Thursday 14 September 2017

శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః

శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః

ఓం శ్రీ సాయినాథాయ నమః |
ఓం లక్ష్మీనారాయణాయ నమః |
ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః |
ఓం శేషశాయినే నమః |
ఓం గోదావరీతటశిరడీవాసినే నమః |
ఓం భక్తహృదాలయాయ నమః |
ఓం సర్వహృన్నిలయాయ నమః |
ఓం భూతావాసాయ నమః |
ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః |
ఓం కాలాతీతాయ నమః || 10 ||

ఓం కాలాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కాలదర్పదమనాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం అమర్త్యాయ నమః |
ఓం మర్త్యాభయప్రదాయ నమః |
ఓం జీవాధారాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం భక్తావసనసమర్థాయ నమః |
ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః || 20||

ఓం అన్నవస్త్రదాయ నమః |
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః |
ఓం ధనమాంగళ్యప్రదాయ నమః |
ఓం ఋద్ధిసిద్ధిదాయ నమః |
ఓం పుత్రమిత్రకలత్రబంధుదాయ నమః |
ఓం యోగక్షేమవహాయ నమః |
ఓం ఆపద్బాంధవాయ నమః |
ఓం మార్గబంధవే నమః |
ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః |
ఓం ప్రియాయ నమః || 30 ||

ఓం ప్రీతివర్ధనాయ నమః |
ఓం అంతర్యామినే నమః |
ఓం సచ్చిదాత్మనే నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం పరమసుఖదాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం జ్ఞానస్వరూపిణే నమః |
ఓం జగతఃపిత్రే నమః || 4౦ ||

ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః |
ఓం భక్తాభయప్రదాయ నమః |
ఓం భక్తపరాధీనాయ నమః |
ఓం భక్తానుగ్రహకాతరాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః |
ఓం భక్తిశక్తిప్రదాయ నమః |
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః |
ఓం ప్రేమప్రదాయ నమః |
ఓం సంశయహృదయ దౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః |
ఓం హృదయగ్రంథిభేదకాయ నమః || 50 ||

ఓం కర్మధ్వంసినే నమః |
ఓం శుద్ధసత్వస్థితాయ నమః |
ఓం గుణాతీతగుణాత్మనే నమః |
ఓం అనంతకళ్యాణగుణాయ నమః |
ఓం అమితపరాక్రమాయ నమః |
ఓం జయినే నమః |
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః |
ఓం అపరాజితాయ నమః |
ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః |
ఓం అశక్యరహితాయ నమః || 60 ||

ఓం సర్వశక్తిమూర్తయే నమః |
ఓం స్వరూపసుందరాయ నమః |
ఓం సులోచనాయ నమః |
ఓం బహురూపవిశ్వమూర్తయే నమః |
ఓం అరూపవ్యక్తాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం సర్వాంతర్యామినే నమః |
ఓం మనోవాగతీతాయ నమః |
ఓం ప్రేమమూర్తయే నమః || 70 ||

ఓం సులభదుర్లభాయ నమః |
ఓం అసహాయసహాయాయ నమః |
ఓం అనాథనాథదీనబంధవే నమః |
ఓం సర్వభారభృతే నమః |
ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః |
ఓం తీర్థాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సతాంగతయే నమః |
ఓం సత్పరాయణాయ నమః || 80 ||

ఓం లోకనాథాయ నమః |
ఓం పావనానఘాయ నమః |
ఓం అమృతాంశువే నమః |
ఓం భాస్కరప్రభాయ నమః |
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః |
ఓం సత్యధర్మపరాయణాయ నమః |
ఓం సిద్ధేశ్వరాయ నమః |
ఓం సిద్ధసంకల్పాయ నమః |
ఓం యోగేశ్వరాయ నమః |
ఓం భగవతే నమః || 90 ||

ఓం భక్తవత్సలాయ నమః |
ఓం సత్పురుషాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం సత్యతత్త్వబోధకాయ నమః |
ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః |
ఓం అభేదానందానుభవప్రదాయ నమః |
ఓం సమసర్వమతసమ్మతాయ నమః |
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః |
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః |
ఓం అద్భుతానందచర్యాయ నమః || 100 ||

ఓం ప్రపన్నార్తిహరాయ నమః |
ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః |
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః |
ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః |
ఓం సర్వమంగళకరాయ నమః |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః |
ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః |
ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః || 108 ||
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

సాష్టాంగ నమస్కారం అంటే...?

సాష్టాంగ నమస్కారం అంటే...?

స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.

శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!

అష్టాంగాలు :

ఉరసు అంటే తొడలు,
శిరసు అంటే తల,
దృష్టి అనగా కళ్ళు,
మనసు అనగా హృదయం,
వచసు అనగా నోరు,
పద్భ్యాం - పాదములు,
కరాభ్యాం - చేతులు,
కర్నాభ్యాం - చెవులు.
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు
తగిలించాలి.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.
 పై చిత్రపఠంలో చూపిన విధంగా చేయవలయును
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 11 September 2017

ఈ రోజు(12.09.2017) మంగళ వారం కావేరి పుష్కరము ప్రారంభం.

ఈ రోజు(12.09.2017) మంగళ వారం కావేరి పుష్కరము ప్రారంభం.

               కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీజలాల వివాదమే గుర్తుకువస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమతల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు…

                మన దేశంలోని ముఖ్య నదులన్నింటి జననం వెనుకా ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరీనదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే రుషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవడంతో.ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను, కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు.

                 గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ రోజు 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది.

           తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.

ఎక్కడ పుట్టింది?
            పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.

            యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.

        యుక్తవయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహసమయంలో కావేరి ఒక షరతుని విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే... తన దారిని తను చూసుకుంటానన్నదే ఆ షరతు. అగస్త్యుడు చాలాకాలం ఆ షరతుకి లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావడంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది.



మరో గాథ ప్రకారం కావేరిని అగస్త్యుడు తన కమండలంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు కమండంలో నుంచి కావేరి అరుపులను విన్న వినాయకుడు ఆమెను విడిపించాలని అనుకున్నాడు. అందుకోసం గణేశుడు ఒక కాకి రూపాన్ని ధరించి ఆ కమండలాన్ని ఒంపేశాడు. దాంతో అందులో ఉన్న కావేరి జలరూపంగా బయటకు రాగలిగింది. అప్పటి నుంచి కావేరి జలరూపంలో ప్రవహిస్తోందని నమ్ముతారు.



గాథలు ఏవైనా కావేరి నది దక్షిణభారతీయుల పాలిట దాహార్తిని తీర్చే దేవతే! కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రవహిస్తూ కొన్ని లక్షల ఎకరాల పొలాలను సాగునీటిని అందిస్తోంది. వందేళ్ల క్రితం కావేరి మీద నిర్మించిన ‘కృష్ణరాజసాగర్ డ్యాం’ పుణ్యమా అని కర్ణాటక కరువుకి దూరంగా ఉంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కావేరి నదీ జలాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేశారు.



కావేరి నదీజలాల విషయాన్ని అలా ఉంచితే, ధార్మికంగా కూడా కావేరి తీరం యావత్తూ పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా తోస్తుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల మీద ఈ కావేరి నది ఉద్భవిస్తుంది. కావేరి జన్మించిన ఆ స్థానంలో నదీస్నానం ఆచరించేందుకు వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని తలకావేరి అని పిలుస్తారు. తలకావేరితో పాటుగా శ్రీరంగం, తిరుచిరాపల్లి, కుంబకోణం, తిరువాయూరులాంటి అనేక క్షేత్రాలు కావేరి తీరాన ఉన్నాయి.



కావేరి నది తమిళనాడులోని పూంపుహార్‌ పట్నం దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ పట్నాన్ని ‘కావేరి పూంపట్టినం’ అని పిలిచేవారు. ఇది చోళుల రాజధానిగా ఉండేది. చోళులకి కావేరీ నది అంటే చాలా ఇష్టంగా ఉండేదేమో! అందుకనే చోళుల కాలంలో కావేరీ తీరం పొడవునా దాదాపు 300 ఆలయాలను నిర్మించారట. ఇవే కాకుండా ‘పంచరంగ క్షేత్రాలు’ పేరుతో కావేరి తీరాన రంగనాథస్వామి పేరిట ఐదు ఆలయాలు వెలిశాయి. మనకి పంచారామాలు ఎలాగో తమిళవాసులకు పంచరంగ క్షేత్రాలు అలాగన్నమాట. వీటిలోని శ్రీరంగం గురించి అందరికీ తెలిసిందే!

             కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.

             తలకావేరి, కుషల్‌ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్‌ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్‌ కావేరీనది వరప్రసాదమే.

             బెంగళూరు పులి టిప్పుసుల్తాన్‌ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది.  తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్‌ గార్డెన్స్‌... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.

పుణ్యతీర్థాలు
           చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం.

భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి.

పుష్కర స్నాన విధి
             ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి.

             మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.

ఏమిటీ పుష్కరం?
           పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Tuesday 5 September 2017

మహాలయ పక్ష పితృ తర్పణము --విధానము

   మహాలయ పక్ష పితృ తర్పణము --విధానము
           మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.
తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.
            ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..
తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు.

            సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి అభిమతము

           సాధారణ సంక్రమణము మరియు అమావాశ్య లందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

విధానము

శ్రీమతే వేద పురుషాయ నమః
         పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. తర్పణము అర్థము , అవసరము ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

దర్శ శ్రాద్ధము

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం
పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిధి

| ప్రాచీనావీతి |
అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |
దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |
హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||
|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||
అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |
ఉపవీతి |

ప్రదక్షిణం |
|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |
నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||
| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |
( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )
తర్పణమ్

           దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .
పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..
ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

         తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.
తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

         తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు.
అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు
గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...

         ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు.ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి.

 ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..
విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి.

         తర్వాత ,ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము :

( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆ రోజు తిథి పేరు )..... వాసరే ( ఆరోజు వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....
విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే.( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

           ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )
శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

     మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్
అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,
-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |
|| సకృదాఛ్చిన్నం బర్హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )
ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||
ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )
పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |

 పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

|| ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |
అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||
-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |
తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||
------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

 పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||
--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||
--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||


ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )
 || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః |  ధ్వీర్నః సంత్వోషధీః ||
-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||
------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||
------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి |

 మాతృ తర్పణం ( మూడు సార్లు )
------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

పితామహీ తర్పణం
-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ప్రపితామహీ తర్పణం
--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )
మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

|| ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |
అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||
--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

|| అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |
తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

 || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||
---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||
--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||
---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )
|| మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||
--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||
--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

|| మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||
-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

 మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

 మాతుః పితామహీ తర్పణం
--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

 మాతుః ప్రపితామహీ తర్పణం
------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి

అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |
నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం
| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

ప్రవర
|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |
ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి

|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |

ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |
నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః ||

ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||
దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక 

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||
అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |
అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )
మీ
వేద, శాస్త్ర,స్మార్త, పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

భాద్రపదమాసం బహుళ పాడ్యమి (06.09.2017, బుధవారం) మహాలయ పక్షం ప్రారంభం

మహాలయ పక్ష ప్రారంభం

మహాలయ పక్షము
             భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు.
                అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము.
            ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.
 
         ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు. పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెలరోజుల్లోని రెండో సగంలో ఎంతో మంది దేవతలూ మునులూ మరణించారు.

      కాబట్టి దాన్ని 'మహాలయం' అనారు.అదే 'మహాలయ పక్షం' అయింది. అందుకే ఈ పదిహేనురోజులూ శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణప్రవచనం.

              అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైనా అన్నశ్రాద్ధం పెట్టాలనీ అదీ కుదరనివారు హిరణ్యశ్రాద్ధం చేయవచ్చనీ, అది కూడా చేసే తాహతులేనివారు పితృదేవతలను తలచుకుని కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

          పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:

1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తిధి

            వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు.
       తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

పక్షంలోని తిథులు

1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
3. తదియ (అధి దేవత - గౌరి)
4. చవితి (అధి దేవత - వినాయకుడు)
5. పంచమి (అధి దేవత - సర్పము)
6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
8. అష్టమి (అధి దేవత - శివుడు)
9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
10. దశమి (అధి దేవత - యముడు)
11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
14. చతుర్దశి (అధి దేవత - శివుడు)
15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)

మహాలయ పక్షం.....! 

         మహాలయ పక్ష ప్రారంభం /శుద్ధ పూర్ణిమ పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి. పితృ దోషం అంటే ఒక శాపం.

      గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

           పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

 ఉదాహరణకి
         ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి.

       దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది.

            ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది.

              పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు.

             పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు.

            సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.

      ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి.

       శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.

           అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

తిధులలో చేస్తే వచ్చే ఫలితం చూద్దాం

 పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది

విదియ యనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది

 తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు

చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు

పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.

 సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

 అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి

 నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది

దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది

ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది

 ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది.

 త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

 చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

 అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.

        ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.

              ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు.

         శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.

            ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.

           ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి.

            కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి.  ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (సెప్టెంబరు 20) నైనా చేసి తీరాలి.

పురాణ కథ

           దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

          ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

              స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

            కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

            ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే( సెప్టెంబరు.20) మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

పితృ దేవతా స్తుతి

                 శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది.

              పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహా పురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

1.నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!

2.నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

3.నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

4.నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

5.నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

6.నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

7.నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

8.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

9.నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

10.నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

11.నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

12.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

13.నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

14.పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

15.పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

16.పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

17.తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

18.సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

19.యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

20.యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

21.కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

22.దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

23.పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

24.తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

25.యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

26.రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

27.అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

28.అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

29.ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

30.సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

31.కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

32.వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

33.మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

34.సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

35.ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!

యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!

తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

రుచిరువాచ
1.అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

2.ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

3.మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

4.నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!

5.ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

6.నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

7.సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

8.అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

9.యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

10.తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

         ........పితృ తర్పణమ్ విధానం తదుపరి పోష్టులో చూడగలరు.........
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

అనంత వ్రత కధా ప్రారంభము


అనంత వ్రత కధా ప్రారంభము

               సూత పౌరాణి కుండు శౌనకాది మహర్షులను చూచి యిట్లనెను. మునివర్యులారా ! లోకంబున
మనుజుండు దారిద్ర్యముచే పీడింప బడుచున్నచో అట్టి దారిద్ర్యమును తొలగ చేయునట్టి ఒక శ్రేష్టమైన వ్రతము కలదు. దానిని చెప్పెదను వినుడు.

          పూర్వము పాండురాజ పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో అరణ్యమున నివసించు చుండగా (అరణ్య
వాసము ) చేయుచు మిక్కిలి కష్టములను అనుభవించుచూ ఒకనాడు కృష్ణుని చూచి "
మహాత్మా ! నేను తమ్ముల తోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచూ మిగుల కష్టము
చెంది యున్నవాడను , ఇట్టి కష్ట సాగరము నందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలయు " నని ప్రార్ధించిన శ్రీ కృష్ణుడు ఇట్లనియె.

            ' ఓ ధర్మరాజా ! పురుషునకును , స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రతము అనునొక వ్రతము కలదు . మఱియు ఆ అనంత వ్రతమును భాద్ర పద శుక్ల పక్ష చతుర్దశి నాడు చేయవలెను . అట్లు చేసినచో కీర్తియును, సుఖమును , శుభమును, పుత్ర లాభమును గలుగు " నని చెప్పిన కృష్ణునితో ధర్మరాజు ఇట్లనియె .

           " ఓ రుక్మిణీ ప్రాణ వల్లభా ! ఆ అనంతుడను దైవము ఎవరు ? ఆది శేషుడా !లేక తక్షకుడా ! లేక సృష్టి కర్తయైన బ్రహ్మయా ! లేక పరమాత్మ స్వరూపుడా " యని అడిగిన ధర్మరాజుతో శ్రీ కృష్ణుడు ఇట్లు అనెను . " ఓ పాండు పుత్రా ! అనంతుడనువాడను నేనే తప్ప మరి యెవరును కాదు .

            సూర్య గమనముచే కళా కాష్ట ముహూర్త ములనియు , పగలు రాత్రియనియు , యుగ సంవత్సర ఋతు మాస కల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పు చున్న కాలం బెద్ది కలదో అదియే నా స్వరూపము. నేనే కాల స్వరూపుడను , అనంతుడు అను పేరున భూభారము తగ్గించుట కొరకును , రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని.

          నన్ను కృష్ణుని గాను , విశ్నునిగాను , హరిహర బ్రహ్మలుగాను , సర్వ వ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను , సృష్టి స్థితి లయ కారణ భూతునిగను , అనంత పద్మనాభునిగను, మత్స్య, కూర్మ ఆద్యవతార స్వరూపునిగను తెలుసుకొనుము. ఏ నా హృదయ మందే పదునాలుగు భువనములను , అష్ట వసువులను ,ఏకాదశ రుద్రులను , ద్వాదశాదిత్యులను , సప్తర్షులును, సరి దద్రి ద్రుమములను , భూలోకం , ఆకాశం , స్వర్గం ఉన్నచో అట్టి నా స్వరూపమును నీ కెరింగించితి " ననిన ధర్మరాజు కృష్ణ మూర్తిం గాంచి " ఓ జగన్నాధా ! నీవు వచించిన అనంత వ్రతం బెటులాచరింప వలయును?

           ఆ వ్రతంబాచరించిన ఏమి ఫలము గలుగును ? ఏ ఏ దానములను చేయవలయును ? ఏ దైవమును పూజింప వలయును ? పూర్వము ఎవరు ఈ వ్రతమును ఆచరించి సుఖము పొందిరి ? అని అడిగిన ధర్మరాజుతో కృష్ణ మూర్తి యిట్లనియె.

        ఓ ధర్మరాజా ! చెప్పెదను వినుము. పూర్వయుగము లందు వసిష్ఠ గోత్రము నందు జన్మించినవాడు , వేద శాస్త్రములను అధ్యయనం చేసినవాడు అయిన సుమంతుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భ్రుగు మహాఋషి పుత్రికయగు దీక్షా దేవియను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణ వతియను ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీల యను నామకరణము చేసిరి.

            ఇట్లుండగా కొన్ని దినములకు దీక్షాదేవి తాప జ్వరంబుచే మృతి నొందెను.పిదప సుమంతుడు వైదిక కర్మ లోప భయంబుచే కర్కశ యను కన్యను వివాహము చేసుకొనెను . ఆ కర్కశ మిగుల కటిన చిత్తు రాలుగను, గయ్యాళి గను , కలహా కారిణి గను ఉండెను. ఇట్లుండ ప్రధమ బార్యయగు దీక్షాదేవి పుత్రిక యైన శీల ,తండ్రి గృహముననే పెరుగుచూ ,గోడల యందును ,గడపల యందును చిత్ర వర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచూ , కూటము మొదలగు స్థలములందు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టుచూ దైవ భక్తి గలదై యుండెను.

          ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయు చుండ కౌండిన్య మహా ముని కొన్ని దినంబులు తపస్సు చేసి , పిదప పెండ్లి చేసుకోన వలయునను ఇచ్చ (కోరిక ) కలిగి దేశ దేశములం తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను .

          అంత సుమంతుడు కౌండిన్య మహా మునిని అర్ఘ్య పాద్యాదులచే పూజించి శుభ దినంబున శీలయను తన కూతురు నిచ్చి వివాహము చేసెను..ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానమును ఇయ్యవలయునని తలంచి తన భార్య యగు కర్కశ యొద్దకు పోయి " ఓ ప్రియురాలా ! మన యల్లునికి ఏదైనా బహుమానము ఇయ్యవలయును గదా ! ఏమి ఇయ్యవచ్చు " నని అడుగగనే ఆ కర్కశ చివుక్కున లేచి లోపలి పోయి తలుపులు గడియ వేసికొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను.

             అంత సుమంతుడు మిగుల చింతించి దారి బత్తెంబుకైనా (దారి ఖర్చులకైనను) ఇయ్యక పంపుట యుక్తము కాదని (మంచిది కాదని ) తలంచి పెండ్లికి చేయబడి మిగిలి యుండెడు పేలపు పిండిని ఇచ్చి అల్లుని తోడ కూతురును పంపెను. అంత కౌండిన్యుండును సదాచార సంపన్నురాలగు భార్య తోడ బండి నెక్కి తిన్నగ తన ఆశ్రమమునకు పోవుచూ మద్యాహ్న వేళ యైనందున సంధ్యా వందనాది క్రియలు సల్పుటకై బండి దిగి తటాకంబునకు (సరస్సునకు ) వెళ్ళెను.

            ఆ దినము అనంత పద్మనాభ చతుర్దశి కావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేకమంది స్త్రీలు ఎఱ్ఱని వస్త్రములు ధరించి మిక్కిలి భక్తి యుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ సేయు చుండగా కౌండిన్యుని బార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు పోయి , "ఓ వనితా మణులారా ! మేరే దేవుని పూజించు చున్నారు ? ఈ వ్రతము పేరేమి ? నాకు సవిస్త రంబుగా చెప్పవలయు " నని ప్రార్దించగా ,

           ఆ పతివ్రతలు యిట్లనిరి. "ఓ పుణ్యవతీ చెప్పెదము వినుము . ఇది అనంతపద్మనాభ స్వామి వ్రతము . ఈ వ్రతమును చూచినచో అనంత ఫలంబు లబించును . మఱియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్ర వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయముచే (ఆవు పేడతో ) అలికించి సర్వతో భద్రంబను ఎనిమిది దళములు (ఆకులు) గల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి , ఆ మండపమునకు చుట్టును పంచ వర్ణపు (అయిదు రంగుల ) ముగ్గుల తోను , తెల్లని బియ్యపు పిండి చేతను ముగ్గులను అలంకరించి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున (కుడి వైపు ) కలశమును ఉంచి అందులో కొద్ది నీటిని పోసి , ఆ వేదిక నడుమ సర్వ వ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని వుంచి అందు ఆవాహనం చేసి ,

శ్లో | కృత్వా దర్భ మయం దేవం శ్వేత ద్వీపై స్థితం హరిమ్
సమన్వితం సప్త ఫణై : పింగళాక్షం చతుర్భుజం ||

           అను శ్లోకమును పటిస్తూ శ్వేత ద్వీపవాసిగను , పింగళాక్షుండుగను, సప్త ఫణ సహితుండుగను, శంఖ చక్ర గదాధరుండుగను ధ్యానము చేసి , కల్పోక్త ప్రకారముగా షోడశోప చార పూజలొనర్చి , ప్రదక్షిణ నమస్కార ములను చేసి పదునాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరమును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి ఐదు పళ్ళ (ఐదు శేర్లు ) గోధుమ పిండితో ఇరువదెనిమిది అతిరసములం (అరిశెలు లేదా అప్పములు ) చేసి నైవేద్యము పెట్టి తోరమును కట్టుకొంంవలయును

          పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు ఉపాయాస దానములిచ్చి (దక్షిణ తాంబూలమును ఇచ్చి ) తక్కిన వానిని తాను భుజింప వలయును. మఱియు పూజ ద్రవ్యములన్నియు పదునాలుగేసిగా నుండ వలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ నుండవలయును.

            ఓ శీలా ! ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సర ము నందు ఉద్యాపనము చేసి మరల వ్రతము నాచరించు చుండవలయు " నని చెప్పిన కౌండిన్య ముని భార్య యగు శీల తక్షణంబున స్నానం బొనర్చి యా స్త్రీల సాహాయము వలన వ్రతము నాచరించి తోరము గట్టుకొని దారి బత్తెమునకు గాను తెచ్చిన పిండిని వాయన దాన మిచ్చి తానును భుజించి సంతుష్టయై , భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండి నెక్కి ఆశ్రమమునకు బోయెను.

               అంత శీల అనంత వ్రతము ఆచరించిన మహత్యము వలన ఆశ్రమ మంతయు స్వర్ణ మయముగాను (బంగారముతో నిండినది గాను ), గృహము నందు అష్టైశ్వర్యములు కలిగి యుండుట చూచి దంపత లిరువురును సంతోష భరితులై సుఖముగ నుండిరి . శీల గోమేధిక పుష్య రాగ మరకత మాణిక్యాది మణి గణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములను కావించు చుండెను.

             అట్లుండ ఒకనాడు దంపతు లిరువురు కూర్చుండి యుండగా దురాత్ముడగు కౌండిన్యుడు శీల చేతికి గల తోరమును చూచి ' ఓ కాంతా ! నీవు చేతియందొక తోరము కట్టుకొని యున్నావు గదా ! అదెందులకు కట్టుకొని యున్నావు ? నన్ను వశ్యంబు చేసికొనుటకా లేక మరియొకరి ని వశ్యంబు చేసికొనుటకు కట్టుకోన్నావా యని అడిగిన ఆ శీల యిట్లనియె ..

            " ఓ ప్రాణ నాయకా ! అనంత పద్మనాభ స్వామిని పూజించి ఆ తోరమును ధరించి యున్నాను . ఆ దేవుని అనుగ్రహంబు వలననే మనకు ఈ ధన ధాన్యాది సంపత్తులు గలిగి యున్న " వని యదార్ధము వచించిన కౌండిన్యుండు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్ర చేసి అనంతుడనగా ఏ దేవుడిని దూషించుచూ ఆ తోరమును త్రెంచి భగ భగ మండు చుండేడు అగ్నిలో పడ వైచెను.

                 అంత నా శీల హాహా కారం బొనర్చుచూ పరుగెత్తి పోయి యా తోరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టెను.పిదప కొన్ని దినంబులకు కౌండిన్యుడు ఇట్టి అపరాధము చేసి నందు వలన అతని ఐశ్వర్య మంతయు నశించి గోధనములు దొంగల పాలై , గృహమగ్ని పాలయ్యెను . గృహమున వస్తువులన్నియు నశించెను . ఎచ్చటికీ పోయినను కలహము సంభ వించి ఎవరును మాటలాడ రైరి .

                    అంత కౌండిన్యుడు ఏమియుం తోచక దారిద్ర్యముచే పీడింప బడుచు వనములో ప్రవేశించి క్షుద్బాదా పీడితుడై అనంత పద్మనాభ స్వామి జ్ఞాపకము కలిగి ఆ మహాదేవుని మనసున ధ్యానించుచూ పోవుచూ ఒక చోట పుష్ప ఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనను వ్రాలకుండుట గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో నిట్లనియె .

                 ఓ వృక్ష రాజమా ! అనంతుడను నామంబు గల దైవమును చూచితివా ? అని అడిగిన నా వృక్షము నెరుంగ నని చెప్పెను అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చి గడ్డిలో అటునిటు దూడతో తిరుగుచున్న గోవును చూచి ఓ కామ దేనువా అనంత పద్మనాభ స్వామిని చూచితివా యని అడిగిన అదియు తానెరుగ నని చెప్పెను. పిదప కౌండిన్యుడు కొంత దూరము పోయి పచ్చికలో నిలుచుండిన ఒక వృషభమును (ఎద్దును ) గాంచి ఓ వృషభ రాజా ! అనంత పద్మనాభ స్వామిని చూచితివా ? అని అడిగిన , అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదని చెప్పెను.

            మరి కొంత దూరము పోగా మనోహరమైన రెండు కొలనులు తరంగములతోను , కమల కల్హార కుము దోత్పలంబుల తోను హంస కారండవ చక్ర వాకాదులతో కూడి జలంబు మరియొక కొలనుకు పొరలు చుండుట చూచి కమలా కరంబులారా ! మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడుగగా

                మేమెరుగమని చెప్పగా , కౌండిన్యుడు మరి కొంత దూరము పోయి ఒక చోట నిలుచుని యుండి న గాడిద , ఏనుగులను చూచి మీరు అనంత పద్మనాభస్వామిని జూచితిరా యని అడిగెను. అవియును మేమెరుంగ మని చెప్పెను. అంత కౌండిన్యుడు మిగుల విషాదంబు చెంది మూర్చ బోయి క్రింద పడెను. అప్పుడు భగవంతుడు కృప కలిగి వృద్ద బ్రాహ్మణ రూప దారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి"

                 ఓ విప్రోత్తమా ! ఇటురమ్మ " ని పిలిచి తన గృహమునకు తీసుకొని పోయెను .అంత ఆ గృహము నవరత్న మణి గణ ఖచితంబుగను, దేవాంగనల తోడం గూడియు నుండుట చూచి యాశ్చర్యం బు నొంది యుండ , సదా గరుడ సేవింతుండుగను , శంఖ చక్ర ధరుండుగను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుండు సంతోష సాగర మగ్నుండై భగవంతుని ఈ విధంబున భజియించెను .

శ్లో || నమో నమస్తే వైకుంట శ్రీ వత్స శుభ లాంచన త్వన్నామ స్మరణాత్పా సమ శేషం నః ప్రణశ్యతి , నమో నమస్తే గోవిందా నారాయణ జనార్ధనా ||

             అని అనేక విధముల స్తోత్రము చేసిన అనంత పద్మనాభుడు మిగుల సంతుష్టుడై ఓ విప్రోత్తమా ! నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంత సించితిని. నీకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభ వించ కుండునటులను, అంత్య కాలమున శాశ్వత విష్ణు లోకము కలుగు నట్లును వరము నిచ్చితి ననిన కౌండిన్యుడు ఆనందాంబుధం తేలుచూ ఇట్లనియె.

              ఓ జగన్నాధా ! నే త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంత మేమి ? ఆ ఆవు ఎక్కడిది ? ఆ వృష భంబు ఎక్కడ నుండి వచ్చే ? ఆ కొలను విశేషంబేమి ? ఆ గాడిద ,ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వరని అడిగిన భగవంతుడిట్లనియె . ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా ! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికిని నుపయోగించని మామిడి చెట్టుగా జన్మించెను.

              పూర్వము ఒకండు మహాబాగ్య వంతుడై యుండి తన జీవిత కాలము నందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగు చున్నాడు. ముందొక రాజు ధన మదాందుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభంభై అడవిలో తిరుగు చున్నాడు .

                 ఆ కొలనులు (సరస్సులు ) రెండును ధర్మం ఒకటి , అధర్మం ఒకటి అని ఎరుంగుము . ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు ఉండి నందున గాదిదయై పుట్టి తిరుగు చున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసు కొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను.

                  అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్ష మైతిని .కాన నీవు ఈ అనంత వ్రతంబును పదునాలుగు సంవత్సరములు ఆచరించి తివేని నీకు నక్షత్ర స్థానము నిచ్చెదనని వచియించి భగవంతుడు అంతర్దానము నొందెను. పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతంబు నాచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపద లనుభవించి యంత్య కాలమున నక్షత్ర మండలంబు చేరెను.

              ఓ ధర్మరాజా ! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబు నందు కానం బడుచున్నాడు. మఱియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు నాచరించి లోకంబునం ప్రసిద్ది పొందెను. సగర , దిలీప, భరత, హరిశ్చంద్ర , జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతంబొనర్చి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అత్యంబున స్వర్గము పొందిరి. కావున ఈ వ్రత కధను సాంతము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యములు అనుభవించి పిదప ఉత్తమ పదంబును (స్వర్గ ప్రాప్తిని ) పొందుదురు.

             ఇతి భవిష్యోత్తర పురాణమున చెప్ప బడిన అనంత వ్రత కధ సంపూర్ణం
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 4 September 2017

ఈ రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి(05.09.2017,మంగళ వారం) అనంత పద్మనాభ వ్రతం

ఈ రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి(05.09.2017,మంగళ వారం)
అనంత పద్మనాభ వ్రతం
              శ్రీమహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు. కాలాత్మకుడిగా, ఆది మధ్యాంత రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు. అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరించిన ఆయన అనంత పద్మనాభుడిగా వర్ధిల్లుతున్నాడు.

             బ్రహ్మ సృజించిన సమస్త జగత్తుకూ ఆధార కారకుడు పద్మనాభుడే అని చెబుతారు. మహా భారతంలోని శాంతిపర్వం ఆ స్వామి వైభవాన్ని వర్ణించింది.

అధ శ్రీ మదనంత పద్మనాభ పూజా కల్పః

ధ్యానం ;
శ్లో || కృత్వా దర్బ మయం దేవం పరిధాన సమన్వితం
ఫణై స్సప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షిణాగ్ర కరే పద్మం శంఖం తస్యా ప్యధః కరే
అవ్యయం సర్వ లోకేశం పీతాంబర ధరం హరిం
దుగ్దాబ్ది శాయనం ద్యాత్వా దైవ మావాహయే త్సుదీ ||
ఓం నమో భగవతే వాసుదేవాయశ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః - ధ్యానం సమర్పయామి

 అని స్వామిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం :
శ్లో || అగచ్చానంత దేవేశ తేజో రాశే జగత్పతే
ఇమాం మాయా కృతం పూజాం గృహాణ సుర సత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి

         అని ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం .అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను .

ఆసనం ;
శ్లో || అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః
రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆసనం సమర్పయామి . నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి .

             దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీత వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

తోరస్తాపనం :
శ్లో || తస్యాగ్ర తోదృడం సూత్రం కుంకు మాక్తం సుదోరకం
చతుర్దశ గ్రంధి సంయుక్తం ఉప కల్ప్య ప్రజాజయేత్ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోరా స్థాపనం కరిష్యామి

          అని 14 ముడులతో సిద్దం చేసి ఉంచుకున్న ఎర్రని దారముతో చేసిన తోరమును ( ఎర్రని దారము కానిచో తెల్లని దారముతో తయారు చేసి కుంకుమ నీళ్ళలో ముంచినది ) స్వామిపై వేయవలెను.

వస్త్ర యుగ్మం :
శ్లో || శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే ,
పీతాంబర ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి

         అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని వస్త్రయుగ్మం అంటారు ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

ఉపనీతోత్తరీయాన్ :
శ్లో || నారాయణ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్ ,
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఉపనీతోత్తరీయాన్ సమర్పయామి

          అనగా జందెమును ఇవ్వవలెను . ఇదియును ప్రత్తితో చేయ వచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపు చేత్తో బ్రొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దవలెను. దీనిని స్వామిపై ఉంచవలెను.

గంధం :
శ్లో || శ్రీ గంధం చంతనో న్మిశ్రం కుంకుమాది భిరంవితం,
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః గంధాన్ సమర్పయామి
గంధమును రెండు మూడు చుక్కలు స్వామిపై చల్లవలెను .
అక్షతాన్ :
 శ్లో || శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్ ,అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో .శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
అని కొద్ది అక్షతలను తీసుకొని ( పసుపు కలిపిన బియ్యమును ) స్వామిపై చల్లవలెను.

పుష్ప పూజ :
శ్లో || కరవీరై ర్జాతి కుసుమైశ్చం పకైర్వకు లై శ్శుభై :
శత పత్రైశ్చ కల్హారైరర్చయే పురుషోత్తమ.
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పుష్పాణి పూజయామి

            కొద్ది పుష్పములను తీసుకొని స్వామీ పాదములపై ఉంచి నమస్కరించ వలెను .

 అధాంగ పూజను ఒక్కొక్క నామమునకు పువ్వులు లేదా పసుపు లేదా కుంకుమను స్వామిపై వేస్తూ పూజించవలెను.

అధాంగ పూజ
ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి ;
 ఓం శేషాయ నమః గుల్ఫౌ పూజయామి ;
ఓం కాలాత్మనే నమః జంఘే పూజయామి ;
ఓం విశ్వ రూపాయ నమః జానునీ పూజయామి;
 ఓం జగన్నాదాయ నమః గుహ్యం పూజయామి;
ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి ;
ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి;
 ఓం శ్రీ వత్స వక్షసే నమః వక్ష స్థలం పూజయామి ;
ఓం చక్ర హస్తాయ నమః హస్తాన్ పూజయామి ;
ఓం ఆజాను బాహవే నమః బాహున్ పూజయామి ;
ఓం శ్రీ కంటాయ నమః కంటం పూజయామి ;
 ఓం చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి ;
ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి ;
ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి ;
 ఓం నారాయణాయ నమః నేత్రౌ పూజయామి ;
ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి ;
ఓం అనంత పద్మనాభాయ నమః శిరః పూజయామి ;
ఓం విష్ణవే నమః సర్వాణ్యం పూజయామి .

         ఈ క్రింది తెలిపిన 108 నామములకు ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు గాని , పసుపు గాని , కుంకుమ గాని వేయుచు ఈ నామములతో పూజించ వలెను.

అర్ఘ్యం :
శ్లో || అనంత గుణ రత్నాయ విశ్వ రూప ధరాయచ
అర్ఘ్యం దదామితే దేవ నాగాది పతయే నమః
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి

          అని దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళిస్తు న్నామని మనసున తలుస్తూ , ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :
శ్లో || సర్వాత్మన్ సర్వ లకేశ సర్వ వ్యాపిన్ సనాతనా ,
పాద్యం గృహణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి

          అనుచు దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్ర లోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం ;
 శ్లో || దామోదర నమస్తేస్తు నర కార్ణ వ తారక ,
గృహణచ మనం దేవ మయా దత్తం హికేశవ .||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి
         అని దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణె తో ఒక మారు నీరు వదలవలెను .

సూచన : 
అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను . అరివేణం లో వదలరాదు.

మధుపర్కం :
శ్లో || అనంతానంత దేవేశ అనంత ఫల దాయక ,
దధి మధ్వాజ్య నమ్మిశ్రం మధుపర్కం దదామితే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి

       అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు.)

పంచామృత స్నానం :
శ్లో || అనంత గుణ గంభీర విశ్వా రూప ధరానమ ,
పంచామృ తైశ్చ విదివత్స్నా పయామి దయానిధే ||
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి

         అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవు పాలు , ఆవు పెరుగు ,తేనె , పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం :
శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ ,
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు,
స్నానం ప్రకల్పయే త్తీర్ధం సర్వ పాప ప్రముక్తయే .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి

    అని పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

అష్టోత్తర శతనామ పూజా

ఓం కృష్ణాయ నమః
ఓం తమల శ్యామలా కృతియే నమః
 ఓం దుర్యోదన కులాంతకాయ నమః
ఓం కమల నాదాయ నమః
ఓం గోపా గోపీశ్వరాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
 ఓం వాసుదేవాయ నమః
ఓం యోగినే నమః
ఓం విశ్వ రూప ప్రదర్శకాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం కోటి సూర్య సమ ప్రభాయ నమః/ 40 /
ఓం సత్యవాచే నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం ఇలాపతయే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
 ఓం పుణ్యాయ నమః
ఓం పరంజ్యోతిషే నమః
 ఓం సత్య భామా రతాయ నమః
ఓం లీలా మానుష విగ్రహాయ నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం జయినే నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యదూద్వహాయ నమః
 ఓం సుభద్రా పూర్వజాయ నమః /80/
 ఓం యశోదా వత్సలాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం విష్ణవే నమః
ఓం హరి : యే నమః
ఓం పీతవసనే నమః
 ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః
 ఓం చతుర్భుజాత్త సక్రాసి గదా నమః
ఓం పారిజాతా పహారికాయ నమః
 ఓం జగద్గురువే నమః
 ఓం శంఖాంబుజా యుదాయుజా నమః
ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః
ఓం జగన్నాధాయ నమః
 ఓం దేవకీ నందనాయ నమః
ఓం గోపాలాయ నమః
 ఓం వేణునాద విశారదాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం సర్వ పాలకాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం నంద గోప ప్రియాత్మజాయ నమః
ఓం అజాయ నమః
ఓం బాణాసుర కరాంత కృతే నమః
ఓం యమునా వేద సంహారిణే నమః
ఓం నిరంజనాయ నమః
ఓం యుధిష్టర ప్రతిష్టాత్రే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం బర్హి బర్హావతంసకాయ నమః
ఓం పూతనా జీవిత హరాయ నమః
 ఓం కంజ లోచనాయ నమః
ఓం పార్ధసారదియే నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం నంద వ్రజజనా నందినే నమః
ఓం మధురా నాదాయ నమః
ఓం గీతామృత మహోదదియే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం కాళీయ ఫణి మాణిక్యరం నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం బలినే నమః
ఓం జిత శ్రీ పదాంబుజాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః
ఓం దామోదరాయ నమః
ఓం నవనీత హరాయ నమః
ఓం తులసీధామ భూషణాయ నమః
ఓం యజ్ఞ భోక్త్రే నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం శమంతక మణే ర్హర్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః
ఓం నర నారాయణాత్మకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం కుబ్జ కృష్ణాంబర ధరాయ నమః
ఓం పర బ్రహ్మణే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం మాయినే నమః
ఓం పన్నాగాశన వాహనాయ నమః
ఓం శుకవాగ మృ తాబ్దీందవే నమః
ఓం పరమ పురుషాయ నమః
ఓం జలక్రీడా సమాసక్త గోపీ నమః
ఓం గోవిందాయ నమః
ఓం ముష్టి కాసుర చాణూర నమః
ఓం వస్త్రా పహారకాయ నమః
ఓం యోగినాం పతయే నమః
ఓం మల్ల యుద్ద విశారదాయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం వత్సవాటి చరాయ నమః
ఓం సంసార వైరిణే నమః
ఓం తీర్ధ కృతే నమః
ఓం అనంతాయ నమః
ఓం కంసారయే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం మురారయే నమః
ఓం దయానిధయే నమః
ఓం తృణీ కృత తృణవర్తాయ నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం సర్వ తీర్దాత్మకాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం సర్వ గ్రహ రూపిణే నమః
ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః
ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః
ఓం పరాత్పరాయ నమః
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .

          తదుపరి పద్నాలుగు ముళ్ళు కలిగిన తోరమును స్వామీ వద్ద ఉంచి , క్రింది నామములతో పసుపు కాని , కుంకుమ లేదా పువ్వులతో పూజించ వలెను.

తోర గ్రంధి పూజా
ఓం కృష్ణాయ నమః ప్రధమ గ్రంధిం పూజయామి
ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంధిం పూజయామి
ఓం కాలాయ నమః చతుర్ధ గ్రంధిం పూజయామి
ఓం బ్రాహ్మణే నమః పంచమ గ్రంధిం పూజయామి
ఓం భాస్కరాయ నమః షష్టమ గ్రంధిం పూజయామి
ఓం శేషాయ నమః సప్తమ గ్రంధిం పూజయామి
ఓం సోమాయ నమః అష్టమ గ్రంధిం పూజయామి
ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంధిం పూజయామి
ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంధిం పూజయామి
ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంధిం పూజయామి
ఓం సృష్టి స్థిత్యన్త కారిణే నమః ద్వాదశ గ్రంధిం పూజయామి
ఓం అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంధిం పూజయామి
ఓం అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంధిం పూజయామి

ధూపం :
శ్లో || వనస్పతి సైర్దివ్యై ర్నాగా గంధైశ్చ సంయుతం ,
ఆఘ్రేయ సర్వ దేవానాం దూపోయం ప్రతి గృహ్యాతాం
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ధూపం సమర్పయామి

       అంటూ అగరువత్తులను వెలిగించి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపించవలెను.

దీపం :
శ్లో || సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా ,
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం.
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః దీపం సమర్పయామి సాక్షాత్
దీపం దర్శయామి

    అని ఇది వరకు తెలిపిన విధంగా దీపారాదనలో వున్న అదనపువత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంటమ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం :
 శ్లో || నైవేద్యం గృహ్య దేవేశ భక్తిం మే హ్యచ లాంకురు
ఈప్సితం మేవరం దేహి పరత్రచ పరాం గతిం .
అన్నం చతుర్విధం భక్ష్యై : రసై : షడ్బి : సమన్వితం ,
మయా నివేదితం తుభ్యం స్వీకురు ష్వ జనార్ధన .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

         అని పళ్ళు ,కొబ్బరికాయ ,ప్రత్యేకంగా నివేదనకు చేసిన ప్రత్యేక పదార్దములు స్వామీ వద్ద వుంచి

 ' ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం అనంత పద్మనాభ స్వామినే నమః '

         ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో ) స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ స్వామి నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి ' అని ఉద్దరిణె తో పంచ పాత్ర లోని నీరు ఇది వరకు యమునా వ్రతం లో తెలిపిన విధంగా అర్ఘ్య పాత్ర ( పంచపాత్ర కాకుండా
విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .

          తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణె తో వదలాలి .పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి .

తాంబూలం :
 శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం ,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తాంబూలం సమర్పయామి

 అని చెపుతూ మూడు తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి స్వామి వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , 'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణె తో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి

నీరాజనం :
శ్లో || సమస్సర్వ హితార్ధాయ జగదాధారా మూర్తయే
సృష్టి స్థిత్యంత రూపాయ హ్యనంతాయ నమోనమః
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః నీరాజనం సమర్పయామి

అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి , మూడు
మార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను . అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరంశుద్దాచామనీయం సమర్పయామి'

              అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .తరువాత చేతిలో పువ్వులు , అక్షతలు ,చిల్లర డబ్బులుపట్టుకొని

మంత్ర పుష్పం :
 శ్లో || నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు : ప్రచోదయాత్ |ఆకాశాత్పతితం తోయం యదా గచ్చతి సాగరంసర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ||ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి

 అనిచెప్పుకొని చేతిలో ఉన్న పువ్వులు , అక్షతలు ,చిల్లర స్వామివారి పాదముల వద్దఉంచవలెను.

ప్రదక్షిణ నమస్కార0: 
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే .
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన ,

నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీ ధర
నమస్తే సర్వా నాగేంద్ర నమస్తే పురుషోత్తమ .
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

         అని శ్రీ స్వామికి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ
ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకొని తలను నెలకు ఆన్చి , ఆడువారు మోకాళ్ళపై
పడుకొని కుడికాలు ఎడమకాలు పై వేసి చేయవలెను ) తరువాత స్వామిపై ఉన్న అక్షతలు
పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ

తోర గ్రహణం :
శ్లో || దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవృద్దయే
అనంతాఖ్య మిదం సూత్రం దారయామ్యహ ముత్తమమ్.
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోర గ్రహణం కరిష్యామి

అని స్వామి వద్ద వుంచి పూజించిన తోరములను చేతిలోనికి తీసుకొని పై శ్లోకమును చదువు కొనవలెను .

తోర నమస్కారం ; 
శ్లో || అనంత సంసార మహాసముద్ర మగ్నం మమభుద్దర వాసుదేవ అనంత రూపిన్ వినియోజయ స్వహ్య నంత సూత్రాయ నమో నమస్తే
శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోర నమస్కారం సమర్పయామి

           అని స్వామి వద్ద నుంచి తీసుకొన్న తోరమును చేతియందుంచుకొని నమస్క రించవలెను

తోర బంధనం :
శ్లో || సంసార గహ్వర గుహాసు సుఖం విహర్తుం
వాంచం తియేకురుకులోద్వ హ శుద్ధ సత్వాః
సం పూజ్యచ త్రిభువనేశ మనంత రూపం
బద్నంతి దక్షిణ కరే వరదో రకంతే .
అనంత పద్మనాభ స్వామినే నమః తోర బంధనం కరిష్యామి

             అని స్వామిని స్మరించి తోరమును దక్షిణ హస్తమున (కుడి చేతికి ) కట్టుకోనవలెను .

జీర్ణ తోర విసర్జనం :
శ్లో || అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక
సూత్ర గ్రంధి షు సంస్థాయ విశ్వరూపాయతే నమః
అని పాతదైన తోరమును విప్పుతూ పై శ్లోకమును చాడువుకోనవలెను .

ఉపాయన దానం : 
శ్లో || అనంతః ప్రతి గృహ్జా తి అనంతో వైడ దాతిచ ,
అనంత స్తార కోభ్యాభ్యా మనంతాయ నమోనమః

పునః పూజ :
ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే

           అని చెప్పుకొని , పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి , అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .

ఛత్రంఆచ్చాదయామి , చామరం వీజయామి , నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి సమస్త
రాజోపచార , శక్త్యోపచార , భక్త్యోపచార పూజాం సమర్పయామి

అనుకొని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .

ఏతత్ఫలం శ్రీ కృష్ణార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను.

' శ్రీ కృష్ణ ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని స్వామివద్దఅక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. తదుపరి పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను . దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

శ్లో| యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ,యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే, అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార
పూజాయాచ భగవాన్సర్వాత్మక :
శ్రీ అనంత పద్మనాభ స్సుప్రీతో వరదో భవతు , శ్రీ
అనంత పద్మనాభ ప్రసాదం శిరసా గృహ్ణామి

 అని దేవునికి నమస్కరించి ప్రసాదమును
స్వీకా రించవలెను .
ఇతి అనంత పద్మనాభ వ్రత పూజావిధానం సమాప్తమ్

     .......అనంత పద్మనాభ వ్రత కథ తదుపరి పోష్టు నందు చూడగలరు.......
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

అనంత వ్రతం/యమునా వ్రతం

ఈ రోజు భాద్రపద శుద్ధ చతుర్దశి(05.09.2017,మంగళ వారం)
అనంత వ్రతం/యమునా వ్రతం

              శ్రీమహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు. కాలాత్మకుడిగా, ఆది మధ్యాంత రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు. అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరించిన ఆయన అనంత పద్మనాభుడిగా వర్ధిల్లుతున్నాడు. బ్రహ్మ సృజించిన సమస్త జగత్తుకూ ఆధార కారకుడు పద్మనాభుడే అని చెబుతారు. మహాభారతంలోని శాంతిపర్వం ఆ స్వామి వైభవాన్ని వర్ణించింది.

          ‘అనంతుడంటే నేనే! పగలు, రాత్రి, దిన, వార, పక్ష, మాస, రుతు, సంవత్సరాలన్నీ నేనే! విరాట్‌ శక్తిని, కాల పురుషుణ్ని నేనే!’ అని శ్రీకృష్ణుడు తన సమగ్ర మూర్తి మత్వాన్ని ధర్మరాజుకు విశదపరచాడంటారు. లోకాల్ని సంరక్షించేది, సంలీనం చేసేది కాలనియమ ప్రవర్తకుడైన అనంతుడేనని బ్రహ్మ వర్ణించాడంటున్నాయి పురాణాలు.

             సృష్టి ఆవిర్భావానికి, వృద్ధికి ముఖ్య భూమిక అనంతుడిదేనని ‘భవిష్య పురాణం’ చెబుతుంది. అనంతుణ్ని వ్రత విధాన నేపథ్యంగా ఆరాధించేదే అనంత పద్మనాభస్వామి వ్రతం. దీన్ని భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఆచరిస్తారు.

          సర్వ శుభదాయకమైన వ్రతాన్ని ఉపదేశించాలని శ్రీకృష్ణుణ్ని కోరాడు ధర్మరాజు. ఆయన అనంత ఫలాన్ని అందజేసే అనంత చతుర్దశి వ్రత విధానాన్ని వివరించాడట. భవిష్య పురాణం ఉత్తర పర్వంలో ఈ వ్రతాచరణ రీతి కనిపిస్తుంది. అగస్త్య మహర్షి పరివ్యాప్తి కల్పించాడంటారు.
           దక్షిణాపథంలో ఆయన తొలిసారిగా అనంత వ్రతం నిర్వహించిన ప్రదేశం- తిరువనంతపురం. పూర్వ నామం- శ్రీ అనంతవ్రతపురం. ఈ క్షేత్రంలో శేషతల్పశాయిగా అనంత పద్మనాభుడు వెలుగొందు తున్నాడు.

                   యోగనిద్రా ముద్రాంకితుడైన అనంత పద్మనాభస్వామి పద్నాలుగు లోకాలకు అధిపతి. ఏడేసి వూర్ధ్వ, అధోలోకాలు ఆయన అధీనంలోఉంటాయంటారు
అందుకే అనంత వ్రతంలో 14 సంఖ్యకు ప్రాధాన్యముంది. వ్రత విధానంలో ‘ప్రతిసర బంధనం’- అంటే, తోర ధారణ ప్రధానమైనది. కుంకుమతో అలంకరించిన పద్నాలుగు పోగుల దారంతో తోరాన్ని తయారుచేస్తారు.
             శ్రీకృష్ణాష్టోత్తర పఠనంతో తోరపూజ నిర్వర్తిస్తారు. ‘ఓం శ్రీకృష్ణాయనమః’ అనే ప్రథమ గ్రంథి (మొదటి ముడి)తో ప్రారంభించి, ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః’ అనే పద్నాలుగో గ్రంథితో పూజ పూర్తిచేస్తారు. 14 ముడుల సమాహారంగా ఈ కంకణం ఉంటుంది.

       అనంత వ్రత కల్పము
              శ్రీ అనంత పద్మనాభ వ్రతమునకు కావలసిన ముఖ్య వస్తువులు:

విష్ణుమూర్తి యొక్క బొమ్మ లేదా చిత్ర పటము , పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం , అక్షతలు , అగ్గిపెట్టె , అగరువత్తులు , వస్త్ర , యజ్నోపవీతములు , పువ్వులు, పళ్ళు , కొబ్బరికాయ , ఈ వ్రతమునకు తోరములు ముఖ్యము. ఇవి ఎర్రని సిల్కు దారముతో చేసినవి గాని లేదా తెల్లని దారముతో చేసినవైతే కుంకుమ నీటిలో తడిపి ఉంచుకొనవలెను .

                 వీటికి పదునాలుగు ముడులు ఉండవలెను. ప్రసాదమునకు గోధుమ పిండిని ఐదు పళ్ళు (అనగా ఐదు శేర్లు) తీసుకొని బెల్లముతో అతిరసములు (అప్పములు ) తయారు చేసుకొనవలెను. ఇందులో ఇరువది ఎనిమిది అతిరసములు దేవునికి నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు వాయన దానమిచ్చి , తక్కిన వానిని తాను భుజింపవలయును.

            పూజా ద్రవ్యము లన్నియు పదునాలుగు చొప్పున ఉండవలయును.బ్రాహ్మణ పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.
ఆచమనం

1 . " ఓం కేశవాయ స్వాహా "
అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా
3 . " ఓం మాధవాయ స్వాహా " జలమును పుచ్చుకోనవలెను
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి .
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 . ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

         ఆచమనము అయిన తరువాత , కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతే షామవిరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||
ప్రాణా యామమ్య : ఓం భూ : - ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః -ఓం సత్యం -ఓం తత్ సవితురేణ్యం.భర్గో దేవస్య ధీమహి దీయోయోన : ప్రచోదయాత్ .ఓం ఆపో జ్యోతిర సోమ్రుతం బ్రహ్మ భూర్భు వస్సువ రోం 

అని సంకల్పము చెప్పు కొనవలెను.

సంకల్పము :
              యమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్దే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ) ,సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ

            అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన ............ సంవత్సరే ,............ ఆయనే, ఋతు : ...........మాసే ,......... పక్షే ............ తిధౌ ,......... వాసరే శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ........గోత్రశ్య... నామధేయః , శ్రీమత్యః , గోత్రస్య ,నామ దేయస్య అనియు , స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి,

          శ్రీ మత్యాః , గోత్ర వత్యాః నామదేవ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము , నామము చెప్పి ) నామ దేయశ్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య,క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిద్ద్యర్ధం , శ్రీ అనంత పద్మనాభ దేవతా ముద్దిశ్య అనంత పద్మనాభ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని ) సంభ వద్బి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో , నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా , భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాధనము చేయవలెను .

కలశ పూజను గూర్చిన వివరణ :
           వెండి, రాగి, లేక కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షతలు , తమలపాకు , పువ్వు ఉంచుకొనవలెను .రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను.

            ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను . కుంకుమ అక్షతలు వగైరా బొటన ,మధ్య , ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను .

          యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ,ఇలా అనుకోవాలి . ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువ వలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః
ఋ గ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః


శ్లో || గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధుకావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ||

               ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ అనంత పద్మనాభ దేవతాః (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పు కొనవలెను ) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని , ఆకుతో గాని చల్లాలి.

మూనర్జము :

              ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాంగతోపివా
యస్స్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు , పసుపు ,గణపతిపై వేసి , ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను . ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాది పతయే నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహోర్తోస్తూ తదాస్తు . తరువాత ఇలా చదువుతూ స్వామికి నమస్కరించ వలెను.

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చక పిలో గజ కర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్న రాజో వినాయకః
ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః
షోడ శైతాని నామాని యః పటేచ్చ్రుణుయాదపి
విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్యన జాయతే ||

అనంత పద్మనాభుని వ్రతమునకు ముందుగా యమునా పూజను చేయవలెను .

యమునా పూజా :

ధ్యానం :
శ్లో || క్షీరో దార్ణవ సంభూతే ఇంద్ర నీల సమప్రభే ,
ధ్యానం కరోమి యమునే విష్ణు రూపి నమోస్తుతే .
యమునా దేవీం ధ్యాయామి అని యమునా దేవిని ధ్యానించవలెను .

ఆవాహనం :
శ్లో || యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయినీ ,ఆవాహయామి భక్త్యాత్వాం సాన్నిధ్యం కురు సువ్రతే .యమునా దేవ్యై నమః ఆవాహయామి

 అని ఆ దేవతను మన ఇంటి లోనికి పిలుచుచున్నట్లుగా (ఆహ్వానించు చున్నట్లుగా ) భావించి అక్షతలు తీసుకొని వేయవలెను .

ఆసనం :
 శ్లో || నమస్కరోమి యమునే సర్వ పాప ప్రణాశిని ,
రత్న సింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం .
యమునా దేవ్యై నమః ఆసనం సమర్పయామి అని కూర్చొనుటకు సింహాసనము ఇచ్చినట్లుగా భావించి దేవిపై అక్షతలు వేయవలెను .

పాద్యం :
 శ్లో || సింహాసన సమారూడే దేవ శక్తి సమన్వితే ,
పాద్యం గృహణ దేవేశి సర్వ లక్షణ సంయుతే .
యమునా దేవ్యై నమః పాద్యం సమర్పయామి అని దేవికి కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణెతో తీసుకొని చల్లవలెను .

అర్ఘ్యం :
శ్లో || నంది పాదే నమస్తుభ్యం సర్వ పాప నివారిణి
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిద ముత్తమం ||
యమునా దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుగు కొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణె తో వేరొక పాత్ర లోనికి వేయవలెను .

ఆచమనీయం :
శ్లో || హర వైడూర్య సంయుక్తే సర్వ లోక హితే శివే ,
గృహణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ||
యమునా దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి అని పంచ పాత్రలోని శుద్ధ జలమును ఉద్దరిణెతో అర్ఘ్య పాత్ర లోనికి వదల వలెను .

స్నానం :
శ్లో || దేవ సలిలే నమస్తుభ్యం సర్వ లోక హితే ప్రియే ,
సర్వ పాప ప్రశమని తుంగ భద్రే నమోస్తుతే ||

యమునా దేవ్యై నమః స్నానం సమర్పయామి అని స్నానమునకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్ర లోని నీటిని పువ్వుతో లేదా ఉద్దరిణెతో వేరొక గిన్నె లోనికి వదలవలెను .

వస్త్ర యుగ్మం :

శ్లో || గురు పాదే నమస్తుభ్యం సర్వ లక్షణ సంయుతే ,
సువ్రతం కురుమే దేవి తుంగ భద్రే నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి

అని వస్త్రమునకు సమర్పిస్తున్నట్లుగా భావించి పత్తితో బిళ్ళ వలె చేసి , దానికి కుంకుమ పెట్టిన వస్త్ర యుగ్మమును దేవికి సమర్పించ వలెను.

మధుపర్కం :
శ్లో || కృష్ణ వేణి నమస్తుభ్యం కృష్ణవేణీ సులక్షణే,
మధుపర్కం గృహాణే దం మయాదత్తం శుభప్రదే ||
యమునా దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి
 అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ, ఈ మధుపర్కం ను ప్రతిమకు అద్దవలెను .(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచు కొన్న దానిని మధుపర్కం అంటారు ).

ఆభరణాని :
శ్లో || నంది పాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరణి,
సర్వలోక హితే తుభ్యం భీమ రధ్యై నమోస్తుతే ||
యమునా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి అని తమ శక్తి కొలది ఆభరణములను దేవి వద్ద ఉంచి నమస్కరించ వలెను .

ఉత్తరీయం ;
శ్లో || సహ్య పాద సముద్భూతే సర్వ కామ ఫల ప్రదే ,
సర్వ లక్షణ సంయుక్తే భవ నాశినితే నమః ||
యమునా దేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి అనుచూ కండువా వంటి తెల్లని వస్త్రమును సమర్పించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణి తో అర్ఘ్య పాత్ర లోనికి వదలవలెను .

గంధం :
శ్లో || కృష్ణ పాద సముద్భూతే గంగేత్రి పధ గామిని ,
జటాజూట సమద్భూతే సర్వ కామ ఫల ప్రదే ||
యమునా దేవ్యై నమః గంధం సమర్పయామి అనుచు గంధమును ఈ దేవతపై రెండు , మూడు చుక్కలు చల్లవలెను

అక్షతలు :
శ్లో || గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని ,
స్వీకురుష్వ జగద్వంద్వే అక్షతా నమలాన్ శుభాన్ ||
యమునా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి అనుచు అక్షతలను (కొద్ది బియ్యమును తీసుకొని తడిపి పసుపు వేసి కలుపవలెను ) దేవిపై చల్ల వలెను .

పుష్ప పూజ :
శ్లో || మందారై : పారిజాతైశ్చ పాటలాశోక చంపకై :,
పూజయామి తవ ప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునా దేవ్యై నమః పుష్పై : పూజయామి అనుచు కొన్ని పూవులను తీసుకొని అక్షతలు , పూవులు కలిపి దేవిపై వేయవలెను.

         ఈ షోడశోపచార పూర్తి అయిన పిమ్మట 13 నామములు గల అధాంగ పూజను చేయవలెను . ప్రతి నామమునకు పువ్వులు కాని , పసుపు కాని కుంకుమ కాని వేయవచ్చును.

అధాంగ పూజ

ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి ;
ఓం సుజంఘాయై నమః జంఘే పూజయామి ;
ఓం చపలాయై నమః జానునీ పూజయామి ;
 ఓం పుణ్యాయై నమః ఊరూ పూజయామి ;
ఓం కమలాయై నమః కటిం పూజయామి ;
ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి ;
ఓం భావ నాశిన్యై నమః కంటం పూజయామి ;
ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి ;
ఓం సుందర్యై నమః లలాటం పూజయామి ;
ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి ;
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి ;
ఓం సునాసికాయై నమః నాసికం పూజయామి ;
ఓం భాగీరధ్యై నమః శిరః పూజయామి.
యమునా దేవ్యై నమః సర్వాంణ్యం గాని పూజయామి .

ధూపం :
శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు సంయుతం ,
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతి గృహ్యతాం .||
యమునా దేవ్యై నమః ధూపం సమర్పయామి

అని ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తి వెలిగించి తిప్పుతూ దూపమును దేవికి చూపవలెను .

దీపం :
శ్లో || ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్య తిమిరాపహమ్,
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరి నమోస్తుతే .
యమునాదేవ్యై నమః దీపం దర్శయామి

అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువ వలెను.

నైవేద్యం :
శ్లో || భక్త్యైశ్చ భోజ్యైశ్చ రసై షడ్భిస్సమన్వితం
నైవేద్యం గృహ్యాతం దేవి యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి

 అని పళ్ళు , కొబ్బరికాయ మొదలగునవి దేవి వద్ద నుంచి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో పదార్దాములపై పువ్వులతో నీళ్ళు చల్లుతూ

' ఓం ప్రాణాయ స్వాహ , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓం శ్రీ మహా గణాధిపతయే నమః '

అంటూ ఆరు మార్లు చేతితో ( చేతిలోని ఉద్దరిణి తో ) స్వామికి నివేదనం చూపించాలి . పిదప

 ఓం యమునా దేవ్యై నమః నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళయామి '

అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .తరువాత ' పాదౌ ప్రక్షాళ యామి ' అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి.

         నిత్య పూజా విదానమందు ఈ విధంగా చేసే నైవేద్యం అనంత పద్మనాభ వ్రతమునకు 14 రకముల పిండి వంటలు చేసి అందు రకమునకు 14 చొప్పున ఒక పళ్ళెములో వుంచి నివేదన చేయాలి

 పునః శుద్దాచామనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం .

హస్త ప్రక్షాళనం :
 శ్లో || పానీయం పావనం శ్రేష్టం గంగా సరసోద్భవం
హస్త ప్రక్షాళ నార్ధం వై గృహాణ సుర పూజితే .
యమునా దేవ్యై నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి

అని భోజనము అయిన పిదప చేతులు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణితో అర్ఘ్య పాత్ర లోనికి హస్తౌ ప్రక్షాళయామి అంటూ వదలవలెను.

తాంబూలం :
శ్లో || కరూప్ర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యతాం దేవీ యమునాయై నమోస్తుతే ||
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి

అని మూడు తమలపాకులు , రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి . తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ , ' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .

నీరాజనం :
శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా ,
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి

                 అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ , చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి .తరువాత అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని ,

మంత్ర పుష్పం :

ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను.

పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి .

ప్రదక్షిణం :
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ ,
నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||

శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక,
ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే . ||

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి .
          చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి ) తరువాత చేతిలో నున్న అక్షతలు , పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ

ప్రార్ధనం :

శ్లో |యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం

యమునా పూజా విధానం సంపూర్ణం

......అనంత పద్మనాభ వ్రతం........
       తదుపరి పోష్టు నందు చూడగలరు
మీ
వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి