Tuesday 31 January 2017

మాఘపురాణం - అయిదవ అధ్యాయం

మాఘపురాణం - అయిదవ అధ్యాయం 

కుక్కకు విముక్తి కా విలుగుట

          దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. 

         వర్తమానకాలమందు యెన్ని కష్టములు అనుభవించు చున్నప్పటికిని మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమేపి సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి -

            "నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసిన యెడల మనోవాంఛా ఫలసిద్ది కలుగునని చెప్పియుంటిరి గదా! ఆ వ్రత విధానమెట్టిదో, యెటుల ఆచరించవలెనో తెలియ పరచుడని" కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నదిఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. 
            రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమునుంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

            తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాసస్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు వుంచికాని, క్రొత్తగుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. 

       మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘస్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహాపాపములైనను నశించిపోవును.

          ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుణ్గవులతో యిష్టాగోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో గూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి, తీరమున నున్న ఒక రావిచెట్టు వద్దకు వచ్చి

శ్లో. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే |
     అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః ||

              అని రావిచెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశామినాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లుపెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు. ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్పవాల్చకుండా దీక్షతో చూచుచు 

          ఆ రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటనుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావిచెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావిచెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడుసార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందునా, అది మాఘమాసము అయివున్నందునా అది వెంటనే తన కుక్క రూపమును వదలి ఒక రాజుగా మారిపోయెను. 
            ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. "ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?" అని గౌతముడు ప్రశ్నించెను.

         "మునిచంద్రమా! నేను కళింగరాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దానధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్నదానము, తిలదానము చేసియున్నాను. 
         అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములు, మంచినీటి చలివేంద్రములునునెన్నో పుణ్యకార్యాలు చేసియున్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను యెన్నో క్రతువులు చేయించాను. 
           పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

            ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, 'రాజా! నీకు గుప్త విషయములు తెలియజేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును.
          ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధ్లతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాగ, అశ్వమేధయాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వందయాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు.
           మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘపౌర్ణమిరోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

            ఒక వేళ యితర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నదీస్నానమాచరించి, దానధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినటుల మాటలాడి యిట్లంటిని. 

         అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘమాసములు చేయుటకాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. 

         చలిదినములలో చన్నీళ్ళు స్నానము చేయుట యెంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికికోపము వచ్చినది, ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలిపోయినాడు. 

          అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొనిపోయెను, ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడుజన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాపఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మస్మృతి నాకు కలిగినది. 

           దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మస్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.

           ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుటవలన యెంతటి విపత్తువాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను పలికిన విషయములన్నియు యదార్థములే నీవు కుక్కవై యెటుల పవిత్రుడనైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడవై ఆలకింపుము.

           నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము. కుక్క రూపములోనున్న నీవు దారినిపోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. 

           అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజచేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను 
కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనను. 

        ఆశతో తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు. అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము 

            కలిగి పునర్జన్మ వచ్చినదన్నమాట. ఇక మాఘమాస మంతయు నదిలోస్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణపఠనము చేసినచో యెంతటి ఫలమువచ్చునో ఊహించుకొనుము అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావిచెట్టునకున్న ఒక తొర్రనుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమఋషి పాదముల పైపడి బెకబెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. ఈ కప్ప జన్మ వృత్తా0తం తదుపరి అధ్యాయములో తెలిపెను.


మృగ శృంగుని చరిత్ర 

             ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యాను.

వివాహమాడు కన్య గుణములు

          మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –

శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!

          ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.

           అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.

            ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.

           గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.

           భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.

           ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను.

           “కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ఆ దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

వసంత పంచమి / శ్రీ పంచమి

వసంత పంచమి / శ్రీ పంచమి

ఈ రోజు అనగా 01.02.2017 బుధవారం.

          వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి  రోజున వస్తుంది దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈపర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈ వసంత పంచమి/శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని మన సనాతన హిందూ ధర్మంలో నమ్మకం. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు.

         'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో తెలియజేయడం జరిగినది.

వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

శ్లోకం.
సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది.

       ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.

        వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.

     సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.

     🌺కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు.

       ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

       చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు.

       వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Monday 30 January 2017

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడో తెలుసా?

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడో తెలుసా?

          తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజినీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

           మైరావణ వృత్తాంతం ఏం చెబుతుందంటే రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను చేజిక్కించుకునేందుకు రామారావణుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడి పోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.

          తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకపోతాడు మైరావణుడు.

హనుమంతుని పయనం…

        రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకర ధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారని, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకరపోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.

మైరావణుని సంహారం…

         మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వముఖం ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు. అతనే పంచముఖాంజనేయుడు.

            పంచముఖాల ప్రాశస్త్యం ఏంటంటే అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాగిస్తూ అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వ ముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం

         మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది.
        తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

         ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది.
          రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
 అందుల ఒక కథ విన్నండి.
         పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది.
         సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది.

         ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని,
         అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు.
           ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

          ఇలా మాఘ పురాణంలోని మూడో అధ్యాయంలో ఉన్న ఈ కథ గౌరీ కథ మహాత్మ్యంతోపాటు మాఘస్నాన పుణ్య ఫలితాలను వివరిస్తోంది. ఈ వివరణ వెనుక ఒక జన్మలో చేసిన తప్పుల పాప ఫలితాన్ని మరుసటి జన్మకు కూడా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని కనుక పాపాలు చేయవద్దనే సున్నితమైన హెచ్చరిక ఒదిగి ఉంది.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మాఘ పురాణం - 4వ అధ్యాయము కుత్సురుని వృత్తాంతము:

మాఘ పురాణం - 4వ అధ్యాయము 

కుత్సురుని వృత్తాంతము:

         పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహాత్మ్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను.

         పూర్వకాలమున కుత్సురుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్దమమునియొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకా దంపతులకు ఒక కుమారుడు జన్మించెను.

          కుమారునికి అయిదవ యేడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయెట శ్రద్దజూపుట, నీతి నియమాలను పాటించుట, దైవకార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములనభ్యసించెను.

         ఈవిధంగా కొంతకాలం గడచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్తవయస్సు వచ్చెను. అతనికి దేశాటనకు బోవలయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు, మాఘమాసం వచ్చునప్పటికి కావేరీ నదీ తీరమునకు చేరుకున్నాడు
.
        “నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం” అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను.

          మాఘమాసమంతయు ఇచటనేయుండి అధికఫలమును సంపాదించెదను” అని మనసున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యమూ ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను. ఆవిధముగా నదీ తీరమున మూడు సంవత్సరములుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను.

             ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోరతపమాచరించవలయుననీ తలంచి ఆ సమీపమందొక పర్వతముపై తపస్సు చేసికొన సంకల్పించి తపస్సుజేయ మొదలిడెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ, నిశ్చల మనస్సుతోనూ, తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను.

        ఆ విప్రయువకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ, చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో వున్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందముతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు.

ఈవిధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను.

       ఓ విప్రకుమారా! నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండ అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది. గాన నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టము నెరవేర్చెదను” అని శ్రీమన్నారాయణుడు పలికెను.

        శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై – ప్రభూ జగద్రక్షకా! సర్వాంతర్యామీ! ఆపద్బాంధవా! నారాయణా! ఆ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏవిధమైన సుఖాలు కోరుటకు నా మనస్సంగీకరించలేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిపుడు కలుగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమియు అవసరము లేదు. కానీ మీ దివ్యదర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శ మిచ్చుచుండవలెను. అదియే నాకోరిక” అని ప్రార్థించెను.

        శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టము నెరవేర్చెద గాక! అని పలికి నాటినుండీ అచటనే ఉండిపోయెను.

       కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై వున్నా తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలడిగిరి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
 శ్రీశైలం చరిత్ర

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం శ్రీశైల మహాక్షేత్రంలో పూజలందుకుంటోంది.

 దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

 భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు. అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం రెండవది.

శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయలు తదితర రాజులు ఎంతోమంది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు.

దేవాలయం నాలుగు దిక్కుల ఎత్తైన గోపురాలు, చుట్టూ అతిపెద్ద ఖాళీస్థలం, లెక్కలేనన్ని ఆలయాలతో అలరారుతోంది.

 దేవాలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నంది కొమ్ముల మధ్యలో నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నాకే భక్తులు తిరుగు ప్రయాణమవుతారు.

శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.

ఈ దేవాలయం చాలా పెద్దది. దేవాలయం చుట్టూ ఎన్నో శివలింగాలు ఉన్నాయి. బయట వృద్ధ మల్లికార్జునుడు, గర్భగుడి వెనుక పాండవుల చేత ప్రతిష్టించబడినవని చెప్పబడే శివలింగాలున్నాయి. మిగతా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా తడిసి మోపెడు ఖర్చవుతుందనే భక్తులు శ్రీశైలం వెళ్తే మాత్రం తక్కువ ఖర్చుతో తిరిగి రావచ్చంటారు.

🏵  శ్రీశైలం - పురాణ గాథ 🏵

శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

 అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.

ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది. దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది.

త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి, మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు. అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు.

ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు. వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు.

 అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా, మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం. శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది.

 స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.

సాక్షాత్తు జగద్గురువులు ఆశందికరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు ‘శివానంద’, ‘సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు.

శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో, అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని, అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి.

కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు
శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది.

‘అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’

అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా. ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి. క్రీ.శ.9-10 దశాబ్దాలనుంచి 15వ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి.

శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

మల్లికార్జున నామ ప్రశస్తి :

స్వామి వారిని మల్లికార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది.

కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది :

పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు :

 పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు

🌷 ఆలయ విశేషాలు 🌷

నిత్యం హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్యన శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దటమైన అరణ్యాల మద్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం

 పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు.

 నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

వసతి సదుపాయములు

శ్రీశైలదేవస్థాన సత్రములు. గంగా సదన్, గౌరీ సదన్, శివసదన్
శ్రీ శైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ కలవు. ఆంద్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది.

శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసమునందు తప్ప మిగిలిన రోజులలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది.

🌺 శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు 🌺

శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు.

చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి

1. శ్రీశైల దేవాలయ ప్రాంతము.
2. సున్నిపెంట ప్రాంతము
3. మండపాలు, పంచమఠాల ప్రాంతము
4. అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.శ్రీశైల దేవాలయ ప్రాంతము.

దేవాలయ ఆవరణ.

వృద్దమల్లికార్జుని గుడి. అద్దాలమండపము. మనోహరకుండము

•శ్రీమల్లికార్జునుని దేవాలయము:

అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.

•భ్రమరాంబిక అమ్మవారి గుడి:

భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.

• మనోహర గుండము:

శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

• నాగ ప్రతిమలు:

• పంచ పాండవులు దేవాలయాలు:

పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.

• అద్దాల మండపము:

• వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది!

సున్నిపెంట ప్రాంతము

• ఆనకట్ట: శ్రీశైలం ప్రాజెక్టు

• జల విద్యుత్ కేంద్రము:

మండపాలు, పంచమఠాల ప్రాంతము
పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ కలవు.

• సారంగధర మఠం: మిగిలిన మఠాలలో నిర్వహణలో, అభివృద్దిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం.

• రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
• విశ్వామిత్రమఠం:
• నంది మఠం మొదలైనవి.

అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.

పాతాళ గంగ

పాతాళ గంగ వద్ద జన సందోహం బాగా ఉంటుంది

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది.

 పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

2004 లొ పాతాళగంగ కు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడినది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

🌼 సాక్షి గణపతి ఆలయము 🌼

ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.

🌻 శిఖరేశ్వరం 🌻

శ్రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

పాలధార, పంచధారలు

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి.

 కొండపగులులనుండిపంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.

ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రదేశం

దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము కలదు.

శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆ పరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను.

 ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడునారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.

శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము

శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గంఅందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు. సందర్శకులను అనుమతించుచున్నారు.

రోడ్డు మార్గములు

• హైదరాబాదు నుండి శ్రీశైలం 200 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.

• గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మద్యగా చాలా బాగుంటుంది.

రైలు మార్గములు

• భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.

విమాన మార్గములు

• హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు

నిత్య సంధ్యా వందనమ్

నిత్య సంధ్యా వందనమ్

శరీర శుద్ధి

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనఃఓం ఆచమ్య

ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)

ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

       (ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)భూతోచ్చాటనఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |

దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

         (ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)ప్రాణాయామఃఓం భూః | ఓం భువః | ఓగ్మ్త సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్మ్్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

సంకల్పః
         మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్విపే రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ,
         అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||మార్జనఃఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః |

(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)
         ప్రాతః కాల మంత్రాచమనఃసూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” ||

        మధ్యాహ్న కాల మంత్రాచమనఃఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతుమామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” ||

         సాయంకాల మంత్రాచమనఃఅగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ||

(ఇతి మంత్రేణ జలం పిబేత్)

        ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)ద్వితీయ మార్జనఃదధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్మ్,’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)

ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’0గ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః ||

      పునః మార్జనఃహిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తానఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధుశ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యాఅంతరి’క్షే బహుథా భవ’0తి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాఃశివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్మ్శ ర’ప్సుషదో’ హువే వోమయి వర్చో బల మోజో నిధ’త్త ||

(మార్జనం కుర్యాత్)
అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః |

       ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)ప్రాణాయామమ్య
         లఘుసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||

మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జాగోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ ||

సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్మ్  సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్మ్్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

(ఇత్యంజలిత్రయం విసృజేత్)
కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం

ఆచమ్య…

          పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే

ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్మ్  సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్మ్  సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

(ఇతి జలం విసృజేత్)
            సజల ప్రదక్షిణం
ఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతేఅసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ ||

(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)

       ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణంసంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి
మధ్యాహ్న తర్పణంసంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
సాయంకాల తర్పణంసంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

(పునరాచమనం కుర్యాత్)
         గాయత్రీ అవాహనఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ ||
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||

        ఓజో’உసి సహో’உసి బల’మసి భ్రాజో’உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసిసర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామిఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్మ్య రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్మ్ృ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్మ్త సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్మ్ో సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మభూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)

        ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)జపసంకల్పఃపూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||కరన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసఃఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |
ధ్యానమ్ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
చతుర్వింశతి ముద్రా ప్రదర్శనంసుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |

       ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రం
      ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
అష్టముద్రా ప్రదర్శనంసురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |

ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |

      ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ ||

      మధ్యాహ్న సూర్యోపస్థానం

ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’0చ |
 హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తిభువ’నా నిపశ్యన్’ ||

ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ |
దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||

ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ |
దృశే విశ్వా’ య సూర్య”మ్ ||
 చిత్రం దేవానా ముద’గా దనీ’కంచక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్మ్య సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ |
పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మశరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్మ్చ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామశరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే ||
 య ఉద’గాన్మహతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||

       సాయంకాల సూర్యోపస్థానం
          ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణావంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః |
యచ్చ ద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (

దిగ్దేవతా నమస్కారః

(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం
ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |

ముని నమస్కారః
         నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||

సంధ్యాదేవతా నమస్కారః
        సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యోనమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః |
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్మ్| సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)

ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ |
స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారః

నమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
భూమ్యాకాశాభి వందనంఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |

సర్వదేవ నమస్కారః

 కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః
         (ప్రవర)చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
ఈశ్వరార్పణంకాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday 29 January 2017

మానవ శరీరంలోని షట్చక్రాలు

  మానవ శరీరంలోని షట్చక్రాలు

శ్లోకం.
       మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః

వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం :
       మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.

2. స్వాధిష్ఠాన చక్రం : 
         ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.

3. మణిపూరక చక్రం :
       బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.

4. అనాహత చక్రం : 
      ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.

5. విశుద్ధచక్రం :
       ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.

6. ఆజ్ఞాచక్రం :
         ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.

7. సహస్రారం :
        ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మాఘపురాణం - 3వ అధ్యాయము వింధ్య పర్వతము:

 మాఘపురాణం - 3వ అధ్యాయము


వింధ్య పర్వతము:

          దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. 

          అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
             మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందు 
ఉ0డుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.

        హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. 
         అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. “ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.

మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. 

“రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
        “ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు
          తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించు కొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

గంధర్వ యువకుని వృత్తాంతము:

         “భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. 
         భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.

       “ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! 

         వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.

        ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.

         అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.

ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
అష్టావక్రుడు
           పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు.
వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. మంచి గుణగణాలు, నీతినియమాలు కలిగినవాడు. కాని అతని దగ్గర ఒకే ఒక లోపం వుంది.

      అదేమిటంటే నిలకడ లేదు మనిషిదగ్గర. అందుకని ఏ విద్యా పూర్తిగా నేర్చుకోలేకపోయాడు.అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ వుండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు.కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని, తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు.

           ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడని పేరు వచ్చింది.అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనకమహారాజు మిథిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు.

           అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో " నాయనలారా! గుడ్డివాళ్ళకు,కుంటివాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు,ఉపనిషత్తులూ చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే - రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది నేను చెబుతోంది కాదు, శాస్త్రం చెబుతోంది" అన్నాడు.

          ఈ వాదం రాజుగారి చెవికి చేరింది.ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి 'నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది,కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు' అనుకొని, " ఆ బాలకులిద్దర్నీ వెంటనే లోపలికి పంపండి" అని భటుల్ని ఆదేశించాడు.

     ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుడ్నీ సువేదకేతువునీ లోపలికి పంపారు.
కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.

          "మేం చిన్నపిల్లలం కాము. వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవర్నీ పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు - జ్ఞానం చేత పండినవారే వృద్ధులు. తెలివి వున్నవాడే మనిషి" అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు.

        ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడకు వచ్చి, "మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటి వాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.

      "మహారాజా! మీరు చెప్పినట్లే కానివ్వండి. కాని వాళ్లు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమనీ, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను. మీపండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. ముందు నన్ను లోపలికి రానీయండి" అని కోరాడు అష్టావక్రుడు.

       అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు.
అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు. పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.అదీ కథ.

     కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో, పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు. దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా వెయ్యకూడదు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహీత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ, తిరుపతి

Saturday 28 January 2017

శనిగ్రహ దోష నివారణకు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

శనిగ్రహ దోష నివారణకు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

           పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.

           ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.

              పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.

            ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్, ఖాదీ కాలని,తిరుపతి

శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు

శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు

ప్రతిరోజూ  మనము బయటకు  వెళ్ళేటప్పుడు  (అనగా ఏ  పని మీద  వెళ్ళినా )   ఈ క్రింద  రాసిన  హనుమంతుని పన్నెండు  నామములు మనసులో చదువుకుంటూ   వెళ్ళేతే  అటువంటివారికి  సర్వత్ర  విజయము కలుగును..

హనుమాన్ అంజనాసూను:  - వాయుపుత్రో  మహాబల:
రామేష్ఠ: ఫల్గుణి  స్సఖ:  -  పింగాక్షో  అమిత విక్రమ:
ఉదధిక్రమణస్చైవ    -  సీతాశోక వినాశక:
లక్ష్మణ:  ప్రానదాతాచ   - దసగ్రీవస్య  దర్పహా
ద్వాదశైతాని   నామాని   -  కపీంద్రస్య  మహాత్మన:
స్వాపకాలే   పఠే నిత్యం  - యాత్రాకాలే  విశేషత:
తస్య  మృత్యుభయం  నాస్తి  - సర్వత్ర విజయీభవేత్

ఈ నామములు రాత్రి  పడుకునేముందు  చదువుకుంటే  ఏ  భయము  లేకుండా  వుంటుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

    “ఓం కుసుమ పుత్రీచ విద్మహే  కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్”

ఉపోద్ఘాతం- చరిత్ర

        స్త్రీలోని ఆత్మీయతకు,అనురాగానికి, సౌమ్యానికి, త్యాగగుణానికి, పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం ‘వాసవీ కన్యకా పరమేశ్వరి’. సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృత గ్రంధ ఆధారంగా వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి. 10వ, 11వ శతాబ్ధానికి చెందిన కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ (కౌసుంబి) దంపతుల గారాల బిడ్డ,పుణ్యాల పంట వాసవాంబ. కుసుమ శ్రేష్ఠి వేంగి దేశంలోని ‘వసాల్’ ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమ శ్రేష్ఠిని ఆ రోజులలో అంతా పెద్ద శ్రేష్ఠి (ఈ శ్రేష్ఠి పదం కాల క్రమేణా శెట్టి గా రూపాంతరం చెందింది) అని పిలిచే వారు.
          ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. ‘వసాల్’ దేశంలో పుట్టింది కనుక ఆమె ‘వాసవి’ అయింది. కన్యారాశిలో పుట్టింది కనుక ‘కన్యక’  అయింది. వాసవి అమ్మను పూజించే వారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో శెట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు అదేవిధంగా గోమాతను కుడా ‘గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు’. ఈ పేరే ‘గోమ్టి’ గా మారింది. గోవును పూజించే గోమతి తీర వాసులు కనుక వీరిని ‘గోమట్లు’ అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో ‘కోమట్లు’ గా మారింది.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరితామృతం

       శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి గోమతీ లేదా ఆర్యవైశ్య కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం నకు ముందు గోమాతను పూజించుట వల్ల వీరికి గోమతి అను పేరు వచ్చింది. శ్రీ పాద శ్రీ వల్లభుడు గో ప్రియుడు.బహుశా ఈ కారణం వల్లే ఆర్యవైశ్య కులస్తులంటే వారికి అబిమానం మెండు. అయితే మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921 మరియు 1931 మధ్య కాలంలో ఒక కమీషన్ వేసారు .

          కమిటీ ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి అందరూ గోమతీ కులస్తులు గల వైశ్య అసోసియేషన్ (1905 లో స్థాపించబడినది) వారు తమ పేరును ‘గోమతీ’ నుండి “ఆర్యవైశ్య” గా మార్చుకున్నారు.

         ఆర్య అంటే గొప్ప వంశస్థుడు, గౌరవింపతగినవాడు అని అర్ధం. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాల తరువాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్యుల కులదేవత గా ఏర్పడ్డారు.

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జననం

       వేంగి దేశాన్ని ఏలే కుసుమశ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు (విమలాదిత్య మహారాజు) అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమశ్రేష్టి సుమారు 18 పరగణాలను జ్యేష్టశైలం/బృహత్శిలానగరం (పెనుగొండ) ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. కుసుమశ్రేష్టి, ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు.
        నగరేశ్వరస్వామి (శివుడు) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేరని వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. అంతట ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు.
         దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.
       వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరుపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.
         భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తిసాము మొదలైన యుద్ధవిద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.
సహోదర వివాహక్షణాల
       విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధిశ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. అంతలో విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమశ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు.

        అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాద్యాలతో వెళ్లుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహమాడదలచాడు. కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు. అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికయని కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా ఒక నెల రోజుల వ్యవది నిచ్చి వివాహానికి సమ్మతించనిచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని తీసుకొని పోతానన్నాడు. విష్ణువర్ధుని కోరిక కుశమశ్రేష్టికి శరాఘాతం అయింది.
       ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. విష్ణువర్ధనుడు క్షత్రియుడు. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.

అనంతర పరిణామాలు
       కుశుమశ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమశ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు.
        సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధునుడితో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.
       భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమశ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పని చేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని విష్ణువర్ధునుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల మధ్య ఐకమత్యం దెబ్బతింది. విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు.
       ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుశుమశ్రేష్టికి అండగా నిలిచారు. నాటి సమావేశం లో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేసెను.
వాసవి దేవి ప్రతిస్పందన
       వాసవి సభలోకి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- ”నేను వివా హానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు . యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు. అపార జననష్టం, ధననష్టం జరుగుతుంది. ఎంతోమంది పునిస్త్రిలు వైధవ్యంతో బాధ పడతారు. తన వల్ల ఇంత రక్తపాతం జరుగకూడదు.ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం.
        దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం . దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు”. వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.

అమర దీపం అసాధారణ త్యాగం ఆత్మార్పణ

       వాసవి సూచనలను అనుసరించి, ఒకానొక మాఘ శుద్ధ పాడ్యమి రోజు గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.

        వారు వాసవీ కన్యకాంబని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. దానికి ఆమె ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది.

        సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమశ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.

         ఆమె నోటి నుండి పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో, తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షం అయింది. వెంటనే వాసవాంబిక తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో దూకి ఆత్మార్పణ కావించుకొనెను.అప్పుడు 102 గోత్రాలకు చెందిన వారు కుడా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్నిగుండంలో దూకారు.
విష్ణువర్ధునుడి మరణం
       విష్ణువర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగిందంతా విష్ణువర్ధునుడికి చెప్పారు. ఆ వార్త విన్నవిష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని, తలపగిలి అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.

అహింసే ముగింపు

       ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-”సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవాంబిక మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది.

        ” ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా 101 శివలింగాలని ప్రతిష్టించాడు. రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవీ కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు.
         వాసవీ కన్యకా పరమేశ్వ జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేసినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.

శ్రీపాద శ్రీ వల్లభుడు – వాసవాంబిక

       సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం ప్రకారం ఆర్య మహాదేవి యొక్క తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక. అనసూయ మాత “అగ్నియోగం” వల్ల జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు శ్రీ వాసవీ కన్యక. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల సహొదరి. ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు వచ్చెదరు .

        ఆ రోజు వాసవీ కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి రక్షా బంధనం కట్టుపుణ్య దినము. ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల వారి సన్నిధానం లో ఉంటారో వారికి చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ గుప్త రూపం లో శ్రీపాద శ్రీ వల్లభులు నివసించును.  !! ఓం శ్రీ వాసవాంబాయైనమః !!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి