Thursday 28 April 2022

శనివారం అమావాస్య

శని అమావాస్య రోజు ఇలా చేస్తే సకల దుష్ప్రభావాలు తొలిగిపోతాయి

అమావాస్య ప్రతి కృష్ణ పక్షం చివరి తేదీన వస్తుంది. ఈసారి అమావాస్య శనివారం అనగా 30.04.2022 న కావడం విశేషం.

          వైశాఖ మాసంలో శనివారం అమావాస్య రావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈసారి అమావాస్య ఏప్రిల్ 30వ తేదీ శనివారం వస్తోందని, దీనిని శని అమావాస్యగా పిలవడం జరిగింది. అయితే, శని అమావాస్య రోజున జ్యోతిష్యశాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు.

           అలాగే అనేక రకాల దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. శని అమావాస్య రోజున ప్రజలు శని దేవుడిని ఆరాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

           సాధారణంగా పక్షి, ఇతర దోషాలను తొలగించడానికి ప్రత్యేక పూజలు, దాన కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. శని అమావాస్య రోజున కొన్ని నివారణలను పాటించడం ద్వారా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అనేక దుష్ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది.

రావి చెట్టు పూజ..
             శని దేవుడి కోపం, ఇతర దోషాలు, దుష్ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే ఏప్రిల్ 30వ తేదీన ఉదయం స్నానం చేసిన తరువాత రావి చెట్టు వద్దకు వెళ్లండి. నల్ల నువ్వుల, ఇనుప గోరు, ఆవాల నూనె, మట్టి దీపం తీసుకెళ్లండి. చెట్టును పూజించే ముందు దాని చుట్టూ కాలవను కట్టి, ఆపై చెట్టుకు నువ్వులు, ఆవాలు, ఇతర పూజా సామగ్రిని సమర్పించాలి. మత గ్రంధాలలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత గురించి పేర్కొనడం జరిగింది.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోండి..
                శనిదేవుని అనుగ్రహం తాకితే అట్టి వారికి ఏ కష్టమూ రాదు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆరాధన. రాబోయే శని అమావాస్య రోజు ఆలయానికి వెళ్లి శని దేవుడికి నూనె, నల్ల నువ్వులు సమర్పించాలి. ఆలయంలో శని చాలీసాను పఠించాలి. ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దా చేయడం ద్వారా శనివా ఆగ్రహానికి లోనైన చోట, మరోవైపు భక్తులను కరుణిస్తే, ఏ కష్టమూ ఆయనను తాకదు! శని దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గం అతని ఆరాధన మరియు ఆరాధన.
               రాబోయే శని అమావాస్య నాడు, ఆలయానికి వెళ్లి శని దేవుడికి నూనె మరియు నల్ల నువ్వులు సమర్పించండి. మీరు ఆలయంలో శని చాలీసాను కూడా పఠించాలి. ఈ రోజున బెల్లంతో చేసిన వస్తువులను దానం చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు.

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ఆంజనేయస్వామి అవతారాలెన్ని

ఆంజనేయస్వామి అవతారాలెన్ని.


              ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.

అవేంటంటే:
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

         ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.

ఆంజనేయస్వామి గురించి కొన్ని .......
            ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడుఅందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
        ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక!అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది.

కలువలు:
            కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

                మంచి పనులు కాపాడతాయి.చెడ్డ పనులు వెంటాడతాయి.ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.
తత్వమసి
పంచముఖ హనుమాన్:
             శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.

1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమంతుడి సందేశం.......
            హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం - వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం - ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్, ఖాధికాలని, తిరుపతి

Wednesday 27 April 2022

భగవాన్ శ్రీ రమణ మహర్షి

విరూపాక్ష గుహలో ఉన్నపుడు బ్రాహ్మణస్వామిగా పిలవబడ్డారు.

భగవాన్ శ్రీ రమణ మహర్షి

ధ్యానం : ఆత్మవేది, ఆత్మజ్ఞాన బోధి, లీలావినోది యగు శ్రీ రమణులను ధ్యానించెదము.
జననం : 1879 డిసెంబర్ 30 (ఆర్ద్ర నక్షత్రం) 
నిర్యాణం : 1950 ఏప్రిల్ 14
తల్లిదండ్రులు : అళగమ్మదేవి - సుందరమయ్యర్
మంత్రం : శ్రీ రమణం జయ రమణం అరుణాచల శివ గురు రమణం

తమిళనాట "త్రిశూలపుర"మనే "తిరుచ్చుళి" గ్రామంలో జన్మించిన రమణుల అసలుపేరు వెంకట్రామన్. అళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థం. ఈ సుందరీ సుందరుల పుత్రుడైన రమణులు అరుణాచలేశుని పిలుపందుకుని నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే అరుణాచలం చేరి తీవ్ర తపోనిష్ఠలో గడిపారు. విరూపాక్ష గుహలో ఉన్నపుడు "బ్రాహ్మణస్వామి"గా పిలవబడ్డారు. తరువాత వీరి తమ్ముడు, తల్లి కూడా వీరిని అనుసరించారు. రమణుల శిష్యుల్లో ఉద్దండులైన 'కావ్యకంఠ' గణపతి 'మునీంద్రులు' పెట్టిన పేరే భగవాన్ శ్రీ రమణమహర్షి. వారు ముని.. వీరు మహర్షి! వారి పేరు గణపతికి అటూఇటూ ఉన్నవి బిరుదులు. వయసులో రమణుల కన్నా కొంచెం పెద్దవారైన కావ్యకంఠుల్ని గణపతి అవతారంగాను, రమణుల్ని కుమారస్వామి అవతారంగాను భావిస్తారు. కావ్యకంఠుల తండ్రికి వినాయకుడొచ్చి ఒళ్లో కూర్చునేవాడట. అందుకే ఆపేరు పెట్టారు. ఎందరికో గురువైన కావ్యకంఠులు రమణుల "అహం మూలాన్వేషణ" బోధతో శాంతి పొంది తమ శిష్యులతో కలిసి రమణులకు దాసోహం అన్నారు. వీరే రమణుల్ని సుబ్రహ్మణ్య అవతారమని ప్రకటించారు.

సర్వ సాధు, సర్వదైవ స్వరూపులుగా ఎందరికో నిదర్శనాలిచ్చిన సాయిబాబా గురుస్థాన్ లో కొందరు రమణ భక్తులకు రమణులు గానూ దర్శనమిచ్చారు.

రమణుల మాటల్లో పాటలు, సూక్తులు, శ్లోకాలూ క్లిష్టమైన ఆత్మ తత్వాన్ని సరళంగా సుబోధకం చేస్తూ దొర్లుతూ ఉండేవి. ఒక భక్తుడు ఆయన ముందు కూర్చుని మనసులో లాంగ్ లాంగ్ ఎగో అన్నట్టుగా "హృదయ కుహర మధ్యే.. హృదయ కుహర మధ్యే.." అంటూ పదే పదే జపిస్తూ తర్వాత పదం ఏమిటో తెలియక అవస్థ పడుతుంటే సర్వజ్ఞులైన రమణులు ఆ పదాలతో మనోజ్ఞమైన ఒక శ్లోకాన్ని ఇలా పూరించారు:
హృదయ కుహర మధ్యే
కేవలం బ్రహ్మ మాత్రమ్
హ్యహమహమితి సాక్షా
దాత్మ రూపేణభాతి
హృదివిశ మనసా స్వమ్
చిన్వతా మజ్జతా వా
పవన చలన రోధా
దాత్మ నిష్ఠో భవత్వమ్!

మంచి పనులు కాపాడతాయి.చెడ్డ పనులు వెంటాడతాయి.
ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.
తత్వమసి
అక్కడే వుండి విన్న కావ్యకంఠులు పులకించిపోతూ "ఆహా! ఇంత మంచి కవిత్వాన్ని మనం కనీవినీ ఎరుగుదుమా" అని తమ శిష్యులతో అన్నారు. పెద్ద చదువులెరుగని రమణుల కవిత్వాన్ని కావ్యకంఠులంతటివారు ప్రశంసించడం మహావిశేషం.అహం మూలాన్వేషణ, ఆత్మతత్వం అంటూ రమణులు ఉపదేశించేదే పై శ్లోకంలోనూ ఇమిడి ఉంది.

అహం మూలాన్వేషణ : కావ్యకంఠులొచ్చి ఆశ్రయించే నాటికి రమణులు చిరకాలంగా మౌనదీక్షలో ఉన్నారు. గొంతు సవరించుకుని మౌనం వీడి ఆయనతో ఇలా అన్నారు: "ఇప్పుడు మీరు "నేను" అన్నారే.. ఆ నేను అనేదాని మూలాన్ని అన్వేషించండి. అదే మీరు. అదే ఆత్మ!" ఈ మాటలు వినగానే కావ్యకంఠులు పరవశించి దాసోహం అన్నారు. భగవాన్ అని పిలవసాగారు. కావ్యాలు కంఠంలో ఉన్న పండితుడని ఆయనకు కావ్యకంఠ అనే బిరుదొచ్చింది. దేవీ సాక్షాత్కారాలు పొందినా అశాంతి పీడించేది. ఈ దశలోనే రమణుల బోధతో శాంతి కలిగిందన్నారు. ఇలా ఎందరో విదేశీ తాత్వికులు కూడా రమణుల బోధతో శాంతులయారు.

రమణుల కొంటెతనం : నేరుగా చెప్పకుండా సంకేతంగా చెప్పడం ఆలోచింపజేస్తుంది. అదే బాగా హత్తుకుంటుంది. దీన్నే మైండ్ గేమ్ అనొచ్చు. మనుషుల మైండ్ గేమ్ మైండుని, గుండెని పాడుచేస్తుంది. దేవుడి మైండ్ గేమ్ చింతన దీక్షను ప్రసాదిస్తీంది. దాని వల్ల మైండు దివ్య చైతన్యాన్ని పొందుతుంది. ఈ సృష్టి సమస్తం దేవుడి మైండ్ గేమే.. అనుక్షణం జరిగేవన్నీ ఆయన్ని గుర్తు చేసుకోడానికే అని భావించడమే దైవచింతన అవుతుంది.

అళగమ్మగారు ఒకరోజు మధ్యానం తీరిక కాగానే రమణుల ముందు కూర్చుంటూ అక్కడున్న చెంబును పక్కన పెట్టారు.

"అయ్యో! అమ్మా! అదెందుకు ముట్టుకున్నావు? దాన్నిప్పుడే వాళ్లెవరో ముట్టుకుని అక్కడ పెట్టారు. ఇప్పుడు నువు స్నానం చెయ్యాలి. బయట వానగా ఉంది. ఇప్పుడెలాగమ్మా?" అన్నారు రమణులు. అళగమ్మగారు కలవరపడి స్నానానికి వెళ్లబోతుంటే అక్కడి భక్తులు ఆపి "అమ్మగారూ! రమణులు భగవానుడని నమ్ముతున్నాం కదా! వారిని తాకితే గంగాస్నాన ఫలం కదా! ఇప్పుడీ వానలో స్నానం ఎందుకమ్మా?" అన్నారు.ఆవిడ వెంటనే అది రమణుల సూచనే అని గ్రహించి "ఔనౌను. నిజమే. అలాగే చేస్తాను" అంటూ స్నానం విరమించుకున్నారు. తల్లిగారి ఛాందస ఆచారాన్ని మాన్పించడానికే ఆయన ఇలా నడిపించారు.

బోధామృతం : ఈ ప్రపంచం మాత్రమే కాదు విశ్వాంతరాళాలన్నీ ఆత్మ దృష్టితో చూస్తే సత్యమే. ఆత్మకు భిన్నంగా చూస్తే మిథ్య! అనే రమణుల బోధలో ద్వైత, అద్వైత తత్వాల సమన్వయాన్ని దర్శించగలం. లీలల కన్నా బోధలే మహిమాన్వితమని రమణుల బోధనా సరళి బోధిస్తుంది.అంతా భగవంతుని ఆజ్ఞతోనే అనుభవించగలం. ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. కర్మలతో ఆయనకు సంబంధం లేదనుకోరాదు అని రమణులు బోధించేవారు.

నిర్యాణం: అందరిలాగే వ్యాధి కూడా రమణుల్ని ఆశ్రయించింది. ఆయన దాన్నీ ప్రేమగానే ఆదరించి శరీరాన్ని విడిచారు. ఆరోజు రాత్రి 8-47 నిమిషాలకు "రమణజ్యోతి" అనే ఆ కాంతి పుంజాన్ని గగనతలంలో అనేక ప్రాంతాలవారు దర్శించారు.

"రమణజ్యోతి ఆకాశంలో ఈశాన్య దిశగా సాగిపోయిందంటూ ప్రముఖ పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి.

రమణ భాగవతులు : కావ్యకంఠులు, పలువురు దేశవిదేశీ సాధుసంతులు రమణుల్ని ప్రత్యక్షంగా సేవించారు. అరవిందులు, నిత్యానందులు, చిన్మయానందులు, నారాయణ గురు తదితర యోగులు రమణ భక్తులే.గాంధీజీ కూడా అరుణాచలం వరకు వచ్చినపుడు కొండపై రమణుల్ని దర్శించాలని ఆశించినా వీలుకాలేదు. గాంధీజీ వెంట వచ్చే జనం వల్ల పైన తొక్కిసలాట జరుగుతుందని భయపడి వారి అనుచరులు వారించడంతో ఆయన సభలో మాట్లాడి వెనుదిరిగారట. అయితేనేమి? తమ అనుచరులైన నాయకులకు, స్వాతంత్ర్య సమర యోధులకు గాంధీజీ తరచూ రమణుల్ని దర్శించి రమ్మని సలహా ఇస్తుండేవారట. "ఒకసారి అరుణాచలం వెళ్లి రమణుల సన్నిధి


మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

Tuesday 26 April 2022

అహోబిలం

 శ్రీ నృసింహ జయంతి

కొలిచేవారి కొంగు బంగారమై 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన నవ నారసింహ క్షేత్రమైన అహోబిలం నారసింహ స్వామి క్షేత్రం


           ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగులవీరాస్వామయ్య  తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం

                    1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే ఉపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

అహోబలం 
             హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. 

           నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. 

           ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. 
             ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు.
             ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. 
              తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు.

                పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
                  తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్.లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. 

                  అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.
                       తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

పార్వేట:-
            అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. 

             అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మార్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పార్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.


                  నారసింహ క్షేత్రం.. అహోబిలం
 స్థలపురాణం : బ్రహ్మాండ పురాణంలో ప్రహ్లాద వరదుడై హిరణ్యకశిపుడిని సంహరించడానికి నర - సింహాకృతిలో స్తంభోద్భవుడై అవతరించిన శ్రీమన్నారాయణుడే అహోబిల నరసింహస్వామి. స్వామి మహా బలవంతుడిగా కనిపించడంతో అబ్బురపడిన దేవతలందరూ "అహో! బలం.." అని భయాశ్చర్య చకితులయారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబలం అనేపేరు వచ్చింది. అదే అహోబిలం అయింది

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ప్రదోష వ్రతం

          ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు .

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును.
           ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహేను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.


            ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఈ త్రయోదశీ ప్రదోషము సమయాన్ని యిలాలెక్క కడతారు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. ( ఒక ఘడియ = 24 నిమిషాలు )

             ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సిఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు, కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అన్నది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు  త్రయోదశిలో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆరోజు కూడా శివ పూజనే చేయాలి

            ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .


          ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారమునాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి.

           శని త్రయోదశినాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము, సర్వ పుణ్యదము.

         ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే .

            ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు, భోళా శంకరుడు

ప్రదోష ఉపవాసముంటే శివుడు ప్రసన్నుడౌతాడా ?

           ప్రదోష ఉపవాస దీక్షను (ఇక్కడ ఉపవాసమంటే భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఉండే నిరాహార స్థితి అని అర్థం చేసుకోవాలి) అనుష్ఠించడం ద్వారా, పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషి వాక్కు. అలా పాటించదలిచిన రోజు ప్రాత:కాలమే స్నానం ఆచరించి శుభ్రమైన తెల్లని వస్త్రాలు (లేక కాషాయం మొదలుగునవి) ధరించి, శరీరంలో వివిధ భాగాలలో విభూతిని, రుధ్రాక్ష మాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ‘ఓ నమ:శివాయ.' శక్తి మేర జపం చేయండి. పద్దతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుధ్రాక్షమాలలు మన మనో శరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో మునిగివుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని ధర్శించాలి. అయితే రోజంతా భక్తి సాధనలోనే ఉండాలన్న విషయం మీరు మరవరాదు. అన్యచింత లేని భక్తియే ఈశ్వరుడి కరుణ దృఫటి మీపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళుతునప్పుడు, వెళ్ళిన తరువాత కూడా శివ మంత్రాన్ని మనసులొ జపిస్తూనే ఉండాలి.


మీ

వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్

శాంతి నగర్,ఖాధికాలని

Monday 25 April 2022

నవగ్రహముల

నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం

 ఆదివారానికి అధిపతి సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిచ్చుట శుభము.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేయుట మంచిది. అన్యోన్య దాయకమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజ, అభిషేకములు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజ చేసి ఉపవాసం ఉండటం శుభము. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి. చంద్ర హోర లో దానము శుభము.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేకంగా తమలపాకు మరియు సింధూర పూజ చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి. కందులు దానం.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, శనగలు వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి…

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

గంగా మాహాత్మ్యం

శ్రీ మహాభారతం - అనుశాసనిక పర్వం - 19
* భీష్ముడిని దర్శించిన అత్ర్యాది ప్రముఖ మహర్షులు.
* గంగా మాహాత్మ్యం 

             శరశయ్యపై శయనించిన భీష్ముడు ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధిస్తున్న సమయంలో ఆయనను దర్శించుటకు అత్రి మహర్షితో సహా అనేక మంది మునులు, మహర్షులు తమ శిష్య బృందంతో వచ్చారు. వారి తపోమహిమతో నిండిన కాంతి సర్వత్రా వ్యాపించింది. శరశయ్యపై పడివున్న భీష్ముడి పరిస్థితి వారు పరిశీలించి చూశారు. పాండవులు వారికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని దర్శించిన అనంతరం మునులు అదృశ్యమై పోయారు. వారు వెళ్ళిన పిమ్మట పాండవులు వారి చరిత్రలను గురించి ముచ్చటించు కొన్నారు. ఆ తరువాత యమనందనుడు తాతగారి పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించి తాతా! ఏ ఊళ్లు, కొండలు నదులు ఏ రకమైన మహిమ కలవో తెల్పు’మని కోరాడు. 

* భీష్ముడు చెప్పిన గంగ ప్రభావం *
ధర్మరాజా! పూర్వం భిక్షాటన చేసే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక సిద్ధయోగి అతిథిగా వచ్చాడు. ఆ విప్రుడు అతనికి అర్ఘ్య పాద్యాదులతో మర్యాదలు చేసి నీవడిగి నట్లే ఆయోగిని అడిగాడు. అప్పుడు అతను బ్రాహ్మణోత్తమా! ఏ దేశాల మధ్య నుండి గంగ ప్రవహిస్తుందో ఆదేశాలలో వున్న నదులు, పర్వతాలు అన్నీ పవిత్రాలే. గంగకు త్రిపథ అని పేరున్న సంగతి నీకు తెలిసిందే కదా! ( స్వర్గంలో మందాకినీ, భువిపై భాగీరథి,పాతాళంలో భోగవతి) అటువంటి గంగను సేవిస్తే యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు, త్యాగాదులచే కలిగే ప్రయోజనం కంటే అధిక ఫలితం చేకూరుతుంది. 

'మేనించుక సోఁకినగంగానదితోయములుజనుల కల్మష కోటిం బో నడచి పురందర లో కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ!'

             కొంచము గంగానది నీరు శరీరానికి సోకితే చాలు మనిషి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా స్వర్గ లోక ఆనందం కలిగిస్తుంది. గతంలో ఎన్ని పాపాలు చేసివున్నా గంగలో మునిగితే - సూర్యుని రాకతో చీకట్లు వైదొలగి పోయినట్లు - ఆ పాపాలన్నీ పటా పంచలౌతాయి. మరణించిన పిమ్మట అతడు స్వర్గానికి చేరగలడు. మనిషి ఎముక గంగ నీళ్ళలో ఎన్నేళ్ళు వుంటుందో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గలోకంలో సుఖాలు పొందుతూ ఉంటాడు. 

            విప్రవర్యా! సోమంలేని యజ్ఞం, చంద్రుడులేనిరాత్రి, సూర్యుడులేని ఆకాశం, స్వధర్మంలేని ఆశ్రమం, పువ్వులు లేని చెట్లు ఎలా శోభించవో అదే విధంగా గంగ లేని దేశం కూడా శోభనివ్వదు. ఎన్ని చాంద్రాయణ వ్రతాలు చేసినా గంగ నీరు త్రాగినంత ఫలితం రాదు. సకల పాపాలు గంగలో మునిగితే పోతాయి. అగ్నిలో పడ్డ దూది వలె సమస్త జీవరాసులకు దుఖం పోగొట్టుకొనుటకు ఎన్ని మార్గాలున్నా అవి గంగతో సమానం కావు. 

'శరణంబు లేని జనులకుఁ బరమ శరణ మండ్రు మునులు భాగీరథి, ని 
ర్జరులకు నమృతము లత్తుల నరులకు గంగాజలం బనఁగ నే విందున్'

         విప్రోత్తమా! దిక్కులేని జనులకు గంగ గొప్ప దిక్కని మునులంటారు. దేవతలకు అమృతమెట్లాగో, నరులకు గంగ నీరు అటువంటిదని అనడం నేను విన్నాను. 

'తలపై జాహ్నవి వాలుకా యలికి కొనిన ఫాలతటిఁ దదంతర్మృత్సం
కలితముఁ జేసిన బాపంబులు దొలఁగు సుపర్ణు గనిన భుజగముల క్రియన్'

         తలమీద గంగ ఇసుక, నొసటిపై గంగ మన్ను రాసుకొంటే గరుత్మంతుడిని చూసిపాములు పారిపోయినట్లు పాపాలు తొలిగి పోతాయి. గంగా తరంగాల తుంపర్లు చిందే గాలి శరీరానికి తాకితే అతడి పాపాలన్నీ అప్పటికప్పుడే పోతాయి. మానవుడు గంగాస్నానం చేస్తే పదునాలుగు తరాల పితృదేవతలను పావనులౌతారు. గంగను చూసినంత మాత్రాన మాట, మనస్సు శరీరం వలన కలిగిన పాపాలన్నీపోతాయి. గంగను గురించి విన్నా, గంగ ఉత్సవాలు చేసినా, చూసినా, గంగను చేతితో తాకినా అది రెండు వంశాల (పుట్టినింటి,మెట్టినింటి) వారి పితృదేవతలను స్వర్గానికి పంపిస్తుంది అటువంటప్పుడు ఇక స్నానం చేస్తే వారికి ఎంత పుణ్యం వస్తుందో వర్ణించలేను.

'విను, గంగ గంగ యను కీర్తనములతో నొండు నీటఁ దగ మునిఁగిన య 
జ్జనులు దురితములఁ దొఱఁగుదు రని యార్యులు సెప్ప విందు సంచిత చరితా!'

          గంగా! గంగా! అంటూ పరవశంతో గంగను కీర్తిస్తూ ఏ నీటిలో మునిగినా పాపాలు పోతాయని పెద్దలంటారు. చూడడానికి శక్తి వుండి గంగను చూడని వాడు పశువుతో సమానుడు. ఇంద్రాది దేవతలే గంగ కావాలనుకొంటే నరులు అనుకోకపోవడం ఉచితమా! ప్రాణం పోయే సమయానైనా గంగను తలచినంత మాత్రాననే ముక్తి కలుగుతుంది. రాజ, చోర, పాప భయాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి. శివుడే ఆ దేవత స్వర్గము నుండి కదలి వస్తే తన నెత్తిన పెట్టుకొన్నాడు కదా! 

'మూడు పథములఁ జని లోకములకు మూఁటి కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి
యమలతర మూర్తి యగు దేవి నాశ్రయించు వాఁడు కృత కృత్యుఁడిది నిక్కువము కృతాత్మ!'

            బ్రాహ్మణోత్తమా! మూడు మార్గాలలో ప్రవహిస్తూ ముల్లోకాలకు గొప్ప అలంకార భూషణమై కీర్తిని కలిగిస్తూ ఉండే నిర్మల మూర్తి గంగాదేవిని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. మానవులకు ఇంద్రుడు,గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు, ఎలాగో అలాగే మనుష్యులకు అన్ని విషయాలలో మాహాత్న్యం గల గంగ గొప్పది. కపిలుడు శాపం వలన సాగర పుత్రులు భస్మరాశులై ఉండగా గనగా ఆ భస్మ రాసులపై ప్రవహించి వారిని స్వర్గానికి పంపినదని చెప్పి సిద్ధుడు బ్రాహ్మణునకు నాకు తెలిసిన గంగా మాహాత్మ్యాన్ని నీకు వివరించాను కాబట్టి నీవు మనోవాక్కాయ నిర్మలుదవై గనగను సేవించు మని చెప్పి ఆకాశ మార్గంలో సిద్ధుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజా! తెలిసింది కదా గంగ గొప్పదనం నీవు కూడా గంగను ఆరాధిస్తే శాశ్విత సుఖవంతువంతుడిని చేస్తుంది, అని భీష్ముడు గంగ గొప్పదనాన్ని చెప్పాడు. 

       (స్వర్గంలో నున్న గంగ భువిపైకి ఎందుకొచ్చింది?: సగరచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా అతని యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి పాతాళంలో తపస్సు చేసుకొంటున్న కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతములో వదిలాడు. ఇది తెలియని సగర పుత్రులు అరవైవేల మంది తండ్రి ఆదేశంమేరకు అశ్వాన్ని వెదకుటకు వెళ్ళారు. భూమిపై వెదకి, వెదకి కనిపించక భూమిని త్రవ్వుకొంటూ పాతాళం దాకా వెళ్ళారు. అక్కడ కపిల ముని ఆశ్రమప్రాంతంలో అశ్వము వుండడం గమనించి కపిలుడే అశ్వాన్ని అపహరించాడని భావించి అయన పై దాడికి సిద్ధమయ్యారు. ఆసమయంలో కపిల మహర్షి చూసిన కోపదృష్టికి భస్మమై పోయారు. వారికి విముక్తి కలగాలంటే గంగను వారి భస్మ రాసులపై పవహింప చేస్తే ముక్తి కలుగుతుందని ముని చెప్పగా తరువాత ఆ వంశంలో జన్మించిన అంశుమంతుడు, దిలీపుడు మొదలగు వారు ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ తరువాత భగీరథుడు ప్రయత్నించి గంగను భువికి తెచ్చి పాతాళంలో వున్నతన ముత్తాతల భస్మరాసులపై ప్రవహింప చేసి వారికి విముక్తి కల్పించాడు.)

 భీష్ముడు : ధర్మరాజా! గంగాదేవి స్తోత్రంకూడిన ఈ పురాణ గాథను చదివినా, విన్నా రోగాలు పోవడమే కాక పాపాలు కూడా తొలిగి పోతాయిఅని చెప్పగా గంగ గొప్పదనం విన్న ధర్మరాజు తన తమ్ములతో కలిసి ఆయనకు నమస్కరించి మరొక సందేహం అడిగాడు 

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !!

           తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !! 

🌷అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ
🌷కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.

🌷కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

🌷ప్రతి ఏటా చైత్ర మాసం (ఏప్రియల్/ మార్చ్), ఆషాఢ మాసం (జూన్/జులై) లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విదియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజులపాటు వైభవంగా జరుగుతాయి.

వసతి
🌷తలుపులమ్మ తల్లి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ సుమారు 28 కాటేజీలు కలవు. నామమాత్రపు ధరల్లో ఇవి లభిస్తాయి. ఉత్సవాలు, పండుగల సీజన్లో గదులు దొరకడం కష్టం. గెస్ట్ హౌస్ లు లేవు కనుక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఉదయాన్నే వచ్చి సాయంత్రం తిరుగుప్రయాణం అవుతారు.

🌷తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి.

తుని పట్టణంలో చూడవలసినవి/ చేయవలసినవి:
🌷ఆదివారపు సంత తప్పకుండా చూడండి. కొండప్రాంతం కనుక ఇక్కడ వర్షాధార పంటలు పండిస్తారు. ముఖ్యంగా మామిడి విస్తారం. తక్కువ ధరకు రోడ్లపై విరివిగా అమ్ముతారు. రానున్నది ఎండాకాలం కనుక తుని లో మామిడిపండ్లు రుచి చూడండి.

తలుపులమ్మ లోవ ఆలయానికి ఎలా చేరుకోవాలి ?
🌷తలుపులమ్మ లోవ గుడి కాకినాడకు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 106 కి. మీ ల దూరంలో, అమలాపురానికి 176 కి. మీ ల దూరంలో, తుని కి కేవలం 8 కి. మీ ల దూరంలో కలదు. ఈ గుడి జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

🌷సమీప విమానాశ్రయం : రాజమండ్రి
సమీప రైల్వే స్టేషన్ : తుని

🌷బస్సు మార్గం : తుని వరకు బస్సులో ప్రయాణించి... అక్కడి నుంచి జీపులలో లేదా షేర్ ఆటోలలో ప్రయాణించి తలుపులమ్మ తల్లి దేవస్థానం చేరుకోవచ్చు.

తలుపులమ్మ లోవ కొత్తూరు సమీప గ్రామం అక్కడి వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

ఓం కారం


సమస్త వేదాల సారమైన ఓం కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనల పై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించినసత్యోపదేశాలే ‘మంత్రాలు’.

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దలవాక్కు.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి:.
మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.

2. ఛందస్సు:.
శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.

 
3. దేవత:.
ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

4. బీజం:.
మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.

5. శక్తి:.
మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.

6. కీలకం:.
మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, సర్వసిద్ధులను పొందుతాడు.

7. అంగన్యాసం:.
అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం:
చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో
అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆమంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:..

‘ఓం’..
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

వేదం ఓంకారరూపం, వేదరాశి..
ఋగ్వేదం నుండి ‘అ’ కారం,
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం:.
అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం:.
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం ‘హూం’.

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

"రం:.
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం:.
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం:.
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం:.
ఊపిరి యొక్క స్వాభావిక బీజం.
‘సో’ ఉచ్ఛ్యాసం,‘హం’ నిశ్శ్వాసం.
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

గాయత్రీ మంత్రం:.ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

జలదానం వైశిష్ట్యం

జలదానం వైశిష్ట్యం 

చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ఠ మాసములలో జలదానం తప్పక చేయవల్సినది.

మార్కండేయ పురాణం
శ్లో- తోయాన్నదాన పరాయణు డగువాడు
వేదనారహితుడై విడుచునొడలు

భావం
నిత్యం మంచినీరు దానం చేయువాడు, రవ్వంత బాధ లేకుండా చివరి దశలో శరీరం విడిచి పెడుతాడు..

దేవీ భాగవతం... నవమ స్కంధం
జల దానం వలన విష్ణు దర్శనం అవుతుంది.
వేసవి కాలంలో నీళ్లను దానం చేసిన పుణ్యాత్ములు వేయి దివ్య సంవత్సరాల కాలం విష్ణువు చేత వైకుంఠంలో సన్మానం అందుకుని, ఆ తర్వాత మణిద్వీపానికి వెళ్తారు.


వేంకటాచల మహాత్మ్యం
ఇక్ష్వాకు వంశస్థుడైన హేమాంగుడనే రాజు కులగురువు వసిష్ఠుని మాట తిరస్కరించి జలదానం చేయక, పండితులను గౌరవించక, చాతక పక్షి, కుక్కగా జన్మలు ఎత్తి, మిథిలా నగర రాజు శ్రుతకీర్తి ఇంటి గోడపై బల్లిగా జన్మ ఎత్తుతాడు. రాజు పండితుడైన శ్రుతదేవుడ్ని కడిగిన పాదజలం బల్లిపై పడి పాపవిముక్తి పొందాడు. సప్తగిరుల్లో స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి దర్శనం, 7 రోజులు జలదానం చేసి స్వర్గం పొంది, వేంకటాద్రిలో జలదానం చేసిన పుణ్యం వల్ల వైవస్వత మన్వంతరంలో కాకుత్స్థుడిగా పుట్టాడు.

లింగ పురాణం
పూర్వజన్మలో సుభద్ర ఎన్ని తప్పులు చేసినా ఆకలితో ఉన్న పండితుడికి ఆతిథ్యం ఇచ్చి మరు జన్మలో రాకుమార్తె గా జన్మించింది.

*అందుకే అన్నదానం, జలదానం తప్పక చేసి తీరాలి*...

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

విద్వాన్ సర్వత్ర పూజ్యతే!


విద్వాన్ సర్వత్ర పూజ్యతే!

       ధనం మూడు రకాలుగా ఉంటుంది. 
ఒకటి బాహ్యంలో ఉండే *భౌతికమైన ధనం*. 
రెండవది *మానసిక ధనం*
మూడవది *పుణ్యరూపమయిన ధనం*. 

          ఈ మూడూ సమానమైన ప్రాతిని ధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకో కపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో సర స్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసర మేనని అంటారు. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ దేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తన కున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు.

           అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశంఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవా రికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదు వున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. 'ఇవన్నీ నావి కావమ్మా. నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి' అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువ వుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం.

రెండవది మానసిక ధనం.
అంటే శాంతి.శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...'ఓంశాంతిః శాంతి శాంతిః' అంటాం.తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగల గాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేక పోయినా 'నాకేం తక్కువయిందని'..అన్నభావ నతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్య మయినా, ఆనందమయినా మానసిక మైన ధనాన్ని ఆవహించి ఉంటాయి.

*మూడవది పుణ్యధనం*.
              ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? కలుగుతుం దనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుం దిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది?

         పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ఉజ్జయిని మహాకాళేశ్వరం

ఈశ్వరానుగ్రహంతో అపమృత్యువు దూరం!!

🌻పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి.. దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు. నలుగురూ సుగుణోపేతులే. తండ్రి ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులు. ఆ ఊరి పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడున్నాడు. అతడి పేరు దూషణుడు. లోకంలో అందరినీ బాధపెడుతూ ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు.

🌻ఉజ్జయినిలో ఈ నలుగురూ శివార్చన చేస్తున్న విషయం తెలుసుకున్న దూషణుడు వారి వద్దకు వచ్చి.. ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలు లేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? అటువంటివాళ్లను నేను ఎందరినో గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చెయ్యనా?’ అని అడిగాడు. దూషణుడి మాటలకు వాళ్లు కొంచెం కూడా బెదరలేదు. ‘తుచ్ఛుడు.. వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే సమయం వృథా అయిపోతుంది. హాయిగా మనం శంకరుడిని నమ్ముకుని ఉందాము. శంకరుని రక్షణయందు ఉండగా మనకు భయం ఏమిటి!’ అని శివపూజపై మనసు లగ్నం చేశారు. దూషణుడు ఆ నలుగురి మీదకు కత్తి ఎత్తాడు. అయినా వాళ్లు కదల్లేదు. కనీసం కత్తికి బెదిరి చెయ్యి కూడా అడ్డుపెట్టకుండా.. ‘హరఓం హర హర’ అంటూ అలాగే కూర్చున్నారు.ఏ రూపంలో వస్తున్న మృత్యువునయినా ఈశ్వరుడు తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు తప్పనిసరిగా రక్షింపబడతాడు.


🌻ఆ నలుగురు బ్రాహ్మణకుమారులూ దీన్నే నమ్మి మట్టితో చేసిన చిన్న పార్థివ లింగానికిఆరాధన చేస్తున్నారు. దూషణుడు వారిపైకి కత్తి ఎత్తగానే.. ఆ పార్థివలింగం నుంచి పరమేశ్వరుడు మహాకాళ స్వరూపంతో బయటకు వచ్చి కోపంతో ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడు, అతని సైనికులు బూడిదరాశులై పడిపోయారు. కానీ.. ఆ వేడి అక్కడే కూర్చున్న నలుగురు బ్రాహ్మణ కుమారులను మాత్రం ఏమీ చేయలేదు. వేడి ధర్మం కాల్చడమే. అగ్నిహోత్రం ఒకరిని కాల్చి వేరొకరిని వదలదు. కానీ, ఆ వచ్చిన వేడి పరమాత్మ స్వరూపం. అందుకే దూషణుని, అతని సైన్యాన్ని మాత్రమే కాల్చి స్వామి భక్తులైన ఆ నలుగురిని మాత్రం కాపాడింది.

🌻అప్పుడు బ్రాహ్మణ కుమారులు ఆ స్వామిని.. చనిపోయేవారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. అంతమందిని చంపి.. అక్కడే ఉన్న తన భక్తులైన నలుగురిని వదిలిన రూపం. కాబట్టి అది మహాకాళ స్వరూపం. ఆ రూపాన్ని చూసి దేవతలు పొంగిపోయి స్వామిని స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా మీరు ఇక్కడ లింగరూపంలో ఉద్భవించండి. ఇటువంటి సజ్జనులు, మీమీద పూనిక ఉన్నవాళ్లు, మీరు ఉన్నారని నమ్మినవాళ్లు ఎవరు ఇక్కడికి వస్తారో వారు అకాలంగా పడిపోకుండా అనుగ్రహించడానికి స్వయంభూలింగంగా ఉండాలి’ అని అడిగారు.

🌻వారి కోరిక మేరకు అక్కడ మహాకాళ లింగంగా ఆవిర్భవించాడు. మనకు భయం వేసినప్పుడు ‘హరహర మహాదేవ శంభోశంకర’ అని పరమేశ్వరుని ధ్యానిస్తే తక్షణం మన భయం తొలగిపోతుంది. ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ మనతోనే ఉంటాడు. వాయులింగమై వాయురూపంలో.. ఆకాశరూపంలో ఆకాశలింగమై ఆ స్వామి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఈశ్వరానుగ్రహం ఉన్నవారికి అపమృత్యువు లేదు.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ఏ రోజు ఏ విశేషము?

ఏ రోజు, ఏ కార్యకలాపాలు ఉత్తమంగా ఉంటాయి 

ఆదివారం, సోమవారం, మంగళవారం,
బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.

ఆదివారం..
రాజకార్యములు, ఉద్యోగ ప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం, సీమంతములకు శుభం.

సోమవారం..
అన్నప్రాశన, కేశఖండన, అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు శుభం.

మంగళవారం..
శుభకార్యాలకు మంచిది కాదు, అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పు తీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.

"
బుధవారం..
సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రధారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుటకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.

గురువారం..
సమస్త శుభకార్యములకు మంచిది, వివాహ యాత్రాదులకు, నూతన వస్త్ర, ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, చెరువులు తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచిది.

*శుక్రవారం..
వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.

శనివారం..
ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మధ్యమం.

మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.

దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి.


అర్ధంతో దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి.


దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ
దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ.. 
ఇవి దుర్గాదేవి 32 నామాలు.

మంచి పనులు కాపాడతాయి.
చెడ్డ పనులు వెంటాడతాయి.
ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.


32 నామాలకు అర్ధం:

1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.
2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం.
3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.
4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.
5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.
6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.
7.దుర్గతోద్దారిణీ: దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.
8.దుర్గనిహంత్రీ: మనదెగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.
9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.
10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.
11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.
12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).
13.దుర్గమాలోక: చర్మచక్షువులు,పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం.
14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే వసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం. అంటే మనలోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపంమని అర్ధం
15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి త్రోవచూపేతల్లీ నీకు వందనం.
16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం).
17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నాకు వందనం (శ్రీచక్రం).
18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానానికి తల్లీ నీకు వందనం.
19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లీ నీకు వందనం.
20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.
21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.
22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని.. రెండోది దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.
23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.
24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.
25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.
26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.
27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.
28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.
29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.
30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.
31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.
32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.

ఓం నమో దుర్గాయ నమః అంటూ ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి అనేది పురాణాల కథనం.. భక్తుల నమ్మకం..

శ్రీ మాత్రే నమః....

