Saturday 31 December 2016

నెమలిగుండం రంగనాయకస్వామివారు

 నెమలిగుండం   రంగనాయకస్వామివారు 

         ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి సంపదలకు, జీవనదులకు ప్రాణప్రదమైన నల్లమల అడవుల పరీవాహక ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రరాజాలున్నాయి. వాటి వరుసలోనే భక్తులకు కొంగు బంగారమై నెమలిగుండ్ల ‘రంగనాయకస్వామి’ క్షేత్రము అలరారుచున్నది.

             ఇక్కడకు మన రాష్ట్రంనుండేగాక,ఇతర ప్రాంతాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి చైత్రమాసం పౌర్ణమినాడు విశేషంగా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించటం పరిపాటి. ఈ ప్రాంత ప్రజలు రంగడు, రంగమ్మ, రంగస్వామి అను పేర్లతో తమ సంతానాన్ని పిలుచుకోవడం అనాదిగా ఉందని అంటున్నారు.

            నెమలగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రము ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో ఉంది. జెల్లివారి చెరువునకు పడమటి దిక్కున నాలుగుమైళ్ళ దూరం పెద్ద అడవి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరము నందు పుట్టిన గుండ్లకమ్మనది, ఈ క్షేత్రము గుండా ప్రవహిస్తూ గుంటూరు, ప్రకాశం జిల్లాల ద్వారా ప్రవహించి సముద్రములో సంగమించుచున్నది. ఈ క్షేత్రమునకు మూడు వైపులా ఉన్న కొండలను ‘శ్రీరంగం కొండల’ని పిలుస్తారు.

          ఇక్కడ నుండి దుముకే జలపాతమే నెమిగుండ్ల- నెమలిగుండము అని పిలుస్తారు. ఇక్కడ నివసిస్తున్న ఓ కుటుంబంలో చెంచులక్ష్మి అనే ఓ కన్య రంగనాయక స్వామి భక్తురాలు. ఒకానొక రోజు ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి సంకల్పించారు.

         కాని ఆ చెంచులక్ష్మి తనకు ఈ పెళ్లి వద్దని తాను శ్రీమన్నారాయణుని ప్రేమిస్తున్నానని ఆయననే వివాహమాడుతానని పట్టు పట్టడంతో వారి కుటుంబాన్ని కులసంఘం పెద్దలు వెలివేశారు.

           ఆ సమయంలోనే శ్రీమన్నారాయణుని సేవించే ‘మయూర మహర్షి’ ఆమెను జేరదీసి ‘నీ కోరిక తీరడానికి తపస్సే మంచిమార్గమని సెలవిచ్చారు. విష్ణుభగవానుని సందర్శనము కోసం ‘మయూర మహర్షి’, శ్రీమన్నారాయణుని వివాహము చేసుకోవాలని చెంచులక్ష్మి ఇరువురూ ఘోర తపస్సు కు పూనుకొన్నారు.

          వీరిరువురి అభీష్టములు నెరవేర్చడానికి వైకుంఠవాసుడే తరలి వచ్చాడు. చెంచులక్ష్మినిభక్తిని మెచ్చిన రంగనాయకస్వామిని ఆమెను వివాహమాడి ఈ నెమలిగుండ్లలోనే నివాసమేర్పరుచుకొన్నాడు.

             ఈ సంగతి తెలియక వైకుంఠుని ఉనికిని గుర్తించలేక వైకుంఠంలో లక్ష్మి చింతింతు రాలైంది. చివరకు స్వామిని వెదకడానికి పూనుకొంది. ఎట్టకేలకు చెంచు ప్రక్కన చేరిన నారాయణుని గుర్తించి అలుక పూనింది. నారాయణుడు చెంచులక్ష్మికూడా నీ సోదరినే అంటూ జరిగిన వైనాన్ని చెప్పగా ప్రసన్నురాలైన లక్ష్మి తాను నెమలి గుండ్లలో కొలువైంది.
              చెంచులక్ష్మి తన సోదరిగా భావించి స్వీకరించింది. శ్రీమన్నారాయణుడిని సేవించే మయూర మహర్షి కోరిక నిమిత్తమై తాను ఇక్కడే కొలువై భక్తుల కోరికలను తీరుస్తానని వరాల నిచ్చిన స్వామి శిలా రూపాన్ని పొందాడు.

               అంతేగాక ఈ ప్రదేశము రంగనాయక క్షేత్రముగా విరాజిల్లగలదని ఆశీర్వదించాడు. అపుడు శిలారూపాన్ని పొందిన స్వామియే మనకు రంగనాయకుల రూపముగా దర్శనం ఇచ్చేది. మయూర మహర్షి చే పూజలందుకొన్న శ్రీమన్నారాయణుడిని రంగస్వామి గా కీర్తిస్తూ అనంతర కాలంలో ఆ ప్రాంత వాసులు గుడిని నిర్మించారు. ఈ ఆలయమే నేటి నెమలి గుండ్ల రంగనాయక స్వామి ఆలయము.

              ఆనాటి నుంచి నేటి వరకు స్వామి లీలలను అనేకాలుగా ఈ క్షేత్రం దర్శించిన భక్తులకు అనుభవంలోకి వస్తునే ఉన్నాయ. ఈ పుణ్యక్షేత్రమున నీటి కొరత యుండదు. గండ్లకమ్మ నది నిండుగా ప్రవహిస్తుంటుంది. రంగనాయకుల యందు లీనమైన వారికిచట ఒక అద్భుత దృశ్యము గోచరిస్తుంది.

             దేవాలయానికి ఎదురుగా నెమలి గుండము ఉంది. దీనినే తూర్పు పీట అని కూడా పిలుస్తుంటారు. ఈ తూర్పు పీటకు చివర రంగనాయకస్వామి వారి శంఖు, చక్ర, నామాలు కన్పిస్తుంటాయ. కాని ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం భక్తితత్పరులకు మాత్రమే గోచరమవుతాయని అంటారు.
             భక్తులు తన్మయత్వంతో స్వామి నామస్మరణ చేస్తూ తప్పట్లు మోత, మైకుల సందడి, సన్నాయి, బ్యాండుమేళం రకరకాల వాద్యాల హోరుతో రంగస్వామి నామస్మరణ చేస్తూ కొండకి పయనమవుతారు.

            ఇక్కడ ఎవరైనా అనాచారపరులు సంచరిస్తే వారిని ఈ స్వామి మహిమవల్ల ఈ అడవులలో సంచరించే తేనెటీగల సైన్యం తీవ్రంగా శిక్షిస్తాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. అందువల్లనే ఈ క్షేత్రంలో దొంగతనాలు, దోపిడీలు లాంటి చర్యలు కూడా ఇక్కడ జరుగవని భక్తులు చెబుతున్నారు.

            అఖిలాండేశ్వరుడైన ఈ స్వామివారిని వర్గ కుల మత భేదాలు లేకుండా సర్వులూ ఈ స్వామిని కొలుస్తారు. కొందరికి దేవుడు ఆవహించి వారుచేసిన తప్పులను వివరించి దానికి శిక్షలు వేస్తుంటారని కూడా ఇక్కడి వారు చెబుతుంటారు.

             అడవులలో నివసించే హరిజన కుటుంబాలు తండోపతండాలుగా ఇక్కడ స్వామిని దర్శించి తన్మయత్వంతో రంగడి స్మరణతో తమ గృహాలకు తిరిగి వెళ్తుంటారు. అందుకే భక్తుల కొంగు బంగారం నెమలిగుండ్ల రంగనాయకుడు. తప్పక చూడవలసిన క్షేత్రం ఈ రంగనాయకస్వామి.

             ఇక్కడ ఉన్న తూర్పుపీట లోని శంఖు చక్రనామాలు దర్శించినవారికి ‘శ్రీరంగం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అంటారు. ఇలా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం అందరూ చూసి తీరాల్సింది.
మీ

వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి


తిరుప్పావై (అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం) 17వ పాశురము
           గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు.
         వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.  మరి ఎలా లేపుచున్నారో

పాశురము

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

         ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది. నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు.
           అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.

            ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.

             ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా.
          "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది.

          ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు.

       "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద" లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావు ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా.
           అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.

         ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు,

         ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు. "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నీవూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.

అవతారిక :-

         ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు.

          ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.      

        (ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)

ప..     లేవయ్యా మా స్వామి! నందగోపాలా!
    లేవయ్యా స్వామి! మా సర్వప్రదాతా!

అ..ప..    లేవమ్మ మాయమ్మా! లే యశోదమ్మా!
    లేవె! స్త్రీ జాతి కంతకును తలమానికమ!

చ..    ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ!
    మేలుకో! నిత్య సూరుల స్వామి!
    శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ!
    ఇంక నిదురింపకుమ! లెమ్ము! కృష్ణుని తోడ!
    లేవయ్య మా స్వామి! నందగోపాలా!
    లేవయ్య స్వామి మా సర్వప్రదాతా!

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday 30 December 2016

పుణ్యప్రదం ~ పుష్యమాసం 30.12.2016 నుండి ప్రారంభం

నిన్న అనగా 30.12.2016 నుండి పుష్యమాసం ప్రారంభం కాబడినది ఈ మాసం
పుణ్యప్రదం ~ పుష్యమాసం

          పుష్యమీ నక్షత్రం పౌర్ణమినాడు చంద్రునితో కూడి ఉన్న మాసం పుష్యమాసం. చాంద్రమాన గణన ప్రకారం సంవత్సరంలో ఇది పదోమాసం. చాంద్రమాన, సౌరమాన గణనల రెండింటి ప్రకారం ఏర్పడే పండుగలు వస్తాయి ఈ మాసంలో. దేవతలతో పాటు, పితృదేవతలనీ ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకం.

          పుష్యమి అనేది శనిగ్రహ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. ఇతడు బుద్ధి కారకుడు. అందువలన బృహస్పతికీ శనికీ అత్యంత ప్రీతికరమైనదీ మాసమని చెబుతారు. శనిపేరు వినగానే ఉలిక్కిపడతారు చాలామంది. అతడు హాని కారకుడనే నమ్మకమే దీనికి కారణం.

             శని సత్యధర్మాలను సమానంగా పాటించేవాడు. ఆరాధించేవారిని అనుగ్రహించే తత్వంకలవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతనికి ఇష్టమైన పదార్థం నువ్వులు, వాటి నుంచి వచ్చేనూనె. కాబట్టి ఈ మాసంలో వాటితో ఆయనను అభిషేకించి, పూజించాలని, దానం చేయాలని, బెల్లంతో కలిపిన నువ్వులు తినాలని శాస్త్ర వచనం.

           బాహ్య భావనలు ఇవైనా, అంతరార్థం లోతైనది. హేమంత (హిమం=మంచు) రుతువులో ఇది రెండో మాసం. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువ. అందువల్లే 'పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు' అనే నానుడి ఏర్పడింది. ఆ కొద్దిసేపైనా ఎండతీక్షణత ఉండదు. సూర్యరశ్మి శరీరానికి తగినంత అందదు. అందువల్ల తైల గ్రంథులు వాటి విధిని సక్రమంగా నిర్వహించలేక మందగిస్తాయి. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. పగుళ్లు ఏర్పడతాయి. దీనికి నివారణ తైల (తైలం=తిలల (నువ్వుల) నుంచి తీసినది) అభ్యంగనం. శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచేది ఉష్ణోగ్రత. ఇది శరీరంలోని ధాతువుల్లో ఉండే కొవ్వు పదార్థాలపై ఆధారపడి ఉంది.

         ఈ మాసంలో అవి మందగించడంవల్ల తైలశాతం తగ్గుతుంది. దాన్ని భర్తీ చేయడానికి సరైన మార్గం నువ్వులు, బెల్లం కలిపి తినడం. బెల్లం ఆయుర్వేద పరంగా అత్యంత ఆరోగ్య ప్రదమైన పదార్థం. దీనివల్ల రక్తవృద్ధి జరుగుతుంది. ధాతు పుష్టి కలిగి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అందువల్లనే ఈ నెలలో వచ్చే పండుగలన్నింటిలోనూ తైలాభ్యంగనం తప్పనిసరి అంటారు.

ఈ మాసంలో వ్రతాలు

        ఈ మాసంలో శుక్లపక్ష విదియనాడు ఆరోగ్య వ్రతం చేస్తారు. దీనికి 'ఆరోగ్య విదియ' పేరు. శుక్లపక్ష షష్ఠి కుమారషష్ఠి. కుమారస్వామిని ఇలవేలుపుగా కొలిచే ప్రాంతాల వారు ఆయనను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శుక్ల అష్టమినాడు సంజ్ఞిక అనే శ్రాద్ధం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. శుక్లదశమి శాంబరీ (రతీదేవి) దశమి. శివపార్వతులను కలిపే ప్రయత్నంలో శివుని ఆగ్రహానికి గురై భస్మమయ్యాడు మన్మథుడు. అప్పుడు రతీదేవి తన కోసం కాకపోయినా, సృష్టి గమనం సక్రమంగా సాగడం కోసమైనా అతడిని బతికించమని కోరింది. సఫలత సాధించింది. లోకోపకారం కోసం ఎంతగానో మథనపడి భర్తను బతికించుకున్నందుకు కృతజ్ఞతగా ఈ వ్రతంచేసి రతీదేవిని పూజిస్తారు. ఒడిషాలో ఈ ఆచారం ఎక్కువ. శుక్ల ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే పుత్రదా ఏకాదశి దీనికి నందైకాదశి అని పేరు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువాలాయాలలో వైకుంఠ ద్వారము ఏర్పాటు చేసి అత్యంత పవిత్రంగా విష్ణుని దర్షించు కుంటారు మరియు ఈ రోజు సంతానం లేనివారు ఈ రోజు లక్ష్మీనారాయణుల్ని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

           పుష్యమాసం అనగానే గుర్తుకు వచ్చేది ధాన్యలక్ష్మి. ధనుర్మాసం పంట ఇంటికి చేరి ధాన్యరూపంలో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. కాబట్టి పౌష్యలక్ష్మిగా పిలుస్తారు. రంగవల్లులు, ధనుర్మాస వ్రతాలు, గొబ్బెమ్మల అలంకారాలు వీటన్నింటి సందడీ అంతా ఇంతా కాదు. తెలుగువారు పాటించేది చాంద్రమానమైనా, సౌరమాన గణన ప్రకారం జరిపించుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఇది మూడు రోజుల పండుగ. సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి ప్రవేశించే రోజు ఇది. తమ వంశంలో గతించిన పితృదేవతలనందరినీ స్మరిస్తూ పూజిస్తారు ..

          ఈ మాసం లో పంటలు పండి ధాన్యం  ఇండ్లకు చేరడము  వల్ల  రైతుల శ్రమ, కష్టం ఫలించి  ఫలం లభించే  మాసం.  చాన్ద్రమాసం  ప్రకారం పదవదైన ఈ మాసంను శూన్య మాసం అంటారు. ఐతే  సూర్య భగవానుడు ధనుస్సురాశిలో  సంచరిస్తూ ఉన్న కాలం మాత్రమె - "శూన్యమాసము "  మకర సంక్రమణ  జరిగిన తరువాత శూన్యమాసము  కాదు. ఈ మాసములో పగలు తక్కువ రాత్రి అధికము.

           పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కనుక ఈ నెలలో  శనిదేవుడి  ప్రభావము అధికంగా  వుంటుంది.  శనిదేవుడికి ప్రతీకమైన మాసము కనుక ఈ నెల  అంతా  శనిదేవుడిని పూజించవలెను.  ఈ మాసములోని  ఆదివారాల్లో ప్రత్యక్ష భగవానుడైన  శ్రీ సూర్యభగవానుడిని   పూజించాలని శాస్త్ర వచనము ముఖ్యంగా ఆదివారంనాడు సూర్యుడిని ఆవుపాలతో అభిషేకించి,  జిల్లేడు పూలతొ పూజించవలెను.  ఈ నెలలో వచ్చే సప్తమిని మార్తాండ సప్తమి అంటారు.  ఆ రోజు సూర్యుడిని  పూజ  చేయడము  వల్ల  మంచి ఫలితము వస్తుంది.

             పుష్య అమావాస్య నాడు  ఇంటిలోని ఒక చోట   శుభ్రపరచి  బియ్యపిండితో  అష్టదళ  పద్మములు వేసి  దానిపైన  కుంపటి పెట్టి  దాంట్లో ఆవు పిడకలు వేసి వెలిగించి దానిమీద కాంస్య పాత్రలో పాయసము చేసి ఉంచవలెను.  ప్రక్కనే  శివలింగం  వుంచవలెను.కంచుపాత్ర యందు బ్రహ్మ దేవుడిని, పాయసము నందు  శ్రీ మహా విష్ణువును , శివలింగం నందు శివుడిని ఆవాహన చేసి పూజించవలెను.బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను.  తరువాత  శివలింగాన్ని, ఆ పాత్రను  బ్రాహ్మణుడికి దానము ఇవ్వవలెను.  ఈ విధంగా చేయడము వల్ల   భూదాన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలితము  లభిస్తాయి.

        ఈ  విధంగా ఎన్నో విశిష్టతలను కలిగిన ఈ పుష్యమాసములో చేసే  పూజలు, దాన ధర్మాలు విశేష ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది

             పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం (ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రమంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు.

         పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత . శనికి అధి దేవత యముడు. "యమం " అంటే "సం యమం" అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శక్తి  లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది.

        శని ధర్మదర్శి. న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను,పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శనికి పైన చెప్పిన గుణాలు అన్నీ పొందవచ్చు. ఎప్పుడూ మనిషి వీటిని పొందుతాడో ,అప్పుడతడు బృహస్పతి వంటి వాడు అవుతాడు. అందువల్ల,పుష్యమి నక్షత్రానికి బృహస్పతిని అధి దేవతగా చెప్తారు.అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని నిరూపితమైంది. పరమాత్ముని నాభి కమలం నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడు. ఎప్పుడు  శరీరంలోని ఈ నాభి ప్రదేశాన్ని శని ప్రదేశమని చెప్పారో, అప్పుడే ఈ ప్రదేశానికి ఇవ్వబడిన  ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని చెప్పినట్లు మనం గ్రహించాలి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

ధనుర్మాసం లో గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలలో ఈ రోజు 16వ పాశురము

  ధనుర్మాసం లో గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలలో ఈ రోజు 16వ పాశురము



తిరుప్పావై 16వ రోజు పాశురము

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్

             మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి. ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది.
             ఆ నందగోపుడినే మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.

             ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాళ్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.

          "నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు, అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు.
             అక్కడ ఇంకో ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ధ్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు.
           మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చే్రాల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ధ్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్" మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు.
           ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు. అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు.
            అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా అని నమస్కరించారు. "మణిక్కదవం" మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళం తీయవయ్యా.

            ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్లపిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు.
            ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, "నెన్నలే వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం ఆయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అయనని అంటే "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయా.
           ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్" చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.

          "వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు, ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.

అవతారిక :-

    ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు.
             పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా!
              భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.

    దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)        

        (ఖరహరప్రియ - ఏకతాళము)

ప..    మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!
    సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

చ..     గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న
    అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.
    చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!
    నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

Thursday 29 December 2016

ధనుర్మాసం గోదాదేబి పాడిన తిరుప్పావై పాశురం లలో ఈ రోజు పదిహేన(15) వ పాశురము




ధనుర్మాసం గోదాదేబి పాడిన తిరుప్పావై పాశురం లలో ఈ రోజు పదిహేన(15) వ పాశురము

            ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పడవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహెను పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచె ఈ వ్రతము నాకు పుర్వరంగామునుతెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు .

           దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత.

          అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈ నాడు మేల్కొల్ప బడుచున్నది.

పాశురం:-

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము;-
        మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

        ఈరోజు పదిహేనవ పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

          అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో,  "ఎల్లే!" ఏమే  "ఇళంకిళియే!" లేత చిలకా!  "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

          కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని,  శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే.  "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

           బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్"  ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు.  అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు,  నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను,  మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు,    "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.

        కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్"  ఏమే రా! మరి ఇంక,  "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.

         పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.

          ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ.

          పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన,  శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు.  ఇది భగవంతుడు చేసే చేష్ట.

           ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి  ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు.  తిరుప్పావై మనకు  అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

అవతారిక:

         వ్రతాన్ని చేయటానికై తమ గోష్ఠిలో చేర్చుకొనదగిన పదవ గోపికను యీ మాలికలో గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది సంభాషణ రూపంలో వున్న అద్వితీయ పాశురం. ఈ గోపికను యీగోష్ఠి నంతను సేవించవలెనను కుతూహలమున్నది. భగవద్గుణాలను ఏకాంతంగా ఒక్కరే అనుభవించటం తగదని అందుకే గోష్ఠిలోని అందరకూ ఆ అనుభవ ఆనందాన్ని పంచాలని గోదమ్మ చెప్తున్నది.

