ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం.సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి.ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది.వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు.ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను ,ఒక నోరు ఉంటుంది.ఇవి దొరకటం చాలా కష్టం.మార్కెట్ లో తాటికాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు.వీటితో పూజిస్తే ఫలితం శూన్యం.ఏ కాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను,ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి.
పూజా విధానం;-
ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏ కాక్షి నారికేళాన్ని శుబ్రమైన నీటితో గాని,గంగా జలంతో గాని కడిగి పసుపు,కుంకుమ, చందనములతో నారికేళాన్ని అలంకరించాలి.రాగి పాత్ర(చెంబు) గాని,అష్టలక్ష్మి పాత్ర గాని తీసుకొని బియ్యముతో ఆపాత్రని నింపి నారికేళానికి పలుచటి పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని చుట్టి పాత్ర పైన ప్రతిష్టించాలి.
ఏ కాక్షి నారికేళానికి పూలు,అక్షింతలతో విష్ణు సహాస్త్రనామంతోను, లలిత సహాస్త్రనామంతోను పూజ చేయాలి.ఈ పూజలో గవ్వలు, గోమతిచక్రాలకు కూడ పూజ చేయవచ్చు.ఏ కాక్షి నారికేళాన్ని ఇంటి పూజా మందిరంలోగాని,షాపు పూజామందిరంలో గాని,విధ్యా సంస్ధలలో గాని,ప్యాక్టరీలలోగాని దీనిని ప్రతిష్టించవచ్చు.
ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం గాని,దీపావలి రోజులలో గాని విశిష్ట పూజ చేస్తే మంచిది.
ఉపయోగాలు:-
ఏ కాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి భాదలు గాని,గొడవలు గాని,అపోహలు గాని ఉండవు.కుటుంబ సభ్యులందరి మధ్య సహాయసహాకారాలు,అన్యోన్యత,అనురాగాలు,ఆప్యాయతలు కలిగి ఉంటారు.
ఏ కాక్షి నారికేళం ఉన్న షాపులోగాని,ప్యాక్టరీలలో గాని,విధ్యా సంస్ధ లలో గాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ,మంచి కమ్యూనికేషన్,ధనాధాయాలు ,వ్యాపారాభివృధ్ధి,మంచి వాక్ శుద్ధి,పిల్లలలో తెలివితేటలు,చదువుపై శ్రద్ధ,పోటితత్వం కలుగుతాయి.ఏ కాక్షినారికేళం ఉన్నచోట సర్వవిదాల అభివృద్ధి,సర్వకార్యసిద్ధి,జనాకర్షణ కలుగుతాయి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
No comments:
Post a Comment