*రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఏమిటీ ప్రయోజనం?*
👉 కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. 'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'.
👉 'శివ' అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి.
👉 శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.
👉 ఈ శర్వాది అష్టమూర్తులే పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను అధిష్టించి ఉన్నాయి.
👉 ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వతోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.
*'ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ:*
*ఓం భవాయ జలమూర్తయే నమః*
*ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ:*
*ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః*
*ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః*
*ఓం పశుపతయే యజమానమూర్తయే నమః*
*ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః*
*ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః*
*జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు.*
👉 అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి పెట్టి 'సో హం' భావంతో సదాశివుని , పూజించాలి.
👉 ' దేహో దేవాలయః ప్రోక్తో జీహాదేవ సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్ '
'రుద్రో జనానాం హృదయే సన్నివిష్టః ప్రాణేష్యంతర్మనసో లింగమాహుః'
హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి.
👉
అందుకే మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్దా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాథి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి. బ్రహ్మచారులు యాజ్ఞవల్క్యుని చేరి 'ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు?” అని అడిగారు.
👉 దానికాయన 'శతరుద్రీయేణేతి' శతరుద్రీయంచేత అన్నాడు.. అని జాబాలోపనిషత్తు చెపుతున్నది.
'శతం రుద్రా దేవతా యస్య'
నూరు మంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రీయం అని తైత్తరీయసంహిత చతుర్థకాండ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.
👉 మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినం తు మహేశ్వరమ్' (శ్వేతా.ఉ) మాయ అంటే ప్రకృతి. దానికి అధిపతి మహేశ్వరుడు. అందుకే ప్రకృతిలోని అనంతమైన శివశక్తిని శివపూజతో, భజనతో, శ్రవణాదికాలతో మేల్కొల్పాలి.
👉 తానే శివుడై సర్వాన్ని శివమయంగా భావించి తాదాత్మ్యం చెందాలి. అదే శివపూజలోని ఆంతర్యం.
👉 అప్పుడు శివపూజలో సాయుజ్యం, శివభజనలో సామీప్యం, శివుని విషయాలను ప్రసంగించడంలో, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరుల ఉపదేశం.
👉 శివుని ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయడం యోగ శాస్త్రరీత్యా మన సహస్రార కమలంలో ప్రకాశించే సదాశివతత్యామృతం వర్షించడానికి ఒక ప్రతీక.
👉 'సర్వయజ్ఞ తపోదాన తీర్థదేశేషు యత్సలం
తత్పలం కోటిగుణితం శివలింగార్చనాత్సలం'.
👉 'అన్ని యజ్ఞాలవల్ల, తపస్సులవల్ల, దానాలవల్ల, తీర్థాలను సందర్శించడంవల్ల కలిగే ఫలానికి కోటి రెట్లు శివలింగార్చనవల్ల కలుగుతుందని పెద్దలంటారు.
👉 ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించ కూడదు ('నారుద్రో రుద్రమర్చయేత్) ముందుగా మహాన్యాసంతో ఆ యోగ్యతను సంపాదించుకొని, తరవాత ఆయనను నమక చమక పారాయణతో అభిషేకిస్తాం.
👉 ఏకాదశరుద్రాభిషేకం చేస్తాం. మన జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు కలిపి పదకొండు. అదే ఏకాదశ రుద్రాభిషేకంలోని అంతరార్థం.
👉 అంతే కాదు. మనలో ప్రాణాపానాది ఐదు వాయువులూ, నాగకూర్మాది ఐదు ఉపవాయువులూ ఉన్నాయి. ఈ పదింటికీ మూలమైనది ఆత్మ. దాంతో పదకొండు. ఇవే ఏకాదశరుద్ర స్వరూపం. రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఇవన్ని శుద్ధమవుతాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతినగర్,ఖాధికాలని,తిరుపతి
No comments:
Post a Comment