          ఇక్కడితో వ్రతంలోని రెండవ దశయైన ఆశ్రయణ దశ పూర్తవుతుంది. వ్రత మిషతో భగవద్గుణాలనందరకు పంచాలనే అద్భుతమైన భావానికి లోనైన ఆండాళ్ తల్లి శ్రవణ, మనన, ధ్యానాలనే వాటిని చక్కగా విశదపరచి నిరూపించింది. భగవంతుని పొందే నిమిత్తం భక్తి యోగాన్ని అనుసరించాలి. మనసు నిండా భక్తి నిండితే అది ఆత్మతో లయిస్తుంది. దానితో ఎడతెగని ఆనందం లభించి స్థిరపడిన చిత్తంతో భగవంతునితో తాదాత్త్యతను పొందుతుంది. ఈ పదవ గోపిక లక్షణాలు కూడా యివే! ఇట్టి నిద్రలో మునిగివున్న యీ పదవ గోపికను తమ గోష్ఠిలో చేరమని సంభాషణా రూపంలో సమాధానపరచి గోష్ఠిలో చేర్చుకున్నది గోదా తల్లి.

        (కమాసురాగము - ఏకతాళము)

వారు:     చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే!

ఆమె:     చెలియలార! ఉలికి పడగ పిలువకు డిదె వచ్చుచుంటి.

వారు:     పుల్లవిరుపు మాటల నీ చతురోక్తుల నెరుగుదుమే?

ఆమె:     అల్లన మీరె చతురలు! నన్నిట్టుల నుండనీరె!
    వలసినవారెల్ల రిచట కూడిరి! ఓ చెలియరో!

వారు:    చెలులెల్లరు వచ్చిరి నీ వెంచుకోవె! సఖియరో!

ఆమె:    ఏల నేను రావలె! మీకేమి నేను చేయవలె?

వారు:    బలియుని కువలయకరి మదమణచిన శ్రీకృష్ణుని లీలల
    కీర్తింప నీవు శీఘ్రమే రావమ్మరో!
    చిలక పలుకు చిన్నదాన! ఇంకా నిదురింతువే?
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday 28 December 2016

దనుర్మాసం గోదాదేవి తిరుప్పావై పాశురములలో ఈ రోజు తిరుప్పావై పద్నాల్గవ పాశురం.

దనుర్మాసం గోదాదేవి తిరుప్పావై పాశురములలో ఈ రోజు
తిరుప్పావై పద్నాల్గవ పాశురం.

పరందాముని మహిమ:

ఆండాళ్ తిరువడిగళేశరణం

        ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకు నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .

          ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతరంలనే మచి ఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .

పాశురం

    ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
    శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
    శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
    తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
    ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
    నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
    శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
    పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్.

తాత్పర్యము:-


  •              ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. 

            ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె?; ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను లేపిచున్నది.    

    అవతారిక :-

          ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక.

          తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.

        ( లలితరాగము - ఏకతాళము)

ప..    ముందుంగ లేపుదు నంటివి ముచ్చటలెన్నో చెప్పితి
    వెందుబోయె నోటిమాట! సిగ్గు నీకు లేకపోయె!

1 చ..    పెరటి దిగుడు బావిలోని ఎర్రని కలువలు నవ్వెను!
    పరికించవె సఖి! ఆ నీలోత్పలములు ముకుళించెను!
    తిరు కోవెల 'కుచ్చికోల' తెరువగ నదె తపోధనులు
    వర కాషాయాంబరులౌ శుభ్రదంతు లేగ గనవె!

2 చ..    శంఖ చక్రములు గల్గిన శ్రీహస్తుని హరిని
    పంకేరుహ నేత్రుని - శ్రీ కృష్ణుని సర్వేశుని
    పంకజలోచనీ! పాడుమో మంజుల భాషిణీ'
    ఇంకనైన లేవవె! నీ నిద్దుర చాలించవె!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Tuesday 27 December 2016

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే


శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే

“శరవణభవ”…ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు

షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.

        పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు.

            కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.
ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి:

           తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

           ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.
ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.

         అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.

       ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

          ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

సుబ్రహ్మణ్య భుజంగం

సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || 1 ||

న జానామి శబ్దం న జానామి చార్థం – న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || 2 ||

మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ || 3 ||

యదా సంనిధానం గతా మానవా మే – భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే – తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || 4 ||

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || 5||

గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢాస్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః – స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు || 6 ||

మహాంభోధితీరే మహాపాపచోరే –మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే
గుహాయాం వసంతం స్వభాసా లసంతం – జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || 7 ||

లసత్స్వర్ణగేహేనృణాంకామదోహే సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం –సదా భావయే కార్తికేయం సురేశమ్ || 8 ||

రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే – మనోహారిలావణ్యపీయూషపూర్ణే
మనఃషట్పదో మే భవక్లేశతప్తః – సదా మోదతాం స్కంద తే పాదపద్మే || 9||

సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || 10 ||

పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామ్యహం తారకారే తవోరః – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || 11 ||

విధౌక్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాన్జగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || 12 ||

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః – సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || 13 ||

స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని
సుధాస్యందిబింబాధరాణీశసూనో – తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || 14 ||

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం – దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || 15 ||

సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || 16 ||

స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || 17 ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం – హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || 18 ||

కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ – ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || 19 ||

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || 20 ||

కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింద్ధి భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం – పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || 21 ||

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే – న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || 22 ||

సహస్రాండభోక్తా త్వయా శూరనామా – హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం – న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || 23||

అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || 24 ||

అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || 25||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సంతు లీనా మమాశేషభావాః || 26 ||

మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే – గుహాద్దేవమన్యం న జానే న జానే ||27||

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా – నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం – స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || 28 ||

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే – వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || 29 ||

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ || 3౦ ||

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కందమూర్తే నమస్తే నమోఽస్తు || 31 ||

జయానందభూమం జయాపారధామం – జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో – జయ త్వం సదా ముక్తిదానేశసూనో || 32 ||

భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || 33 ||

శ్రీ పార్వతిశ ముఖ పంకజ.

హే స్వామినాథ కరుణాకర దీనబంధో – శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ – దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ – తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల – పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య – దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార – కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాఽమరబృందవంద్య – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాదిమనుమన్త్రిత గాఙ్గతోయైః – పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా – కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాన్త్యా – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || 9 ||
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురొహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

ధనుర్మాసం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురం లో ఈ రోజు పదమూడవ పాశురం

ధనుర్మాసం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురం లో ఈ రోజు పదమూడవ పాశురం

ఆండాళ్ తిరువడిగళేశరణం :

         వెనుకటి పాసురములో గోపికను మేల్కొల్పుచున్నప్పుడు కృష్ణ సంకీర్తనము మాని శ్రీ రామచంద్ర గుణమును సంకీర్తనము నొనర్చి శ్రీ రాముడు మనోభి రాముడని గోపికలు పేర్కొనిరి. దానిని విని నందవ్రజమున సంచలన మేర్పడినది. మధురలో పుట్టి శ్రీ కృష్ణుడు గోపావంశమున చేరి తాను కుడా గోపాలుడే యనునట్లు కలసి మెలసి యుండి వారి కాపాడుచుండగా అట్టి కృష్ణుడు ని విడిచి శ్రీ రాముని కీర్తించుట ఏమి అన్యాయము.

         ఆనాడు అయోధ్యలో " రామో రామో రామ ఇతి ప్రజానా మభావన్ కదా:"ప్రజలు రాముడు, రాముడు ,రాముడని అనుకోనుచుదేదివారు. కాని ఇతర ప్రసంగామీలేదు కదా!
నంద వ్రజమున మాత్రము కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హితవు అని .వాదనలు జరుగుతున్నాయి. అవి రెండు గ్రూపులుగా విడిపోయారు. వారి మద్య గొడవ జరుగుతుండగా ఒక పెద్దమ్మ వచ్చి రాముడే కృష్ణుడని , కృష్ణుడే రాముడని వారికి వివరించింది.

         ఈ రోజు లేపుచున్న గోపిక నేత్ర సౌందర్యము కలది. నేత్ర సౌందర్యమనగా కృష్ణుడు తన కంటి యందే ఉంఢవలెను కాని కృష్ణుని వెదకుకొని రాక యెట్లుండ గలడు. అను దైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి ఇంటిలో నే పరుండినది. నేత్రమనగా జ్ఞానము .నేటి గోపిక కృష్ణుని కలవాలన్న కోరిక కలది అయినాను కృష్ణుని పొందుటకు తానె ప్రయత్నమూ చేయక పరున్నది . ఆ గోపికను ఈ విధముగా లేపుచున్నారు.

 పాశురం

    పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
    క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
    ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
    వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
    పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
    కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
    పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
    కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.

తాత్పర్యం:
        కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరునుసంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను.

        ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు.

       కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.

    అవతారిక :-

         ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొలిపారు. ఇక ఎనిమిదవ గోపికను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కల్గినది. తన నేత్ర సౌందర్యాన్న నుభవించటానికై శ్రీ కృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో వుండి ఉదాసీన వైఖరిననుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న యీమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు.

        క్రిందటి (మాలికలో) ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కాని ఊరివారు వ్రేపల్లెలో కృష్ణ కీర్తనమేగాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికిని యిక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించివున్న శ్రీమన్నారాయణుడు అవసరార్ధము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు.

          నామ రూపాలు వేరైనా తత్త్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు.

        (చారకేశి రాగము - ఆదితాళము)

ప..    లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
         లేవే! తామరసాక్షి! లే! మా కాశ్చర్యమాయె!

అ..ప..    లేవే! పడకను వీడవె! రావె! తీర్థమాడగ
             వేవేగ లేచిరావె! సమయము మించి పోవునె!

చ..     నోటిని జీలిచి బకాసురు జంపిన    
         పటు బలశాలి శ్రీకృష్ణుని కీర్తిని
         నోట బాడుచు నోము నోచేటి కన్యలు - ఆ
        చోటు చేరిరె! వేగ నిద్దుర లేవనె!

చ..    శుక్రుండుదయ మందె నస్తమించెను గురుడు
        పక్షుల కలవరము లవిగో వినబడవొ నీకు?
       శ్రీకృష్ణుని తలచు కపటమ్ము వీడి యిపుడు
       ఆ కృష్ణ విరహ తాపము దీర నీరాడ
     లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Monday 26 December 2016

నక్షత్రము - నాటాల్సిన వృక్షం

నక్షత్రము - నాటాల్సిన వృక్షం
        వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.

         జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు.

         ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.

జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు

అశ్వని నక్షత్రము
       అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.

భరణి నక్షత్రము
         భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రము
      కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రము
       రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

మృగశిర నక్షత్రము
       మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రము
      ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

పునర్వసు నక్షత్రము
       పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రము
       పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రము
       ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రము
       మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రము
       పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రము
       ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రము
       హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రము
       చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రము
       స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రము
       విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రము
        అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రము
        జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రము
        మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

పూర్వాషాడ నక్షత్రము
        పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఉత్తరాషాడ నక్షత్రము
         ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రము
         శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రము
        ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రము
        శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము
        పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రము
        ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రము
        రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.
మీ🌹
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

జై శ్రీరామ్
జై హనుమాన్

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

తిరుమల పుణ్య క్షేత్రం యందు ఆకాశ గంగ ఎలా,ఎందుకు ఏర్పడింది

తిరుమల పుణ్య క్షేత్రం యందు ఆకాశ గంగ ఎలా,ఎందుకు ఏర్పడింది

    తిరుమలనంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం స్వామి వారి కైంకర్యమే మహాదానందం తో పాపనాశనానికి వెళ్లి అక్కడ నుండి నీటికుండ నెత్తికి  ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు. పరమభాగవతోత్తముడైన తిరుమలనంబి  శ్రమకు అలసట.!  స్వామి  తిరుమలనంబి శ్రమను తీర్చదలిచి  స్వామీ వేటబాలుడై
ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి  తీర్థం  తెచ్చే దారిలో  చెట్టునీడన. కూర్చున్నాడు

         స్వామివారికి  నంబి  తీర్థం  తెస్తున్నది చూచాడు స్వామి   నంబిని   దాహంగా  ఉంది  గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అన్నాడు. అందులకు నంబి" బాలకా  !  ఇది  దివ్యజలం, స్వామి   అభిషేకపు  జలమిది  నీవు  అడగరాదు నేనివ్వరాదు అన్నాడు. అయిననూ వేటగాడు గా వున్న స్వామీ  తాతా  !  నీరు  పోసి  ప్రాణం  రక్షించవా  ? అన్నాడు  ,

          నీ  దాహం  తీర్చాల్సినవాడు  భగవంతుడు బాలకా కావున భగవంతుని ప్రార్థించు అతడే  రక్షకుడు, ప్రాణరక్షకుడు చెప్పి స్వామి అభిషేకం నకు నాకు  సమయాతీతం  అవుతున్నదని వేగంగా  అడుగుసాగించాడు నంబి.

           స్వామి నంభి తీసుకెళుతున్న  కుండకు బాణం కొట్టాడు  దానికి  చిల్లు పడింది నీటి  ధార సాగింది స్వామి   దోసిటితో  నీరు   త్రాగసాగాడు కుండ తేలిక అయింది ఎందులకు అని తిరుమల నంబి తిరిగి చూచాడు బాలుడు చేత బాణం చే కుండకు ఏర్పడిన రంధ్ర0  నుండి ధారగా పడుచున్న స్వామి వారికి అభిషేకం చివరి నీటిబొట్టుతో పూర్తిగా ఖాళి అయినది అంతటితో  నంబి  హతాశుడైనాడు  కూలబడ్డాడు.

      శ్రీస్వామికి ఏదో అపచారం చేసాను అని  గొల్లుమన్నాడు  ,
  కన్నీరు కాలువ కట్టింది,అది చూచి  స్వామి  నివ్వెరపోయాడు  ఎంతటి  భక్తి భగవంతుని  కన్నీరు భగవంతుని  బాష్బమైంది  ,

"  తాతా లే  నీకు పవిత్రజలం చూపుతాను  నాతొ రా అని నంబి  చేయిపట్టుకొని లేపి రెండేరెండు  అడుగుల్లో  కొండచరియకు  చేరాడు. అక్కడ నుండి స్వామి బాణం ఎక్కుపెట్టి, కొండకు కొట్టాడు
మిరమిట్లు మెరుపుతో  కొండనుంచి జలధార. అదే ఆకాశగంగ.

    తిరుమలనంబికి  తెలివి  వచ్చింది, జలధార బంగారుబిందె   మరొకరు,వినలేదు,కనలేదు అంతటితో నంబి కాలాతితం కాకూడదు  అని ఆ ఆకాశగంగ తీర్థంతో  ఆలయానికి చేరుకున్నాడు అంతా  చకితులయ్యారు దానిని నంబి  గమనించలేదు  .

           నాటి  నుంచి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థంతోనే శ్రీవేంకటేశ్వరస్వామికి   అభిషేకం  జరుగుతుంది.

 నమో  వేంకటేశాయ. నమః
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధీ కాలని,తిరుపతి

ధనుర్మాసం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలలో ఈ రోజు పన్నెండవ పాశురం

  ధనుర్మాసం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురాలలో ఈ రోజు పన్నెండవ పాశురం

ఆండాళ్ తిరువడిగళేశరణం :

            ఇదివరకటి పాశురము న స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామె మేల్కొలుపబడినది.
శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది. ఒక్క క్షణమైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు. అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును.

            అందుకుగాను " యజ్ఞము ,దానము, తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు.ఆచరిచితీరాలి. యజ్ఞము,దానము,తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి జ్ఞానము, తద్వారా భక్తి కలుగుటకు సాయపడును.కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు, కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును, ఫలమునందాశను ,సంగమును విడచుటయే కర్మ సన్యాసము. కాని నియతమగు కర్మను విడచుట సన్యాసమను మొహముతో విడచుట తామస త్యాగము. శరీర క్లేశము కల్గునను భయముచే కర్మలను మానుట రాజసత్యాగము. భగవద్గీతలొ కర్మన్యాసము అని చెప్పబడి ఉన్నది.
వెనుకటి పాశురములో గోపాలుర స్వధర్మమును ఫల సంగ కర్తృత్వాభిమానములను వదలి యాచరించెడి స్వభావము కలవారని వర్ణించబడింధి.

          ఈ పాశురములో అట్టి స్వధర్మము ను కూడా ఆచరించని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నధి.
గోపాలురందరును పరమాత్మయే ఉపాయము -ఉపేయము అని నమ్మినవారు. వారి యెమి చేసినా పరమాత్ముని ప్రీతి కొరకే చేస్తున్నామన్న కోరిక లక్ష్యము కలవారు.ఇంద్రియ ప్రవ్రుత్తి నిరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుచున్నారు.

పాశురము:

     కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
    నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
    ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
    పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
    చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
    మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
    ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
    అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.

తాత్పర్యము:
         లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైనమంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలిచియున్నాము.
         పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా!

         ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము. కీర్తిస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! (నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు.

    అవతారిక :-

           లక్ష్మణస్వామివలె శ్రీకృష్ణుని యెడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకొనే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లిలిని మేల్కొలుపుతున్నారు. గోపాలురు, గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కల్గనంతవరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు.
          ఆ కృష్ణ సేవకు యీ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణసేవకే అంకితమయ్యే ధన్యజీవులీ గోకులంవారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే యీ జన్మ సార్ధక మంత్రం' కాబట్టి తైలధారవలెను, నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి (యీ మాలికలో) వివరిస్తోంది.          

        (హమీరు కల్యాణి రాగము - ఏకతాళము)

ప..    ఇకనైనను లేచిరావె! ఏమి మొద్దునిద్దరే?
    ఇకనైనను నోరు తెరచి మాటాడగ రాగదే?

అ..ప..    ఈ కన్నియలందరు నీ వాకిట గుమిగూడిరని
    ఒకరొకరికి కాదు, ఊరు వాడంతట తెలిసినదే!

1. చ..    పాలు పిదుకువారు లేక మహిషీ గణ మరచుచు
    పాలుద్రాగు లేగలందు భావము ప్రసరించి కారు
    పాలముంగిలి తడియు సంపదగల వానికి చెల్లెల!
    తలను మంచు పడుచున్నదె! గడప నాని యున్నామే!

2. చ..    దక్షిణ లంకకు ప్రభుడగు రావణు జంపినవానిని
    అక్షయ మోదము గూర్చిన ఆ ఘన శ్రీరాముని
    ఏ క్షణమును వీడక కీర్తించుచుండ వినలేదా?
    ఈ క్షణమ్మునైన లేచి రావమ్మా! కొమ్మరో!
    ఇక నైనను లేచిరావె!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Sunday 25 December 2016

పితృకర్మలు కర్మలు ఎందుకు చేయాలి ?

పితృకర్మలు కర్మలు ఎందుకు చేయాలి ?

           వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము,విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .

శ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "

        దైవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దైవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దైవ కార్యాలు ఫలిస్తాయి.

           అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణం లో పెద్దల మాట,శాస్త్రం కూడా.

         మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి.

         పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

           ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునరజన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.

           పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను పితృ పక్షములో శ్రార్దము చేయవలెను.నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

తిరుప్పావై పాశురములలో ఈ రోజు పదకొండవ పాశురం

  ధనుర్మాసం గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురములలో  ఈ రోజు పదకొండవ పాశురం

ఆండాళ్ తిరువడిగలే శరణం :

           ఈశ్వరుడే ఉపాయము -ఉపేయము లని నమ్మినవారు గోపికలు. తనను పొందించు సాధనము తానె అని భగవానుని ఉపాయత్వము గలవారే ఈ లేపబడుచున్న గోపికలా.
ఈ పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడైయున్నట్లే  ఈమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపికను ఇందు లెపబడుచున్నది.ఈమె సౌందర్యము ను స్త్రీలె పృశంచించుట విశేషము .గోపికలందరు కౄష్ణపరతంత్రులే.

పాశురం

    కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
    శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
    కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
    పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
    శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
    ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
    శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
    ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.

తాత్పర్యము:

         ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా!

           పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు,బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక,మాటాడక,ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు.

         అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.

    అవతారిక :-

         అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని,ఈ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు,ఆదరణీయురాలు.

       ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు,కనపడవు,పట్టించుకోదు.

       ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (ఈ మాలికలో) మేల్కొలుపుతున్నారు.    

        (శుద్ధ సావేరిరాగము - ఝంపెతాళము)

ప..    మాటాడవేలనే? ఓ చిన్నదాన?
    ఇటు నిదుర వీడవు! తామస మదేలనే?

అ..ప..     ఇటు వినవదేలనే? మా కృష్ణ గీతముల!
    పటువైన శ్రీకృష్ణ సంశ్లేష మోహమా?

1. చ..    ఈ గో సమూహముల గాచు వీరెల్లరు
    తగిన వీరులు శత్రు సైన్యాల నణతురు
    బంగారు లతవె! గోపాల కుల తిలకమా!
    అంగనా లేవనే! ఓ చిన్నదాన!

2. చ..    చెలియలందరు వచ్చి నీ వాకిట న్నిలిచి
    నీలమేఘశ్యాము తిరు నామములు పాడ
    ఏల కదలక యుంటివో వనమయూరీ!
    ఏల మాటాడవో అహినితంబా! సఖీ!
    మాటాడవేలనే? ఓ చిన్నదాన?
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

శివుడి శిగలో చంద్రవంక”వెనుకున్న కథ

శివుడి శిగలో చంద్రవంక”వెనుకున్న కథ

     చంద్రుడు పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు.

            ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు.

            దక్షుని 27మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒకో రోజు ఒకో భార్య వద్ద ఉండసాగాడు చంద్రడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి.

           అయితే రోజులు గడిచేకొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధికప్రేమ కలుగసాగింది. ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా, రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది.

            కొన్నాళ్లకి ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు, చంద్రుని మందలించాడు. కానీ కొద్దికాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యలకంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు.

           కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు, చంద్రుని మీద కోపగించుకున్నాడు.ఏ వెలుగుని చూసుకుని నువ్విలా విర్రవీగుతున్నావో, ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు.

        బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరుగేముంది! ఆయన శపించినట్లుగానే ఒకో రోజు గడిచేకొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏంకాను? మనుషుల మనస్సులు ఏం కాను? అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు.

           చంద్రుడు కూడా తనకు శాపవిమోచనం ప్రసాదించమంటూ అటూఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరికాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు.

           చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు. కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు! అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

శనివార మహిమ - శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

శనివార మహిమ - శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం

         శనివారం ఆంజనేయ స్వామి ని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి .అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే శని వారం శ్రేష్టమైనది .
’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః  –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’

      బీఅంటే ప్రతి శని వారం భరతుడు హనుమను సేవించి పరాక్రమ వంతుడు అయినాడు అని  అర్ధం .శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి .తైలంతో కూడిన గంధసి0దూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు .అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది .వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగు తుంది .శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి ,యశోవంతు లైన పుత్రులు కలుగుతారు .

    మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

         శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రల తో బయటి నుండి నీరు తెచ్చు కొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయ వచ్చు .నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి .

        ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదా విధి గా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

                 శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉండి .శని గ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమము ఉన్నవాడు .ఒక సారి శని దేవుడు హనుమను సమీపించి ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించను .ఇంత వరకు నిన్ను పట్టు కొ లేదు .ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు .దానికి హనుమ ‘’శనీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ?నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమశిరస్సు మీద ఉంటానని చెప్పాడు .

       సరే నని శిరస్సు మీద శనిని చేర్చు కొన్నాడు మారుతి .ఆయనకు శనిని బాధించాలని మనసు లో కోరిక కలిగింది .ఒక మహా పర్వతాన్ని పెకలించి నెట్టి  మీదకు ఎత్తు కొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్ను కొన్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు .జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువు కు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు .ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు .తోకలో బంధింప బడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు .శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించ టమే  నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు .అందు కని నిన్ను ఒక రకం గా శాశించి వదిలి పెడ తాను’’అన్నాడు .గత్యంతరం లేక శని సరే నన్నాడు .

         హనుమ ‘శనీ! నా భక్తులను బాధించ రాదు .నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని  ఏకాలం లో నైనా ముట్టు కొ కూడదు .నువ్వు బాధించ రాదు .మాట తప్పితే కథి నాతి కథి నం గా నిన్ను దండిస్తాను ‘’అని చెప్పి ,శని తో వాగ్దానం చేయించు కొని వదిలి పెట్టాడు .అందుకే శని వారం ఇంత ప్రాధాన్యత సంత రించు కొన్నది .శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తి కే శని కి తైలాభిషేకం చేస్తారు .ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించటం లేదు . .

   ‘’ మంద వారేషు సం ప్రాప్తే   హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;

     హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది .

సాధారణం గా శని బాధ తట్టు కోవటం చాలా కష్టం .అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు .అయితే పేద వారు చేయ లేరు కదా .నూనె తో కూడా అభిషేకం చేసే స్తోమత వారికి ఉండక పోవచ్చు .ఇలాంటి వారి కోసం శ్రీ మద్రామాయణం లోని సుందర కాండ లో ని 48 వ సర్గ ను శని వారం ఉదయం ,సాయంకాలం పఠిస్తేశని దేవుని అనుగ్రహం పొంద  గలరు .ఖర్చు లేని పని .ఇప్పుడు ఆ సర్గ లో ఉన్న విషయాన్ని తెలుసు కొందాం
                  ఆంజనేయుడు లంక లో ఉన్న రాక్షసులను కాలితో ,చేతులతో కొండలతో తోక తో చంపి పారేస్తున్నాడు .రావణుడు పంపిన అక్ష కుమారుణ్ణి ససైన్యం గా హతమార్చాడు .చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ‘’ఇంద్ర జిత్ ‘’అనే బిరుదు పొందిన తన పుత్ర రత్నం మేఘ నాదుడిని సైన్యం తోడూ ఇచ్చి హనుమ పైకి యుద్ధానికి పంపించాడు.పంపిస్తూ కొడుకు తో ఇలా చెప్పాడు ‘’నాయనా !నీకు అన్ని అస్త్ర శస్త్ర విద్యాల రహస్యాలు తెలుసు .రణ వేత్తవు .ఇద్రు డిని  సునాయాసం గా గెలిచి రాక్హస రాజ్యానికి ముప్పు లేకుండా చేసిన ఘనుడవు .బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది అనేక దివ్యాస్త్రాలను సాధించు కొన్నావు .నీ అస్త్రాల ముందు ఎవరు నిలబడ లేరు .మూడు లోకాల్లో నిన్ను జయించ గల మగాడు లేడు .నీ చేత ఓడిమ్పబడని వాడూ లేడు  .నీ పరాక్రమ విక్రమం అంత గొప్పది .ఏయే కాలాలలో ఏయే ప్రదేశాలలో ఏమి చేయాలో నీకు బాగా తెలుసు .నీకు యుద్ధం లో అసాధ్యమైనది లేదు .సూక్ష్మ బుద్ధి తో ఆలోచించి కార్య సాధన చేయ గల సర్వ సమర్దుడవు .నీ భుజ ,వీర్య ,తపో బలాలు నాతో సమాన మైనవి .యుద్ధ సమయం లో నేను నిర్ణ యించిన పని చిటికెలో నువ్వు చేయ గల వాడివి .నువ్వు అండగా ఉండ బట్టే నేను ఇంత నిక్షేపం గా లంకా రాజ్య పాలన చేస్తున్నాను .ఎవడో కోతి మన మహా వీరు లందర్నీ అశోక వనం దగ్గర ఉండి  మట్టు పెడు తున్నాడు .అక్షయ కుమారుడిని చంపేశాడు .జంబుమాలి ,పంచ సేనాగ్ర నాయకులు వాడి చేతి లో మరణించారు . .మన సైన్యం దాదాపు అంతా క్షీణించి పోయింది .నువ్వే ఇప్పుడు లంకా రాజ్యాన్ని రక్షించ గల ఏకైక వీరుడివి .ఎంత మంది సైనికుల్ని పంపినా ఆ కోతి  సునాయాసం గా చంపేసి భయం కల్గిస్తున్నాడు .వారి వల్ల ఇక కార్యం సాను కూల పడదు .ఆ కోతి పరాక్రమం ఏమిటో ఎక్కడి నుంచి వచ్చాడో ఆతని వెనకాల ఉన్న వ్యూహం ఏమిటో తెలుసుకో .దాన్ని బట్టి నీ దగ్గ ర ఉన్న సర్వశాస్త్రాలను ధైర్యం గా ప్రయోగించు .వాడిని వదించటం  తక్షణ కర్తవ్యం .నువ్వే తగిన వాడివి .నిన్ను పంపటం నాకు సుత రామూ ఇష్టం లేక పోయినా తప్పని సరి గా పంపువలసి వస్తోది .లంకా రాజ్య భవిష్యత్తు అంతా నీ చేతి లో ఉంది .విజయం సాధించి తిరిగి రా .నా ఆశీస్సులు ,లంకా వాసుల ఆశీస్సులు నీకు లభించు గాక ‘’అని చెప్పి ఉత్సాహ పరచి ఇంద్ర జిత్ ను పంపాడు
          రెట్టించిన ఉత్సాహం తో ,ఉప్పొంగిన పరాక్రమం తో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి ఆశీస్సులు గ్రహించి ప్రణామం చేసి బయల్దేరాడు .ఉప్పొంగే సముద్రం లా ఉన్నాడు .గరుత్మంతుని వేగం తో కదిలాడు .నాలుగు ఏనుగులున్న రధాన్ని ఎక్కాడు .సుశిక్షితు లైన విలుకాన్ద్రను వెంట బెట్టు కొన్నాడు .హనుమ ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరాడు .అప్పడు పది దిక్కుల్లో దుశ్శకునాలు కలిగాయి క్రూర మృగాలు అరిచాయి .వీరిద్దరి యుద్ధాన్ని చూడాలని మునులు ,సిద్ధులు ,సాధ్యులు దేవతలు అందరు ఆకాశవీధి లోఉత్కంథ గా చేరి చూస్తున్నారు .
           ఇంద్ర జిత్ విచిత్ర ధ్వని కలిగేటట్లు ధనుష్టన్కారం చేశాడు .హనుమ ఇంద్ర జిత్తులు యుద్ధం ప్రారంభించారు .అతి వేగం గా ఇంద్ర జిత్ బాణ ప్రయోగం చేస్తున్నాడు .మహాకాయుడు అయిన ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తున్నాడు .ఆకాశ మార్గం లో సంచరిస్తూ అతనికి అంద కుండా అసహనాన్ని కల్గిస్తున్నాడు .ఎన్నో రకాల శరాలను లాఘవం గా సందిస్తున్నాడు రావణ  పుత్రుడు .వాటిని అతి తేలిక గా తప్పించు కొంటున్నాడు వాయు పుత్రుడు .అతని బాణ ధ్వని ,రాధ ధ్వని  భేరీ ల ధ్వని విని ఆకాశం లోకి అంద నంత ఎత్తు కు యెగిరి తప్పించు కొంటున్నాడు మారుతి .ఒకరి కొకరు తీసి పోకుండా యుద్ధం చాలా సేపు చేశారు .ఎంత చేసినా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్ధం కాలేదు .అతని అతి శక్తి వంత మైన బాణాలన్ని వ్యర్ధమే అయ్యాయి .హనుమంతుని ,ఇసుమంతైనా ఏమీ చేయ లేక పోయాయి .హనుమ ను వోడించటం అసాధ్యం అని ఇంద్రజిత్ నిర్ణయానికి చ్చాడు .మరి ఉపాయం ?బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమ ను బంధించాలి అని నిశ్చయించు కొన్నాడు .
                    మంత్ర పూతం గా బ్రహ్మాస్త్రాన్ని హనుమ పై ఇంద్ర జిత్ ప్రయోగించాడు .అరి వీర భయంకరుడైన హరి వీరుడు బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింప బడ్డాడు .ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చిన శాపం .అయితే అది తను ఏమీ చేయదు అన్న  సంగతి కూడా జ్ఞాపకం వచ్చింది .నమస్కరించి బద్ధుదయాడు .,బంధుడు అయాడు .ఈ బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని ,రావణుడిని చూసే ఆవ కాశం కలుగు తుందని ,దానితో అతని పరాక్రమం ,వ్యూహం తెలుసు కొ వచ్చునని భావించాడు .రాక్షసులు బలాత్కారం గా పట్టి లాగుతున్నా ,ఏమీ మాట్లాడ లేదు .తప్పించు కొనే ప్రయత్నమూ  చేయ లేదు .అతని నిర్వి చేష్టతను గమనించి రాక్షసులు హనుమ ను గొలుసు లతో నార వస్త్రాలతో కట్టే శారు .బ్రహ్మ వరం పని చేసింది .బంధింప బడ గానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచి పోయింది .వేరే బంధం ఉంటె బ్రహ్మాస్త్ర బంధం పని చేయదు .అది హనుమ కు మాత్రమే తెలుసు .ఈ  విషయం ఇంద్ర జిత్ అర్ధం చేసు కొన్నాడు .తను కష్ట పడి  బంధించింది అంతా వ్యర్ధమైనదని దుఃఖించాడు .ఇక ఈ మాయా కపి వల్ల లంకా రాజ్యానికి వినాశం తప్పదు అని ఊహించాడు .ఏమీ చేయ లేక మౌనంగా తండ్రి దగ్గరకు ,సైన్యం హనుమను ఈడ్చుకొని వస్తుంటే చేరాడు .విషయాన్ని అంతటిని తండ్రికి వివ రించాడు .హనుమ ను చూసి రాక్షసు లందరూ ‘’చంపండి ,నరకండి ‘’అని అరుస్తున్నారు .
    హనుమ రావణ  సింహా సనం దగ్గరకు వెళ్లాడు .అక్కడి పెద్దలన్దర్నీ తేరి పార జూశాడు .రావణుడు మంత్రులతో ‘’ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసు కొండి  ‘’అని ఆజ్ఞా పించాడు .వారు హనుమను వివరాలు అడిగారు .అప్పుడు హనుమంతుడు ‘’నేను రామ బంటును .హనుమ నామ దేయుడిని .సుగ్రీవుని మంత్రిని .సీతా మాత శ్రీ రాముని ఇల్లాలు .నువ్వు అపహరించావని తెలిసి మా రాజు నన్ను వెదికిఆమె జాడ తెలుసు కోమని  దక్షిణ దిక్కు కు పంపితే ఇక్కడ ఉందని తెలుసు కొని లంక చేరాను. దుస్తర మైన సముద్రాన్ని ఆవ లీల గా దాటాను .ఇది నా శక్తి కాదు శ్రీ రాముని దివ్య విభూతి మాత్రమే ..’’అని చెప్పాడు –కనుక శని పీడా బాధితులు శని వారం నాడు సుందర కాండ  లోని ఈ నలభై ఎనిమిదవ సర్గ ను భక్తీ తో పఠిస్తే ఆ పీడ నుంచి విరగడ పొందుతారు
జై హనుమాన్
మీ🌹
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి