పుష్య మాసం లో వచ్చే బహుళ ఏకాదశి దీనినే షట్ తిల ఏకాదశి. ఈ వ్రతం ఎలా చేయాలి?
పుష్య మాసం లోవచ్చే పుష్య బహుళ ఏకాదశికి మోక్షం ఇస్తూనే షత్తిల ఉంది. ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వులతో దేవతలకి , నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీలలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి.
ఏకాదశి రోజున దాన్యం తినకూడదు అంటారు కదా మరి నువ్వులు ఎలా తినడం అని అనుమానం వస్తుంది. నువ్వులు దేవుడికి నివేదన చేసి , అందరికి నువ్వుల ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత దానిని తినాలి.
షట్‌తిల ఏకాదశి:
షట్ తిల ఏకాదశి కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు తిలలతొ (నువ్వులు) ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు గురువరేణ్యులు ప్రవచిస్తున్నారు.
పితృదేవతలకు ఆ రోజు అత్యంత ప్రీతికరం. ఆ రోజున వారికి తర్పణాలు వదలడం ఆచారంగా వస్తున్నది.
ఆరు కార్యాలు ఏమిటంటే
1) నువ్వులతో స్నానం(తిలాస్నానం),
2) స్నానానంతరం నువ్వులముద్ద చేసి ఆ చూర్ణాన్ని శరీరానికి పట్టించడం
3) ఇంటిలో తిల హోమం నిర్వహించడం
4) పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించడం
5) నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం
6) చివరగా తిలాన్నం భుజించడం.(బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం)
ఈ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేసినవారికి పితృ దేవతలు, శ్రీ మహా విష్ణువు సంతసించి దీవెనలు అందజేస్తారు. ఆ కర్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. తిల ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ పరంధాముడు సంతసించి దైహిక సంబంధమైన సర్వసుఖాలు సహా ఆ తరువాత ఊర్ధ్వ, అధో లోకాల్లో కూడ ఉత్కృష్ఠ స్థానం అనుగ్రహిస్తూ దీవిస్తాడని విశ్వాశం.
ఓం నమో నారాయణాయ
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:
Post a Comment