Saturday, 17 December 2016

తిరుప్పావై పాశురం 3 వ రోజు-వ్రత ఫలం

తిరుప్పావై 3 వ పాశురం - వ్రతఫలం

ఆండాళ్ తిరువడిగలే శరణం

        లోకములో విషయాలు విడుచుట, స్వీకరించుట ఒకేరీతిగావుండును. అవి మనకర్మలను అనుసరించి పట్టినాను దుఃఖమును పొందుదురు . వదిలినాను దుఃఖమును పొందుదురు .బార్యా,బిడ్డలు ఉన్ననూ దుఃఖమే ! వదిలినాను దుఃఖమే ! దానికి కారణము వానివల్ల కల్గిన సుఖము గాని దుఃఖముగాని విషయమువల్ల జనించునవి కాకపోవుటఏ! కావునా పట్టుట విడుచుట రెండు సమానమే ! కావున భాగావద్విశాయము సహజానందము , అదే పరమానందము అని తెలిసి ఇతరములు విడిచి వేయుదురు. ఆ విషయాలు తెలిసే ఈ వ్రతములో ఏమిచేయవలేనో రెండవ పాశురములో వివరించారు.

మరి వ్రతనియమాలు తెలుసుకున్నాము
మరి ఆ వ్రతఫలితములు ఎలావుండాలి

మూడవ పాశురములో వివరించారు.

పాశురం.

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
        బలిచక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాసమువరకు పెరిగి మూడు లోకములను తన పాదములసు కొలిచిన పురుషోత్తముడగు పరందాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువపూలులో మనోహరములగు తుమ్మెదలు నిద్రపోతుండగా, సస్యములు సమ్రుద్దిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములొ దూరి స్థిరముగా కూర్చొని పొదుగునంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమౄద్దిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్ధము లేని సంపద దేశమంతా నిండవలెను.అని మూడవ పాశురము అర్ధము .

         అయితే గోపికలు ఈ వ్రతము చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు . ఈ రోజు మన అమ్మ (ఆండాళ్) శ్రీ పరందాముని వామన అవతారము ను కొలచింధి. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలే , మరోసారి తాబేలుగా, మరొకమారు వరాహమూర్థిగా, ఇంకోసారి నరసిం హముగా , మరొకమారు పరిపూర్ణ మానవ మూర్థిగా అవతరించి మనలను నిరంతరమూ కాపాడుచున్నడు.
భగవంథుడు సర్వ వ్యాప్థి అని చెప్పుటకు ఈ విధముగా చెప్పినధి అమ్మ. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటె బ్రహ్మ కడిగిన మొదటి పాదము , బలిచక్రవర్థి కడిగిన రెండో పాదము ఒకసారె చేరాయి . అంటె ఆయన సర్వ వ్యాప్తము అని తెలిసింధి. ఈ విధముగా వున్న స్వామి బలిచక్రవర్థి తలమీద ముడోపాదాన్ని మోపి బలికి రసా తలమును ప్రసాధించారు. ఇది అంతా నారాయణ తత్వముగా అమ్మ వివరించింది.మరియు లోకము సుఖముగా వుండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింది. మూడు కాలాలు వానలు కురిసి పంటలు బాగాపడి. గోవులు పాలు చెపుముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని. మన దేశము సశ్యశ్యామలంగా వుండాలని గోపికలతో వివరించింధి.

         గోపికలు ఏకొరికా లేక దేశము సౌభాగ్యము వంకతో ఈ వ్రతముతో శ్రీ కృష్ణుని సేవ చెసుకొని వారి జీవితము దన్యత చే కూర్చుకోవలె అని ఫలము కోరుతూ ఈ వ్రతము చెయుటకు నిర్ణయించుకొనిరి .

       ఈ పాశురములో చెప్పెది ఎమిటంటే ఈ వ్రతము చెయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధి ని కలిగించును. అంతరంగమున ఆత్మ ఙాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాధించును.

3వ మాలిక
   
          ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.

        (మోహనరాగము - ఆదితాళము)

ప.    హరి తిరువడులను కొలిచెదము
    తిరు నామములనె పాడెదము

అ.ప..    పెరిగి లోకముల గొలిచిన పాదము
    పరసాధనమని తెలిసి పాడుదము

1 చ.    వ్రతమును చేయగ స్నానమాడెదము
    ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
    వితత సస్యముల నెగయు మీనములు
    మత్తిలి కలువల సోలు భ్రమరముల

2 ఛ.    బలసిన గోవుల పొదుగుల తాకగ
    కలశముల క్షీరధారలు కురియగ
    శ్రీలెయెడతెగని ప్రసారములో యన
    ఇల సిరులదూగు చేతుము వ్రతమును.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment