Thursday 30 November 2017

మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్ర్వతం

మార్గశిర శుద్ధ త్రయోదశి 
శ్రీ హనుమద్ర్వతం

మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||

        మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు.

            పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి.

             ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.

పంపాకలశ ప్రతిష్ఠా

         ఆచమ్య, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని నీటిని తాకాలి. ముందుగా పంపాకలశ ప్రరిష్టాపన చేసి షోడశోపచారాలతో పంపాపూజ చేయాలి.

             పీఠంపై యథాశక్తిగా బియ్యం పోసి పట్టుగుడ్డ పరిచి హనుమంతుని పటాన్ని చక్కని పూలమాలతో అలంకరించి దానిముందు ఐదు తమలపాకులు ఒకేరీతిగా పరిచి దానిపై వెండి, రాగి, లేదా కంచు పాత్ర ఉంచాలి.

'ఇమం మే వరుణ' మంత్రంతో ఆ పాత్రను నీళ్ళతో (పంపానదీ నీళ్ళతో)  నింపాలి.

           ఇమం మే వరుణ శ్రుదీహవమద్యాచ మృడయ
త్వామవస్సురాచకే| తత్త్వాయామి బ్రాహ్మణా
వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్భి:|
ఆహేడమానో వరుణేహ బోధ్యోరుశగ్ సమానః||

"ఇమం మే గంగా'' అనే మంత్రంతో ఆ కలశంలోని నీళ్ళను అభిమంత్రించాలి.
ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమగొం నచతావరుష్ణియా|
అసిక్నియా మరుద్వ్రుదౌవితన్థ యార్జీకీయే శృణుహ్యసుషోమయా||

           తరువాత ఆ పంపాకలశంలో సువర్ణమౌక్తికలు ఉంచి గంధపుష్పాక్షతాలను, అష్టగంధ, కర్పూరాలు ఉంచి

హ్రం హ్రీం హ్రూం హ్రై౦ హ్రౌం హ్రః తటిన్యా
ద్వాదశ కళా ఇహగాచ్చ తాగచ్చత||

'ఓం హం సూర్యమండలాయ ద్వాదశ కళాత్మనే తద్దేవతా కలశాయ నమః అని ఆ కలశానికి నమస్కరించి నూతనవస్త్రం చుట్టి కలశానికి 'బృహత్సామ' మంత్రంతో రక్షాబంధనం చేయాలి.

బృహత్సామక్షత్రభృద్వ్రుద్ధ వృష్టియం త్రిష్ణు భౌజశుఋభిత ముగ్రవీరం!
ఇంద్రస్తోమేనా పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా||

                 పుష్పాక్షతలు తీసుకుని - ఐ౦ హ్రీం శ్రీం ఓం నమోభగవాతే అశేష తీర్థాలవాలే శివజటాదిరూఢే గంగే గంగాంబికే స్వాహా||సర్వానందకరీ మశేషదురితధ్వంసీం మృగాంకప్రభాంత్ర్యక్షా మూర్ద్వ కరద్వయేన దధతీం పాశం సృణీం చ క్రమాత్ దోర్భ్యాం చామృత పూర్ణకుంభ మవరే ముక్తాక్షమాలా ధరాం గంగా సింధు సరిద్వరాది రచితాం శ్రీతీర్థశక్తిం భజే||

అని చేతులో ఉన్న పుష్పాక్షతలను కలశంలోని నీటిలో వేసి నమస్కరించాలి. తరువాత పంపాకలశానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి.

ఓం అనునీతే పునరస్మాసుచక్షుః ప్రాణమిహనోథౌహి భోగం జ్యోక్సశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి|  అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణా నేవ యథాస్థాన ముపహ్వయతే.

 పంపాకలశ స్థిత శ్రీ గంగా మహాదేవీ ఇహప్రాణ ఇహజీవ ఇహజీవ ఇహగాచ్చ|
సర్వేంద్రియాణి సుఖం చిరం తిష్టంతు స్వాహా||

స్థిరభవ|| వరదాభవ| సుముఖీభవ| సుప్రసన్నాభవ| ప్రసీద ప్రసీద ప్రసీద||

అని ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత పంపాకలశ పూజ చేయాలి.

            శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు.

          వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు.

          పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.

              అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు. తన జెండాపై కట్టబడ్డ వాడు, ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు.

                 ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు.

            పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.

              దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు. పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు.

          బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు.

             త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు.

           పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు.

         బ్రహ్మర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాది కాలని,తిరుపతి

Monday 27 November 2017

మార్గశిర శుద్ధ ఏకాదశి (28.11.2017) గీతా జయంతి


మార్గశిర శుద్ధ ఏకాదశి (28.11.2017) గీతా జయంతి

         గీతా జయంతి మన పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

              గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు.

            త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి.

               ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.

 సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

            ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి,

            ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను) అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు.

           ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు.

                ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృర్ణోతి నరో పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ 

          చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబత్తలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.

 నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి
అర్జునా! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగాకుండుగాక.

యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్ 

                ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 

              సాదు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.

                 కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని, అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము.

                  అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.

           నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం, ఒక ఆశాపుంజం.

              భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday 26 November 2017

మార్గశిర సప్తమి(27.11.2017 సోమవారం) నాడు సూర్యారాధన,

మార్గశిర సప్తమి(27.11.2017 సోమవారం) నాడు సూర్యారాధన, 

            మార్గశిర మాసంలో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు. కశ్యపమహర్షి, ఊర్వశి అనే అప్సరస, రుతసేనుడనే గంధర్వుడు, మహాశంఖమనే సర్పం, తారక్ష్యుడు అనే యక్షుడు, విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు, ఆయన వెంట ఉంటారు.

            ఆయన చీకట్లను పారద్రోలడంలో, శత్రువులను సంహరించడంలో సమర్ధుడు, సకల జగత్తుకు శుభ ప్రదుడు. మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి.
              ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షిని ఈ విధంగా అడిగాడు ఓ మహర్షి! ప్రతిరోజు ఆకాశంలో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు, మహర్షులు సిద్ధులు, మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి అని అడుగగా ఈ విధంగా వివరించారు.

            " ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు. ఉత్కృష్టమైన బ్రహం తేజో రూపుడు. సాక్షాత్ బ్రహ్మమయుడే. ఈ భగవానుడు ధర్మ, అర్ధ, కామ, మోక్షము అనే నాలుగు పురుషార్ధ ఫలాలని ఇస్తాడు. ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము.

            లోకముల యొక్క ఉత్పత్తి, పాలన ఈయన వల్లే జరుగుతాయి. ఈయన లోకరక్షకుడు. ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు. సంద్యోపాసన సమయంలో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుషున్నే సేవిస్తారు.

                      ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదించినట్లే. సూర్యమండలంలో ఉన్న సాధ్యదేవిని ఉపాశించి ద్విజులంతా స్వర్గాన్ని, మోక్షాన్ని పొందు తున్నారు. సుర్యోపాసన వల్లే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు. ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము, దు:ఖము, శోకాలు కలుగవు అని తెలియజేశారు  వ్యాసమహర్షి .

               ప్రాతః కాలంలో విధి విధానంగా స్నానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి క‌లుగుతుంది. సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపాలను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలంలో సూర్యకిరణాలతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహంలో స్నానమాచరించిన వారు పితృ, మాతృ వంశాలకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి, తరువాత అమర దేహుడై స్వర్గానికి వెళతాడు.

          అరుణోదయం కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజి తుడవుతాడు. సూర్యోద‌యానికి ముందే స్నానం చేస్తే ఉత్తమం. సూర్యోద‌య స‌మ‌యంలో స్నానం మ‌ద్యమం. సూర్యోద‌యం త‌ర్వాత స్నానం చేస్తే త‌క్కువ ఫ‌లితం ఉంటుంది.

            ఆదివారం నాడు సూర్య భ‌గ‌వానుడ్ని త‌ప్పక అర్చించాలి. ఆ రోజున సూర్యుని వైపు తిరిగి పూజ చేసుకోవాలి. శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసుడికి దానం చేయాలి. సూర్యుడ్ని షోడ‌శ ఉప‌చార‌ముల‌తో పూజించి పాయ‌సం లేక పొంగ‌లి త‌యారుచేసి నివేద‌న చేస్తారు. పాలు పొంగిన‌ట్లు సౌభాగ్యం పొంగాల‌ని వేడుకొంటారు.

              మార్గశిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవద్గీతలో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వృక్షచాయ. ఇది గ్రీష్మఋతువులో చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది.

           అలాగే విష్ణు స్వరుపమైన మార్గశీర్ష మాసంకుడా, అతి శీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిస్తే మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుస్తోంది .

         మార్గ శిరం సత్వ గుణాన్ని పెంచి భగవదనుభూతిని కలుగ చేస్తుంది. లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం. మార్గశిర్శమో! క్షేత్రములో సస్యములు పండి భారంతో వంగి మనోహరంగా ఉంటుంది. అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday 25 November 2017

మార్గశిర అష్టమి 26.11.2017 ఆదివారం కాలభైరవాష్టమి

మార్గశిర అష్టమి 26.11.2017 ఆదివారం
కాలభైరవాష్టమి

కాళభైరవా నమోస్తుతే - కపిలీశ్వరా నమోస్తుతే - కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే"

             శ్రీకాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది.

           ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మ దేవుడు ‘నేను సృష్టికర్తను. పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.

           దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.

           హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.

          ‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు. దీనితోకాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు.

        ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు అందుకు ‘‘కాలభైరా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు.

          నీవు కాశీ క్షేత్రాన్ని వెళ్లు . కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ’అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు దీనితో కాలభై రవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మ హత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు.

         బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’తర్వాత కాలభైరవుడని చూరి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపటుట. ముందుగా నీకే పూజలు జరుగుతాయి.

          నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’ శివుడు పలికాడు.దీనిలో శ్రీకాల భైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు. కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.

            కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విస్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం శునకమునకు పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీకాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం.

             ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.

            ''కాలభైరవాష్టమి'' పర్వదినాన్న కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవు డయ్యాడు.

              భైరవుణ్ణి  శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది.  ఈరోజు గంగాస్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

            కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.

          ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు.

            భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యంగా పెడతారు. ఈశ్వరుడు ఆయుష్షుని ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.

            కాలభైరవునికి ఎనిమిది మిరియాలు ఒక తెల్ల గుడ్డలో కట్టి వత్తిగా చేసి, భైరవుని తలచుకుంటూ, దేవుని ముందు 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించి పెట్టండి. ఎంతో మంచిది. భైరవుడు ఎంతో సంతోసిస్తాడు. దీవిస్తాడు.

         ఈ మార్గశిర అష్టమి కాలభైరవజన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకం ను పారాయణ చేస్తారు.

కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

         ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయ. గ్రహదోషాలు తొలగిపోతాయ.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday 23 November 2017

  మార్గశిర మాసం షష్టి(24.11.2017 శుక్రవారం)

       శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

             దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము!

               పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమిత బలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు.

             కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

           అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు.

                మొత్తం మీద మన్మధుని పూల బాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

            ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుని లోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు.

             ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

               ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

        కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

                 అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

            సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీ యులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

             దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుండ్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

 పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు.

              ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్స వములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

        ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.

          ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

           పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 22 November 2017

మార్గశిర మాసం గురువారం(23.11.2017) లక్ష్మివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం పంచమి తీర్థం

మార్గశిర మాసం గురువారం లక్ష్మివారం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం పంచమి తీర్థం

మార్గశిర లక్ష్మివార  వ్రతం:

          ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం (గురువారం) నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము.

           ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు.  మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

మార్గశిర లక్ష్మివార వ్రత విధానం

            మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.

              ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని మొట్టమొదట గణపతికి  ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.
              లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారము లలో చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.

               లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం – పులగం
2 వ గురువారం – అట్లు, తిమ్మనం
3 వ గురువారం –  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం – చిత్రాన్నం, గారెలు
5 వ గురువారం – పూర్ణం బూరెలు

 లక్ష్మివార వ్రత కధ:

               పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు.  అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.  ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.

            ఆ సుశీల  సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల.

            ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని  సుశీల చాలా బాధపడుతుంది.
            తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా!  నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.  సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు.  దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.

         ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు.  ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు.  ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.  మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.

          కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది.  వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి.  ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.

            సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు.  జరిగిన విషయం తల్లికి చెప్పాడు.  తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.  మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను.

             అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.  అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.  సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు.

           ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను.  ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు.  ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు.  తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.  తల్లి విచారించింది.  కొన్నాళ్ళకు.  తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.


           తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి  మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.  అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను.  ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.

         కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది.  అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.  ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది.  రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది.  ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.  మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది.

              పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది.  కూతురుమాత్రమే చేసుకున్నది.  నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది.

           పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.  అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని.  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం .

            అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది.  కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా

                    నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది.  అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.  మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి.

           సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం,  మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు,  పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.  కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు.

             అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.  కధలోపమైనను వ్రత లోపము కారాదు.  భక్తి తప్పినను ఫలము తప్పదు.

ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మివారముల తేదీలు:

నవంబర్ 23వ తేదీ గురువారం
నవంబర్ 30వ తేదీ గురువారం
డిశంబర్ 7వ తేదీ గురువారం
డిశంబర్ 14వ తేదీ గురువారం

లక్ష్మీ అమ్మవారి మంగళ హారతి పాట:

లక్ష్మీదేవ్మ- మంగళ హారతి ఇది గో
అనురాగంబులో- నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా – ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా – దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి – తీ పైన పండ్లు
కన్నతల్లి – కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ
మల్లె పుష్పాలు – మందార పూలు
తెల్ల గన్నేరు – చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి – దయ సేయమ్మా || లక్ష్మీ
భక్తితో గొలిచేటి – నీ భక్త వరులం
నిజముగా – నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు – చేకూర్చు మాతా ||
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

తిరుచానూరు శ్రీ పద్మావతమ్మ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు(23.11.2017) పంచమి తీర్థం.

తిరుచానూరు శ్రీ పద్మావతమ్మ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు(23.11.2017) పంచమి తీర్థం.

పంచమితీర్థం విశేషం

             తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూెత్సవాల చివరిరోజైన నవంబరు 23వ తేదీ గురువారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది.

ఈ సందర్భంగా పంచమితీర్థం, పద్మపుష్కరిణి వైశిష్ట్యాన్ని
కొంచెం తెలుసు కొందాము

             శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పద్మపురాణం ఒకటి. ఇందులో శ్రీపద్మావతి అమ్మవారి ఆవిర్భావాన్ని వివరించారు. వైకుంఠ లోకంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు శయనించి ఉండగా యజ్ఞానికి ఫలితమిచ్చే దైవం కోసం సప్తఋషులు వెతుకుతూ వచ్చారు.

      శ్రీ స్వామి వారు యోగనిద్రలో ఉండి భృగుమహర్షిని చూడలేదు. కోపించిన   భృగుమహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్నారు. స్వామివారి వక్షస్థలంలో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు ఆగ్రహం చెంది పాతాళలోకానికి వెళ్లిపోయారు.

            స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వచ్చారు. అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకుని 56 దేశాలు తిరిగారు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన కొల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు దర్శించి పూజలు చేశారు.

      ఆ సమయంలో ఆకాశంలో అశరీరవాణి వినిపించింది. ”స్వర్ణముఖి నదీతీరానికి వెళ్లి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు, జప, తపం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు” అని తెలిపింది. స్వామివారు స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని ‘కుంతలము’ అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారు.

                వాయుదేవున్ని పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకురావాలని ఆదేశించారు. స్వర్ణ కమలాలు వికసించేందుకు వైఖానసాగమోక్తంగా శ్రీసూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించారు.(శ్రీ సూర్యనారాయణ స్వామి వారి గుడి కూడా తిరుచానూరు కోనేరు ఎదురుగా ఉన్నది.)

           స్వామివారు క్షీరం(పాలు)ను మాత్రమే ఆహారంగా తీసుకుని 12 సంవత్సరాల పాటు శ్రీమంత్ర జప తప అర్చన చేశారు. 13వ సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం, ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం పంచమి తిథినాడు వాతావరణం ప్రసన్నమైంది.

             సహస్రదళ బంగారుపద్మం నుంచి నాలుగు చేతులతో, పద్మాల వంటి కళ్లతో, సకల దివ్య ఆభరణాలు, వస్త్రాలు, పుష్పాలతో శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించారు.

             సత్యలోకం నుంచి బ్రహ్మ హంస వాహనంపై, కైలాసం నుంచి పార్వతి పరమేశ్వరులు వృషభంపై, సచిదేవి ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, సనకాది యోగులు, సప్తఋషులు, ప్రహ్లాదుడు మొదలైన భక్తులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు ఆకాశం నుంచి రాగా, దేవగంధర్వులు మంగళవాయిద్యాలు మోగిస్తుండగా తామరపూల మాలను శ్రీనివాసుని కంఠానికి శ్రీపద్మావతి అమ్మవారు అలంకరించారు.

            శ్రీనివాసుడు తామరపుష్పాన్ని అమ్మవారికి అలంకరించారు. 108 దివ్యదేశాల్లో అమ్మవారు స్వామివారికోసం తపస్సు చేసినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. తిరుచానూరులో మాత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు శ్రీ పద్మపురాణంలో ఉండడం విశేషం.

పంచమితీర్థం ఉత్సవ క్రమం : చూర్ణాభిషేకం :

            పంచమితీర్థం రోజున ఉదయం ధ్వజారోహణ మండపంలో చూర్ణాభిషేకం నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో అభ్యంగన స్నానం చేయిస్తారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నువ్వుల నూనె, చూర్ణపొడి కలిపి ఈ క్రతువు నిర్వహిస్తారు.

            అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ మంత్రం శ్రీ సూక్తం పఠిస్తారు. అభ్యంగన స్నానం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పంచమితీర్థ మండపానికి వేంచేపు చేస్తారు.

పంచమితీర్థ మండపంలో :

            పంచమితీర్థ మండపంలో వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆశీనులను చేస్తారు. 9 కలశాల్లో ఆవాహన చేసి అనుజ్ఞ స్వీకరిస్తారు. విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ఉపచారాలు సమర్పిస్తారు.

           ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె, పసుపు కుంకుమ, చందనం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు, దివ్యమాలలు, దివ్య ఆభరణాలు, లడ్డూ, వడ, అప్పం తదితర ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తారు.

             తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వచ్చిన సారె ముందుగా తిరుపతిలోని శ్రీకోదండ రామాలయం, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయాల మర్యాదలు స్వీకరించి తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంటుంది.

               అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయ అధికారులు స్వాగతం పలికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళతారు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday 18 November 2017

మార్గశిర మాసము 19.11.2017 ఆది వారము ప్రారంభం

మార్గశిర మాసము19.11.2017ఆదివారము ప్రారంభం
 
మార్గశిర మాస విశిష్టత

            సౌరమానము ప్రకారము సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన మాసము కావున ఈ మాసమునకు 'ధనుర్మాసము' అని పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే, ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారు. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం రావటం వలన ఈ మాసమును మార్గశిర మాసము అంటారు.
            ‘మార్గశీర్ష ’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.

 “బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం”  

         అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువుల లోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.

             శ్రీ సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘సంక్రమణము’ అంటారు. మనకు సంవత్సరానికి పన్నెండు సంక్రమణములు వస్తాయి.

          సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.

          ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతా లతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో
 ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః
అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.

             ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.

          మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం” చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గమాసం లో భగవంతునియందు లయించవలెనన్న తపనగల వారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవ ప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే.

            ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూ ధనుడు’ అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించ వలెను. ఈరోజునుండి ధనుర్మాసం ప్రారంభమైనట్లే.

         ఈ రోజునుండి ప్రతిరోజు విష్ణ్వాలయాలలోప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి

           మనకెలాగైతే దినమునందు బ్రాహ్మీ ముహూర్తము సత్వగుణ ప్రభావము కలదని భావింపబడునో, అదే విధముగా మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వలె చాలా సత్వగుణ ప్రభావము కలదని దేవతలు భావింతురు. అలాంటి పవిత్రమైన మాసంలో గోదాదేవి వ్రతమును ఆచరించింది కావున ఈ వ్రతానికి గొప్ప విశిష్టత లభించింది.    

గోదా జననం
       యజ్ఞవాటికికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా  విష్ణుచిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుతుండగా అతనికి ఒక బాలిక లభించినది. వారికి సంతానము లేకపోవుటచే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచు 'కోదై' (పూలదండ) అనే పేరుతొ పిలుచుకుంటూ ఉండేవారు.

        ఆ పేరే క్రమేపి 'గోదా' అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళముగల తులసివలె - జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కలిగి భగవత్గుణముల యందే ఆశక్తి కలిగి యుండెడిది. తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని,ఆ భగవంతునినే తన ప్రియునిగా భావించి, వివాహమాడదలచినది.

            పూర్వము ద్వాపరయుగమున వ్రజభూమిలో, గోపికలు కాత్యాయిని వ్రతము చేసి, కృష్ణునిపొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా భావించి, తన తోటి చెలికత్తెలనే గోపికలుగా భావించి, తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి, ఆ వటపత్రసాయి ఆలయమునే నందగోప భవనముగా భావించి, ఆ ఆలయములో నున్న వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి 'మార్గశీర్ష వ్రతాన్ని'ఆచరించినది.

          ఆ వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలెనని, ఒక్కో పాటలో- మనం ఏంతెలుసు కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలి,  అనే విషయాలని,  ముప్పై రోజులు ముప్పై పాశురాలుగా (పాటల రూపంలో) భగవంతుని కీర్తించి అందరికీ  'తిరుప్పావై' ప్రబంధముగా అందించింది.

గోదా కల్యాణం
          చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీరంగనాథుని యందే మనస్సు లగ్నం చేసి ఆరాధించుచుండెను. ప్రతీరోజు భగవంతునికి అర్పింపవలసిన పుష్పమాలికను తాను ధరించి, అద్దంలో చూసుకొని, మళ్ళీ ఆ మాలను అదే స్థలంలో పెట్టెడిది.

            ఆ విషయం తెలియక విష్ణుచిత్తులవారు ఆ మాలను భగవంతునికి సమర్పించెడివారు. ఒకరోజు ఈ దృశ్యమును విష్ణుచిత్తులవారు గమనించి, ఆరోజు భగవంతునికి మాలికను సమర్పించకుండిరి.

            అదేరోజు రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తులవారికి కలలో ప్రత్యక్షమై, "గోదా ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అవియే నాకు అత్యంత ప్రీతికరం" (ఆరోజు నుండి విష్ణుచిత్తులు అదే విధంగా చేయుచుండిరి.)  "నేనే - నీకుమార్తెను వివాహమాడెదను.

          వివాహమహోత్సవానికి నా అజ్ఞ మేరకు తగిన సామగ్రులను తీసుకొని, పాండ్య మహారాజు ఘన స్వాగతంతో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానించెదరు" అని చెప్పి అంతర్థానమయ్యెను. విష్ణుచిత్తులు మేల్కొని, ఆనందోత్సాహముతో తన జన్మ సార్థకమయ్యిందని, పొంగిపోతూ తెల్లవారిన తరవాత గోదాదేవిని తీసుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను.

             శ్రీరంగమున అందరూ చూస్తుండగా పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలో ప్రవేశించి, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామి దివ్య తిరువడి గళ్ళలో (పాదపద్మములలో) అంతర్ధాన మయ్యెను.మాలను ధరించి విడుచుట వలన గోదాదేవికి"ఆముక్తమాల్యద" అనియు, "శూడిక్కొడుత్త నాన్చియార్"అనే దివ్య నామములు కలిగెను. ఆమెనే "ఆండాళ్" అని కూడా అందురు. (ఆండాళ్  అనగా రక్షించుటకు వచ్చినది).

             విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహమాడి, గోదమ్మతల్లి  భోగములను అనుభవించినది కావున, ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగ భాగ్యాలు లభించునని మన పెద్దలు చెప్పారు. భోగభాగ్యాలు కలిగించే పండుగ కనుక భోగి పండుగ అని కూడా అంటారు.

"శ్రీ ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం"
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

కార్తిక పురాణం-30 వ అధ్యాయము కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి

కార్తిక పురాణం-30 వ అధ్యాయము
కార్తిక వ్రాత మహిమ్నా ఫల శ్రుతి

               నైమిశారణ్య ఆశ్రమములో శౌని కాది మహా మునులకందరకు సుత మహాముని తెలియ జేసిన విశ్నుమహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయి నోళ్ళ కొని యాడిరి. శౌని కాది మునులకుక్ ఇంకను సంశయములు తిరనందున, సుతుని గాంచి" ఓ ముని తిలకమా!

             కలియుగ మందు ప్రజలు అరి షడ్వర్గ ములకు దాసులై, అత్యాచార పరులై జీవి౦చుచు సంసార సాగరముతరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణో పాయమే దైన కలదా?
ధర్మము లన్నిటిలో మోక్ష సాధనా కుప కరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలో నూ ముక్తి నొంసంగు వుత్తమ దైవ మెవరు?

           మానవుని అవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫల మిచ్చు కార్య మేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించు చున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు పాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియ జేయు" మని కోరిరి. అంత సుతుడా ప్రశ్న నాలకించి"

ఓ మును లారా!

        మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి.
 కలియుగ మందలి మానవులు మంద బుద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లోనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చే కూరును.

            కార్తీక వ్రతము శ్రీ మన్నారాణునకు ప్రీతీకరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటె ఘనమై నదని శ్రీ హరి వర్ణించి యున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు. అంతియే కాదు,సృష్టి కర్తయగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శత్య ము గాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను.

          కార్తీక మాసమందు ఆచరించ వలసిన పద్దతులను జెప్పుచున్నాను. శ్రద్దగా అలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్న ప్పుడు శ్రీ హరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగ నది స్నానము చేయ వలెను.దేవాలయానికి వెళ్లి హరి హరదులను పూజింప వలెను. తన కున్న దానితో కొంచమైనా దీప దానం చెయ వలయును .ఈ నెల రోజులు విధవ వండిన పదార్థ ములు తిన కూడదు.  రాత్రులు విష్ణు ఆలయమున గాని,శివాలయమున గాని ఆవు నేతిలో దీపారాధన చెయ వలెను.

             ప్రతి దినము సాయంకాలము పురాణ పటణము చెయ వలెను.ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అను భవింతురు.
సూర్యుడు తుల రాశి యందున్న నెల రోజులు యీ విధముగాఆచరించు వారు జీవన్ము క్తు లగుదురు. ఇట్లు ఆచరించు టకు శక్తి వుండి కూడా ఆచరించక గాని, లేక, ఆచరించు వారలను జూచి యె గ తాళి చేసిన గాని, వారికి ధన సహాయము చేయు వారికి అడ్డు పడిన వారును ఇహ మందు అనేక కష్టముల పాల గుటయే గాక వారి జన్మాంత ర మందు నరకములో పడి యమ కింకరుల చేత నానా హింసల పాలు కాగలరు.

            అంతియే గాక అట్టి వారు నూరు జన్మల వలకు ఛ౦డాలాది హీన జన్మ లెత్తుదురు.కార్తీక మాసములో కావేరి, నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నాన మాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యిహమందు సర్వసుఖ ములను అనుభ వించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు.

            సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము ఉత్తమమైనది. అధికఫలదాయక యైనది. హరి హరాదులకు ప్రితికర మైనది. కనుక కార్తీక మాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రత మాచరించ వలెన నెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును.

            కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ద పౌర్ణ మినాడు అయినను తమ శక్తీ కొలది వ్రత మాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును.

             ఈ మాసములో ధనము, ధాన్యము,బంగారము, గృహము, కన్యాదానములు, చేసిన చొ యెప్పటి కినీ తరగని పుణ్యము లభించును.ఈ నెలరోజులు ధనవంతుడైన ను బీదవాడైన ను మరెవ్వరైన ను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధ ములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును.

         ఈ కథ ను చదివిన వారికి ని శ్రీ మన్నారాయుణుడు సక లైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును.

ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు ఓం సర్వేషాం పూర్ణ౦ భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||

త్రింశో ధ్యాయము -  అఖిరి రోజు పారాయణము సమాప్తము
రేపట్నుండి మార్గశిర మాసం ప్రారంభం
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి





Thursday 16 November 2017

కార్తిక పురాణం-29 వ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట -

కార్తిక పురాణం-29 వ అధ్యాయము
అంబరీషుడు దుర్వాసుని పూజించుట 

              ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్త్యువారితో ఈ విషముగా సుదర్శన చక్రము అంబరీషునక అభయ మిచ్చి ఉభయులను రక్షించి, భక్త కోటికీ దర్శన మిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను.

            ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పదముల ఫై బడి దండ ప్రణామములాచరించి,పదములని కడిగి,
ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పై జల్లుకొని,

         " ఓ ముని శ్రేష్టా! నేను సంసార మార్గ మందున్న యొక సామాన్య గృహస్తుడను నా శక్తి కొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును,ద్వాదశి వ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్య మేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు.

            మీ యెడల నాకు అమితమైన అనురాగ ముండుటచేతనే తమకు ఆతిథ్య మివ్వ వలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు,ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడ నైతిని.

                 మీ రాక వలన శ్రీ మహా విష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకరమును మరువ లేకున్నాను.

 మహానుభావా!

నా మన సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి.నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవ చేసినను యింకను ఋణ పది యుండును. కాన, ఓ పుణ్య పురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠుల యందును-ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడనై యుండు నట్లును నన్నాశిర్విదించు " డని ప్రార్ధించి,

           సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.ఈ విధముగా తన పాదముల పై బడి ప్రార్ధించు చున్న అంబరీషుని ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో,ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమాన మని ధర్మ శాస్త్రములు తెలియ జేయుచున్నవి.

        నివు నాకుయిష్టుడవు తండ్రితో సమానుడ వైనావు.
 నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట
 వలన నీకు అయుక్షినము కలుగును.అందు చేత నీకు నమస్కరించుట లేదు.నివు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను.

                   పవిత్ర ఏకాదశి వ్రత నిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవిన్చితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్క యితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారముపంచ భక్ష్య పరమాన్నములతో సంతృప్తి గా విందార గంచి, అతని భక్తి ని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి,సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

              ఈ వ్రుతాంత్త మంతయు కార్తిక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది ఓ అగస్త్య మహాముని!ద్వాదశి వ్రత ప్రభావ మెంతటి మహాత్మ్యము గలదో గ్రహించి తివిగదా! ఆ దినమున విష్ణు మూర్తి క్షీర సాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును.

             ఏ మనుజుడు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ,
లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీ మన్నారయణుని ప్రీతీ కొరకు దానము లిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పాట పంటలై పోవును. ద్వాదశి దినము శ్రీ మన్నానారా యణుకు ప్రీతీ కరమైన దినము కనుక ఆ నాడు ద్వాదశి ఘడియలు తక్కువగా యున్నాను.

           ఆ ఘడియలు దాటకుండ గానే భుజింప వలెను. ఎవరికైతే వైకుంట ములో స్థిర నివాస మేర్పరచు కొని వుండాలని కోరిక వుండునో,అట్టి వారు ఏకాదశి వ్రతము,
 ద్వాదశి వ్రతము రెండునూ చేయ వలెను. ఏ యొక్కటి యు విడువ కూడదు. శ్రీ హరికి ప్రీతీ కరమగు కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కర మైనది.దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశ యింపకూడదు.

                మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది అయినను అదే గొప్ప వృక్ష మైన విధముగా కార్తీక మాసములో నియమాను సారముగ జేసినా యే కొంచము పుణ్య మైనను, అది అవ సాన కాలమున యమ దూతల పలు కానీ యాక కాపాడును. అందులకే యీ కార్తిక మాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును- అని అత్రి మహాముని అగస్త్యనకు బోధించిరి.

ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 15 November 2017

కార్తిక పురాణం-28 వ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ

కార్తిక పురాణం-28 వ అధ్యాయము
విష్ణు సుదర్శన చక్ర మహిమ

           జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతు డైనను,వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్దని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను.
             అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణునికడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూతిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి " అంబరీషా,ధర్మ పాలకా!

         నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము,నీకు నా పైగల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వనించితివి,కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రత భంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని.
             గాని నా దుర్బద్దినన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది.నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని.
 ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగమని చెప్పినాడు.కాన నీవే నాకు శరణ్యము.

              నేను యెంతటి తపశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు " మని అనేక విధాల ప్రార్ధoచగా,అంబరీషుడు శ్రీ మన్నారా యణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా!
 నీ కివే నా మన: పూర్వక వందనములు.

         ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియక యో తొందరపాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను.
 అయిన ను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు,ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితి వేని, ముందు నన్నుచంపి,తర్వాత ఈ దుర్వాసుని జంపుము.
              నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను.నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము.నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు అందువలన నే యీ దుర్వాసుడుముల్లో కములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు.

            దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు,
 నీ శక్తికియే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లో క మంతటికి తెలియును. అయినను ముని పుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచు చున్నాను.
             నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము"అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు
 గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్ద నలకు శాంతించి"

             ఓ భక్త గ్రేశ్వరా ! అంబరీషా! నీభక్తీని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు.అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు
యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును

           ఇది యెల్ల రకు తెలిసిన విషేయమే, ముక్కో పియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్ట వలన ని కన్ను లెర్ర జే సి నీ మీద జూపిన రౌద్ర మును నేను తిలకించితిని. నిరపరాధ వగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచ వలెన నితరుముచున్నాను.

          ఈతడు కూడా సామాన్యుడుగాడు.ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాత పశ్శాలి. రుద్ర తే జము భులో క వాసుల నందరను చంపగలదుగాని, శక్తీ లో నా కంటె యెక్కువే మియుగాదు.
 సృషి కర్త యగు బ్రాహ్మతేజస్సు కంటెను,కైలాసవ తియగు మహేశ్వరు ని తేజశ్శక్తి కంటెను యెక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతొ రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు.

          నన్నేదుర్కొన జాలరు.తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము.ఈ నీ తిని ఆచరించు వారాలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోన గలరు.
ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్దమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మ ము నీవు నిర్వర్తించుము"మని చక్రాయుధము పలికెను.

           అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో , బ్రాహ్మణాదుల యుందును,స్త్రీలయందును, గౌరవము గలవాడను.నారాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవులేను నియేనాయభిలాష .కాన, శరణు గోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము.

              వేల కొలది అగ్ని దేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేకమైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు.నీవు అట్టి తేజో రాశివి మహా విష్ణువు లోక నిందితుల పై, లోక కంటకుల పై, దేవ - గో - బ్రాహ్మణ హింసా పరుల పై నిన్ను ప్రయోగించి, వారిని రక్షించి,
 తనకుక్షి యుందున్న ప ధాలుగు లోక ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు.

         కాన,నికివే నామన: పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదముల పై పడెను.అంతట సుదర్శన చక్రము అంబరీ షుని లేవదీ సి గాడాలింగన మొనర్చి " అంబరీ షా! నీ నిష్కళంక భక్తి కి మెచ్చితిని.

           విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠీ0తురో, యెవరు దాన దర్మములతో పుణ్యఫలమును వృద్దిచేసుకొందురో,యెవరు పరులను హింసించక - పర ధనములను ఆశపడక- పర స్త్రీలను చెర బెట్టిక - గో హత్య - బ్రాహ్మణహత్య- శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్ట ములు నశించి,
యిహమందున పరమందున సర్వసాఖ్యములతో తులతూగుధురు.
                కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను,
 నీ ద్వాదశి వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్య ఫలము ముందు యీ మునిపుంగ వునిత పశ్శక్తి పని చేయలేదు ." అని చెప్పి అత ని నాశీర్వదించి, అదృశ్యా మమ్యెను.

అష్టామిశోధ్యాయము - ఇరవ య్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday 14 November 2017

కార్తిక పురాణం-27 వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

కార్తిక పురాణం-27 వ అధ్యాయము
దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

            అత్రి మహా ముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని యెంతో ప్రేమతో జేర దీసి యింకను ఇట్లు చెప్పెను.

           "ఓ దుర్వాస ముని! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను గాన, అందులకు నేనంగికరించితిని.బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతా క్రాంతుడై బ్రాహ్మణ పరిఒవృతుడైప్రాయోపవేశ మొనర్పనెంచినాడు.

             ఆ కారణమూ వలన విష్ణు చక్రము నిన్ను భాదింపబూనెను.ప్రజారక్షనమే రాజా ధర్మముగాని, ప్రజా పీడనము గాదు.ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను.

      ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును. బ్రాహ్మణ హితకులకి న్యాయ శాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని శిక బట్టి లాగినవాడును, కాళ్లతో తన్నినవాడును,విపర ద్రవ్యమును హరించు వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విపర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మ హ౦ తుకులే అగుదురు.

               కాన, ఓ దుర్వాస మహర్షి! అంబరీషుడు ని గురించి - తప శ్శాలియు, విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందు చున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు కాబట్టి, నీవు వేగమే అబరిషుని కడకేగుము అందు వలన మీ ఉభయులకు శాంతి లభించును"అని విష్ణువు దూర్వా సునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

సప్తవి౦శోధ్యాయము- ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Monday 13 November 2017

కార్తిక పురాణం-26 వ అధ్యాయము దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ

కార్తిక పురాణం-26 వ అధ్యాయము
దూర్వాసుడు శ్రీ హరి ని శరణు వేడుట - శ్రీ హరి బోధ

            ఈ విధ ముగా అత్రిమహముని అగస్త్యునితో - దుర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాద మును తెలిపి, మిగిలన వృత్తంత మును ఇట్లు తెలియజే సేను.ఆవిధ ముగా ముక్కోపి యైన దూర్వాసుడు భూలో కము, భువర్లో కము, పాతాళ లోకము, సత్యలో కములకు తిరిగి తిరిగి అన్ని లో కములలో ను తనను రక్షించువారు లేక పోవుటచె వైకుంఠ ముందున మహా విష్ణువు కడకు వెళ్లి

                 " వాసుదేవా! జగన్నాధా! శరణాగత రక్షణ బిరుదాంకి తా! రక్షింపుము.నీ భక్తు డైన అంబరీషున కు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను.ముక్కో పినై మహాపరాధ ము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడ వు . బ్రాహ్మణుడైన భగు మహర్షి నీ యురము పై తనిన్న ను సహించితివి.అ కాలిగురుతు నెటికి నీ నీ వక్ష స్దల మందున్నది. ప్రశాంత మనస్యుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము.

             శ్రీ హరి! నీ చక్రాయుధము నన్ను చంప వచ్చుచున్న" దని దూర్వాసుడు శ్రీ మన్నారాయణుని పరి పరి విధములా ప్రార్దించెను. ఆ విధ ముగా దూర్వాసుడు అహంకార మును వదలి తనను ప్రార్ది0చుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి " దూర్వాసా! నీ మాటలు యదార్ధ ములు.నీ వంటి తపోధ నులు నాకత్యంత ప్రియులు.

            నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయ పడ కుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను.ప్రతియుగ ముందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభ వించే యాపాదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును.

          నీ వ కారణముగా అంబరీ షుని శపించిటివి. నేను శత్రువు కైనను మనో వాక్కయులందు కూడా కీడు తలపెట్టేను. ఈ ప్రపంచ మందుగల ప్రాణి సమూహము నా రూ పముగానే జూతును. అంబరీ షుడు ధర్మయుక్త ముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని,అటువంటి నాభక్తుని నీవు అనేక విధ ములు దూషించితివి.నీ యెడమ పాద ముతో తన్నితివి.

              అతని యింటికి నీవు అతిధివైవచ్చికుడ, నేను వేళకు రానియెడల ద్వాద శి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీ షున కు చెప్పా వైతివి. అతడు వ్రత భంగ మును కు భయపడి, నీ రాకకై చూచి జలపాన మును మాత్రమే జే సెను. అంత కంటే అతడు అ పరాధ ము యేమి చె సెను! చాతుర్వర్ణ ములవారికి భోజన నిషిద్ద ది న ములందు కూడా జలపానము దాహశాంతికి ని, పవిత్ర త కును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్ర మున నాభక్తు ని దూషించి శపించితివి.

          అతడు వ్రత భంగ మునకు భయపడి జలపానము చేసినాడుకాని నిన్నువ మానించుటకు చేయాలేదె?నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను.

         నేనుపుడు రాజ హృదయములో ప్రవేశించినాను.
నీ శాపఫలము పది జన్మలలో అనుభ వించుదున ని పలికిన వాడిని నే నే.అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తానూ తెలుసుకోనె స్దితిలో లేదు.నీ శాపమును అతడు వినలేదు. అంబరీ షుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు.నిరపరాధి, దయాశాలి, ధర్మత త్పరుడు.

          అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అత నిని నిష్కరణ ముగా శపించితివి.విచారించ వలదు. ఆ శాపమును లో కో పకారమున కై నేనె అనుభ వింతును .అదెటులనిన నీ శాపములో నిది మొదటి జన్మ మత్స్యజన్మ . నే నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తు దును.

          మరికొంత కాలమున కు దేవ దానవులు క్షిరసాగర మును మదుంచుటకు మందర పర్వత మును కవ్వముగా చే యుదురు. అ పర్వత మునునీటిలో మునగకుండ కూర్మ రూపమున నా విపున మోయుదును.వరాహజన్మ మెత్తి హిరణ్యాక్లుని వదంతును. నరసింహ జన్మ మెత్తి
హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును.బలిచే స్వర్గ మునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గ మును
అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తి ని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూ భార మును తగ్గి౦తున.లోకకంటకు ఢ యిన రావణుని జంపిలో కోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును.

        పిదప, యదువంశమున శ్రీ కృష్ణు నిగను, కలియుగ మున బుద్దుడుగను ,కలియుగాంత మున విష్ణు చి త్తుఢ ను విప్రునియింట " కల్కి" యన పేరున జన్మించి, అశ్వారూడు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మ దేషుల నందరను ముట్టు బెట్టుదును.నీవు అంబరీ షునకు శాపరు పమున నిచ్చిన పది జన్మలను యీ విధ ముగా పూర్తి చేయుదును.

           ఇట్లు నా దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపజే సి వైకుంఠప్రాప్తి నోసంగుదును.ఇది ముమ్మాటికి తథ్యము.

షడ్వి౦శోధ్యాయము- ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday 12 November 2017

కార్తిక పురాణం-(25 వ అధ్యాయము ) దుర్వాసుడు అంబరి షుని శ పించుట

కార్తిక పురాణం-(25 వ అధ్యాయము )
దుర్వాసుడు అంబరి షుని శ పించుట

             " అంబరి షా! పూర్వజన్మలో కించిత్ పాపవి శే షమువలన నీ కీ యనర్ధము వచ్చినది. నీ బుద్ది చే దీర్ఘ ముగా అలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము.ఇక మాకు సెలవిప్పించుము " అని పండితులు పలికిరి.

           అంత అంబరీ షుడు " ఓ పండితోత్తములారా! నానిశ్చితాభి ప్రాయమును ఆలకించి వెడలుడు.
 ద్వాదశీ నిష్టను విడచుట కన్న, విప్రశాపము అధీక మయినది కాదు.జలపానము చేయుట వలన బ్రాహణుని అవ మాన పరచుటగాదు.ద్వాదశిని విడ చుటయుగాదు.

              అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్య ఫలము న శింపదు. గాన, జలపాన మొనరించి వూర కుందును" అని వారి యెదుట నె జలపానము నోనరించెను.అంబరి షుడు జలపాన మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చెసుకొని అక్కడ కు వచ్చెను.

           వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ" ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాక నే నీ వేల భాజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?ఎంతటి ధర్మపరి త్యాగి వి?అతిధికి అన్నము పెట్టె దనని ఆశ జూపి పెట్ట కుండా తాను తినిన వాడు మాలభ క్ష కుడ గును.

             అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును.
నీవు భోజన మునకు బదులు జలపానము చేసితివి.
అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడి ఛి భుజించి నావు కాన, నీవు నమ్మక ద్రోహివగుదు వె గాని హరి భక్తుడ వెట్లు కాగలవు ? శ్రీ హరి బ్రాహణావ మాన మును సహింపడు. మమ్మే యావ మానించుట యనిన శ్రీ హరి నీ అవ మానించుటయే.

           నీ వంటి హరి నిందా పరుడు మరి యొకడు లేడు.
 నీవు మహా భక్తుడ నని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమొన రించితివి. అబరిషా! నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టి నావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.

             అ౦బరిషుడు,మునికోపమునకు గడ గడ వణుకుచు,ముకుళిత హస్త ములతో " మహానుభావా! నేను ధర్మ హీనుడను, నా యజ్ఞానముచేనే నీ కార్యము చేసితిని.నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతి యే ప్రధానము.మీరు తపోధనులూ, దయా దాక్షిణ్య ములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను.

          దయాశూన్యడైన దూర్వసుడు అంబరిషుని తలను తన యెడమకాలితో తన్ని"దోషికీ శాపమీయకుండా వుండ రాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో పంది గాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవ జన్మలో వామనుడు గాను,ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో ముధుడవైన రాజుగాను యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధి గలదయలేని బ్రాహణుడ వుగాను పుట్టెదవుగాక " అనివెనుక ముందు ఆలోచించక శపించెను.

             ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా,శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగ కుండుటకు - అంబరీ షుని హృదయములో ప్రవేశించి " మునివర్యా! అటులనే - మీ శాపమనుభ వింతు" న ని ప్రాధే యపడెను.

             కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా, శ్రీ మన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను. ఆ సుదర్శన ము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వసుని పై పడ
బోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలంచి ప్రాణము పై ఆశ కలిగి అచటి నుండి " బ్రతుకుజీవుడా" యని పరుగిడేను.

          మహాతేజుస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను.దుర్వాసుడు తనను కాపాడ మని భూ లోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని,బ్రహలో కానికి వెళ్లి బ్రహ దేవుని, కైలా సమునకు వెళ్లి పర మేశ్వరునీ యెంత ప్రార్దంచిన ను వారు సైత ము చక్రాయుధ ము నుండి దుర్వాసుని కాపాడ లేక పోయిరి.

పంచ వింశో ధ్యాయము - ఇర వ య్యయిదో రోజు పారాయణము సమాప్తము
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Saturday 11 November 2017

కార్తిక పురాణం-24 వ అధ్యాయము అంబ రిషుని ద్వాదశి వ్రతము

 కార్తిక పురాణం-24 వ అధ్యాయము
అంబ రిషుని ద్వాదశి వ్రతము

                  అత్రి మహాముని మరల అగస్త్యునితో
 " ఓ కుంభ సంభవా! కార్తీక వ్రత ప్రభావము నెంతివి చా రించిన నూ,యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసి నంత వరకు వివరింతును.అలకింపుము.

             " గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసిన ౦దు వలన ను, సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానా దు లోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీ మన్నారయణుని నిజ తత్వమును
తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్దలతో దాన ధర్మములు చేయు వారికీ ని అంత ఫలమే కలుగును.

            ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధాన మెట్లో చెప్పెదను. వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున,
పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యె కాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజింప వలయును. దీని కొక యితిహాసము కాలదు.దానిని కూడా వివరించెదను. సావదనుడవై అలకింపుము"మని యిట్లు చెప్పు చున్నాడు.

              పూర్వము అంబరీషుడను రాజు కాలదు. అతడు పరమ భగవ తోత్తముడు ద్వాదశి వ్రాత ప్రియుడు
అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయు చుండెడివాడు. ఒక ద్వాదశి నాడు, ద్వాదశి ఘడియలు స్వల్ప ముగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనె వ్రతమును ముగించి బ్రాహ్మణాసమారాధన చేయ దలచి సిద్దముగా నుండెను.

             అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను.అంబరీషుడు ఆ మునిని గౌరవించి,
ద్వాదశి ఘడియలలో పారాయణము చేయ వలయు ను గాన, తొందరగా స్నానమున కై రమ్మన మని కోరెను.

 దుర్వాసుడ౦దులక౦గీకరించి సమీపమున గల నదికి స్నానమున కై వెడలెను.అంబరీషుడు యెంత సేపు వేచి యున్న నూ దుర్వాసుడు రాలేదు.ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు నుకొనెను. " ఇంటి కొచ్చిన దుర్వాసుని భోజనము నాకు రమ్మంటిని .

            ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యింత వరకు రాలేదు. బ్రాహ్మణు న కతిధ్య మిత్తునని మాట యిచ్చి భోజనం పెట్టక పోవుట మహా పాపము.అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటి పొవును. వ్రత భంగమగును. ఈ ముని మహా కోప స్వభావము గలవాడు.

              ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకే మియు తోచ కున్నది. బ్రాహ్మణా భోజన మతిక్రమిం చ రాదు.ద్వాదశి ఘడియలు మించిపో కూడదు.ఘడియలు దాటి పోయిన పిదప భుజించిన యెడల, హరి భక్తి ని వదలిన వాడనగుదను.

           ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పల మగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు,భోజనము చేసిన ద్వార్వసునకు కోపము వచ్చును.అదియు గాక, యీ నియమమును నెను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసినా పుణ్యములు నశించును. దానికి ప్రాయ శ్చితము లేదు.అని అలోచించి " బ్రాహ్మణా శాపమునకు భయము లేదు.

              ఆ భయము ను శ్రీ మహా విష్ణువేబోగట్ట గలదు. కావున నెను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిన ను పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వ జ్ఞు లైన కొందరు
పంతితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

           ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యే కాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘదియలున్నవి. ద్వాదశి ఘడియలలో నే భుజించ వలసి యున్నది. ఇంతలో నా యింటికి దుర్వాస మహాముని విచ్చేసిరి.అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అంధుల కాయన అంగీకరించి నదికి స్నానర్ధ మై వెళ్లి ఇంట వరకూ రాకుండెను.

         ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి.
బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింప వచ్చునా? లేక, వ్రత భ౦గమును సమ్మతించి ముని వెచ్చే వరకూ వేచి యుండ వలెనా?ఈ రెండిటిలో యేది ముఖ్య మైనదో తెలుప వలసిన"దాని కోరెను. అంతట యా ధర్మ జ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసికొని, దిర్ఘముగా అలోచించి "

             మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భ కు హరములందు జట రాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్ని దేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులుభుజించిన చతుర్వి ధాన్నమును పచనముగా వించి దేహే౦ద్రి యలకు శక్తి నొసంగు చున్నాడు. ప్రాణ వాయువు సహాయముతో జట రాగ్ని ప్రజ్వరిల్లును.

             అది చెలరేగిన క్షు ద్భా ధ- దప్పిక కలుగును. అ తపము చల్లార్చ వలెనన్న అన్నము, నిరు పుచ్చుకొని శాంత పరచ వలెను. శరీరమునకు శక్త కలుగ చేయువాడు అగ్ని దేవుడు, దేవత లందరి కంటే అధికుడై దేవ పుజ్యు డైనాడు. ఆ యగ్ని దేవునందరు సదా పూజింప వలెను.
గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కదా జాతి వాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వణికి పెట్టకుండా తినరాదు.

             అందులో నూ వేద వేదాంగ విద్య విశార దుడును, మహత పశ్శలియు, సదా చార సంపన్నుడును అయిన దుర్వాస మహా మునినిభోజనమునకు పిలిచి వణికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపమూ కలుగును.అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసు నంతటి వానిని అవమాన మొనరించిన పాపము సంప్రాప్త మగను" అని విషాద పరచిరి.
చతుర్వి ౦ శో ధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday 10 November 2017

కాలభైరవ అష్టమి


కాలభైరవ అష్టమి

           మార్గశిరశుద్ధ అష్టమి, శ్రీ కాలభైరవ అష్టమి. (కొన్ని సందర్భాల్లో మాసం తీసుకోకుండా, సౌరమానాన్ని అనుసరించి కృత్తికా నక్షత్రం ఉన్న మాసంలో కృష్ణ పక్ష అష్టమిని తీసుకుంటారు.

         అది నవంబరు- డిసెంబర్ నెలల్లో వస్తుంది.)పిలిచిన పలికే దైవం, భక్తుల భాధాలను, గ్రహపీడలను, రోగాలను నయం చేసే శక్తి, కర్మబంధాల నుంచి విమోచనం కలిగించగల దైవం #శ్రీకాలభైరువుడు. అటువంటి కాలభైరవ స్వామికి ప్రీతికరమైన, విశేషమైన రోజు #కాలభైరవాష్టమి. ఆ విశేషాలు తెలుసుకుందాం.

మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి-

              ‘‘కాలభైరవాష్టమి’’. పరమ శివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే ‘కాలభైరవాష్టమి’. లయకారుడైన పరమశివుడివల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడుగా కొలువుదీరిన దేవడు - కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన ‘‘కాలభైరవాష్టమి’’ పర్వదినమును జరుపుకుని కాలభైరవుడిని పూజించాలని శాస్తవ్రచనం.

             కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి - ‘‘నేనే సృష్టికర్తను...

           పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని పలికాడు. శివుడు అందుకు వ్యతిరేకించాడు. దీనితో ఇద్దరి మధ్య వాదం ప్రారంభమై చాలాసేపు వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు.

          దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నతకాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు.

             ఈ విధంగా శివుడి హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యనవున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. అనంతరం శ్రీకాలభైరవుడు లయకారుడైన శివుడి ముందు నిలబడగా-

           ‘‘నీవు బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడంవల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహాయిచ్చాడు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యా పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు -

            ‘‘కాలభైరవా! నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు. బ్రహ్మ దేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు. నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు. కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు... కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యాపాతకం భస్మమైపోతుంది’’ అని సలహాయిచ్చాడు.

                    దీనితో- కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా, బ్రహ్మకపాలాన్నీ కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని ‘‘కపాల మోక్షతీర్థం’’.

            తర్వాత కాశీక్షేత్రంలో శ్రీకాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలందుకుంటూ వున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతోపాటూ కాశీకి వెళ్ళి వచ్చినవారు ‘‘కాశీ సంతర్పణం’’ కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవస్వామి వారి మహత్మ్యానికి నిదర్శనం.

           ఈ విధంగా ఆవిర్భవించిన కాలభైరవ స్వామి వారి జన్మదినమైన ‘‘కాలభైరవాష్టమి’’ నాడు శ్రీకాలభైరవుడిని స్మరించడం, పూజించడంవల్ల సకల పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశిస్తాయి. కాలభైరవాష్టమి నాడు తెల్లవారుఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి.

         కాలభైరవుడి విగ్రహాన్నిగాని, చిత్రపటాన్ని గానీ పూజామందిరంలో ఏర్పాటుచేసుకుని ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీకాలభైరవస్వామి వారిని షోడశోపచారము, అష్టోత్తరాలతో పూజించి, శక్తిమేరకు నైవేద్యమును సమర్పించవలెను.

            ఆ రోజూ మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట ఉపవాసం వుండవలెను. ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘‘కాలభైరవాష్టకమ్’’ను పారాయణం చేయాలని శాస్తవ్రచనం. ఈ విధంగా కాలభైరవాష్టమిని జరుపుకొనడంవల్ల సర్వవిధాలైన భయాలు తొలగిపోయి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాలభైరవాష్టకమును నిత్యం పఠించడం కూడా మంచిదే!

కాలభైరవాష్టకము

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 |

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

కార్తిక పురాణం-23 వ అధ్యాయము శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట

కార్తిక పురాణం-23 వ అధ్యాయము
శ్రీ రంగ క్షేత్రమున పురంజయుడు ముక్క్తి నొందుట

అగస్త్యుడు మరల అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగ వా!విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు" మని యడుగ గా అత్రిమహాముని యిట్లు చెప్పిరి-
కు౦భ సంభవా!పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలో పేతుడై అగ్ని శేషము,
 శత్రు శేషము వుండ కూడదని తెలిసి, తన శత్రు రాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెనుతన యొక్క విష్ణు భక్తీ ప్రభావమువలన గొప్ప పరాక్ర మవంతుడు,పవిత్రుడు, సత్య దీక్షత త్పరుడు, నితాన్న దాత,భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద వె దా౦గ వేత్త యై యుండను.

           మరియు అనేక శత్రువులను జయించి దశది శలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింప చేసెను. శ త్రువులకు సింహ స్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడ గెత్తి అరి షడ్వర్గ ములను కుడా జయించిన వాడైయుండెను.

          ఇన్ని యేల? అతడి ప్పుడు విష్ణు భక్తా గ్రే సరుడు,
సదాచార సత్పు రుషులలో వుత్తముడై రాణించుచుండెను.అయినను తనకు తృప్తి లోదు.
ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యేవిధ ముగా శ్రీ హరి ని పూజించిన కృతార్దుడ నగుదునా?యని విచారించుచుండ గా ఒకానొక నాడు అశరీర వాణి" పురంజయా! కావేరీ తీరమున శ్రీ రంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠ మని పిలిచెదరు.

             నీ వచట కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీ వీసంసార సాగర మున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు" అని పలికెను.అంతటా పురంజయుడు అ యశిరీర వాణి వాక్యములు విని, రాజ్య భారమును మంత్రులకు అప్పగించి, సపరి వార ముగాబయలుదేరి మార్గ మద్య మున నున్నపుణ్య క్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు,పుణ్య నదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జే రుకొనెను.

             అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించు చుండగా మధ్యనున్నశ్రీ రంగ నాథాలయమున శే షశయ్య పై పవళించియున్న శ్రీ రంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి,

 " దామోద రా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా!
 అచ్యుతా! ముకుందా!పురాణపురుషా!హృషి కేశా!
ద్రోపది మాన సంరక్షకా!ధీన జన భక్తపొషా!ప్రహ్లాదవరదా!
 గరుడ ధ్వజా ! క రి వ ర దా! పాహిమాం! పాహమాం!
రక్షమాం రక్షమాం! దాసోహం పర మాత్మ దాసోహం"

యని విష్ణు సోత్త్ర మును పఠించి,కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గది పిత దుపరి సపరి వారు ముగా అయోధ్య కు బయలు దేరును. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములోచేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులంద రూ సిరి సంపదలతో ,పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

             అయో ధ్యానగరము దృఢ తర ప్రకార ములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనో హర గృహాగో పురాదులచో చతురంగ సైన్య సంయుత మై ప్రకాశించుచుండెను.అయోధ్యా నగర మందలి వీరులు యుద్ద నేర్పరు లై,రాజనీ తి గలవారై,వైరి గర్భ నిర్భదకులై, నిరంతరము విజయశిలురై,అప్రమత్తు లై యుండిరి.

            ఆ నగర మందలి అంగ నామణులు హంసగ జగామినులూ, పద్మ పత్రా యత లోచ నులూ నై విపుల శో ణీత్వము, విశాల కటిత్వము,సూక్ష్మ మద్యత్వము; సింహకుచ పినత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఇరవై మూడవ అధ్యాయము సమాప్తం
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి