండి విముక్తి చేయు మహిమగల శ్రీసత్యనారాయణవ్రతవిధానమును, దానిఫలితములను ఆచరించి ముక్తినొందినవారి కథలను, విన్నవించాను. 

విశేషించి కలియుగములో సత్యనారాయణవ్రతమును మించినదిలేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగమున సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణయని, సర్వేశ్వరుడని పిల్చుకొంటారు. ఎవ్వరేపేరుతో పిలిచిన కోర్కెలుతీర్చే స్వామి సత్యనారాయణస్వామియే.

*0x0x0x0x0x0x0x0x0x0*
*-- వరలేఖరి.నరసింహశర్మ.*
*0x0x0x0x0x0x0x0x0x0*