మీ
వేద, శాస్త్ర స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

శ్రీ శివాష్టకమ్

శ్రీ శివాష్టకమ్

తస్మై నమో పరమకారణ కారణాయ I 
దీప్తోజ్జ్వల జ్వలిత పింగల లోచనాయ I
నాగేంద్రహార కృత కుండల భూషణాయ I 
బ్రహ్మేంద్ర విష్ణువరదాయ నమశ్శివాయ II1

శ్రీ మత్ర్పసన్న శశి పన్నగ భూషణాయ I 
శైలేంద్రజావదన చుంబిత లోచనాయ I
కైలాసమందర మహేంద్ర నికేతనాయ I
లోకత్రయార్తి హరణాయ నమశ్శివాయ II2

పద్మావదాత మణికుండల గోవృషాయ I 
కృష్ణాగరు ప్రచుర చందన చర్చితాయ I
భస్మానుషక్త వికచోత్పల మల్లికాయ I
నీలాబ్జ కంఠ సదృశాయ నమశ్శివాయ II3

లంబ త్సపింగల జటా ముకుటోత్కటాయ I 
దంష్ట్రాకరాళ వికటోత్కట భైరవాయ I
వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ I 
త్రైలోక్యనాధ నమితాయ నమశ్శివాయ II4


దక్షప్రజాపతి మహామఘ నాశనాయ I
క్షిప్రం మహాత్రిపుర దానవ ఘాతనాయ I
బ్రహ్మోర్జితోర్ధ్వగ కరోటి నికృంతనాయ I
యోగాయ యోగనమితాయ నమశ్శివాయ ౹౹5

సంసార సృష్టిఘటనా పరివర్తనాయ I
రక్షః పిశాచగణ సిద్ధ సమాకులాయ I
సిద్ధోరగ గ్రహ గణేంద్ర నిషేవితాయ I
శార్దులచర్మవసనాయనమశ్శివాయ II6

భస్మాంగరాగ కృతరూప మనోహరాయ I
సౌమ్యావదాత వనమాశ్రిత మాశ్రితాయ I
గౌరీకటాక్ష నయనార్ధ నిరీక్షణాయ I
గోక్షీరధార ధవళాయ నమశ్శివాయ II7

ఆదిత్యసోమ వరుణానిల సేవితాయ I 
యజ్ఞాగ్నిహోత్ర వరధూమ నికేతనాయ I
ఋక్ సామవేద మునిభిః స్తుతి సంయుతాయ I
గోపాయ గోప నమితాయ నమశ్శివాయ II8

శివాష్టక మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే II

॥ఇతి శ్రీ శివాష్టకమ్ సంపూర్ణం॥


మీ
వేద, శాస్త్ర, స్మార్త పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Tuesday 19 April 2022

శ్రీ సీతా అష్టోత్తర శతనామావళీ*

శ్రీ సీతా అష్టోత్తర శతనామావళీ*

ఓం సీతాయై నమః |
ఓం జానక్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం వైదేహ్యై నమః |
ఓం రాఘవప్రియాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం అవనిసుతాయై నమః |
ఓం రామాయై నమః |
ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమః |
ఓం రత్నగుప్తాయై నమః | ౧౦

ఓం మాతులింగ్యై నమః |
ఓం మైథిల్యై నమః |
ఓం భక్తతోషదాయై నమః |
ఓం పద్మాక్షజాయై నమః |
ఓం కంజనేత్రాయై నమః |
ఓం స్మితాస్యాయై నమః |
ఓం నూపురస్వనాయై నమః |
ఓం వైకుంఠనిలయాయై నమః |
ఓం మాయై నమః |
ఓం శ్రియై నమః | ౨౦

ఓం ముక్తిదాయై నమః |
ఓం కామపూరణ్యై నమః |
ఓం నృపాత్మజాయై నమః |
ఓం హేమవర్ణాయై నమః |
ఓం మృదులాంగ్యై నమః |
ఓం సుభాషిణ్యై నమః |
ఓం కుశాంబికాయై నమః |
ఓం దివ్యదాయై నమః |
ఓం లవమాత్రే నమః |
ఓం మనోహరాయై నమః | ౩౦

ఓం హనుమద్వందితపదాయై నమః |
ఓం ముక్తాయై నమః |
ఓం కేయూరధారిణ్యై నమః |
ఓం అశోకవనమధ్యస్థాయై నమః |
ఓం రావణాదికమోహిన్యై నమః |
ఓం విమానసంస్థితాయై నమః |
ఓం సుభృవే నమః |
ఓం సుకేశ్యై నమః |
ఓం రశనాన్వితాయై నమః |
ఓం రజోరూపాయై నమః | ౪౦

ఓం సత్త్వరూపాయై నమః |
ఓం తామస్యై నమః |
ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం హేమమృగాసక్తచిత్తయై నమః |
ఓం వాల్మీకాశ్రమవాసిన్యై నమః |
ఓం పతివ్రతాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం పీతకౌశేయవాసిన్యై నమః |
ఓం మృగనేత్రాయై నమః |
ఓం బింబోష్ఠ్యై నమః | ౫౦

ఓం ధనుర్విద్యావిశారదాయై నమః |
ఓం సౌమ్యరూపాయై నమఃఓం దశరథస్తనుషాయ నమః |
ఓం చామరవీజితాయై నమః |
ఓం సుమేధాదుహిత్రే నమః |
ఓం దివ్యరూపాయై నమః |
ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం ధియే నమః | ౬౦

ఓం లజ్జాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం శమాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం ప్రభాయై నమః |
ఓం అయోధ్యానివాసిన్యై నమః |
ఓం వసంతశీతలాయై నమః |
ఓం గౌర్యై నమః | ౭౦

ఓం స్నానసంతుష్టమానసాయై నమః |
ఓం రమానామభద్రసంస్థాయై నమః |
ఓం హేమకుంభపయోధరాయై నమః |
ఓం సురార్చితాయై నమః |
ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం మేధాయై నమః |
ఓం విభావర్యై నమః |
ఓం లఘూదరాయై నమః | ౮౦

ఓం వరారోహాయై నమః |
ఓం హేమకంకణమండితాయై నమః |
ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః |
ఓం రాఘవతోషిణ్యై నమః |
ఓం శ్రీరామసేవనరతాయై నమః |
ఓం రత్నతాటంకధారిణ్యై నమః |
ఓం రామవామాంకసంస్థాయై నమః |
ఓం రామచంద్రైకరంజిన్యై నమః |
ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః |
ఓం రామమోహిన్యై నమః | ౯౦

ఓం సువర్ణతులితాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం కలావత్యై నమః |
ఓం కలకంఠాయై నమః |
ఓం కంబుకంఠాయై నమః |
ఓం రంభోరవే నమః |
ఓం గజగామిన్యై నమః |
ఓం రామార్పితమనసే నమః |
ఓం రామవందితాయై నమః | ౧౦౦

ఓం రామవల్లభాయై నమః |
ఓం శ్రీరామపదచిహ్నాంగాయై నమః |
ఓం రామరామేతిభాషిణ్యై నమః |
ఓం రామపర్యంకశయనాయై నమః |
ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమః |
ఓం వరాయై నమః |
ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః |
ఓం మాతులింగకరాధృతాయై నమః |
ఓం దివ్యచందనసంస్థాయై నమః |
ఓం మూలకాసురమర్దిన్యై నమః | ౧౧౦ ||

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్, ఖాధికాలని
తిరుపతి

అష్ట భైరవులు

అష్ట భైరవులు 

ఈ నామములు ప్రతీరోజు 27 సార్లు చదవవలెను
1. అసితాంగ భైరవుడు
2. రురు భైరవుడు
3. చండ భైరవుడు
4. క్రోధ భైరవుడు
5. ఉన్మత్త భైరవుడు
6. కపాల భైరవుడు
7. భీషణ భైరవుడు
8. సంహార భైరవుడు

అష్టభైరవులు ఆదిత్యాది స్వరూపులు, శివ స్వరూపులు. ఆ భైరవుల నామమును ప్రతీరోజు స్మరించిన అంటువ్యాధులను పారద్రోలును. సకల శుభదాయకం, ఐశ్వర్య ప్రదాయకం.

ముఖ్యగమనిక:- శునకమునకు ఏదైనా ఆహారము పెట్టవలెను


అంటువ్యాధుల భయాందోళన నిర్మూలనకు అష్టభైరవుల నామములు పఠించినచో శుభ ఫలితాలు చేకూరుతాయి


కాలభైరవ స్వామి అనుగ్రహం వలన భుక్తి, ముక్తి, జ్ఞానము కలుగుతాయి అలానే శోకం, మోహము, లాభము, దైన్యము తొలగిపోతాయి ... ప్రతీరోజూ శ్రీ కాలభైరవాష్టకం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే విశేష ఫలితము, శ్రీ కాల భైరవుని అనుగ్రహము కలుగుతాయి ...


శ్రీ కాలభైరవాష్టకం
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయఙ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||
భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ |
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ |
నిక్వణన్-మనోఙ్ఞ హేమ కింకిణీ లసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ |
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||
రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ |
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
ఙ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ |
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ||

ఓం శ్రీ కాలభైరవాయ నమః


ఇట్లు
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్, ఖాధికాలని
తిరుపతి

సంకష్టహర చతుర్థి

సంకటహర చతుర్థి 
సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్నిసంకటాలు తొలగిపోతాయి. అందుకనే ప్రతిమాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే చతుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తాం. దీనినే సంకష్టహార చతుర్థి అని కూడా అంటారు. చవితికి అధపతి వినాయకుడు. స్వామిని ఈ రోజున నిండుమనసుతో కొలిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతిపురాణం పేర్కొంటుంది. సాధారణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉపవాసముండాలి.సాయంత్రం చంద్రదర్శనం తరువాత విరమించాలి. సమీప గణపతి ఆలయంలో జరిగే సంకటహారచతుర్థి వ్రతంలోపాల్గొనాలి. వినాయకచవితిరోజున చంద్రున్ని చూడకూడదు. అయతే సంకటహార చతుర్థి రోజున చంద్రున్ని చూడాలి. మంగళవారంనాడు వచ్చే సంకటహారచతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఈ రోజున ఈ వ్రతంనిర్వహిస్తే మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి.

సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు.

వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా వినాయకుడికి అవసరమైనవి. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక సాధనం.


ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి అని చెబుతారు.

సంకట హర చతుర్థి వ్రత కథ

ఒకానొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళుతుండగా ఒక రాజ్యం దాటుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపోయిందట. దానికి కారణమేమిటి అని పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన ఒక వ్యక్తి ఒక్క చూపు కారణంగా పుష్పకం ఆగిందని వాలిన దని తెలుసుకున్నాడు. మహారాజుకు చెబుతున్న సందర్భం లో వారిద్దరి ముందునుంచి పుష్పక విమానంలో ఒక పుణ్య స్త్రీ ఆకాశం లోకి తీసుకువెడుతున్నారు. అలా తీసుకువెళుతున్న దూతలను కారణం అడుగగా... ఆ దూతలు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఈమె తన జీవితంలో ఎన్నో పాపములు చేసింది కానీ నిన్నటి రోజు వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్ర దర్శనం చేసి మరణించింది కాబట్టి ఆమెకు ఉత్తమ గతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెళుతున్నాం అన్నారు.

వి.యస్.యస్.పి.పి
శాంతినగర్,ఖాధికాలని
తిరుపతి

Sunday 17 April 2022

వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశము

ఈ రోజు అనగా 17.04.2022 న ఆదివారం సాయంత్రం 4.00 గం లకు అందరు సభ్యులు, గౌరవ అతిధులు వారి సమక్షంలో పురోహిత పరిషత్ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ పి.రామకృష్ణ శాస్త్రి గారి అధ్యక్షతన, కోశాధికారి గౌరవ శ్రీ చక్రాల. కోటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో సాధారణ సర్వ సభ్య సమావేశము నిర్వహించ బడినది.
  ఇందులో పరిషత్ యొక్క 2021.2022 ఆదాయ, వ్యయముల వివరములు పరిషత్ కోశాధికారి చక్రాల కోటేశ్వర రావు గారు చదివి వినిపించడం జరిగినది. మరియు రాబోవు ఆర్ధిక సంవత్సరం 2022.2023 నకు గాను అంచనా రాబడి, ఖర్చు ల వివరాలు చదివి వినిపించడం జరిగినది.

 వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్,శాంతి నగర్, ఖాధికాలని, తిరుపతి.
 సంబంధించి నూతనంగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది.

అధ్యక్షులు: గౌరవ.శ్రీ పి.రామకృష్ణ శాస్త్రి గారు
ఉపాధ్యక్షులు: గౌరవ,శ్రీ.గురుమూర్తి గారు
కార్యదర్శి : గౌరవ శ్రీ.చక్రాల.కోటేశ్వర రావు గారు
సంయుక్త కార్యదర్శి:గౌరవ.శ్రీ.మావిళ్ళపల్లి.లక్ష్మీనారాయణ గారు
కోశాధికారి: గౌరవ.శ్రీ మారుపెద్ది,దొరస్వామి గారు.

సాంకేతిక సభ్యులు

గౌరవనీయులు
శ్రీ.డాక్టర్.ఏ.వేణుగోపాల్ శర్మ గారు
శ్రీ.ఏ.రాధేశ్యామ్ గారు
శ్రీ.యం.మోహన్ రావు గారు
శ్రీ.డి.చిద్విలాష్ గారు.
శ్రీ.ఇంద్రకంటి. మురళి

గౌరవాధ్యక్షులు 
శ్రీ.వనం.గౌరీ శంఖర్ గారు.

        పై తెలిపిన నూతన కార్యవర్గం ఎన్నుకోబడినది.. సదరు సమావేశమునకు అందరు సభ్యులు.పురోహిత పరిషత్ శ్రేయోభిలాషులు హాజరవడం జరిగినది.

ఇట్లు.
కార్యదర్శి
వి.యస్. యస్. పి.పి
తిరుపతి