Monday 28 August 2017

భాద్రపదమాసం శుద్ధ అష్టమి(29.08.2017, మంగళ వారం) ఈ దినమే రాధాష్టమి అని అంటారు.


భాద్రపదమాసం శుద్ధ అష్టమి(29.08.2017, మంగళ వారం) ఈ దినమే రాధాష్టమి అని అంటారు.

రాధాష్టమి

పవిత్ర ప్రేమకు చిహ్నం ‘‘బృందావనం‘‘

            బృందావనంలో రాధాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలు.శ్రీరాధాకృష్ణుల అనురాగాన్ని వర్ణించే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం రాధాష్టమి రోజు న శ్రీ రాధాకృష్ణులను పూజించడం వలన విశేష ఫలితాలను ఇస్తుంది
.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!!

           భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.

            శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు.

              ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ్రహాలను అభరణాలు, నూతన వస్త్రాలతో విశేషంగా అలంకరిస్తారు. బృందావనంలో ముఖ్యమైన ప్రదేశాలను భక్తులకు తెలియజేస్తూ వాటి విశిష్టతతో కూడిన వీడియోను ప్రదర్శిస్తారు. రాధారానిని కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వహింస్తారు.

            రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.

          మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి,

            విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.

          రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.

         రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.

            గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.

           శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.

              శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.

              రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని
కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.

     వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.

పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.

           రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.రాధా కృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందనీ భావన.

‘             రాధా! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో. ఏదైనా ఇస్తాను.’
‘మాధవా! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా?’
‘అవును రాధా!’
‘నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా?’

         చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది.
‘నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!’

          అదే బృందావనం. ఈ రోజు రాధాష్టమి. రాధ పుట్టిన రోజు. ఈ అరుదైన రోజు కోసం అపూర్వమైన రీతిలో, తన గుణగణాలను దివ్యాభరణాలుగా మార్చి, మనోజ్ఞంగా అలంకరించుకుని సరికొత్త శ్యామసుందరుడు అవతరించాడు. అటు రాధావిలాసం, ఇటు మురళీగాన వినోదం, సరస శృంగార చక్రవర్తి,

            రాధికా మానస విహార రాజహంస, సకల భువనైక మోహన దివ్యమూర్తి రాధను మంత్రముగ్ధం చేస్తున్నాడు. జలతరంగిణి మీటినట్టు రాధ నవ్వుతున్నది. జగమంతా అమృతం వర్షిస్తున్నది. ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది

            ‘కృష్ణా! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు

          . నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుం టున్నానా?’.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. ‘ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!’ ఆశ్చర్యచ కితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు.

           ‘ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా! అన్నట్లు రాధా! నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా!’గలగలా నవ్వింది రాధ. ‘నీకన్నా విలువైనది నేనే గోపాలా!’ హతాశుడయ్యాడు కృష్ణుడు! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.

‘ఏమంటున్నావు రాధా! నువ్వు నాకంటే విలువైనదానివా? ఎలా?’
‘్భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!’
‘అవును’
‘నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా’
‘నిజం’
‘నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!’
‘అనుమానమెందుకు రాధా!’
‘నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ’
‘ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?’
‘ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా’

           కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో.

           కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది.
కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది.

        వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు.

‘ఏ.. ఏమిటిది!.. మా.. మాధవా!’ రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది.
‘బానిస, యజమానికి నమస్కరించాలి కదా!’
కృష్ణుని వినయసౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది.

            రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.

           ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది. పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.

          యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం ‘రాధామాధవం’.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Saturday 26 August 2017

భాద్రపద శుక్ల షష్టి (27.8.2017)ని సూర్య షష్టి అంటారు.

 భాద్రపద శుక్ల షష్టి (27.8.2017)ని సూర్య షష్టి అంటారు. 

         ఈ రోజున సూర్యుని స్మరిస్తూ స్నానం చేసి ,సూర్యుని ఆరాధించి , "పంచగవ్యాలు" ( ఆవుపాలు, పెరుగు, నేయ్యి, మూత్రం, పేడ కలిపి) ప్రాశనం చేస్తే విశేష ఫలం.

శుక్లభాద్రపదే షష్ట్యాం స్నానం భాస్కరపూజనం
ప్రాశనం పంచగవ్యస్య చాశ్వమేధ ఫలాదికం -
అని శాస్త్రోక్తి.

ఈ రోజున కుమారస్వామిని దర్శించడం వలన పాపనాశనమవుతుంది

సూర్య షష్టి 

           ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

పూజా పద్దతి

           ఈ పండగ సందర్భంగా ఇల్లంతా శుభ్రపరచుకుని, శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ కూరతో తయారుచేసిన వంటకాన్ని ఆరగిస్తారు.వంటలో సాధారణంగా ఉప్పు వినియోగించరు.

           ఒకవేళ వాడినా సైంధవ లవణాన్ని మాత్రమే వాడుతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడుతారు కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్‌గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసముంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్, రొట్టెలను ప్రసాధంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.

             మూడవ రోజున అస్తమించే సూర్యున్ని పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. నాలుగో రోజున ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది.

ఛట్‌పూజ మరియు బతుకమ్మ సారూప్యత

          ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు.

                ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.

 సూర్య నమస్కార స్తోత్రం

ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

          సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు.ఈ స్తోత్రం రోజు మూడు కాలాలో పఠిస్తే మంచిది. లేదా రొజూ పూజ చేసే సమయంలో ముమ్మారు పఠించినా చాలు. ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి శ్లోకం పఠిస్తే మంచిది.

           సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్య నారాయణ మూర్తి అని కొలుస్తాము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Friday 25 August 2017

ఋషి పంచమి వ్రత కథ


ఋషి పంచమి వ్రత కథ 


సర్వలోకమునకు గురువుఐన, సర్వేశ్వరుడు ఐన శ్రీ కృష్ణుని చూచి ' ధర్మరాజు ' ఓ దేవ దేవా! అనేక వ్రతములను గూర్చి విన్ననూ, వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది ఐన ఒక వ్రతము వినవలెనని ఉంది.

        అని చెప్పగా విన్న శ్రీ కృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మ రాజా చెప్పెదను వినము దేనిని చెయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది ఐన ' ఋషి పంచమి ' అను వ్రతము ఒకటి ఉంది. దానిని గూర్చిన పురాణ కథ ఒకటి ఉంది.

           పూర్వకాలమున ' విదర్భ దేశం'లో ' ఉదంకుడు ' అను ఒక ' బ్రాహ్మణుడు ' కలడు. అతని భార్య పేరు 'సుశీల' ఈమె పతివ్రత వీరికి సుభీషణుడు అను కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదే వేదాంగములను చదివెను. కూతురుని ఒక బ్రాహ్మణునకు ఇచ్చి ' వివాహం ' చేసిరి ఆ తరువాత ఆమె 'విధ వశము' చే వైధవ్యమును పొందెను. ( అనగా భర్త లేనిదయ్యెను) తాను పవిత్రముగా ఉండి, తన తండ్రి ఇంటిలోనే కాలము, గడుపు చుండెను.

           తండ్రి ఐన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధ పడుచు కొడుకు ఇంటి నుంచి భార్యను, కూతురును తీసుకొని అడవులకు పోయి తన శిష్యులకు ' జ్ఞాన బోధ' చేయుచుండెను. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరి చర్యలు (సేవలు) చేయు చుండగా ఒకానొక రోజున అర్ద రాత్రి వేళ, అలసి నిద్రిస్తుండగా ఆమె దేహమంతా పురుగులు పట్టినవి.
          ఇలా శరీర మంతా పురుగులతో నిండియున్న ఆమెను చూచి 'శిష్యులు' ఆమె తల్లికి చెప్పిరి. అది విని తల్లి బాధ చెంది, ఆమె శరీర మునకు ఉన్న పురుగులను దులిపి, ఆమెను తీసుకొని తన భర్త ఐన ఉదంకుని దగ్గరకు పోయి, జరిగిన దంతా వివరించి చెప్పి, ఇందుకు కారణము తెలుపమని కోరగా ఉదంకుడు కొంత సేపు 'ధ్యాన ముద్ర'లో ఉండి ఆమె పూర్వ జన్మ వృత్తాంత మంతయూ గ్రహించి ఇలా చెప్పెను.

          ఓ ప్రాణేశ్వరీ! ఆమె ఇంతకుముందు తన ఏడవ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి 'రజస్వల' యై దూరముగా నుండక ఇంటి పనులు అన్ని చేయుచూ వంట సామాగ్రిని (అనగా అన్నము, కూర, పప్పు, మొ|| పదార్దములు వండిన గిన్నెలు|| వాటిని) తాకిన దోషము వలన ఆమె శరీర మంతట పురుగులు వ్యాపించనవి, కావున 'స్త్రీ' రజొయుక్తరాలు ఐనచో పాపము కలది అగును.

           అది యెట్లు అనగా మొదటి రోజున చూడాలి రెండవ రోజున బ్రహ్మఘాతి ( అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగను) మూడవ రోజున రజకి ఐ నాలుగవ దినమున శుద్ధ అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కాని, ఆ వ్రతము చేయుటను చూచి ఉండుట వలన నిర్మలమైన బ్రాహ్మణకులంలో పుట్టుట జరిగినది ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగుల కలదిగా అయ్యెను.

        అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంత మను గూర్చి చెప్పగా అతని భార్యైన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీర మంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్య కరమైన వ్రతము గూర్చి నాకు తెలపువలెను.అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధముగా చెప్పుచుండెను.

          ఏ వ్రతము చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యములు, సకల ఐశ్వర్యములు కలుగునో సర్వపాపములు తొలగునో, అంతే గాక ఆపద లేని సంపదలు వర్దిల్లునో అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి ఉంది. అన్న శ్రీ కృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు.
          ఓ శ్రీకృష్ణ ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అనిన శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ రాజేంద్రా ఏ వ్రతము చేసినచో ఆడువారు సర్వపాపముల నుండి విముక్తి పొందెదరో ఆ వ్రతమును గూర్చి నీకు తెల్పెదను. అని ఇలా వివరించుచుండెను.

        'ఋషి పంచమి' వ్రతము అను ఒక వ్రతము ఉంది. 'ధర్మ రాజు' అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈవిధముగా పలుకుచున్నాడు. ఒక స్త్రీ 'రజస్వల' ఐనందున తెలిసిఐననూ, తెలియక ఐననూ వంటచేయు (పాత్రలను) భాండ ములను తాకినచో అది పాపమే అగును. బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులలోను స్త్రీలు రజొవతులుగా ఉండునపుడు దూరముగా ఉండుటకు హేతువు ఉంది.

         అనగా కారణము ఉంది. అది ఏమనగా ఇంద్రుడు ముందు వృత్రాసురుని చంపినపుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి, ఆపీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను నాలుగు భాగములుగా విభజించి ' స్త్రీ 'లయందును, వృక్షములయందును (అనగా నీటి యందును) ఈ విధముగా నాలుగు తావులయందు (అనగా నాలుగు స్థలముల యందు) ఉంచెను.

         కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మఘాతి, మూడవ రోజున రజకిగా నుండి నాలుగవ రోజున పరిశుద్ధము అగును కావున, రజః కాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో ( అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపము నశించుటకు అన్ని పాపములు తొలగి పోవుటకు సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ 'ఋషి పంచమి' వ్రతము బ్రాహ్మణాది నాలుగు జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది. (అనగా చేయ దగినది)

ఈవిషయమున ఇంకొక పురాణ కథ ఉంది.

            మొదటగా కృత యుగమున విర్భ దేశమునందు ' శ్వేన జిత్తు ' అను పేరుగల ఒక రాజు నాలుగు (అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర) జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పద శాస్త్ర హితామహుడ ( అనగా పదములు చెప్పుటలో పాండిత్యము కలిగిన వాడు) అన్ని ప్రాణులయందు లేద ఆజీవులయందు దయ కలవాడైన సుమిత్రడు అను ఒక బ్రాహ్మణుడు కలడు.

           ఇతడు వ్యాపారము చేయుచూ కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది. అనేక మంది చెలికత్తెలు కలదిగా అనేక మంది స్నేహితులు కలదిగా వర్షాకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో నుండి, జయ శ్రీ అను పేరుతో విలసిల్లుచుండెను. ఇలా ఉండగా ఒక సారి రజస్వల ఐ ఇంటి పనులు చేయుచూ, వంట సామగ్రిని తాకి భర్తతో కూడి ఉండి, పాపకర్మ చేయుటచే కొంత కాలమునకు భార్య భర్తలు ఇద్దరూ చనిపోయిరి.

          ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వలా నియమమును తిరస్కరించినది (అనగా నియమం పాటించ లేదు) కావున ఆ పాపము వలన ఆడ కుక్కగాను ఆమె రుతుమతిగా ఉన్నపుడు భార్యతో నుండుట చేత సుమిత్రుడు వృషభము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టిరి.

             ఆ సుమిత్రుని కొడుకు ఐన సుమతి అనువాడు ధర్మములను తెలిపిన వాడు, పెద్దల యందు భక్తి కలవాడు. దేవతలను, అతిధులను పూజించువాడై ఉండెను. ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన (తద్దినము) రోజు వచ్చనది అప్పుడు తన భార్యైన ' చంద్రవతి ' అనునామెను పిలిచి శ్రద్ధ తోను భక్తి తోను ఇలా పలికెను.

          ఓ దేవీ! మా తండ్రి గారు చనిపోయిన రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. అందుకై వంట చేయుమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాకములను (అనగా అనేక పిండి వంటలను చేసెను) చేసి వాటిని సిద్దము చేయుచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసాన్నములను తినుచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిన చూచెను.

         అది తినినచో బ్రాహ్మణులందరూ మరనింతురు.అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరూ ముట్టరు అనుకొని అది అన్నమును తినుచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను.

        ఆ ఆహార పదార్దములను పార వేసి, మరల శుభ్రముగా వండి, బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధముల విధులు సమకూర్చి, పిదప మిగిలిన వాటిని ఇంట్లో నివారంతా భుజించి మిగిలిన పదార్దములను కూడా ఆ కుక్కకు వేయక పోవుట వలన అది తన భర్త రూపములో నున్న వృషభము (అనగా ఎద్దును) చూచి ఇలా పలుకుచున్నది.

       ఓ స్వామి! నేడు ఉచ్చిష్టము (అనగా అందరూ తినగా మిగిలినది) వెయక పోవుట వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది గాక బ్రాహ్మణుల కొరకు శ్రార్దమునకై చేసిన పాకములో ఒక సర్పము (అనగా పాము) వచ్చి అక్కడి పాయసము తిని, విషము దానిలో కలిపి పోయెను అది నేను చూచి, ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్దములను ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదురని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయెదను అని అనుకొని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్దము చేసుకొని నన్ను బాధించింది. అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ (శునకము) అనగా కుక్కను ఆ (వృషభము) ఎద్దు తన కష్టముల గూర్చి చెప్పుచుండెను.
     
         శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్థించి, దంత ధావనం చేసి, (అనగా పండ్లను శుభ్రముగా కడుగుకొని) తిలామలక పిష్ఠములచే కేశసంశోధం చేసుకుని (అనగా నువ్వుల నూనెను వ్రాసుకుని) మృత్తి కాస్నాన పూర్వకముగా శుద్ధోదక స్నానము (అనగా ఎవరైనా మరణించిన తరువాత చేయు స్నానము అని అర్దము)

          పరిశుద్ధ మైన వస్త్రములను కట్టుకొని యధా విధి కర్మలు ఆచరించి (అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వ్రేల్చి అనగా యజ్ఞ మునకు కావలసిన అన్ని సామగ్రులను సిద్దము చెసికొని భక్తి యుక్తుడై సప్తర్షులను ఆవహింప చేసి శుభములైన పంచామృత రసములచే వారిని సంత్రుప్తులను గావించి, అభిషిక్తులను గావించి, చందన, అగరు, కర్పూరాది సుగంధములను అలంకరింపచేసి, అనేక విధములైన పువ్వులతో వారిన పూజించి, వస్త్రయజ్ఞో పవితముల చేత కప్పి ధూప దీప నైవేద్యములు పెట్టి అనేక శాకములు (అనగా కరలు) పాయసములు అనగా పరమాన్నములు మొ||న ఆరురుచులుగల షడ్రశోపేత భోజనం పెట్టి ఫలములచే అర్ఘ్యము ఇచ్చి

శ్లో || కశ్యపోత్రిర్భర ద్వాజో విశ్వామిత్రోధ గౌతమః
          జమదగ్నిర్వశిష్టవ్చ సాధ్వి చైనాప్యరంధతీ ||

             అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ' ఋషి పంచమి ' వ్రతమును యధాశక్తి ఆచరించి తన తల్లితండ్రులను బ్రతికించుకొనెను. ఈ విధముగా ' ఋషి పంచమి ' వ్రతమును సప్త ఋషుల సహితముగ ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది, ఆ ఫలమును తల్లి తండ్రులకు ఇచ్చి, వారిని బ్రతికింపచేసెను.

              వారు బ్రతికి ఆమర లోకమునకు అధిపతులు ఐనారు. కావున ఈ వ్రతమహిమ చేత కాటుక వాచిక మానసిక ( అనగా శారీరకమైన దోషములు) తొలగిపోయి కలిగెడు పుణ్యమును గూర్చి వివరించెదను అని ఓ రాజా అన్ని వ్రతములు ఆచరించి ఫలము, అన్ని నదులలో స్నానము చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయుటవలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును.

                ఏ 'స్త్రీ ' ఈ వ్రతం ఆచరించునో ఆ ' స్త్రీ ' భోగభాగ్యము కలిగినది, రూపము, సౌందర్యము, పుత్రులతోను పౌత్రులతోను కూడిన దైఇహపర సౌఖ్యములను పొందినది అగును. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశించిపోవును. మరియు చదువు వారి వినువారి పాపములు నశింపచేయుటయే గాక ధనము, పుత్రులు, కీర్తి, స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా! ఈ వ్రతములలోకి శ్రేష్ఠము అనిన శ్రీకృష్ణుని మాటలు విని, అజాత శత్రువుఐన ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు

ఉద్యాపన ఘట్టము:

              ఓ దేవకీ నందనా ఈ వ్రతమునకు ఉద్యాపన విధానము ఎలా? సుమతి ఎలా చేసాడు దాని వివరము చెప్పవలెను అనిన వసుదేవ సుతుడు ఇలా చెప్పుచుండెను.

          ఓ కుంతీ కుమారా! మొదటి రోజున అనేక ఆహార పదార్ధములను చేసి, ప్రోద్దునేలేచి, స్నానముచేసి, గురువుదగ్గరకు చేరి ఆ గురువును చూచి, ఓ స్వామినే చేయు ఉద్యాపనము ఆచార్యుండ వైఉండుము అని ప్రార్థించి ముందు చెప్పిన విధి ప్రకారము భక్తితో ప్రార్థించి పరిశుద్ధ ప్రదేశమును అలికి, అందు సర్వతొ భద్రమండలమను ఏర్పరచి (అనగా రాగి పాత్రైనకావచ్చును, రాగి చెంబుతో కలశమును తయారు చేసుకొనవలెను.

           ఆ చెంబునకు వస్త్రసూత్రమును కట్టి, పంచరత్నములను ఇచ్చి, పూలు, పండ్లు, గంధము, అక్షతలు మొ||గు వాటిచేత అర్పించి, ఇలా చేసిన తరువాత ఆ కలశమును పూజించవలెను.

            ఆ కలశము మీద సువర్ణ రజత తామ్రములతో (అనగా బంగారం, వెండి, రాగి మొ||వి ఏదైననూ శక్తిని మించక అనగా తమకున్న శక్తితో సప్తఋషుల బొమ్మలు చేయించి ఆ కలశములమీద ఉంచి ఫలపుష్పములతో కూడిన పంచవర్ణ నితానంబులను కట్టించి సమస్త పూజాద్రవ్యములతో మధ్యాహ్న సమయమున శ్రద్ధతో భక్తితో కశ్యషమహర్షి మొ||న సప్తఋషులను పూజించి, అరుంధతితో కూడిన కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్టులారా, నాచేత ఇవ్వబడిన అర్ఘ్యము తీసుకొని సంతోషములతో ఉండమని ప్రార్థించి,

          ఈవిధముగా పూజచేసి, స్థిరమైన మనసు కలవాడై, ఇలాంటి విధానముచే ఈవ్రతము ఏడు సంవత్సరముల చేయవలెను. దీనికి ఉద్యాపనము ఇంకను వేదవేదాం పారంగతులైన గురువులను ఋషులను పూజించి జటాజుటాసూత్రక మండల సమన్వితులును (అనగా బొమ్మలను) ఆకలశముల మీద ఉంచి పంచామృత స్నానమును భక్తితో చేయించి, విధ విధానము చేత సప్తర్షులను పూజించి, ఆ రాత్రి పురాణము చదువుటచేతను, వినుట చేతను జాగరణము చేసి, మరునాడు ఉదయమున స్నాన సంధ్యావంద నాదికములు ఆచరించి నిత్య కృత్యములు తీర్చుకొని (అనగా కాలకృత్యములు తీర్చుకొని) వేద మంత్రముల చేత నైననూ, పురాణములో చెప్పిన మంత్రములచేత నైననూ, వారి వారి అధికారమును అనుసరించి నువ్వులనూనె మొ||గు వాటిచే ఆ మంత్రములు చెప్పి, అష్టోత్తర, సహస్రములచేత నైనను లేక అష్టోత్తర శతనామములతో నైన వేరువేరుగా అర్చించవలెను.


         ఇట్లు చేసి, మరల పూజచేసి బంగారు ఆభరములు, వస్త్రకుండలములు అమృత భోజనములు ( అనగా పిండి వంటలు, పాయస పదార్ధములు మొ||న నెయ్యి, పెరుగు మొ||న వాటితో కూడిన పదార్ధములు) ఇలా అనేక దానములచే గురువును సంతోషపెట్టి, వస్త్రములతో (బట్టలతో అలంకరింపబడిన ఏడుగురు ఋగ్వేదము పాడు 'ఋత్వికులకు' వస్త్రములను యజ్ఞో పవీతములను, దక్షిణలను భక్తితో ఇచ్చి పూజించి, భార్యతొ కూడిన గురువునకు ప్రదక్షిణములతో సాష్టాంగ నమస్కారములు చేసి,

          అతని 'ఆజ్ఞ' (అనగా మాటను తీసుకొని వ్రతము పూర్తి చేసి, ఆ తరువాత భక్తితో మృష్టాన్నము (అనగా పంచ భక్ష, పాయసములతో కూడినది) పెట్టి బ్రాహ్మణులను తృప్తి పరచి దీన జనులకు భోజనము పెట్టి, ఋత్తికులకు తాంబూల దక్షిణలు ఇచ్చి సప్తర్షుల బొమ్మలను దానముచేసి, వారిచే ఆశీర్వాదము పొంది, వారి ఆజ్ఞను తీసుకొని ఇష్టమైన చుట్టములతో కూడి భుజింపవలెను.

           ఓ ధర్మరాజా ఎప్పుడూ ఫలం కోరువారు ఇలా చెప్పబడిన విధమున ఉద్యాపనము చేసి, ఈ వ్రతం చేయవలయును. ఇలా ఆచరించిన ఈ వ్రతము సర్వ తీర్ధముల యందు స్నానము చేసిన ఫలమును, అన్ని వ్రతములను ఆచరించిన పుణ్యమును ఇచ్చును.

          కావున ఓ ధర్మరాజా! ఏ వనిత (అనగా స్త్రీ) ఈ వ్రతమును ఆచరించునో ఆమె సమస్త పాపముల నుండి విముక్తురాలయు ఈ లోకమున చాలాకాలము పుత్రులతో పౌత్రులతో భర్తతో అనేక భోగముల అనుభవించి, నిత్య సౌభాగ్యముతో స్వర్గలోకములో కూడా పూజింపబడి చివరకు మోక్షము పొందును. అని శ్రీకృష్ణుడు చెప్పగా విని ధర్మరాజు సంతోషించెను.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

ఋషి పంచమి పూజావిధానం మరియు ఋషి పంచమి కథ

ఋషి పంచమి పూజావిధానం మరియు ఋషి పంచమి కథ

           ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధ చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండ కూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి) తో ముగ్గులు వేయాలి.

           సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దాని పై ఒక తమలపాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైఋతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు -

         దీపారాధన విధానము: దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో ( కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోన1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను.
          తర్వాత చేయు కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను.

          దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరి నూనెగాని, ఆవు నెయ్యిగాని వాడ వచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

ఘంటానాదము

శ్లో || ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్ కుర్యాద్ఘంటార వంతత్ర దేవతాహ్వాహన లాంఛ నమ్

           మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆనీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.

పూజకు కావలసిన వస్తువులు : 
       ఏ వ్రతమును (పూజకు) ఆచరించుచున్నామో ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకోనవలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరవత్తులు, వస్త్ర, యజ్ఞో పవీతములు, తోరములు ( తెల్లని దారమునకు పసుపు రాసి 9 వరసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి,

         ఈ తోరములను దేవునికి పూజ చేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు.) ప్రత్యేక నివేదన ( పిండి వంటలు) పిమ్మట యజమానులు (పూజ చేసే వారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచ మనం చేయాలి.

     ఈ నామములు మొత్తం 24 ఉన్నాయి.
 1. " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
2. " ఓం నారాయణాయ స్వాహా " అనుకుని ఒక సారి
3. " ఓం మాధ వాయ స్వాహా " అనుకుని ఒక సారి జలమును పుచ్చు కోవలెను. తరువాత
4. " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగుకోవాలి.
5. " ఓం విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్లతో కళ్లు తుడుచుకోవాలి.
6. " ఓం మధు సూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురు కోవాలి.
7. " ఓం త్రివిక్ర మాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
8, " ఓం వామనాయ నమః"
9" ఓం శ్రీధ రాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తల పై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
 10. " ఓం హృషీకేశాయ నమః" ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
11. " ఓం పద్మనాభాయ నమః" పాదాల పై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
12. " ఓం దామోద రాయ నమః" శిరస్సు పై జలమును ప్రోక్షించుకోవలెను.
13. " ఓం సంకర్షణాయ నమః" చేతి వ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
14. " ఓం వాసుదేవాయ నమః" వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
15, " ఓం ప్రద్యుమ్నాయ నమః"
16" ఓం అనిరుద్దాయ నమః" నేత్రాలు తాకవలెను.
 17" ఓం పురుషోత్తమాయ నమః"
18.ఓం అధోక్షజాయ నమః" రెండు చెవులూ తాకవలెను. 19. " ఓం నారసింహాయ నమ:
20. " ఓం అచ్యుతాయ నమః" బొడ్డును స్పృశించవలెను. 21. " ఓం జనార్ద నాయ నమః" చేతివ్రేళ్లతో వక్ష స్థలం, హృదయం తాకవలెను.
 22. " ఓం ఉపేంద్రాయ నమః" చేతి కొనతో శిరస్సు తాక వలెను.
23." ఓం హరయే నమః
24. " ఓం కృష్ణాయ నమః" కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపుర మును కుడి చెతితోను తాకవలెను.

          ఆచ మనము వెంటనే సంకల్పము చెప్పుకోవలెను. ఆచ మనము అయిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేల పై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను.

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే ||

ప్రాణాయామమ్య

ఓం భూ: - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓగ్o సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దెవస్య ధీమ హీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.

సంకల్పము

            మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపేభరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీ శైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదార్యో: మధ్య ప్రదేశే (మనం ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొన వలెను), శోభన గృహే ( అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ ఆస్మిన్ వర్త మానే వ్యావ హారిక చాంద్ర మానేన..............నామ సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), అయనే, ( సంవత్సరమునకు రెండు అయనములు - ఉత్త రాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ అయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ఋతు:, ( వసంత, గ్రీష్మ, వర్ష మొ|| ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము, అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) తిధౌ, ( ఆరోజు తిథి) వాసరే (ఆరోజు ఏ వార మనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిధౌ
           మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీరామా ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్.... గోత్రస్య..... నామధేయః, శ్రీ మత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అనియు ( పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మ పత్నీ సమేతస్య ( పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థ్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం ( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
తధంగ కలశ పూజాం కరిష్యే || పిద పకలశారాధ నను చెయవలెను.

కలశ పూజను గూర్చిన వివరణ

         వెండి, రాగి, లేక కంచు గ్లా సులు ( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను.
       ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు ( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి.
           ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను.

 మం || కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః|| ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః 

శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ, నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు || 

       ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీరామ. ( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గానీ చల్లాలి.

మార్జనము

        ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:|| 

        అని పిదపకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్ఠాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా

శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్ఠా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. 

తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే || సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||

        పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచార ములనగా ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి. పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచారములనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి.

షోడశో పచార పూజాప్రారంభ:

ధ్యానం:

శ్లో || ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి అని శ్రీ రాముని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం:

శ్లో || ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి. ఆవా హనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా మనస్ఫూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున అక్షతలు దేవుని పై వేయవలెను.

ఆసనం:

శ్లో || ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుట కై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం:

శ్లో || ఓం శ్రీ రామ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుట కై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :

శ్లో || ఓం శ్రీరామ నమః పాదౌ:పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్లు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం:

శ్లో || ఓం శ్రీరామ నమః ఆచమనీయం సమర్పయామి. అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతొ ఒక మారు నీరు వదలవలెను.

సూచన:

         అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పల్లెము) లో వదలరాదు.

మధుపర్కం : ఓం శ్రీ రామ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ, ఈ మధుపర్కాన్ని ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు

పంచామృత స్నానం :

ఓం శ్రీ రామ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్ధోదక స్నానం :
 ఓం శ్రీ రామనమః శుద్ధోదక స్నానం సమర్పయామి . పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .

వస్త్ర యుగ్మం :

ఓం శ్రీ రామనమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం :

ఓం శ్రీరామనమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.

గంధం :

ఓం శ్రీనమః గంధాన్ సమర్పయామి ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను. ఆభరణం :

 శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే | భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత || ఓం శ్రీ రామనమః ఆభరణాన్ సమర్పయామి

        అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.

 ఆధాంగ పూజ
. ఈ క్రింది నామాలను చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువును పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను. పిదప అగరువత్తిని వెలిగించి

ధూపం :

శ్లో || ఓం శ్రీ రామ నమః ధూప మాఘ్రాపయామి. ధూపం సమర్పయామి.
అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

 దీపం :
శ్లో || ఓం శ్రీరామ నమః సాక్షాత్ దీపం దర్శయామి
అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను.

నైవేద్యం :
 శ్లో || ఓం శ్రీరామ నైవేద్యం సమర్పయామి
అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి ఒక పల్లెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దాని పై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ

 ' ఓం భూర్భువస్సువః ఓం తత్ స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరి షించామి, ( ఋతంత్వా సత్యేత పరి షించామి అని రాత్రి చెప్పవలెను) అమృత మస్తు అమృతో పస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి.

 తదుపరి ఓం శ్రీరామ నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర ) లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్ధాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం

తాంబూలం

శ్లో || ఓం శ్రీరామ నమః తాంబూలం సమర్పయామి
 అని చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం
శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :

శ్లో |ఓం శ్రీరామ నమః కర్పూర నీరాజనం సమర్పయామి

అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,

మంత్ర పుష్పం :

శ్లో || ఓం శ్రీరామ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం:

శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ, నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన || శ్లో || ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక, ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే || శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే || ఓం శ్రీరామ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి ( మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి ) తరువాత స్వామి పై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసినులై నమస్కరించుచూ

పునః పూజ  :

ఓం రామ నమః పునః పుజాంచ కరిష్యే అని చెప్పుకొని, పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామి పై చల్లుతూ ఈక్రింది మంత్రములు చదువుకొనవలెను. విశేషో పచారములు: ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈక్రింది శ్లోకమును చదువుకొనవలెను.

పూజాఫల సమర్పణమ్:

శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్ మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం శ్రీరామర్పణమస్తు

           అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీరామ ప్రసాదం శిరసాగృహ్నామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

      ఓం శ్రీ రామ నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు. పూజా విధానం సంపూర్ణం.

తీర్ధ ప్రాశ నమ్ :

శ్లో || అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ | సమస్త పాపక్ష యకరం శ్రీరామ పాదో దకం పావనం శుభమ్ || అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

//వ్రత కథ తదుపరి పోష్టునందు చూడగలరు//

         


       భాద్రపద శుద్ధ పంచమి (26.08.2017,శనివారం)ని  ఋషి పంచమిగా వ్యవహరిస్తారు.

ఋషి పంచమి
      ఋషి పంచమి రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి.

         తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు :

 కశ్యప ఋషి :
 కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||
భరద్వాజ ఋషి :
జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
 గౌతమ ఋషి : 
యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
జమదగ్ని ఋషి :
అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
వసిష్ఠ ఋషి :
శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||    ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||
                                       సప్తఋషిభ్యో నమః

ఋషి పంచమి పూజావిధానం మరియు కథ.
//తదుపరి పౌష్టు నందు చూడగలరు//

శ్రీ గురుభ్యోనమ:
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Thursday 24 August 2017


వినాయక వ్రతకల్పం-పూజావిధానం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: - వామనాయ నమ: - శ్రీధరాయ నమ: - హృషీకేశాయ నమ: - పద్మనాభాయ నమ: - దామోదరాయ నమ: - సంకర్షణాయ నమ: - వాసుదేవాయ నమ: - ప్రద్యుమ్నాయ నమ: - అనిరుద్ధాయ నమ: - పురుషోత్తమాయ నమ: - అధోక్ష జాయ నమ: - నారసింహాయ నమ: - అచ్యుతాయ నమ: - జనార్దనాయ నమ: - ఉపేంద్రాయ నమ: - హరమే నమ: - శ్రీ కృష్ణాయ నమ:.

(గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).

శ్లో!! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!.

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||

వినాయక ప్రార్ధన:
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక:
లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప:
ధూమకేతు ర్గణాధ్యక్ష:, ఫాలచంద్రో గజానన:
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బ: స్కన్ద పూరజ:
షోడశైతాని నామాని య: పఠే చ్చ్రుణుయా దపి,
విద్యారమ్బే విహహే చ ప్రవేశే నిర్గమే తథా,
సజ్గ్రామే సర కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
అభీప్సితార్ధసిద్ధ్యర్ధం పూజితో యస్సు రైరపి,
సరవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: !!

సంకల్పం :
           ఓం ॥ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ…… నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ ….వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ….గోత్రః …. నామధేయః, శ్రీమతః ….గోత్రస్య ….నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.

              పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే ।

భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)vsspptpt

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా
తదంగ కలశపూజాం కరిష్యే ॥
కలశపూజ :

కలశం గంధపుష్పాక్షతై రాభ్యర్చ్య ( కలశానికి గంధపు బొట్లు పెట్టి, అక్షతలు అద్ది, లోపల ఒఖ పుష్పాన్ని వుంచి.. తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి.)vsspptpt

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాత్రుగణా: స్మృతా: !!
కుక్షౌతు సాగరా: సరే సప్తదీపా వసుంధరా !
ఋగ్వేదో విథ యజుర్వేద: సామవేదో అథర్వణ: !
అంగైశ్చ సహితా: సరే కలశాంబు సమాశ్రితా: !!
ఆయాన్తు దేవ పూజార్ధం దురితక్షయకారకా: !
గంగే చ యమునే చైవ గోదావరి సరసతి !
నర్మదే సింధూకావేరి జలేవిస్మిన్ సన్నిధిం కురు !!
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య.

(కలశమందలి జలమును చేతిలో పోసికొని, పూజకోరకై, వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది.)
తదంగతేన వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే
.
ప్రాణ ప్రతిష్ట :

మం !! అసునీతే పునరస్మాసు చక్షు:
పున: ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్సశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాప: ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
సామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకమ్ !
తావత్తం ప్రీతిభావేన బింబే విస్మిన్ సన్నిధిం కురు !!
ఆవాహితో భవ, స్థాపితో భవ , సుప్రసన్నో భవ , వరదో భవ, అవకుంఠితో భవ ,స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.

పూజా విధానమ్ :

శ్లోకం: భవసంచితపాఫౌఘవిధంసనవిచక్షం !
విఘ్నాంధకార భాసంతం విఘ్నరాజ మహం భజే !!
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్బుజం !
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ !!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం !
భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ధ్యాయామి.


శ్లోకం: అత్రా విగాచ్ఛ జగదంద్య సురరాజార్చితేశర
అనాధనాధ సరజ్ఞ గౌరీగర్బసముద్భవ !!
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి.

శ్లోకం: మౌక్తికై: పుష్పరాగైశ్చ నానారత్నే రిరాజితం !
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్ !!
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి.

శ్లోకం: గౌరీపుత్ర! నమస్తే విస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్ష తైర్యుతం !
శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.

శ్లోకం: గజవక్త్ర నమస్తేవిస్తు సరాభీష్టప్రదాయక !
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి.

శ్లోకం: అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత !
గృహాణ విచమనం దేవ !తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనీయం సమర్పయామి.

శ్లోకం: దధిక్షీర సమాయుక్తం మాధా హ్హ్యేన సమనితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్య నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి.

శ్లోకం: స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సరజ్ఞ గీరాణవరపూజిత !
శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.

శ్లోకం: యా ఫలిని ర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణి:
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచన్తగ్ హస:
శ్రీ వరసిద్ధి వినాయకాయ ఫలోధకేన సమర్పయామి.

శ్లోకం: గంగాది సరతీర్దేభ్య ఆహ్రుతై రమలైర్జలై :
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్దోదక స్నానం సమర్పయామి.

శ్లోకం: రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ తం లంబోదర హరాత్మజ
 శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్లోకం: రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయం గృహాణ దేవ సరజ్ఞ భక్తానామిష్టదాయక
 శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లోకం: చందనాగురుకర్పూరకస్తూరీ కుంకుమానితం విలేపనం సురశ్రేష్ఠ !ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతామ్
 శ్రీ వరసిద్ధి వినాయకం గంధాన్ సమర్పయామి.

శ్లోకం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానందశంభుపుత్ర నమోవిస్తుతే
 శ్రీ వరసిద్ధి వినాయకాయ అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

శ్లోకం: సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోవిస్తుతే
శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పై సమర్పయామి.

అథాంగ పూజా:

ఓం పార్వతీనందనాయ నమః |పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను) |
ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద) |
ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |
ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను) |
ఓం మహత్తమాయ నమః | మేఢ్రం పూజయామి
ఓం నాధాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను) |
ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని) |
ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము) |
ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును) |
ఓం స్కంధాగ్రజాయ నమః | స్కంధే పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ నమః | హస్తాన్ పూజయామి (చేతులను) |
ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను) |
ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను) |
ఓం శూర్పకర్ణాయనమః | కర్ణే పూజయామి (చెవులను) |
ఓం ఫాలచంద్రాయనమః | ఫాలం పూజయామి (నుదురును) |
ఓం నాగాభరణాయనమః | నాశికాం పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠా పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును) |
ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును) |
ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను) |

ఏకవింశతి పత్ర పూజ – (21 ఆకులు)
ఓం ఉమాపుత్రాయనమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయనమః | బృహతీపత్రం సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయనమః | బిల్వపత్రం సమర్పయామి (మారేడు) |
ఓం ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం సమర్పయామి (అనగా గరిక) |
ఓం ధూమకేతవే నమః | దుర్ధూరపత్రం సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే నమః | బదరీపత్రం సమర్పయామి (రేగు) |
ఓం అపవర్గదాయనమః | అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం ద్వైమాతురాయనమః | తులసీపత్రం సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ నమః | చూతపత్రం సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయనమః | కరవీరపత్రం సమర్పయామి (గన్నేరు) |
ఓం విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ నమః | దాడిమీపత్రం సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయనమః | ఆమలకీపత్రం సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధురాయ నమః | సింధూర పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయనమః | జాతీ పత్రం సమర్పయామి (జాజిపత్రి) |
ఓం గండగళన్మదాయ నమః | గండవీ పత్రం సమర్పయామి (తెల్లగరికె) |
ఓం శంకరప్రియాయనమః | శమీ పత్రం సమర్పయామి (జమ్మి) |
ఓం భృంగరాజ త్కటాయ నమః | అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి) |
ఓం అర్జునదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ నమః | అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు) |

ఏకవింశతి పుష్ప పూజా – (21 పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి |
ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి |
ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి |
ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి |
ఓం విద్యా గణపతయే నమః | దుర్ధూర పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి |
ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి |
ఓం కామితార్థప్రదగణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి |
ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి |
ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి |
ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి |
ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్చిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి |
ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి |

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఆఖువాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం వినాయకాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఈశపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఏకదంతాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం మూషికవాహనాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కుమారగురవే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కపిలవర్ణాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం మోదకహస్తాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం గజనాసికాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం గజముఖాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సుప్రసన్నాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం సురాగ్రజాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |
ఓం స్కందప్రియాయ నమః | దూర్వారయుగ్మం సమర్పయామి |

అష్టోత్తర శతనామ పూజ –
ఓం గజాననాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్విముఖాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం కృత్తినే నమః |
ఓం సుప్రదీపాయ నమః | 10
ఓం సుఖనిధయే నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం మంగళస్వరూపాయ నమః |
ఓం ప్రమదాయ నమః |
ఓం ప్రథమాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం విఘ్నకర్త్రే నమః |
ఓం విఘ్నహంత్రే నమః |
ఓం విశ్వనేత్రే నమః |
ఓం విరాట్పతయే నమః | 20
ఓం శ్రీపతయే నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం అగ్రపూజ్యాయ నమః |
ఓం అగ్రగామినే నమః |
ఓం భక్తనిధయే నమః |
ఓం శృంగారిణే నమః | 30
ఓం ఆశ్రితవత్సలాయ నమః |
ఓం మంత్రకృతే నమః |
ఓం చామీకరప్రభాయ నమః |
ఓం సర్వాయ నమః |
ఓం సర్వోపన్యాసాయ నమః |
ఓం సర్వకర్త్రే నమః |
ఓం సర్వనేత్రాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం సర్వసిద్ధయే నమః |
ఓం పంచహస్తాయ నమః | 40
ఓం పార్వతీనందనాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం కుమారగురవే నమః |
ఓం సురారిఘ్నాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహాకాలాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం లంబజఠరాయ నమః | 50
ఓం హ్రస్వగ్రీవాయ నమః |
ఓం మహేశాయ నమః |
ఓం దివ్యాంగాయ నమః |
ఓం మణికింకిణి మేఖలాయ నమః |
ఓం సమస్తదేవతామూర్తయే నమః |
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం కుంజరాసురభంజనాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం మహోదరాయ నమః |
ఓం మదోత్కటాయ నమః | 60
ఓం మహావీరాయ నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం విష్ణుప్రియాయ నమః |
ఓం భక్తజీవితాయ నమః |
ఓం జితమన్మథాయ నమః |
ఓం ఐశ్వర్యకారణాయ నమః |
ఓం జయినే నమః |
ఓం యక్షకిన్నరసేవితాయ నమః |
ఓం గంగాసుతాయ నమః |
ఓం గణాధీశాయ నమః | 70
ఓం గంభీరనినదాయ నమః |
ఓం వటవే నమః |
ఓం అభీష్టవరదాయ నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం శివప్రియాయ నమః |
ఓం శీఘ్రకారిణే నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం జలోత్థితాయ నమః |
ఓం భవాత్మజాయ నమః | 80
ఓం బ్రహ్మవిద్యాదిధారిణే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం సతతోత్థితాయ నమః |
ఓం విఘాతకారిణే నమః |
ఓం విశ్వదృశే నమః |
ఓం విశ్వరక్షాకృతే నమః |
ఓం భావగమ్యాయ నమః |
ఓం మంగళప్రదాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః | 90
ఓం అప్రాకృతపరాక్రమాయ నమః |
ఓం సత్యధర్మిణే నమః |
ఓం సఖ్యై నమః |
ఓం సరసాంబునిధయే నమః |
ఓం మోదకప్రియాయ నమః |
ఓం కాంతిమతే నమః |
ఓం ధృతిమతే నమః |
ఓం కామినే నమః |
ఓం కపిత్థఫలప్రియాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః | 100
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం కళ్యాణగురవే నమః |
ఓం ఉన్మత్తవేషాయ నమః |
ఓం వరజితే నమః |
ఓం సమస్తజగదాధారాయ నమః |
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః |
ఓం ఆక్రాంతపదచిత్ప్రభవే నమః |
ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః | 108

అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి ||
నానావిధపత్రపుష్పాణి సమర్పయామి ||

ధూపం
దశాంగం దేవదేవేశ సుగంధం చ మనోహరం |
ధూపం దాస్యామి వరద గృహాణ త్వం గజాననా ||
శ్రీ మహాగణపతిం ధూపమాఘ్రాపయామి |

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం దీపం దర్శయామి |

నైవేద్యం
శాల్యన్నం షడ్రసోపేతం ఫల లడ్డుక మోదకాన్ |
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం స్వీకురు శాంకరే ||
శ్రీ మహాగణపతిం నైవేద్యం సమర్పయామి |

పానీయం
పావనం శ్రేష్ఠం గంగాది సలిలాహృతం |
హస్త ప్రక్షాళనార్థం త్వం గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం హస్త ప్రక్షాళనం సమర్పయామి |

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ మహాగణపతిం తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి

నీరాజనం
నీరాజనం నీరజస్కన్ కర్పూరేణ కృతం మయా |
గృహాణ కరుణారాశే గజానన నమోఽస్తు తే||
శ్రీ మహాగణపతిం నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |

మంత్రపుష్పం
జాజీచంపక పున్నాగ మల్లికా వకుళదిభిః |
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణద్విరదాననా ||
శ్రీ మహాగణపతిం మంత్రపుష్పం సమర్పయామి |

(అవకాశమున్నవారు అనంతరము స్వర్ణపుష్పమును సమర్పించవలెను.)

ప్రదక్షిణం
యనికాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే ||

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా |
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయకా ||

ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||

శ్రీ మహాగణపతిం ప్రదక్షిణం సమర్పయామి |

నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్ట ప్రదోభూయా వినాయక నమోఽస్తు తే ||
శ్రీ మహాగణపతిం సాష్టాంగ నమస్కారం సమర్పయామి |

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం ||
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
శ్రీ మహాగణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి |

ఛత్రం
స్వర్ణదండసమాయుక్తం ముక్తాజాలకమండితం |
శ్వేత పట్టాత పత్రం చ గృహాణ గణనాయక ||
శ్రీ మహాగణపతిం ఛత్రం సమర్పయామి |

చామరం
హేమదండసమాయుక్తం గృహాణ గణనాయక |
చమరీవాలరజితం చామరం చామరార్చితా ||
ఉశీనిర్మితం దేవ వ్యజనం శ్వేదశాంతిదం
హిమతోయ సమాసిక్తం గృహాణ గణనాయక||
శ్రీ మహాగణపతిం చామరం వీజయామి |

శ్రీ మహాగణపతిం ఆందోళికార్థం అక్షతాన్ సమర్పయామి
శ్రీ మహాగణపతిం సమస్త రాజోపచారాన్, దేవోపచారాన్ సమర్పయామి |

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధం పుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం సిద్ధి వినాయకనమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

నమస్తే భిన్నదంతాయ నమస్తే వరసూనవే |
యిదమర్ఘ్యం ప్రదాశ్యామి గృహాణ గణనాయక ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం సిద్ధి వినాయకాయ నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం |

అనేన అర్ఘ్యప్రదానేన భగవాన్ సర్వాత్మకః సిద్ధివినాయకః ప్రియతాం |

అర్పణం
యస్యస్మృత్యా చ నామోక్త్యా తవః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||

అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


శ్రీ వినాయక వ్రత కథ

       గణపతి జననము: సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు।

        ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది,

        విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అని సెలవిచ్చాడు.
             విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు।

          అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు।

             నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది।

            తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది,

           ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

          జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు।

        విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు.గణపతిని ముందు పూజించాలి: గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది।

           శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు।

            గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు।

         నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం
          గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు।

          ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

         చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు.

          కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
           ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి
 వినాయకచవితి ఎప్పుడు చేయాలి, పూజా విధానం
వినాయకుని ఆవిర్భావం
           ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి.
విధుల్లో మంటపాన్ని పెట్టి ఆవాహన చేసేవాళ్ళు సాయంత్రం లోపు చేయాలి.

వినాయకుని ఆవిర్భావం 

           భర్త కైలాసానికి వస్తున్నట్టు తెలుసుకున్న పార్వతి ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడి బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్లింది.

        ఆ సమయంలో శివుడు కైలాసం చేరుకున్నాడు. లోనికి వెళ్లనీయకుండా శివుడిని బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్లాడు. పార్వతీదేవి స్నానం చేసి, సర్వాలంకారాలతో శివుడి వద్దకు వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూండగా వాకిట్లో తనను అడ్డగించిన బాలుడిని సంహరించినట్టు శివుడు చెప్పాడు.

         ఆ వార్తతో పార్వతి దుఃఖించడం మొదలు పెట్టింది. పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు శివుడు. ఆదిదంపతులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించారు. అతడికి ఎలుకను వాహనంగా ఇచ్చారు. కొన్ని రోజులకు శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.

            ఇతడిని దేవతలకు సేనా నాయకుడిగా నియమించారు. ఒకరోజు దేవతలు, మునులు కలసి కైలాసానికి వచ్చారు. విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని పరమేశ్వరుని వేడుకున్నారు. గజాననుడు మరుగుజ్జు, అసమర్థుడని, ఆ ఆధిపత్యాన్ని తనకే ఇవ్వమని కుమారస్వామి తండ్రిని కోరాడు.

          దీంతో శివుడు ‘‘ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానం చేసి ఎవరు ముందుగా నా వద్దకు వస్తారో, వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను’’ అని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ముల్లోకాలు తిరగడం మొదలు పెట్టాడు.

               గజాననుడు బాధతో తండ్రి వద్దకు వచ్చి ‘‘నాన్నా..నా అసమర్థత తెలిసీ ఇలాంటి పరీక్షను పెట్టారు. దీనికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి’’ అని వేడుకున్నాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన వాడికి ఆ ఫలితం లభిస్తుందని శివుడు చెప్పాడు. వెంటనే గజాననుడు ఆ విధంగా చేశాడు.

           మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తనకన్నా ముందుగా స్నానం చేసి వెళుతున్న గజాననుడు కనిపించాడు. చివరకు తండ్రి వద్దకు వచ్చిన కుమారస్వామి తన ఓటమిని అంగీకరించాడు. దీంతో శివుడు గజాననునికి విఘ్న ఆధిపత ్య పదవి ఇచ్చాడు.

       ఆరోజు భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్లు ఇచ్చి పూజించిన వారికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరం ఇచ్చాడు. ఆ రోజు భక్తులు పెట్టిన కుడుములు, ఉండ్రాళ్లు తిని కైలాసానికి వచ్చిన వినాయకుడు తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయడానికి అవస్థ పడుతుండటం చూసిన చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దిష్టి తగిలి వినాయకుని కడుపు పగిలింది. మరణించిన వినాయకుని చూసి పార్వతి దుఃఖించింది. ‘‘నిన్ను చూసిన జనం పాపాత్ములై, నీలాపనిందలు పొందుతారు’’ అని చంద్రుని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు

           పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.

         అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది.

             కావున శాపాన్ని ఉపసంహరించుకో’’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం

            ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు.

               శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు.

           శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

            శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు.

              ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు.

            వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు.

             శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’’ అన్నారు.

        ‘‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు.  ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.

      ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

వినాయక చవితి పూజా విధానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే |

          మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ! అవి ఆణిముత్యాలతో గూడిన ముత్యాలహారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది "వినాయకచవితి'.

        తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నలనుండి పెద్దలవరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున విశేషంగా గణపతి పుట్టిన రోజు అయిన ఈ రోజు జరుపుకుంటూ ఉంటాము.

          మహేశ్వరాది దేవతా గణాలందరికీ గణపతి ప్రభువు. అంటే! హిందువుల యొక్క సకలదేవతా గణాలకు ఆయనే ప్రభువన్నమాట. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది మనకు. బ్రహ్మవైవర్తన పురాణమందు 'గణ' శబ్దానికి విజ్ఞానమని 'ణ' అంటే తేజస్సు అని చెప్పబడియున్నది.

         ఈ ప్రపంచం అంతా గణాలతో కూడుకుని యున్నది. అటువంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం! అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన "మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి.

ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు.
1. మహా గణపతి,
2. హరిద్రాగణపతి
8. స్వర్ణగణపతి
4. ఉచ్చిష్ట గణపతి
5. సంతాన గణపతి
6. నవనీత గణపతి అని;
                  అలాగే ప్రపంచం అంతటా వారివారి ప్రాంతీయతను బట్టి భిన్న రూపాలతో ఆరాధిసూ ఉంటారు. ఈ జ్యేష్ఠరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి గణపతికిచ్చి వివాహం చెయ్యగా! వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఈయన ఆరాధనవల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.

21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వీటినే 'ఏకవింశతి' పత్రాలు అంటారు
అయితే ఆ 21 పత్రాలు ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాగని ఏ ఆకుపడితే ఆ ఆకును పూజలో వినాయకునికి సమర్పించకూడదు.

వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు :
1. మాచీ పత్రం/మాచ పత్రి ,
2. దూర్వా పత్రం/గరిక ,
3. అపామార్గ పత్రం/ఉత్తరేణి ,
4. బృహతీ పత్రం/ములక,
5. దత్తూర పత్రం/ఉమ్మెత్త,
6. తులసీ పత్రం/తులసి,
7. బిల్వ పత్రం/మారేడు,
8. బదరీ పత్రం/రేగు,
9. చూత పత్రం/మామిడి,
10. కరవీర పత్రం/గన్నేరు,
11. మరువక పత్రం/ ధవనం,
12. శమీ పత్రం/జమ్మి,
13. విష్ణుక్రాంత పత్రం,
14. సింధువార పత్రం/వావిలి,
15. అశ్వత్థ పత్రం/రావి,
16. దాడిమీ పత్రం/దానిమ్మ,
17. జాజి పత్రం/జాజిమల్లి,
18. అర్జున పత్రం/మద్ది ,
19.దేవదారు పత్రం ,
20. గండలీ పత్రం/లతాదూర్వా,
21. అర్క పత్రం/జిల్లేడు.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకుల్ని పట్టణాల్లో అయితే కొనుగోలు చేస్తారు. అదే  పల్లెల్లో అయితే ఎక్కడైనా లభ్యమవుతాయి
( వినాయక చవితి వ్రత కల్పం మరియు షోఢచోపచార పూజా విదానం వివరంగా తదుపరి పోష్టులో పోష్టు చేయబడినది)
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నాగF,ఖాదీ కాలనీ,తిరుపతిP

Wednesday 23 August 2017

భాద్రపద శుక్ల తదియ(24.08.2017) గురువారం హరితాళిక గౌరీ వ్రతం/సువర్ణగౌరి వ్రతం

భాద్రపద శుక్ల తదియ(24.08.2017) గురువారం
హరితాళిక గౌరీ వ్రతం/సువర్ణగౌరి వ్రతం

         హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం : భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.

హరితాళిక వ్రతం విశిష్టత 

     కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది  “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తిక్షిశద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు”అని అడిగింది.

           ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షవూతంతో కూడిన తదియయందీ వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు.

          ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. విను!” అన్నాడు.భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్పర్వతము కలదు. హిమవంతుడా ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు. చిన్నతనం నుంచే శివభక్తురాలవు.

          యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా?యని హిమవంతుడాలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తడ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయవపూను? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు.

        వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నమున కన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.

        హిమవంతుడానందంతో భార్యాపిల్లలకావిషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి పొర్లిపొర్లి దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది.

          నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనవూపాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు. నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు.

          నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరావూతివలె ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు.

          16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథులు ముళ్లు వేసి తోరానికి గ్రంథిపూజచేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయక చవితిరోజు దంపతులకు భోజ, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి.

          ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకతలింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జన చేయాలని శివుడు పార్వతికి తెలియజేయాలి. కథ తప్పినా వాక్కు తప్పదు.
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 21 August 2017


మంగళవారం 22.08.2017 భాద్రపదమాసం ప్రారంభం మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం).. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి.


భాద్రపద మాసం విశిష్టత

     భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. కాని వరాహజయంతి, వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు.

      దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.
      భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే.
        అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ‘దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు.

        ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
మహాలయ పక్షం ;
      భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ‘మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేను రోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.

భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : 

హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం
      భాద్రపద శుక్ల పక్ష తదియనాడు  ‘హరితాళిక వ్రతం’ లేదా  ‘సువర్ణ గౌరీ వ్రతం’ ‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
శుక్ల తదియ : ఉండ్రాళ్ళ తద్ది
     భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
శుక్ల చవితి : వినాయక చవితి
      ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా  ‘గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి
     తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ‘పరివర్తన ఏకాదశి’ అని, ‘విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ‘పద్మ పరివర్తన ఏకాదశి’  అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి
      దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి

     అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ‘అనంత చతుర్దశి వ్రతం’ లేదా ‘అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.

కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి
     అజ ఏకాదశికే ‘ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.

కన్యా సంక్రమణం
ఈ చరాచర జగత్తుకు వెలుగును , చైతన్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సింహరాశి నుండి రాశులలో ఆరవదైన కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాదు. ఈ రోజు పూజలు, దానాలు చేయడంతోపాటు సూర్యభగవానుడిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను


మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం)

           భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి.
        పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.


కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే |

యాచిత్వాపి నరః కుర్యాత్ పితౄణాం తన్మహాలయం ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి.

        అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు.
         గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

          దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

         ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

         అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

         కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

          ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

         ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు.

         ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.



శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ |

అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్ ||

ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః |

కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై ||

భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే |

అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం ||

క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః |

దరిద్రోరోదనం కుర్యాత్ ఏవంకాననభూమిషు ||

తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః |

హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః ||

           పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి