Saturday 27 May 2017

జ్యేష్ట శుద్ధ తదియ అనగా ఈ రోజు 27.05.2017 శనివారము రంభా వ్రతం

జ్యేష్ట శుద్ధ తదియ అనగా ఈ రోజు 27.05.2017 శనివారము రంభా వ్రతం

            జ్యేష్ట శుద్ధ తదియ రోజున రంభా వ్రతం , రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయా వ్రతము అను వ్రతములు ఆచరిస్తారు. ఇందులో రంభా వ్రతము కొంత వరకు ఆచరణలో వున్నది

        కృత్య సారసముచ్చయం’ అను గ్రంథంలో పంచాగ్న సాధన చేయాలి, పద్మాసనం వేసుకుని కూచుని తపస్సు చేయాలి’ అని ఉంది. అసలు పం చాగ్ని సాధన అంటేనే ‘నాలుగు వైపులా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యునివైపు కంటి రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం..’

          ఇది చాలా చాలా కఠోర దీక్ష. అలాంటి దీక్షను నియమ నిష్ఠలతో చేయాలి. ఇందులో అరటి చెట్ల ప్రత్యేకతలను గమనిస్తే ఆ నీడను జ్యేష్ఠ శుద్ధ తది య మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకూ దాదాపు నెలరోజు నివసించ డం అనేది చక్కని ఆరోగ్యాన్నిస్తుంది. 

         ఈ వ్రతం ప్రత్యేకంగా స్ర్తీలకని చెప్పశ్హనవసరం లేదు. వేసవి సమయంలో పగటి పూట అరటి చెట్టు నీడ దాహాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. చలచల్లగా ఉంటుంది.

      ఈ రంభా వ్రతం కాక అరటిచెట్టు సంబంధమైనది కదళీ వ్రతం అని మరొక వ్రతం కూడా ఉంది. అది భారతీయులే చేస్తారు. ఆ వ్రతం చేస్తే స్ర్తీలు సౌభాగ్యవతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి. రాజ్య వ్రతం, త్రి విక్రమ తృతీయా వ్రతం మొదలైన ఇతర వ్రతాలు కూడా నేడు చేస్తారని ఉన్నది. 
      కాని అన్నింటిలోకి రంభావ్రతం కొంతవరకూ ఆచరణలో ఉన్నట్టు కనుపిస్తోంది. తపో నిష్టలో వున్న శివుడు వుపచారించడానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు.  

         పార్వతి యందు శివునికి ప్రేమ కలగడానికి ఆ సమయములో మన్మధుడు తన బాణాలను ప్రయోగించాడు.  శివునికి చిత్తం చెదిరింది.  అందుకు శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరచి చోదాఉ.  మన్మధుడు భస్మమయ్యాడు.  శివుడు అక్కడ నుండి వెళ్లి పోయాడు.    
         పార్వతి చిన్న బుచ్చుకుని ఇంటికి వచ్చేసింది.  తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది.  పార్వతి బావురుమంది.  తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్ళింది.  ఇంతలో అక్కడికి  సప్తమహర్షులు వచారు. వారికి హిమవంతుడు తనకూతురు సంగతి చెప్పాడు.  అప్పుడు ఆ మునులలో భ్రుగువు ఆమెను ఒక వ్రతం ఉంది నీవు ఆ వ్రతం చేస్తే శివుడు నీకు భర్త అవుతాడు.  అని పలికారు.  

            అప్పుడు పార్వతి ఆ మహర్షులను ఆ వ్రతమును ఎప్పుడు, ఎలా చేయాలి అని అడిగింది.  దానికి ఆ మునివర్యులు ఈ విధంగా చెప్పారు.  బిడ్డా!  ఈ వ్రతాన్ని పెద్దలు "రంభా వ్రతము" అంటారు.  రంభ అనగా అరటి చెట్టు.  ఆ వ్రతాన్ని జ్యేష్ట శుద్ధ తదియ నాడు చేయాలి.  ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచ వాళ్ళేనా ముగ్గులు పెట్టాలి.  రంభ కు అధిష్టాన దేవతా సావిత్రి కనుక అరటి చెట్టు క్రింద సావిత్రి దేవిని పూజించాలి.  

  అరటి చెట్టుకు సావిత్రి దేవి అధిష్టాన దేవతా ఎలా అయ్యింది. 

         ఇందుకు గాను భ్రుగువు ఇలా అన్నాడు.  బిడ్డా!  సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మ దేవుడికి ఇద్దరు భార్యలు.  సావిత్రి దేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్ళడం మానివేసింది.  గాయిత్రి ఆమెకు చాలా దూరము చెప్పి చూసింది.  సావిత్రి తన మంకు పట్టును వదలలేదు.  బ్రహ్మకు కోపం వచ్చింది.  ఈ లోకాన్ని వదిలిపో మనవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని అతడు సావిత్రిని శపించాడు.  

           అప్పుడు సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది.  బ్రహ్మ కాళ్ళ మీద పది మన్నించ మణి ప్రాధేయ పడింది.  కాని బ్రహ్మకు దయరాలేదు.  గత్యంతరము లేక సావిత్రి భూలోకానికి వచ్చి అరటి చెట్టైపుట్టింది.  అరటి చెట్టుగా ఆమె బ్రహ్మగురించి అయిదు సంవత్సరములు తపస్సు చేసింది.  అప్పటికి బ్రహ్మ కు మనస్సు కరిగింది. 

          జ్యేష్ట తదియ నాడు అతడు సావిత్రికి ప్రత్యక్షమయ్యాడు.  "నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటిచెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి.  ఇక నీవు నాతొ సత్య లోకానికి రావచ్చు" అంటూ బ్రహ్మ ఆమెను తీసుకొని పోయాడు.  సావిత్రికి శాపమోక్షమైన దినము కాబట్టి జ్యేష్ట శుద్ధ తదియ ఒక పర్వదినమైనది.  

          అప్పుడు పార్వతి "స్వామీ! అయితే ఈ వ్రతం సాంగం చేసే నియమాలు దయచేసి తెలియ జేయండి.  అని కోరింది.  అందు మీద భరు మహర్షి బిడ్డా! ముగ్గులు పెట్టి అరటిచెట్టు కింద మంటపం వేయవలెను.  దానిని సరస పదార్ధ సంపన్నం చేయాలి.  
        అరటి చెట్ల నీడను పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్త్రోత్రం చేయవలెను.  రాత్రి జాగరణము చేయాలి.  మరునాటి నుంచి పద్మాసనస్త అయి పగలు సావిత్రి స్త్రోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల క్రిందనే విశ్రమిస్తూ వుండాలి.  ఇలా నెలరోజులు చేసి ఆ మీద సరస సంపన్నమైన ఆ మంతపమును పూజ్య దంపతులకు దానం చేయాలి.  ఈ వ్రతాన్ని ఈ వరకు లోపాముద్ర చేసి భర్తను పొందింది.  అని చెప్పాడు.  

          పార్వతి ఆవిధముగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది.  ఆ దీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు.  ఇది రంభా వ్రత గాద దైవ అంశతో కూడిన అరటి చెట్టును పూజించడమే రంభా వ్రతం. మంచి భర్త కోసం, అన్యోన్యమైన దాంపత్యం కోసం మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని,తీరుపతి

శ్రాద్ధాభోక్తలు నియమాలు-

శ్రాద్ధాభోక్తలుగా పిలువదగని వారు

           మిత్రద్రోహి, పుచ్చినగోళ్లున్నవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్లవాడు, అబ్రాహ్మణుడు, కన్యలను తిట్టేవాడు, అగ్నిని - వేదాల్ని వదిలినవాడు, సుర/ సోమ విక్రయం చేసేవాడు, హీనకృత్యాలు చేసేవాడు, ఘోరపతకాలు చేసేవాడు, గ్రామం అంతటికి శూద్రాది విచక్షణ పాటించక పౌరహిత్యం , జీవన భృతికోసం వేదం చెప్పేవాడు నియంత్రించదైనవారిగా పరిగణించబడరు.
             ఇంకా - రెండోపెళ్లి చేసుకున్న దాని భర్త, తల్లిదండ్రుల పట్ల దయలేనివాడు, శూద్రస్త్రీని ఉంచుకొన్న బ్రాహ్మణుడు, దేవాలయ అర్చకుడు, భరణం ఇచ్చి వేదాధ్యయనం చేసినవాడు భోక్తగా పిలువదగడు.

         'శుద్ధశ్రోత్రియుల్ని నియంత్రించడం' అనే విధి మొదట నిర్వర్తించి, వారికీ సంగతి చెప్పాలి. అలా చెప్పడం జరిగాక స్త్రీసంగమం, అహంకారం, క్రోధం విడనాడాలి. భోక్తలుగా వచ్చేవారికీ ఇది వర్తిస్తుంది. కనుకనే శ్రేష్ఠుల్ని ఎన్నుకోవాలి. నియంత్రించకనే ఇంటికి ఆ సమయంలో వచ్చిన అతిథిని పోనీయరాదు. పాద్యాదులు ఇచ్చి గౌరవించి భోజనం చేయించాక పంపించాలి. భోక్తలుగా పిలిచిన వారిని మాత్రం పవిత్రము (దర్భముడి) ధరించి ఆచమించి ఆసనాలపై కూర్చుండజేయాలి.

            పితృదేవతలకు బేసిసంఖ్య బ్రాహ్మణులను, విశ్వేదేవతలస్థానంలో సరిసంఖ్య బ్రాహ్మణులను లేదా మొత్తం రెండుస్థానాలకు చెరొకరిని భోక్తలుగా పిలవవచ్చు! విశ్వేదేవతాస్థానంలో ఉన్నవారిని తూర్పు ముఖంగాను - పితృదేవతాస్థానంలో ఉన్నవారిని ఉత్తరముఖంగాను కూర్చోబెట్టి భుజింపజేయదగును.

            పితృ - మాతామహవర్గం వారికి వేరేగా శ్రాద్ధం చేయాలని కోందరంటారు. ఇతర మహర్షులు ఒకచోటనే - ఒకేపాకంతో చేయవచ్చునంటారు.

             మొదట యువధ్యాన్యజలంతో దేవతలకు అర్ఘ్యమిచ్చి గంధ, పుష్ప, ధూపదీపాలు సమర్పించి, పితృదేవతలకు అపసవ్యంగా ఈ పూజాదికము నెరవేర్చి అనుజ్ఞపొంది పితృదేవతాహ్వానం చేయాలి. తిలోదకాల్తో అపసవ్యంగా సమర్పించాలి.
           యతులు మొదలగువారు అప్రయత్నంగా శ్రాద్ధకాలమున విచ్చేసినపుడు విజ్ఞుడాతనిని పోనీయక భోజనం చేయించి పంపాలి. శాకములు లవణము లేని అన్నం మూడుసార్లు హోమం చేయాలి. ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన విథి -

           మొదట 'అగ్నియే కవ్యవాహనాయ స్వధానమః' అనే ఆహుతి, అటుపైన 'సోమాయ పితృమతే స్వాహా' అనే ఆహుతి, ఆ తర్వాత 'వైవస్వతాయ యమాయాంగి రస్వతే' అని అని హోమం చేయగా మిగిలిన అన్నాన్ని, అల్పమాత్రంగా బ్రాహ్మణ విస్తర్లలో ఉంచాలి. ఆ తర్వాత మృష్టాన్నభోజనాన్ని వారి విస్తర్లలో వడ్డించి 'మీ సంతృప్తి మేరకు భుజింతురు గాక' అని సౌమ్యంగా పలికి, వారికి ఆప్యాయంగా వడ్డన జరిగేలా చూడాలి.

        కోపంగాగాని - త్వరగాగాని వడ్డించరాదు. రక్షోఘ్నమంత్రపటనం జరిగించి, భూమిమీద అస్తరణం కల్పించి, ఆ బ్రాహ్మణుల్ని పితృ దేవతలుగా భావించాలి. 'ఈ శ్రాద్ధవిధి ప్రకారం పితృదేవతలు సంతృప్తి చెందెదరుగాక! భూమియందు నా చేత, పెట్టబడినట్టి పిండముతో పితృపితామహ ప్రపితామహులు తృప్తులగుదురుగాక!

          మాతామహులు, విశ్వేదేవతలు మహాసంతుష్టినందెదరుగాక! హవ్యకవ్యములు (దేవతలకు - పితరులకు ఇవ్వబడిన అన్నములు) భుజించేవాడూ యజ్ఞేశ్వరుడూ అవ్యయుడూ అయిన శ్రీహరి ఇక్కడ ఉండడం వల్ల సకల రాక్షసులూ - అసురులూ తొలగిపోదురుగాక' అని నిండుగా - మనఃస్ఫూర్తిగా శ్రాద్ధవిధి నిర్వర్తించి, బ్రాహ్మణులు సంతృప్తులైన పిదప భూతలమందు అన్నము చిమ్మవలో. అంతవరకు అది ఉంచవలె.

           బ్రాహ్మణభోజనాలు సంప్రీతికరంగా ముగిసిన పిమ్మట, వారికి ఉత్తరాపోశన మీయవలె.తృప్తులైన బ్రాహ్మణుల అనుజ్ఞపొంది, సావధాన చిత్తుడై గృహస్థు అన్నంతోను నీటితోను భూతలం (ముందేర్పరచుకున్న ప్రదేశం) పైన పిండప్రదానం చేయాలి. పితృతార్థం (తర్జనిమూలం)తో జలాన్ని పిండాలను, తిలలను, ఇవ్వాలి. మాతామహులకు కూడాఇదే రీతి.

         దక్షిణాగ్రదర్భల మీద పుష్పాలతో పూజించిన పిండాల్ని, ఉచ్ఛిష్ట సన్నిధానాన పితృపితామహాదులకు ఇచ్చి, ఆదర్భలమూలమున చతుర్థాది పితరులను లేప ఘర్షణంతో సంతోషింప చేయాలి. (ఇదంతా అపరకర్మలు చేయించే పురోహిత పరిభాష. విస్తరించి రాయదగదు.)

          మాతామహాదులను కూడ ఇదేరీతిన పూజించి, బ్రహ్మణులకు యథాశక్తి దక్షిణలివ్వాలి. వారి ఆశీస్సులు అందుకోవాలి.

              వారిని పంపివేశాక - మొదట పితృదేవతలను, ఆ తర్వాత విశ్వేదేవతలను విసర్జన చేయాలి. (విశ్వేదేవతంత్ర పక్షం ప్రకారం - విశ్వేదేవతలకు ముందు, పితరులకు తర్వాత విసర్జన చెప్పే పద్ధతి కూడ ఉన్నది).

               మాతామహాదులకు కూడ ఇదేరీతి విసర్జన. ప్రీతివాక్కుల నడిగి, ద్వారపర్యంతం అనుగమించి మరలాలి. ఆ తర్వాత వైశ్వదేవం - నిత్యకృత్యాది ఆరాధన, ఆపైన శిష్టులతో - ఇష్టులతో కలిసి భోజనం చేయవలె.

            పండితుడైనవాడు ఈ రీతిగా పితృ, మాతామహాదిశ్రాద్ధాలు నిర్వర్తించాలి. దీనివల్ల పితృదేవతలకు తృప్తి కలిగి సకలవాంఛలు నెరవేరుస్తారు. మనుమడు 8/15 వంతు దినభాగం, తిలలు (వీరు/ఇవి) శ్రాద్ధంలో పవిత్రమైనవి. వెండి, సోమునికి ప్రీతికరం. పితృదేవతలు సోముని (చంద్రుని)పై ఆధారపడినవారు. అతడు యోగిపై ఆఅధారపడినవాడు. కనుక శ్రాద్ధంలో యోగిని నియంత్రించడం - వెండిదానం ఇవ్వడం పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది.

శ్రాద్ధంలో ఉపయోగించదగినవి :

             పితృదేవతలకు తృప్తిని కలిగించేవి శ్రాద్ధంలో ఉపయోగించాలి. మాంసాన్ని సైతం శ్రాద్ధకర్మంలో పెట్టే ఆచారం (ఒకప్పుడు) ఉండేది. కలిలోదీనికి ప్రత్యామ్నాయంగా మినుము ఉపయోగిస్తున్నారు. ఇందువల్ల పితరులకు మాంససంబంధ తృప్తి కలుగుతుంది. దీన్ని పలపైతృకం అంటారు.

           మినుములతో బాటు మాంస సమానద్రవ్యాలుగా కలియుగంలో దధి, ఘృత, గోక్షీర, పాయసాదులు చెప్పబడ్డాయి. పితృకర్మాచరణానికి గయాక్షేత్రం ప్రసిద్ధి, ఇక్కడ జన్మలో ఒక్కసారైనా పిండప్రదానం చేసినవారి పితరులు తరిస్తారు.

          శ్రాద్ధయోగ్యవస్తువులలో అనుములు, గోధుములు, నల్లావాలు, నీవారధానాలు, పెసలు, నువ్వులు, వడ్లు, యువధాన్యాలు, వనౌషదులు చేరతాయి.

కందులు, నీరుల్లి, గోంగూర, పుల్లబచ్చలి, మునగ, ముల్లంగి, వెల్లుల్లి, సొరకాయ తగవు.

     bబ్గి బ్బయ్6, నగ్నుడు, ఛండాలుడు, జూదరి, మద్యపానమత్తుడు, నపుంసకుడు, శవవాహకులు, కోతి, పంది, కోడి....వీరిచే శ్రాద్ధకర్మ చూడబడకూడదు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 25 May 2017

రేపటి నుండి అనగా 26.05.2017 శుక్రవారము జ్యేష్ట మాసం ప్రారంభం

జ్యేష్ట మాసం
              చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది.

             మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

       శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు.

       వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి.

         బ్రాహ్మణులకు నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

        జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.
      ఈ మాసంలో కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలి.

మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.

రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.

వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.

జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday 9 May 2017

శ్రీ మహాలక్ష్మి సాధన

శ్రీసూక్త రహస్యార్ధము

            వేదముల యందు మహా శక్తి వంతమయిన మంత్రములలో పురుష సూక్తము,శ్రీ సూక్తము, నారాయణ సూక్తము, దుర్గా సూక్తము మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి.  వేదము అంటే జ్ఞానము, జ్ఞానమంటే వెలుగు, వెలుగు అంటే ఆనందము,   ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్ర౦, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము.

శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము

            జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో ప్రకృతి స్వరూపిణి యైన జగన్మాతయగు శ్రీ మహాలక్ష్మిని ఉపాసించు మంత్రమే శ్రీ సూక్తము. ముగ్గురమ్మలలో ఒకరైన శ్రీదేవి  ఈ సూక్తమునకు అధిష్టాన దేవత. పదిహేను ఋక్కులతో, పదిహేను వేదమంత్రములతో శ్రీ మహాలక్ష్మిని కీర్తింప బడినది.
            పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు గల 15 రోజులలో, 15 కళలతో, రోజుకు ఒక్కో కళ చొప్పున వృద్ది చెందుతూ పౌర్ణమి నాటి చంద్ర బింబములో షోడశిగా వెలుగొందే జగన్మాత యొక్క చంద్ర కళకు రహస్య సంకేతమిది.  గురుముఖత నేర్చుకొని, స్వరయుక్తముగా సామాన్యుడు సహితము ఈ సూక్తమును ఉపాసించ వచ్చును.

           దారిద్ర్య నాశనము కొరకు, దుఖ నాశనము కొరకు, కష్టములు తొలుగుట కొరకు, అన్న వస్త్రములు సమృద్ధిగా ఉండుట కొరకు, సౌఖ్యము, సౌభాగ్యము, సౌందర్యము కొరకు ఈ ఉపాసన చేయవచ్చును. అష్ట్యైశ్వర్య సిద్ధి, అధికార ప్రాప్తి, మహా భాగ్యము, భోగము, ఆనందము, సుఖ సంతోషముల కొరకు, శాంతి కొరకు, సత్సంతానము, వంశాభి వృద్ధి,మోక్ష ప్రాప్తి కొరకు ఈ శ్రీ సూక్త పఠనము చేయుట చాలా చాలా ఉత్తమము.

           వేదములను, మంత్ర శాస్త్రమును ఔపోసన పట్టిన వారికి మాత్రమే, నిగూడార్ధముతో ఉన్న ఈ మంత్ర సూక్తము యొక్క రహస్యములు తెలియును.  ఐదు వందల సంవత్సరములకు పూర్వము శ్రీ విద్యారణ్య మహా స్వామి శ్రీసూక్త రహస్యార్ధములను తమ భాష్యములో చాలా వివరముగా తెలిపి వున్నారు.

           భక్తీ, గౌరవములతో శ్రీసూక్త ఉపాసనా మంత్ర రహస్యములను తెలుసుకొనవలెనని ఆసక్తి కలిగిన వారు ఇది పఠి౦చి సకల భోగ భాగ్యములను, ఆనందములను  పొందగలరని ఆశిస్తూ. సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము ఈ శ్రీసూక్తం. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. శ్రీసూక్తంతో అమ్మ వారికి  అభిషేకము చేయడం లోకోచారము.

1.        హిరణ్య వర్ణాం హరిణీ౦ సువర్ణ రజతస్రజాం
              చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా

బంగారు వర్ణముతో మెరయుచు అష్ట్యైశ్వర్యము లను ప్రసాదించునది, హ్రీంకారము కలిగినది, విష్ణువును కలిగినది, సూర్య మరియు చంద్ర నాడులను మెడయందు హారములుగా కలిగినది, చంద్ర సహోదరి, నారాయణ శక్తి అయిన శ్రీ దేవి నన్ను ఆవహించు గాక.


2.  తాం మ ఆవాహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం |
     యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషా నాహమ్ ||

యజ్ఞ సంపదల నిచ్చు ఓ అగ్ని హోత్రుడా, అష్ట్యైశ్వర్యములను, సిరి సంపదలను, కామధేనువును, మంది మార్బలము, బంధు మిత్ర పరివారమును ప్రసాదించు,                ఏ సమయములయందును మమ్ములను విడువకుండా ఉండునట్లుగా ఆ శ్రీ దేవిని             మా యందు ఆవాహన చేయుము.

3.    అశ్వపూర్వా౦ రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ |
       శ్రియం దేవీ ముపహ్వాయే శ్రీర్మాదేవీ జుషతామ్ |

ఇచ్చట అశ్వములనగా ఇంద్రియములు, రథమధ్యాం అనగా రథమనేడి శరీర మధ్యమున అనగా మనస్సునందు ఆసీనురాలైన సామ్రాజ్యలక్ష్మీ, గజముల ఘీంకారముతో మేలుకోనేడి ఆ శ్రీ దేవిని శ్రద్ధాభక్తులతో పూజించు చున్నాను. మాతృమూర్తి అయిన ఆ దేవి నన్ను ప్రేమతో  అనుగ్రహించు గాక.  ఈ శ్లోకము ప్రతి దినము సహస్రం చేసిన అధికారం దక్కుటయే గాక, ఎల్లకాలం నిలబడుతుందని దుర్గా కల్పము నందు తెలుపబడినది.

4.  కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం,          
         పద్మేస్థితాం పద్మ వర్ణాం తామిహోపహ్వాయే శ్రియం ||

బంగారు వర్ణముతో తయారయిన ప్రాకారమునందు నివచించేడిది, జీవుల మనస్సులయందు ఆర్ధతను కలిగించునది, అన్ని కోర్కెలను తీర్చి, జీవులకు తృప్తిని కలిగించునది, పద్మము నందు ఆసీనురాలై యుండెడిది, పద్మము వంటి వర్ణముతో ప్రకాశించునది అయిన శ్రీ మహాలక్ష్మి దేవిని   శ్రద్ధా భక్తులతో ఆశ్రయించు చున్నాను.

ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ పఠి౦చుచున్న శ్రీ దేవి యొక్క కృపగలిగి, సమస్త కోరికలు తీరి, జీవితమును సంపూర్ణ ఆనందముతో అనుభవించ గలరు.

5.    చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం,  శ్రియం లోకే దేవ జుష్టాము దారాం
          తాం పద్మినిమీం శరణ మహం ప్రపద్యే అలక్ష్మీర్యే నశ్యతాం త్వాం వృణే ||

చంద్రుని వోలె ప్రకాశించునది, ప్రకృతి యందు విలీనమైనది, తెల్లటి యశస్సు చేత నలుదిక్కులు ప్రకాశించునది, కుండలినీ శక్తిని హృదయ పద్మము నందు వికసింప చేయునది, “ఈ౦” అను బీజాక్షరము చేత ద్యానింప బడునది, దారిద్ర్య దేవతను తరిమివేసి, అష్ట్యైశ్వర్యము లను సిద్ధింప జేయునది అయిన ఆ శ్రీ దేవిని అహం విడిచి శరణు జొచ్చుచున్నాను.

ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న అమ్మ అనుగ్రహముతో అఖండ సంపదలు ప్రాప్తించును.


6.   ఆదిత్య వర్ణే తపసోzధిజాతో వనస్పతిస్తవ వృక్షోzధ బిల్వః
       తస్య ఫలాని తపసానుదంతు బాహ్యాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ: ||

సూర్య భగవానునితో సమానమైన తేజస్సుతో ప్రకాశించు శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మి అధిష్టాన దేవతగా ఉండేడి బిల్వ వృక్షము క్రింద తపమాచరించు మహాలక్ష్మి యంత్రమునకు పూజలు చేసి మారేడు ఫల సమిధులతో పూర్ణాహుతి చేసిన,  ఆ శ్రీదేవి లోపల, బయట వుండే మాయను పూర్తిగా తోలగించి, జీవుని ఆవహించిన దారిద్ర్యమును నశింప చేయును.
ఈ శ్లోకమును ప్రతి నిత్యమూ వెయ్యి సార్లు పఠి౦చుచున్న, జన్మ జన్మల దారిద్ర్యము కూడా నశించును.

7.    ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
       ప్రాదూర్భూతోzస్మి రాష్ట్రే zస్మిన్ కీర్తి మృద్ధి౦ దధాతు మే ||

యక్షులకు అధిపతి, అనంతమైన సంపదలు నిచ్చునది కుబేర మంత్రము, అఖండమైన యశస్సును ఇచ్చేడి చింతామణి మంత్రమును రెండింటితో పాటు ఈ ఏడవ శ్లోకమును జపించిన శ్రీ దేవి మర్త్య లోకమున లేదా జీవుని శరీరము నందు సంపూర్ణారోగ్యము కలిగింప చేసి, అష్ట్యైశ్వర్యములను, కీర్తిని పెంపొందించును గాక.

ఈ శ్లోకమును భక్తితో 44 లక్షల జపము చేసి పూర్ణాహుతి చేసిన వారికీ దారిద్ర్యము నశించి, సంపూర్ణారోగ్యము,   అష్ట్యైశ్వర్యములు కలుగును.

8.   క్షుత్పిపాసా మలాం జ్యేష్టా౦ అలక్ష్మీర్ నాశయామ్యహం
       అభూతి మ సమృద్ధి౦చ సర్వాన్ నిర్ణుద, మే గృహాత్ ||

  అలక్ష్మి దేవి, గృహమనేడి శరీరమును ఆవహించిన దారిద్ర్యమును కలుగ చేయును. జ్యేష్టా దేవి ఆవహించిన ఆకలి, అతినిద్ర, దప్పిక, ఆశుభ్రతను కలిగించు బద్ధకము వంటివన్నీ శరీరము యందు కలుగ చేయును, వీటి ఫలితముగా దారిద్ర్యమును అరిష్టములు సంభ విన్చును. కావున ఈ శ్లోకమును పఠి౦చిన ఇటువంటి దారిద్ర్యము అరిష్టము లన్నింటిని శ్రీదేవి నశింపచేసి సౌభాగ్య లక్ష్మిని వాని యందు ఆవహింపజేయును.

పై శ్లోకమును ప్రతి నిత్యమూ 108 పర్యాయములు జపించు చున్న ఆ దేవి కృపచే అలక్ష్మి, జ్యేష్టా దేవి ఇరువురు ఆ సాధకుని నుంచి అతి దూరముగా తొలగి పోవును.

 9.     గంధద్వారా౦ దురాధర్షా౦ నిత్యపుష్టాం కరీషిణీ౦
       ఈశ్వరీం సర్వ భూతానాం తామిహోపహ్వాయే శ్రియం ||

పంచ ప్రాణముల యందు ముఖ్యమైన ప్రాణము శ్వాస యందుండును. అటువంటి ప్రాణము, ప్రాణాయామము చేయుటకు, ఉపాసించుటకు, వీలును కల్పించుతున్న ఆత్మ స్వరూపిణి, అనురాగవర్షిణీ, మాతృ స్వరూపిణి, ఈశ్వర శక్తి అయిన శ్రీదేవిని గోమయం తో అలికిన ప్రాంతము నందు ఆసీనులై ఆరాధించిన వారి యందు ధాన్య లక్ష్మిని ఆవహింప జేసి ధన, ధన్య, పశు సమృద్ధిని ప్రాప్తింప జేయును.

ఈ శ్లోకము 5000 పర్యాయములు జపము చేసి దశాంశము హోమ తర్పణము గావించి అన్న దానము శక్తి కొలది గావించిన మంత్రం సిద్దియగును. శ్వాశ మీద జయము కలిగి లక్ష్మీ కటాక్షము కలుగును.

10    మనసః కామమా కూతిం వాచః సత్యమశీమహి
        పశూనాం రూపమన్నస్యమయి శ్రీ: శ్రయతాం యశః ||

మనస్సునందుండు కోరికలు, యిష్టములు సిద్దించుట, వాక్సిద్ధి మరియు అన్న వస్త్ర గో సంపద, రూప సంపద, లక్ష్మీ సంపదలను ఎల్లప్పుడూ నా యందు స్థిరముగా ఉంచమని శ్రీలక్ష్మీ దేవిని భక్తీ తో ఆశ్రయించు చున్నాను.

ఈ శ్లోకమును దీక్షతో మనస్సును, వాక్కును పవిత్రముగా నుంచి 8 లక్షల సార్లు జపించిన అనంతరం ప్రతినిత్యం 108 సార్లు జపించు చున్న భోగ భాగ్యములు, అన్న వస్త్రములు, గో సంపద, పాడి పంటలు అభివృద్ధి చెంది వాక్ సిద్ధి  కలుగును.

11.     కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
           శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ||

కర్దమ మహర్షి కోరికపై స్వయముగా లక్ష్మీ దేవి ఆయన కూమార్తేయై జన్మించినది. సర్వ జగత్తుకు మాతృమూర్తి అయినది, శరీరము నందలి మూలాధార పద్మము మొదలుకొని సహస్రార దళ కమలముల వరకు వెన్నును దండము వలే ధరించునట్టి, శ్రీ మహాలక్ష్మి నా వంశమునందు స్థిరముగా నివాసమును ఏర్పరచు కొనవలెను.

ఈ శ్లోకమును దీక్షతో లక్ష సార్లు జపించిన వారికి, సంతానముతో బాటు అష్ట్యైశ్వర్యములు కలుగును.


12.     ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే
          నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ||

సృష్టికి కారణమైన మన్మధుడు లక్ష్మీ దేవి పుత్రుడు. మాయ అయిన ఈ సంసార బంధములను, ఆ కామ దేవునిని జయంచ వలెనన్న నారాయణ శక్తి యగు నారాయణిని ప్రార్ధించి, ఆమె అనుగ్రహము పొంది మోక్షము పొంద వచ్చును. ఇంకను జగన్మాత స్వరూపిణి అయిన ఆ మహాలక్ష్మిని మా వంశాభి వృద్ధిని చేయమని సదా ప్రార్ధన చేయు చున్నాను.

మారేడు చెట్టు క్రింద 64,000 జపము చేసి, అన్నదానము చేసిన ఈ మంత్ర సిద్ధి కలిగి వంశాభి వృద్ధి కలిగి అమ్మ స్థిర నివాసము ఏర్పరుచు కొనును.

13.    ఆర్ద్రాం పుష్కరిణీ౦ పుష్టిం పింగళా౦ పద్మ మాలినీం
         చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||

బంగారు వర్ణముతో మెరయుచున్న ఇడ పింగల నాడులు అనగా సూర్య చంద్ర నాడులను ధరించి కుండలినీ  శక్తిని మేల్కొలిపినందు వలన కలిగిన అపరితమైన ఆనందముచే కలిగిన ఆర్ధ్రతచే వచ్చిన కన్నుల యందు నీటితో తడిసినది, అన్న వస్త్రములను భక్తులకు ఇచ్చునటువంటి ఆ మహా తల్లి నన్ను ఆవహించుగాక.


14      ఆర్ద్రాం యః కారిణీ౦ యష్టీం సువర్ణాం హేమమాలినీం
           సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ  ||

ఆర్ద్రత చే కన్నుల యందు నీటితో తడిచినది, బ్రహ్మ దండము అనే మేరు దండమును కలిగి వుండి, అధర్మము వైపు వేడలుచున్న వారిని దండిన్చునది, బంగారు రంగు చ్చాయతో బంగారు వర్ణము కలిగిన పాదములతో సూర్యనాడి కలిగినది అగు ఆ శ్రీ మహాలక్ష్మి నన్ను ఆవహించుగాక.


15.    తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
          యాస్యాం హిరణ్యం ప్రభూతం గావో, దాస్యో అశ్వాన్ విన్దేయం పురుషానహం ||

యజ్ఞముచే సంపదలు నిచ్చు ఓ అగ్నిహోత్రుడా ఎవరిచే బంగారము విశేషముగా ఉద్భవించినదో, గోవులు, అశ్వములు వంటి సంపదలు, దాసీ జనములు, పుత్ర, పౌత్ర బంధు మిత్ర, పరివారములను ఇచ్చును. అట్టి శ్రీ మహాలక్ష్మీ దేవి మా యందు ఎల్లప్పుడూ ఆవహించి మోక్షమును ప్రాసాదించుగాక.
ఈ మంత్రమును ప్రతి దినము జపించిన ఆరోగ్య, ప్రతిష్ట, కీర్తి, ఐశ్వర్యములు ప్రాప్తించును.


16.     యః శుచి: ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం
          శ్రియః పంచ దశర్చ౦చ శ్రీ కామః సతతం జపేత్  ||

సాధకుడు ఏకాగ్రతతో ఇంద్రియములను జయించి బాహ్య అన్త్ర్యములను శుచితో నుంచుకొని ప్రతి నిత్యమూ ఆవు నేతితో అగ్ని హోత్రములో పై 15 ఋక్కులతో  ఆహుతులను వేసి యజ్ఞమును నిర్వహించ వలెను.

లేదా 15 ఋక్కులతో  15 రోజులు అఖండ పారాయణ చేసిన వారికి సర్వ కార్య సిద్ది కలుగును.

              శ్రీ మహాలక్ష్మి సాధనకు అత్యంత విశిష్టమైన మంత్రములు 1. కనకధారాస్తవము, 2. శ్రీసూక్తము. ప్రతి నిత్యం నారాయణ సహిత శ్రీమహాలక్ష్మి దేవి యొక్క ఈ మంత్రములను పారాయణ గావించిన వారికి భగవదానుగ్రహము కలిగి మోక్ష ప్రాప్తి లభించును.

            విద్య అంటే జ్ఞానము. జ్ఞానము అంటే గంగ లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే వుండాలి గాని, అది నిలిచి పోకూడదు. నిలిస్తే నీరు పాడౌవుతుంది. ఈ జ్ఞాన గంగ ఏ ఒక్కరి సోత్తో కాదు, ఇది అందరిది మన అందరిది. దీనిని గోప్యముగా ఉంచ కుండా అందరికీ అందు బాటలోకి తీసుకొని రావాలనే మన మహర్షులు ఎంతో తాపత్రయ పడినారు.

                 అర్హత కలిగిన వారు అందరూ ఈ విద్యను అభ్యసిస్తూ ముందుకు కదిలి ఆ జగన్మాత పాదములు పట్టుకో గలరని రాబోయే శ్రావణ మాసపు పర్వ దినములలో అందరూ శ్రీహరితో గూడిన శ్రీమహాలక్ష్మీని  సాధన చేసి అమ్మ అనుగ్రహమును పొంది, అష్ట్యైశ్వర్యములు బడసి, ఆనందముతో, సుఖ సంతోషములతో పిల్లా పాలలతో తరించేదరని ఆశిస్తూ, అందరూ సుఖముగా వుండాలని కోరుకొంటూ,   అతి సులభుడు శ్రీ వరదుడు. కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుంది అమ్మ శ్రీమహాలక్ష్మి.

లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీ రంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియాం ||
మీ
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Monday 8 May 2017

ఈ రోజు అనగా 09.05.2017 మంగళవారం నృసింహ జయంతి


ఈ రోజు అనగా 09.05.2017 మంగళవారం నృసింహ జయంతి.

            శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్థమెత్తిన అవతారాలలో శ్రీ నృసింహ అవతారం ఒకటి. తన భక్తులను కాపాడుతూ వుంటాననే విషయాన్ని లోకానికి చాటి చెప్పడానికి శ్రీ మహావిష్ణువెత్తిన అత్యంత శక్తివంతమైన అవతారమిది. శ్రీ రాముడు. శ్రీ కృష్ణుడు అవతారాలవలె కుటుంబ నేపథ్యంలో కాకుండా, అప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువెత్తిన మహోన్నతమైన అవతారంగా శ్రీ నృసింహ అవతారం చెప్పబడుతోంది.

           నృసింహ స్వామి కృతయుగంలో వైశాఖ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజున అవతరించాడు. ఇక ఆయన ఆవిర్భావం వెనుక ఎప్పటిలానే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దాగుంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు, ఒకసారి స్వామివారి దర్శనానికి వచ్చిన బ్రహ్మ మానసపుత్రులను అడ్డుకున్నారు. దాంతో వారు కోపించి మూడు జన్మలపాటు విష్ణుమూర్తికి విరోధులైన రాక్షసులుగా జన్మించి ఆయన చేతిలో సంహరించబడమని శపించారు.

        ఫలితంగా జయవిజయులు 'హిరణ్యాక్ష - హిరణ్య కశిపులు'గా, 'రావణ - కుంభ కర్ణులు'గా, 'శిశుపాల - దంతవక్త్రలు'గా జన్మించారు. ఇక దితి - కశ్యపుడికి జన్మించిన హిరణ్యాక్ష - హిరణ్య కశిపుల్లో, హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు సంహరించాడు. దాంతో శ్రీ మహావిష్ణువుపై హిరణ్య కశిపుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మ దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేసి తనకి మనుషులవల్ల గానీ, జంతువుల వల్లగానీ, పగలుగానీ, రాత్రిగాని,భూమిపై గానీ, నేలపై గాని ఎలాంటి ఆయుధాల వలన గాని మరణం లేకుండా వరాన్ని పొందాడు.

           ఇక హిరణ్య కశిపుడు తన నలుగురి కుమారులలో ఒకరైన ప్రహ్లాదుడు విష్ణు నామాన్ని జపించడాన్ని సహించలేక ఎన్నో రకాలుగా శిక్షించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. శ్రీహరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పడంతో, అయితే చూపించమంటూ ఆ పక్కనే వున్న స్తంభాన్ని తన గదతో పగులగొట్టాడు.

            నరుడు - సింహం కలిసిన శరీరంతో నృసింహ అవతారంలో ఆ స్తంభంలోనుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువు, పగలు - రాత్రి కాని సంధ్యా సమయంలో, భూమిపై - ఆకాశంలోనూ కాకుండా తన తొడపై పడేసి,ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా తన చేతి గోళ్లతో హిరణ్య కశిపుడిని వధించాడు. అలా లోకకల్యాణం కోసం ఆయన ఆవిర్భవించిన ఈ రోజునే 'నృసింహ జయంతి'గా జరుపుకుంటారు

           నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.

"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"

అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.

           శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగ అ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.

శ్రీ నృసింహ జయంతి

సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్| 

ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్|| 

సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య| 

దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్||

అవి తొలుత అలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి తెలుసుకుందాం! 

            ఈ భూమిపై 'మానవుడు ' అవతరించిన నాటినుండి తనమనుగడకు ఆనందం కలిగించేవాటిని, తనలు అమ్మి వ్ధాలమేలును చేకూర్చే ప్రకృతి సంపదకు "దేవతా స్వరూపాలు కల్పించి" వాటిని పూజిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అలా మానవుడు ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్య భావముతో చూడటం ఒక విశేషం! అంతేకాదు మన భారతీయ సంస్కృతిలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన, నది, పర్వతాలు ఇలా ప్రకృతిలోని సంపదన0న్నిటిని పదిలపరుచుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం. 

         అందువల్లనే మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ నృసింహస్వామి ఆవిర్భావచరిత్ర..
 నృసింహ అవతారం ఆవిర్భావం ఎలా?

           పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులూ సంరక్షించుచూ ఉండు సమయాన, ఒక్కసారి సనక, సనందన, సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు. వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల, శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు.

         దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు. అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ, కుంభకర్ణుణులుగా మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మిస్తారు. 

         అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, ఆ వరగర్వంతో లోకకంటకులైనారు. దానితో దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహావార రూపంలో హిరణ్యక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు. 

             తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన 'హిరణ్యకశిపుడు ' బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ వరాలుపొంది. తనకు ఒక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు. అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు" విష్ణుభక్తుడై తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. 

          అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు "హరినామ మాధుర్యాన్ని" పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు. చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద, దండోపాయాలతో ప్రయత్నిస్తారు. అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు. చివరకు పుత్రవాత్సల్యమనేది లేకుండ "ప్రహ్లాదుని" సంహరించుటకు వివిధ మార్గాలు అవలంబిస్తాడు. ప్రహ్లాదుని ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఏక్కడరా? ఈ స్తంభమునందు చూపగలవా? అని ప్రశ్నిస్తాడు. 

           అందుకు ప్రహ్లదుదు తండ్రీ! సర్వాంతర్యామి అయినా శ్రీహరి "ఇందుగలడందులేడను సందేహములేదు" ఎందెందు వెదకిన అందందే కలడు అని జవాబు ఇస్తాడు. అయితే ఈ స్తంభమునందు చూపగలవా? అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు.

            అంత శ్రీహరి 'హిరణ్యకసిపుడు ' తన దానవ పరిజ్ఞానుతో 'బ్రహ్మా వలన పొందిన వరాలు ఎమిటో? వాటిలోని లోపాలు క్షణకాలం అలోచించి, అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా పొందిన వరాలకు అనుగుణమైన రూపుదాల్చి హరిణ్యకశివుడు మోదిన స్తంభమునందు అవతారాలలో 'నాలుగవ అవతారం' "శాశ్వత అవతారం" అంటే! నిర్యాణము పొందిన రాముడు. 

           కృష్ణుడువంటి అవతారముల వలెకాకుండా! సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము" శాశ్వతమైనదిగా చెప్పబడినది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే 'చతుర్దశి ' నాడు ఆవిర్భవించారు. ఆపుణ్యదినమునే మనం "శ్రీనృసింహ జయంతి" గా జరుపుకుంటూ ఉంటాము. ఇది క్తయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం.

"వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ , 
మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"

             అని సాక్షాత్తు శ్రీహరి స్వ్యంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి) అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశివుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు. అట్టి స్వామి ఆకారంచూస్తే సింహంతల, మానవశరీరం. సగం మృగత్వం, సగం నరత్వం. 

        ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం, కరుణ, ఉగ్రత్వం, ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి "హిరణ్యకశివుదు" పొందిన వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన" మృగ నరలక్షణాలతో గూడి, ఒక్క ఉదుటన హిరణ్యజశిపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు. 

           అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక, దేవతలందరు ప్రహ్లాదుని ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు. అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా, పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ పూజించబడుచున్నారు.


నృసింహ పురాణ కథ

ఇది ప్రహ్లాదుని పూర్వ జన్మపు వాసుదేవుని వృత్తాంతమునకు సంబంధించిన కథ.


అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధి కాలని,తిరుపతి

Friday 5 May 2017

ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు


ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు

ఏకాదశి అనగా ఏమి, వాటి ఫలితము ఏమిటి?.

        ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.

                మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి ఫలములు:
           ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం నుండి జేష్ఠ మాసం వరకు  వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరంలో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;

1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.
2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.
3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.
4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి
5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.
6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును
7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;
8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;
9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.
10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .
11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.
12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.
13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.
14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.
15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.
17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం
18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.
19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:
20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం
21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి
22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం
23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }
24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..

ఇవి సంవత్సరలో వచ్చే ఏకాదశులు
మోహిని ఏకాదశి
           వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. ఒకసారి పాండవాగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. “ఓ జనార్ధనా! వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పధ్ధతి ఏమిటి? దానిని ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి?'' 

                దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజుతో ఇలా అన్నాడు "ఓ ధర్మనందనా ! వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. సావధానంగా విను'' అని చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమత పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు "రామచంద్రా! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై, పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు.
              అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఏంటో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెపుతాను విను'' అని అననదు.
              పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్ర వంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణుభక్తుడు కూడా ఉండేవాడు. వైశ్యవర్నానికియా చెందినా ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణుమందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింప చేశాడు. 

            మంచినీటి బావులను త్రవ్వించాడు, ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తనకు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగ పరచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, ధృష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో ధృష్టబుద్ధి పరమపాపి, కుమతి, చెడుప్రవర్తన కలిగినవాడు ఆయిన ధృష్టబుద్ధి వేశ్యాసాంగత్యం కలిగినవాడై, మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు. 

           ఇతా ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ముడైన ధృష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినిఒగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వేశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటినుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీథిలో పడిన ధృష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు. 

            ఆ ధనం కూడా ఖర్చు అవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన ధృష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షకభటులకు చిక్కినా అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు. కాని ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణకు గురి అయిన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. 

          ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రానహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా ఆదవిఒ సంచరిస్తూ ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం, ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషివస్త్రం నుండి ఒక నీటిచుక్క ధృష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపలు నశించాయి.

           వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి ముకుళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. “నీ పాపాలు అన్నీ కూడా శ్రీఘ్రంగా నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరుపర్వతం అంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది.
          కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు'' అని తెలిపాడు. కౌండిన్యఋషి చెప్పిన మాటలను విన్న ధృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు అని తెలిపాడు.  

           మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖసంతోషాలు కలుగుతాయి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Monday 1 May 2017

గంగావతరణ, గంగా సప్తమి


గంగావతరణం

       గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే. ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి - గంగా సప్తమి. అనగా ఈ రోజు 02.05.2017 మంగళ వారము
గంగావతరణ ఎలా ఏర్పడింది.

          ఇక్ష్వాకు వంశపు రాజైన సగరమహారాజుకు ఇద్దరు భార్యలు.పెద్ద భార్య కేశిని. రెండవ భార్య  సుమతి. వీరికి సంతానం కలుగక పోవడంతో సగరుడు నూరు సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు  భృగు మహర్షి వచ్చి వారి పూజలను మెచ్చి వారు అడుగ కుండానే వరమిస్తాడు. ఒక భార్యకు అరువది వేల మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు.
       ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెబుతాడు. కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక 60 వేల చిన్న చిన్న మాంస ఖండములు  పుట్టగా, ఆకాశ వాణి భృగు మహర్షి వాక్కు ఫలిస్తుందనీ ఆ మాంస ఖండములను నేతికుండలలో దాచమనీ చెబుతుంది. రాజు అలాగే చేయగా వాటినుండి అరవై వేలమంది పుత్రులు కలుగుతారు.

           అసమంజసుడు పూర్వ జన్మలో ఒక మహాయోగి. చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్లీ జన్మ పొందాడు. ఆ అసమంజునుడికి పూర్వజన్మ వాసన ఉండి, విపరీతం తెచ్చింది. కిందటి జన్మలా ఈ జన్మలో కూడా చెడ్డసహవాసం ఉండకూడదని తనకు దగ్గర వారిని, స్నేహం చేయ వచ్చిన వారినీ సరయూ నదిలో ముంచేసేవాడు. అది తెలుసుకుని రాజు అతనిని తన రాజ్యం నుంచి వెడలగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగబలంతో తను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించగలిగాడు.
             వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కాని అతడు యెవరికీ తెలియకుండా యెక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యమవలేదు. ఆ అసమంజునుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు.

          సగరుడు తన గురువైన ఔర్యుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని వంద ఆశ్వమేధయాగాలు తలపెట్టాడు. తొంబైతొమ్మిది చేసి నూరవయాగం ఆరంభించగా, దేవేంద్రుడికి ఓర్వలేనితనమయింది. యాగాశ్వాన్ని అపహరించి దానిని యెక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదలి వెళ్లిపోయాడు. యజ్ఞాశ్వమును వెతికి తీసుకు రమ్మని సగరుడు తన అరవై వేల మంది కొడుకులనూ పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపిస్తాడు.

           వారు యజ్ఞాశ్వాన్ని వెతుకుకుంటూ  దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరనూ హింసిస్తూ భూమి నాలుగు చెరగులా త్రవ్వి పోస్తూ పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్నిదొంగిలించి తెచ్చాడని తిట్టి పోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరచిన కపిల ముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీ పటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు అసమంజసుని కొడుకూ తన మనుమడూ అయిన అంశుమంతుని వారిని వెదికి రమ్మని పంపిస్తాడు.

        అంశుమంతుడు తన పిన తండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిల బిలం చేరి అక్కడ తన పిన తండ్రుల భస్మ రాశులనూ ఆ ప్రక్కనే కపిలమునినీ ఆయన ప్రక్కనే కట్టబడి ఉన్న యాగాశ్వాన్నీ కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకు పోవచ్చని అనుమతిస్తూ ఆతని పిన తండ్రుల బూడిద ప్రోవుల మీద సురగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్లాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు.

        సగరుడూ ఆయన తరువాత అంశుమంతుడూ చాలా కాలం రాజ్యం చేస్తారు.అంశుమంతుడు తన పిన తండ్రులకు సద్గతులను కలిగించడానికి అడవికి పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్తుడౌతాడు. అతడి వలెనే అతని కుమారుడు దిలీపుడు కూడాప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు.

          దిలీపుని కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకప్పగించి  గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు.

          అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగ వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

            నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

          మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి  తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అని అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

                శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్ళారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది.

           హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని (జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో సహా దూకింది. పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేసాడు.  శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది.


జడయను అడవిని వడివడి అడుగిడి 
జాడ ఎరుంగనిదై
తడబడి నడచుచు
గడగడ వడకుచు
సుడివడి పోయినదై
ఒక పరి అటు చని
ఒక పరి ఇటు చని 
మొగమే చెల్లనిదై

             భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుని మీది దయతో తన జటలను విదలించాడు కారుణ్య మూర్తి. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి.

        ఆ రంధ్రాలలోనుండి బయటపడింది పావన గంగ. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగ పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

        ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు. మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపోయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.
           ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు అంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది.


         నన్ల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశింఛాడు.  బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథము వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.

            ఇలా సాగిపొతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.

ఉరికింది ఉరికింది గంగ
ఉన్ముక్త మానస  విహంగ
జలజలా పారుతూ
గలగలా సాగుతూ
చెంగుమని దూకుతూ
చెలరేగి ఆడుతూ
తుళ్ళుతూ తూలుతూ
నిక్కుతూ నీల్గుతూ
ముంచివేసెను
జహ్నుముని ఆశ్రమమును

           గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు, ముంచెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.

           ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరధా నీ కోసం గంగను విడిచిపెట్టేస్తున్నా అని తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.

           మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి. వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.


మునుముందుగా భగీరథుడు నడువంగ
తన మేన సరికొత్త తరగలుప్పొంగ
తరలింది తరలింది గంగ
సాగరుల పాపములు కడుగంగ
భువికి పుణ్యమొసగె నదిగా....


           ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోను, భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్దేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.

           శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూడు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.

ఫలశ్రుతి :
          ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు. ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి