Monday, 16 May 2022

సత్యనారాయణ వ్రత విధానం:*

*సత్యనారాయణ వ్రత విధానం:*
           ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )

ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )

పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.


మీ

వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్

శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

Wednesday, 4 May 2022

దశ దానాలు, బియ్యం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

బియ్యం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

🌲గత జన్మలో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుందని అంటారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుందనేది పండితుల వ్యాఖ్య. దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి. అయితే, నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి కోరిన కోర్కెలు తీరుతాయి. రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేసి, కెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. గురు గ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడిక పెసలు, శుక్రుడికి అలసందలు, రాహువుకి మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులను దానం చేయాలి. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం, వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడం, పేదలకు ఉచితంగా విద్యను అందించడం, ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడం ఈ చతుర్విద దానాలు చేసిన వారి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.

🌲శక్తి కొలది చేసే ధనసాయం కానీ, వస్తు సహాయం కానీ..'ధర్మం' అంటారు. ఇలా 'ధర్మం' చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునికి చేసిన దానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాదు ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది. 'ధర్మం' చేయడానికి ఎలాంటి పరిధులు లేవు.

🌲తోచింది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, 'దానం' చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయి. శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వీటినే 'దశ దానాలు' అంటారు.

దశ దానాలు- ఫలితాలు
🌲దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ దానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం
🌲గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవు, దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి, పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

భూదానం
🌲కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. వీరికి శివలోకప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. 

తిలదానం
🌲తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది.

హిరణ్య (సువర్ణ) దానం
🌲బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తిస్తాడు.

నెయ్యి దానం
🌲ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. దీనిని యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్ర దానం
🌲చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం. కేవలం అలంకారినికే కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు.

ధాన్య దానం
🌲జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, ఇహలోకంలో సకలసౌఖ్యాలను అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు. 

గుడ దానం
🌲రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీమహాలక్ష్మీకి మహా ప్రీతి. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత దానం
🌲అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు. దాతకు సర్వసంపదలు వంశాభివృద్ది అనుగ్రహిస్తారు.

లవణ దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు, ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతుంది. ఆయుష్షు బలం సంతోషాన్ని అనుగ్రహిస్తారు, వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పడింతల ఫలితం ఉంటుంది. అంతేకాదు దానం భక్తి శ్రద్ధలతో చేయాలి గాని, దాన గ్రహీతకు ఎదో ఉపకారం చేస్తున్నామనే భావనతో గాని నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు గాని దానం చేయరాదు, ఒకవేళ అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం దక్కదు. 

మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Monday, 2 May 2022

తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం.

ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం.
💥 వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది.

💥 కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. 

💥 పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.

💥 ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. 

💥 కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు. 
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు

🌸 చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం!
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం !

🌸 అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది.

🌸 రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు.

🌸 శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.

🌸 జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు.

🌸 రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి.

🌸 ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, శ్రీ రామ శరణంమమ అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి.

🌸 అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు.

🌸 అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది.

🌸 రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు 'శ్రీరామ జయం' అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

🌸 పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.

🌸 రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

🌸 మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి.

🌸 రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

🌸 అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

🌸 రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

🌸 రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

🌸 ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

🌸 పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో సమర్పించండి. లేదంటే నదిలో వదలండి.

🌸 ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

🌸 ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు.

🌸 శుచిగా లేని సమయాల్లోను మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.

జైశ్రీరామ్ 

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

సింహాచలం వరాహనరసింహస్వామికి అక్షయ తృతీయ రోజున చందనోత్సవం

రేపు అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు?

🌺సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి?

🌺పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు, విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి, నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.

🌺చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి.... తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ, ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.

🌺ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

అక్షయ తృతీయ

 అక్షయ తృతీయ - 
       వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 3 మే 2022 అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.

1. పరశురాముని జన్మదినం.

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.

3. త్రేతాయుగం మొదలైన దినం.

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం.

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

🌟అక్షయ తృతీయ నాడు, మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా, (అది పుణ్యం కావచ్చు, లేదా పాపం కావచ్చు) అక్షయంగా, నిరంతరం, జన్మలతో సంబంధం లేకుండా, మన వెంట వస్తూనే ఉంటుంది. 

🌟పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా, ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ, కూజాలో గానీ, మంచి నీరు పోసి, దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే, ఎన్ని జన్మలలోనూ, మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. 

🌟అతిధులకు, అభ్యాగతులకు, పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే, ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. 

🌟అర్హులకు స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే, మన ఉత్తర జన్మలలో, వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం.

🌟అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

వడక్కునాథన్ ఆలయం, త్రిస్సూర్

వడక్కునాథన్ ఆలయం, త్రిస్సూర్ 

🌸భారతదేశంలోని పురాతన దేవాలయాలను సందర్శించడం ఇష్టమా? 

🌸త్రిస్సూర్లోని వడక్కునాథన్ ఆలయానికి వెళ్లకుండా ఉండకూడదు. ఈ దేవాలయం కేరళ సంస్కృతి మరియు వారసత్వంతో కూడిన అందమైన మరియు పాత చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. కేరళలోని వడక్కునాథన్ ఆలయానికి యునెస్కో నుంచి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ లభించింది. ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి, ఇందులో 400 సంవత్సరాల పురాతన కుడ్య చిత్రాలు ఉన్నాయి మరియు వడక్కునాథన్ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది.

🌸మీరు వడక్కునాథన్ ఆలయ నిర్మాణాన్ని ఆస్వాదించాలనుకుంటే, అప్పుడు మీరు తప్పనిసరిగా త్రిస్సూర్ని సందర్శించాలి. ఈ ఆలయంలో నిర్మాణ సౌందర్యం, చరిత్ర, వారసత్వం మరియు సంస్కృతి కూడా ఉన్నాయి. త్రిస్సూర్ ప్రజలు వడక్కునాథన్ దేవాలయం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఆలయం వద్ద మహా విష్ణువు మరియు శంకర నారాయణ విగ్రహాలు ఉన్నాయి. ఇది కేరళ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే కూతంబలం అనే అతిపెద్ద డ్యాన్స్ హాల్ కూడా కలిగి ఉంది. 

🌸వడక్కునాథన్ ఆలయ ఉత్సవంలో వివిధ సంప్రదాయ ప్రదర్శనలు జరుగుతాయి మరియు దీనిని నంగ్యార్ కూతు అని పిలుస్తారు. ఆలయం వెలుపల తిరువంబడి కృష్ణ దేవాలయం మరియు పారమెక్కవు దేవి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు, ముఖ్యంగా వారాంతంలో మరియు సోమవారాల్లో ప్రజలు విశ్వాసాన్ని ఉపయోగించాలి మరియు ఆలయాన్ని విశ్వసించాలి. త్రిస్సూర్లోని నాథన్ దేవాలయం కేరళ యొక్క సాంప్రదాయక నిర్మాణ కోణంలో అత్యుత్తమమైనది.

🌸ఈ ఆలయం ఒక పెద్ద రాయి చుట్టూ ఉన్న కొండ తాళం మీద ఉంది మరియు వాటా 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వడక్కునాథన్ ఆలయ ద్వారం ఉత్తరం, తూర్పు, దక్షిణం మరియు పడమర వైపు నాలుగు గోపురాలను కలిగి ఉంది. ప్రవేశ ద్వారాలు నాలుగు భారీ గేట్వేలు మరియు ఆలయం చుట్టూ బంతిని కలిగి ఉంటాయి, ఇది స్థలాన్ని నిర్మించడంలో నైపుణ్యం మరియు నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ వడక్కునాథన్, శంకరనారాయణ మరియు శ్రీరాముని ప్రధాన మందిరాలు ఉన్నాయి. ఎడమవైపు ప్రవేశ ద్వారం వాలుగా ఉన్న పైకప్పులపై రాగి పలకలు మరియు థియేటర్ కూడా ఉన్నాయి.

🌸వడక్కునాథన్ ఆలయం లోపల కేరళ సంస్కృతి మరియు కళలను ప్రతిబింబించే పాత మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలో భద్రపరచబడిన వివిధ వాల్ పెయింటింగ్లు, చెక్క శిల్పాలు మరియు వివిధ అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. మీరు వడక్కునాథన్ ఆలయాన్ని సందర్శిస్తున్నట్లయితే, దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మీరు తప్పనిసరిగా మ్యూజియంకు వెళ్లాలి. ముఖ్యంగా పండుగ రోజుల్లో దేవాలయాలు చాలా రద్దీగా ఉండే సందర్భాలు ఉన్నాయి. మహా శివరాత్రి నాడు, లక్షల గొర్రెపిల్లలు వెలిగిస్తారు, మరియు ఇది ఆలయం లోపల అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటి.

🌸మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సందర్శిస్తున్నట్లయితే, ఆలయాన్ని సందర్శించడానికి మీరు ఖచ్చితమైన భారతీయ దుస్తులను ధరించారని నిర్ధారించుకోండి. కఠినమైన డ్రెస్ కోడ్ ఉన్నందున, మీరు ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా సంప్రదాయం మరియు సంస్కృతిని గౌరవించేలా చూసుకోవాలి. ఏప్రిల్ నుండి మే వరకు జరుపుకునే మహా శివరాత్రి, త్రిసూర్ పూరం ప్రధాన పండుగ కాకుండా వివిధ పండుగలు ఉన్నాయి.

🌸ఈ వేడుక 36 గంటల వరకు కొనసాగుతుంది మరియు ఆలయంలో బాణాసంచా ప్రదర్శనలు జరిగే సంతోషకరమైన సందర్భాన్ని కలిగి ఉంటుంది. ఏనుగులకు ఆహారం ఇవ్వడం మరియు వడక్కునాథన్ ఆలయం యొక్క ప్రధాన పండుగలలో ఒకటైన అనయూట్టు పండుగ అని పిలువబడే వార్షిక పండుగ ఉంది. వివిధ ఏనుగులను గుంపులో ఉంచుతారు, అక్కడ ప్రజలు వాటికి ఆహారం మరియు పూజలు చేస్తారు. ఈ పండుగకు దేశంలోని నలుమూలల నుండి వివిధ భక్తులు వచ్చి శివుని ఆశీస్సులు పొందుతుంటారు. మీ కోరికలన్నింటికీ సమాధానాలు పొందడానికి అద్భుతమైన అందం మరియు విశ్వాసానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి.

వడక్కునాథన్ ఆలయ చరిత్ర
🌸ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది మరియు ఇది కేరళ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. దీని వాస్తుశిల్పం మరియు వివిధ పెయింటింగ్లు ఆలయం అసాధారణమైనవని సూచిస్తున్నాయి. భార్యాభర్తలు, శివగురువు మరియు ఆర్యాంబ వడకునాథన్ దేవునికి చాలా ప్రార్థనలు చేసిన తర్వాత బాల గురు ఆదిశంకరాచార్యతో జన్మించారు. ఆ తర్వాత భార్యాభర్తల కలలో శివుడు వచ్చాడు. కలలో, శివుడు ఈ జంటకు రెండు ఎంపికలు ఇచ్చాడు, ఇది మొదటిది ఆరోగ్యంగా జీవించే సాధారణ కొడుకు మరియు రెండవది త్వరగా చనిపోయే అసాధారణ కుమారుడు. ఈ జంట రెండవ ఎంపికను ఎంచుకుంటారు మరియు వారు అతనికి ఆది శంకర అని పేరు పెట్టారు. ఇది వడక్కునాథన్ ఆలయం యొక్క అత్యంత ఆసక్తికరమైన చరిత్రలలో ఒకటి మరియు పిల్లవాడు స్వాతంత్ర్యం పొందాడు మరియు వడక్కునాథన్ ఆలయంలోనే 'విదేహ ముక్తి' పొందాడు.

వడక్కునాథన్ ఆలయానికి ఎలా చేరుకోవాలి?

🌸ఈ ఆలయం నగరం మధ్యలో ఉంది మరియు మీరు క్యాబ్లు లేదా ఆటో రిక్షాల ద్వారా మీకు అనుకూలంగా ఉండే ఎంపికలను సులభంగా చేరుకోవచ్చు. ఆలయం నుండి దాదాపు 2 కి.మీ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది మరియు మీరు విమానాశ్రయం ద్వారా వస్తున్నట్లయితే విమానాశ్రయం నుండి ఆలయానికి దాదాపు 50 కి.మీ దూరం ఉంటుంది. మూడు రవాణాకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ముంబై, చెన్నై లేదా ఢిల్లీ నుండి వస్తున్నట్లయితే, బాగా కనెక్ట్ చేయబడిన ఎంపికలు కూడా ఉన్నాయి.

 

Sunday, 1 May 2022

కొలను భారతి -సరస్వతి దేవి దేవాలయం

           సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.🌺

కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !! 


🌻ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే బాసర వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు బాసర తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. ఎంతైనా రాష్ట్రాలు విడిపోయాయి కదా !! అంతదూరం వెళ్ళాలా అని కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వారికి 'ఆంధ్ర బాసర' గా వెలుగొందుతున్నది కొలను భారతి.

🌻ఇది ఆంధ్ర ప్రదేశ్ లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

క్షేత్ర విశేషాలు
🌻కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది.

🌻ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నది. ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. పరిసర ప్రాంతలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది.

నల్లమలలో
🌻రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు శిథిలావస్తలో మనకు దర్శనమిస్తాయి. దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.

ఆనవాయితి
🌻రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితి.

🌻 నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.

వరుణ తీర్ధము
🌻ఇచ్చట,"శ్రీ చక్ర సంచారిణీ" యంత్రములో ' కొలను భారతి' ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి"గా కనపడుతుంది.

ఏడు శివాలయాలు
🌻కొలను భారతి ప్రధాన దేవాలయం చేరువలో ఏడు శివాలయాలు ఉన్నాయి. అంతేనా ఇక్కడ జనార్థన స్వామి దేవాలయము కూడా తప్పక దర్శించాలి. ఏడు శివాలయాలూ ఎర్రటి ఇసుక రాయితో నిర్మించి ఉండటం గమనించవచ్చు.

చాళుక్యుల కాలం
🌻వాటిని చూస్తే ... ఇవి చాళుక్యుల కాలం నాటి ఆలయాలు అని అనుకుంటాం కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆ శివాలయాలు శిధిలావస్థ లో ఉంటే .. ఇటీవలే వాటిని పునరుద్ధరించారు. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ప్రతిష్టించారు.

పండుగలు
🌻కొలను భారతి లో ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుగుతాయి. స్థానికంగా ఉండే ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాలవారు ఆ సమయాలలో ఎడ్ల బండీలు కట్టుకొని వచ్చి చూసి వెళుతుంటారు. కార్తీక మాసం, నవరాతి ఉత్సవాలు, మహా శివరాత్రి ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు.

కొలను భారతి దేవాలయం ఎలా చేరుకోవాలి ?
🌻కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లె మండల కేంద్రం నుండి శివపురము అనే గ్రామనికి ముందుగా భక్తులు చేరుకోవాలి. ఇది తారు రోడ్డు. గ్రామానికి చేరుకున్నాక, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డులో ప్రయాణించి కొలనుభారతి దేవాలయం చేరుకోవచ్చు.

మీ
వేద, శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి
 

శ్రీవారి ప్రసాదాలు విశేషం

*శ్రీవారి ప్రసాదవిశేషాలు* 


వార క్రమానుసారం అర్పించే ప్రసాదాలు

🎈వారక్రమానుసారం సమర్పించే ప్రసాదాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

సోమవారం : 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలు
మంగళవారం : ప్రత్యేక ప్రసాదాలు ఏవీ ఉండవు
బుధవారం : పెసరపప్పు, పానకం, పాయసం
గురువారం : తిరుప్పావడ సేవ, 484 కిలోల పులిహార, 51 తేనె తోళీలు, 51 పెద్ద జిలేబీలు, వడలు, పాయసం
శుక్రవారం : అభిషేకం, 51 పోళీలు, పాయసం
శనివారం : రోజువారీ నైవేద్యాలు మాత్రమే
ఆదివారం : అమృత కలశం లేదా గరుడ ప్రసాదం

🎈ఆదివారం రోజున సమర్పించే ప్రసాదం పేరు అమృతకలశం లేదా గరుడప్రసాదం. ఈ ప్రసాదం వెనుక గల ఐతిహ్యం ఏమిటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతివైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే, గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి, సంతానప్రాప్తి కలిగిస్తాడు.

🎈లెక్కకు మించిన ప్రసాదాలను గుర్తుంచు కోలేక, సతమతమవుతున్నారు కదూ!

🎈ఈ తికమక వికటకవి తెనాలి రామలింగడికీ, నందకఖడ్గ అంశతో కారణజన్ముడిగా జన్మించిన అన్నమయ్యకు కూడా తప్పలేదు. ఆ సాహితీ, సంగీత సార్వభౌముల ముందు సామాన్యులమైన మనమెంత?

🎈జగన్నాటక సూత్రధారి శ్రీవేంకటేశ్వరుడు ఇన్నిన్ని తినుబండారాలను ఆరగిస్తున్నట్లుగా నటిస్తూ, తెనాలి రామలింగడి లాంటి వికటకవుల వెటకారాలకు గురి అవుతూ (వారు కూడా శ్రీవారికి పరమభక్తులే! వెటకారంతో కూడిన వారి "నిందాస్తుతు" లలో శ్రీవారి పట్ల సాన్నిహిత్యం, చొరవ, ప్రియసఖుల పట్ల ఉండే స్వాతంత్ర్యం ధ్వనిస్తాయి) తన భక్తుల జిహ్వచాపల్యాన్ని, అన్నార్తిని తీరుస్తున్నాడు.

🎈భక్తులను కాపాడడానికి, ఉద్ధరించటానికి తాను స్వయంగా శారీరక బాధలను, నీలాపనిందలను భరించటం శ్రీమహావిష్ణువుకు అన్ని యుగాల్లోనూ పరిపాటే!

🎈గర్భాలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు కూడా మధ్యాహ్న, సాయం సమయాల్లో నాలుగు రకాల అన్నప్రసాదాలు, నాలుగు రకాల పణ్యారాలు, పంచకజ్జాయం నివేదిస్తారు.

🎈ప్రత్యేక సందర్భాలలో, అంటే – మూడు రోజుల పవిత్రోత్సవాలు, తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు, మూడు రోజుల జ్యేష్టాభిషేకం - ఉగాది, శ్రీరామనవమి, దీపావళి - ఆస్థాన సందర్భాల్లో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది.

తోమనిపళ్ళాల వాడు 
🎈అన్నమాచార్యుని "వేడుకొందామా.... తోమనిపళ్ళాల వాడే" అనే కీర్తన మనకు సుపరిచితం. శ్రీనివాసుణ్ణి ఈ విధంగా ఎందుకు కీర్తించారంటే -
స్వామి ఒకసారి ఆరగించిన పళ్ళాన్ని తోమి మరలా వాడకుండా, పారవేస్తారు. తదుపరి భోజనానికి మళ్ళీ కొత్తపళ్ళెం ఉపయోగిస్తారు. ఆ తోమనిపళ్ళాలే - "పగిలిన మట్టికుండలు". వీటిలో ఉంచే నైవేద్యమే ఓడు ప్రసాదం. కుమ్మరి భీమన్న అనే మహాభక్తుని గుర్తుగా, తరతరాల నుండి వస్తున్న ఈ సాంప్రదాయం వెనుకనున్న ఐతిహ్యాన్ని మరొకచోట వివరించడమైనది.

🎈అపార కరుణామయుడైన వేంకటేశుడు తాను మాత్రం పగిలిన మట్టికుండలో భుజిస్తూ, "తిండి మెండయ్య" అనిపించుకుంటూ, భక్తకోటికి పంచభక్ష్య పరమాన్నాలు అందిస్తున్నాడు !

లడ్డూ చరిత్ర 
🎈లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా లడ్డూ ప్రాచుర్యానికి కారణం. తిరుపతి యాత్ర చేసి వచ్చినవారు ఎవరైనా, లడ్డూ ప్రసాదం తీసుకు రాకుండా ఉండరు. శ్రీవారి ప్రసాదమంటే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది లడ్డూయే!

🎈దాదాపు, ఆలయ పరిసర ప్రాంతమంతా నోరూరిస్తూ, తియ్యటి, కమ్మని, ఘుమఘుమలాడే స్వచ్ఛమైన నేతి సువాసనలు లడ్డూల నుంచి వచ్చినవే!
ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా, తిరుపతి లడ్డూ రుచి మాత్రం దేనికీ రాదు గాక రాదు. ఎందుకంటే....
చక్కెరమోము గల తల్లి అయిన అలమేలుమంగ యొక్క పతిదేవుని ఎంగిలి ఇతరత్రా చేసిన లడ్డూలకు తగలక పోవడమే దీనికి కారణమేమో!

🎈అంతేగాక, ఎనభయ్యేళ్ళకు పైగా, ఒకే పద్ధతిలో, అదే పాళ్ళలో, లక్షలకొద్దీ లడ్డూలు నిరంతరాయంగా, శ్రీవారి పట్ల అచంచల భక్తితో, తయారు చేస్తుండడం వల్ల, "పోటు" బ్రాహ్మణులు ఈ విలక్షణమూ, నిత్యనూతనమూ అయిన లడ్డూ తయారీలో అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారు.

🎈తిరుమల లడ్డూకు తి.తి.దే. 2009 సం.లో పేటెంటు హక్కు సాధించుకొని, జియోగ్రాఫికల్ ఇండికేటర్ జాబితాలో చేరింది. లడ్డూ వేర్వేరు రూపాల్లో అనేక శతాబ్దాల నుంచి ఉన్నా, తీపి బూందీ ప్రసాదంగా సుమారు 1800 సం.లో విక్రయాలు మొదలై, తదనంతర కాలంలో రూపాంతరం చెందుతూ, 1940 ల్లో ప్రస్తుత లడ్డూ రూపం దాల్చుకుంది.

🎈ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు. ఒకప్పుడు వాడే కట్టెలపొయ్యి స్థానంలో నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీవారి సంపంగి ప్రాకారానికి ఉత్తర భాగాన ఉన్న "పడిపోటు" అనబడే వంటశాలలో లడ్డూలను తయారు చేస్తారు. వంటలకు కావలసిన దినుసులన్నింటినీ "ఉగ్రాణం" అని పిలువబడే గిడ్డంగిలో భద్రపరుస్తారు.

🎈 లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును "దిట్టం" అని అంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొలమానాన్ని "పడితరం దిట్టం" గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం, 5100 లడ్డూలను తయారు చేయడానికి సుమారుగా 830 కిలోల సరుకులను "ఉగ్రాణం" నుంచి "పడిపోటు" కు తరలిస్తారు.

ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు:
🎈1. ఆస్థానలడ్డు
వీటిని ప్రత్యేక సందర్భాలలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు మాత్రమే అందజేస్తారు. సాధారణంగా, ఈ లడ్డూల విక్రయం జరగదు. వీటి తయారీలో, అధిక మొత్తంలో నెయ్యి మరియు ముంతమామిడి పప్పు (సారపప్పు) వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని బరువు సుమారుగా 750 గ్రాములు ఉంటుంది. అమోఘమైన దీని రుచిని ఆస్వాదించి తెలుసుకోవాలే గానీ, వర్ణించనలవి కాదు.

🎈2. కళ్యాణోత్సవ లడ్డు -
కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది.
దక్షిణ భారత దేశపు వివాహ విందుల్లో ఈ మధ్యకాలం వరకు – అంటే క్యాటరింగ్ సంస్కృతి మొదలై సాంప్రదాయిక విందు భోజనాలు అంతరించి పోయేంత వరకు లడ్డూ వడ్డన తప్పనిసరి. ఈ ఆనవాయితీ, తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవానికి ప్రసాదంగా ఇచ్చే లడ్డూ ద్వారానే ప్రారంభమైందని చెపుతారు

🎈ఇలా, తరతరాలుగా మన దైనందిన జీవనంలో భాగమై పోయిన తిరుమల సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు, ఈ లడ్డూలను, దర్శనానంతరం సంపంగిప్రాకారంలో గల "వగపడి" నందు పొందవచ్చు.

🎈3. ప్రోక్తం లేదా సాధారణ లడ్డు - 
సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రా. లడ్డూలన్నింటిలోకి అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇదే!
ఇవే కాకుండా, భక్తులకు దర్శనానంతరం ఉచిత ప్రసాదంగా ఒక్కోసారి బుల్లి లడ్డూలను కూడా అందజేస్తారు.

🎈51 వస్తువుల్ని (లడ్డూ, వడ, జిలేబి లాంటివి) ఒక "పడి" గా వ్యవహరిస్తారు. ఒక పడి చిన్న లడ్డూలను తయారు చేయటానికి కావలసిన పదార్థాలు:
1.80 కిలోల శనగపిండి
1.65 కిలోల నెయ్యి
4.00 కిలోల పంచదార
300 గ్రాముల జీడిపప్పు
160 గ్రాముల ఎండుద్రాక్ష
80 గ్రాముల కలకండ (పటికబెల్లం)
40 గ్రాముల యాలకులు

🎈అదీ శ్రీవారికీ, భక్తులందరికీ అత్యంత ప్రీతికరమైన, ఖండఖండాంతరాల ఖ్యాతి గాంచిన "తిరుపతి లడ్డూ" కథ -

🎈శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం. 

 
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

Thursday, 28 April 2022

శనివారం అమావాస్య

శని అమావాస్య రోజు ఇలా చేస్తే సకల దుష్ప్రభావాలు తొలిగిపోతాయి

అమావాస్య ప్రతి కృష్ణ పక్షం చివరి తేదీన వస్తుంది. ఈసారి అమావాస్య శనివారం అనగా 30.04.2022 న కావడం విశేషం.

          వైశాఖ మాసంలో శనివారం అమావాస్య రావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈసారి అమావాస్య ఏప్రిల్ 30వ తేదీ శనివారం వస్తోందని, దీనిని శని అమావాస్యగా పిలవడం జరిగింది. అయితే, శని అమావాస్య రోజున జ్యోతిష్యశాస్త్రం పరంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందవచ్చు.

           అలాగే అనేక రకాల దోషాల నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు పండితులు. శని అమావాస్య రోజున ప్రజలు శని దేవుడిని ఆరాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

           సాధారణంగా పక్షి, ఇతర దోషాలను తొలగించడానికి ప్రత్యేక పూజలు, దాన కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే.. శని అమావాస్య రోజున కొన్ని నివారణలను పాటించడం ద్వారా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అనేక దుష్ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది.

రావి చెట్టు పూజ..
             శని దేవుడి కోపం, ఇతర దోషాలు, దుష్ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే ఏప్రిల్ 30వ తేదీన ఉదయం స్నానం చేసిన తరువాత రావి చెట్టు వద్దకు వెళ్లండి. నల్ల నువ్వుల, ఇనుప గోరు, ఆవాల నూనె, మట్టి దీపం తీసుకెళ్లండి. చెట్టును పూజించే ముందు దాని చుట్టూ కాలవను కట్టి, ఆపై చెట్టుకు నువ్వులు, ఆవాలు, ఇతర పూజా సామగ్రిని సమర్పించాలి. మత గ్రంధాలలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావి చెట్టును పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత గురించి పేర్కొనడం జరిగింది.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోండి..
                శనిదేవుని అనుగ్రహం తాకితే అట్టి వారికి ఏ కష్టమూ రాదు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆరాధన. రాబోయే శని అమావాస్య రోజు ఆలయానికి వెళ్లి శని దేవుడికి నూనె, నల్ల నువ్వులు సమర్పించాలి. ఆలయంలో శని చాలీసాను పఠించాలి. ఆ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను దా చేయడం ద్వారా శనివా ఆగ్రహానికి లోనైన చోట, మరోవైపు భక్తులను కరుణిస్తే, ఏ కష్టమూ ఆయనను తాకదు! శని దేవుడిని ప్రసన్నం చేసుకునే మార్గం అతని ఆరాధన మరియు ఆరాధన.
               రాబోయే శని అమావాస్య నాడు, ఆలయానికి వెళ్లి శని దేవుడికి నూనె మరియు నల్ల నువ్వులు సమర్పించండి. మీరు ఆలయంలో శని చాలీసాను కూడా పఠించాలి. ఈ రోజున బెల్లంతో చేసిన వస్తువులను దానం చేయడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు.

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ఆంజనేయస్వామి అవతారాలెన్ని

ఆంజనేయస్వామి అవతారాలెన్ని.


              ఆంజనేయస్వామి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు. మహావిష్ణువు దశావతారం ధరిస్తే.. ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.

అవేంటంటే:
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.

         ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.

ఆంజనేయస్వామి గురించి కొన్ని .......
            ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడుఅందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
        ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక!అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది.

కలువలు:
            కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

                మంచి పనులు కాపాడతాయి.చెడ్డ పనులు వెంటాడతాయి.ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.
తత్వమసి
పంచముఖ హనుమాన్:
             శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.

1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.
2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమంతుడి సందేశం.......
            హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం - వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం - ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్, ఖాధికాలని, తిరుపతి

Wednesday, 27 April 2022

భగవాన్ శ్రీ రమణ మహర్షి

విరూపాక్ష గుహలో ఉన్నపుడు బ్రాహ్మణస్వామిగా పిలవబడ్డారు.

భగవాన్ శ్రీ రమణ మహర్షి

ధ్యానం : ఆత్మవేది, ఆత్మజ్ఞాన బోధి, లీలావినోది యగు శ్రీ రమణులను ధ్యానించెదము.
జననం : 1879 డిసెంబర్ 30 (ఆర్ద్ర నక్షత్రం) 
నిర్యాణం : 1950 ఏప్రిల్ 14
తల్లిదండ్రులు : అళగమ్మదేవి - సుందరమయ్యర్
మంత్రం : శ్రీ రమణం జయ రమణం అరుణాచల శివ గురు రమణం

తమిళనాట "త్రిశూలపుర"మనే "తిరుచ్చుళి" గ్రామంలో జన్మించిన రమణుల అసలుపేరు వెంకట్రామన్. అళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థం. ఈ సుందరీ సుందరుల పుత్రుడైన రమణులు అరుణాచలేశుని పిలుపందుకుని నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే అరుణాచలం చేరి తీవ్ర తపోనిష్ఠలో గడిపారు. విరూపాక్ష గుహలో ఉన్నపుడు "బ్రాహ్మణస్వామి"గా పిలవబడ్డారు. తరువాత వీరి తమ్ముడు, తల్లి కూడా వీరిని అనుసరించారు. రమణుల శిష్యుల్లో ఉద్దండులైన 'కావ్యకంఠ' గణపతి 'మునీంద్రులు' పెట్టిన పేరే భగవాన్ శ్రీ రమణమహర్షి. వారు ముని.. వీరు మహర్షి! వారి పేరు గణపతికి అటూఇటూ ఉన్నవి బిరుదులు. వయసులో రమణుల కన్నా కొంచెం పెద్దవారైన కావ్యకంఠుల్ని గణపతి అవతారంగాను, రమణుల్ని కుమారస్వామి అవతారంగాను భావిస్తారు. కావ్యకంఠుల తండ్రికి వినాయకుడొచ్చి ఒళ్లో కూర్చునేవాడట. అందుకే ఆపేరు పెట్టారు. ఎందరికో గురువైన కావ్యకంఠులు రమణుల "అహం మూలాన్వేషణ" బోధతో శాంతి పొంది తమ శిష్యులతో కలిసి రమణులకు దాసోహం అన్నారు. వీరే రమణుల్ని సుబ్రహ్మణ్య అవతారమని ప్రకటించారు.

సర్వ సాధు, సర్వదైవ స్వరూపులుగా ఎందరికో నిదర్శనాలిచ్చిన సాయిబాబా గురుస్థాన్ లో కొందరు రమణ భక్తులకు రమణులు గానూ దర్శనమిచ్చారు.

రమణుల మాటల్లో పాటలు, సూక్తులు, శ్లోకాలూ క్లిష్టమైన ఆత్మ తత్వాన్ని సరళంగా సుబోధకం చేస్తూ దొర్లుతూ ఉండేవి. ఒక భక్తుడు ఆయన ముందు కూర్చుని మనసులో లాంగ్ లాంగ్ ఎగో అన్నట్టుగా "హృదయ కుహర మధ్యే.. హృదయ కుహర మధ్యే.." అంటూ పదే పదే జపిస్తూ తర్వాత పదం ఏమిటో తెలియక అవస్థ పడుతుంటే సర్వజ్ఞులైన రమణులు ఆ పదాలతో మనోజ్ఞమైన ఒక శ్లోకాన్ని ఇలా పూరించారు:
హృదయ కుహర మధ్యే
కేవలం బ్రహ్మ మాత్రమ్
హ్యహమహమితి సాక్షా
దాత్మ రూపేణభాతి
హృదివిశ మనసా స్వమ్
చిన్వతా మజ్జతా వా
పవన చలన రోధా
దాత్మ నిష్ఠో భవత్వమ్!

మంచి పనులు కాపాడతాయి.చెడ్డ పనులు వెంటాడతాయి.
ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.
తత్వమసి
అక్కడే వుండి విన్న కావ్యకంఠులు పులకించిపోతూ "ఆహా! ఇంత మంచి కవిత్వాన్ని మనం కనీవినీ ఎరుగుదుమా" అని తమ శిష్యులతో అన్నారు. పెద్ద చదువులెరుగని రమణుల కవిత్వాన్ని కావ్యకంఠులంతటివారు ప్రశంసించడం మహావిశేషం.అహం మూలాన్వేషణ, ఆత్మతత్వం అంటూ రమణులు ఉపదేశించేదే పై శ్లోకంలోనూ ఇమిడి ఉంది.

అహం మూలాన్వేషణ : కావ్యకంఠులొచ్చి ఆశ్రయించే నాటికి రమణులు చిరకాలంగా మౌనదీక్షలో ఉన్నారు. గొంతు సవరించుకుని మౌనం వీడి ఆయనతో ఇలా అన్నారు: "ఇప్పుడు మీరు "నేను" అన్నారే.. ఆ నేను అనేదాని మూలాన్ని అన్వేషించండి. అదే మీరు. అదే ఆత్మ!" ఈ మాటలు వినగానే కావ్యకంఠులు పరవశించి దాసోహం అన్నారు. భగవాన్ అని పిలవసాగారు. కావ్యాలు కంఠంలో ఉన్న పండితుడని ఆయనకు కావ్యకంఠ అనే బిరుదొచ్చింది. దేవీ సాక్షాత్కారాలు పొందినా అశాంతి పీడించేది. ఈ దశలోనే రమణుల బోధతో శాంతి కలిగిందన్నారు. ఇలా ఎందరో విదేశీ తాత్వికులు కూడా రమణుల బోధతో శాంతులయారు.

రమణుల కొంటెతనం : నేరుగా చెప్పకుండా సంకేతంగా చెప్పడం ఆలోచింపజేస్తుంది. అదే బాగా హత్తుకుంటుంది. దీన్నే మైండ్ గేమ్ అనొచ్చు. మనుషుల మైండ్ గేమ్ మైండుని, గుండెని పాడుచేస్తుంది. దేవుడి మైండ్ గేమ్ చింతన దీక్షను ప్రసాదిస్తీంది. దాని వల్ల మైండు దివ్య చైతన్యాన్ని పొందుతుంది. ఈ సృష్టి సమస్తం దేవుడి మైండ్ గేమే.. అనుక్షణం జరిగేవన్నీ ఆయన్ని గుర్తు చేసుకోడానికే అని భావించడమే దైవచింతన అవుతుంది.

అళగమ్మగారు ఒకరోజు మధ్యానం తీరిక కాగానే రమణుల ముందు కూర్చుంటూ అక్కడున్న చెంబును పక్కన పెట్టారు.

"అయ్యో! అమ్మా! అదెందుకు ముట్టుకున్నావు? దాన్నిప్పుడే వాళ్లెవరో ముట్టుకుని అక్కడ పెట్టారు. ఇప్పుడు నువు స్నానం చెయ్యాలి. బయట వానగా ఉంది. ఇప్పుడెలాగమ్మా?" అన్నారు రమణులు. అళగమ్మగారు కలవరపడి స్నానానికి వెళ్లబోతుంటే అక్కడి భక్తులు ఆపి "అమ్మగారూ! రమణులు భగవానుడని నమ్ముతున్నాం కదా! వారిని తాకితే గంగాస్నాన ఫలం కదా! ఇప్పుడీ వానలో స్నానం ఎందుకమ్మా?" అన్నారు.ఆవిడ వెంటనే అది రమణుల సూచనే అని గ్రహించి "ఔనౌను. నిజమే. అలాగే చేస్తాను" అంటూ స్నానం విరమించుకున్నారు. తల్లిగారి ఛాందస ఆచారాన్ని మాన్పించడానికే ఆయన ఇలా నడిపించారు.

బోధామృతం : ఈ ప్రపంచం మాత్రమే కాదు విశ్వాంతరాళాలన్నీ ఆత్మ దృష్టితో చూస్తే సత్యమే. ఆత్మకు భిన్నంగా చూస్తే మిథ్య! అనే రమణుల బోధలో ద్వైత, అద్వైత తత్వాల సమన్వయాన్ని దర్శించగలం. లీలల కన్నా బోధలే మహిమాన్వితమని రమణుల బోధనా సరళి బోధిస్తుంది.అంతా భగవంతుని ఆజ్ఞతోనే అనుభవించగలం. ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. కర్మలతో ఆయనకు సంబంధం లేదనుకోరాదు అని రమణులు బోధించేవారు.

నిర్యాణం: అందరిలాగే వ్యాధి కూడా రమణుల్ని ఆశ్రయించింది. ఆయన దాన్నీ ప్రేమగానే ఆదరించి శరీరాన్ని విడిచారు. ఆరోజు రాత్రి 8-47 నిమిషాలకు "రమణజ్యోతి" అనే ఆ కాంతి పుంజాన్ని గగనతలంలో అనేక ప్రాంతాలవారు దర్శించారు.

"రమణజ్యోతి ఆకాశంలో ఈశాన్య దిశగా సాగిపోయిందంటూ ప్రముఖ పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి.

రమణ భాగవతులు : కావ్యకంఠులు, పలువురు దేశవిదేశీ సాధుసంతులు రమణుల్ని ప్రత్యక్షంగా సేవించారు. అరవిందులు, నిత్యానందులు, చిన్మయానందులు, నారాయణ గురు తదితర యోగులు రమణ భక్తులే.గాంధీజీ కూడా అరుణాచలం వరకు వచ్చినపుడు కొండపై రమణుల్ని దర్శించాలని ఆశించినా వీలుకాలేదు. గాంధీజీ వెంట వచ్చే జనం వల్ల పైన తొక్కిసలాట జరుగుతుందని భయపడి వారి అనుచరులు వారించడంతో ఆయన సభలో మాట్లాడి వెనుదిరిగారట. అయితేనేమి? తమ అనుచరులైన నాయకులకు, స్వాతంత్ర్య సమర యోధులకు గాంధీజీ తరచూ రమణుల్ని దర్శించి రమ్మని సలహా ఇస్తుండేవారట. "ఒకసారి అరుణాచలం వెళ్లి రమణుల సన్నిధి


మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

Tuesday, 26 April 2022

అహోబిలం

 శ్రీ నృసింహ జయంతి

కొలిచేవారి కొంగు బంగారమై 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటైన నవ నారసింహ క్షేత్రమైన అహోబిలం నారసింహ స్వామి క్షేత్రం


           ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగులవీరాస్వామయ్య  తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం

                    1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ. వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే ఉపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.

అహోబలం 
             హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. 

           నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. 

           ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లాదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవశించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. 
             ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు.
             ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. 
              తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు.

                పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
                  తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్.లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. 

                  అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.
                       తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

పార్వేట:-
            అహోబిల స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను అహ్వాఇస్తానని అన్నారట. ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ నాటి ప్రప్రథమ పీఠధి పతి శ్రీ శఠ గోప యతీంద్ర మహదేశికన్ వారు ఈ బ్రహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ నాటి నుండి ఈ నాటివరకు పర్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరగడం ఒక విశేషము. తిరుమలలో కూడా శ్రీ వారికి పార్వేట ఉత్సవాలు జరుగుతాయి. 

             అటు పిమ్మట బ్రహ్మోత్సవాలు జరిగి గరుడోత్సవంతో అనగా మార్చి 17 న ఈ వేడుకలు పూర్తవుతాయి. అహోబిల స్వామి వారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తాడు. పార్వేట ఉత్సవాలు ఈ గ్రామాలలో ఆ నలబైదు రోజులు జరుగుతాయి. ఈ నెలన్నర రోజులు అన్ని గ్రామాల్లో అందరికి పండగే. అన్ని వేడుకలె. స్వామి వారి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబల వారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న ఒక సంప్రదాయము. సుమారు 120 మంది ఈ విధంగా స్వామి వారి సేవలో తరిస్తున్నారు.


                  నారసింహ క్షేత్రం.. అహోబిలం
 స్థలపురాణం : బ్రహ్మాండ పురాణంలో ప్రహ్లాద వరదుడై హిరణ్యకశిపుడిని సంహరించడానికి నర - సింహాకృతిలో స్తంభోద్భవుడై అవతరించిన శ్రీమన్నారాయణుడే అహోబిల నరసింహస్వామి. స్వామి మహా బలవంతుడిగా కనిపించడంతో అబ్బురపడిన దేవతలందరూ "అహో! బలం.." అని భయాశ్చర్య చకితులయారట. అందుకే ఈ క్షేత్రానికి అహోబలం అనేపేరు వచ్చింది. అదే అహోబిలం అయింది

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

ప్రదోష వ్రతం

          ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము.  ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు .

ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును.
           ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము.
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదిహేను ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము.


            ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో, ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే, ఏ దినమైనా  సూర్యాస్తమయము తర్వాత  త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఈ త్రయోదశీ ప్రదోషము సమయాన్ని యిలాలెక్క కడతారు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. ( ఒక ఘడియ = 24 నిమిషాలు )

             ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది . సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సిఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు, కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అన్నది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాసశివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు  త్రయోదశిలో  మహా ప్రదోష కాల శివపూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆరోజు కూడా శివ పూజనే చేయాలి

            ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి,  మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును .


          ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారమునాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి.

           శని త్రయోదశినాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాపహరము, సర్వ పుణ్యదము.

         ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే .

            ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు పొంగిపోతాడు, భోళా శంకరుడు

ప్రదోష ఉపవాసముంటే శివుడు ప్రసన్నుడౌతాడా ?

           ప్రదోష ఉపవాస దీక్షను (ఇక్కడ ఉపవాసమంటే భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఉండే నిరాహార స్థితి అని అర్థం చేసుకోవాలి) అనుష్ఠించడం ద్వారా, పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషి వాక్కు. అలా పాటించదలిచిన రోజు ప్రాత:కాలమే స్నానం ఆచరించి శుభ్రమైన తెల్లని వస్త్రాలు (లేక కాషాయం మొదలుగునవి) ధరించి, శరీరంలో వివిధ భాగాలలో విభూతిని, రుధ్రాక్ష మాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ‘ఓ నమ:శివాయ.' శక్తి మేర జపం చేయండి. పద్దతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుధ్రాక్షమాలలు మన మనో శరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో మునిగివుండి సూర్యాస్త సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని ధర్శించాలి. అయితే రోజంతా భక్తి సాధనలోనే ఉండాలన్న విషయం మీరు మరవరాదు. అన్యచింత లేని భక్తియే ఈశ్వరుడి కరుణ దృఫటి మీపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళుతునప్పుడు, వెళ్ళిన తరువాత కూడా శివ మంత్రాన్ని మనసులొ జపిస్తూనే ఉండాలి.


మీ

వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్

శాంతి నగర్,ఖాధికాలని

Monday, 25 April 2022

నవగ్రహముల

నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం

 ఆదివారానికి అధిపతి సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి అరుణం పారాయణ చేసిన తరువాత ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం. ఉపవాసంతో దానమిచ్చుట శుభము.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేయుట మంచిది. అన్యోన్య దాయకమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజ, అభిషేకములు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజ చేసి ఉపవాసం ఉండటం శుభము. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి. చంద్ర హోర లో దానము శుభము.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేకంగా తమలపాకు మరియు సింధూర పూజ చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి. కందులు దానం.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.

గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, శనగలు వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి. నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి…

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

గంగా మాహాత్మ్యం

శ్రీ మహాభారతం - అనుశాసనిక పర్వం - 19
* భీష్ముడిని దర్శించిన అత్ర్యాది ప్రముఖ మహర్షులు.
* గంగా మాహాత్మ్యం 

             శరశయ్యపై శయనించిన భీష్ముడు ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధిస్తున్న సమయంలో ఆయనను దర్శించుటకు అత్రి మహర్షితో సహా అనేక మంది మునులు, మహర్షులు తమ శిష్య బృందంతో వచ్చారు. వారి తపోమహిమతో నిండిన కాంతి సర్వత్రా వ్యాపించింది. శరశయ్యపై పడివున్న భీష్ముడి పరిస్థితి వారు పరిశీలించి చూశారు. పాండవులు వారికి భక్తిశ్రద్ధలతో నమస్కరించారు. భీష్ముడిని దర్శించిన అనంతరం మునులు అదృశ్యమై పోయారు. వారు వెళ్ళిన పిమ్మట పాండవులు వారి చరిత్రలను గురించి ముచ్చటించు కొన్నారు. ఆ తరువాత యమనందనుడు తాతగారి పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించి తాతా! ఏ ఊళ్లు, కొండలు నదులు ఏ రకమైన మహిమ కలవో తెల్పు’మని కోరాడు. 

* భీష్ముడు చెప్పిన గంగ ప్రభావం *
ధర్మరాజా! పూర్వం భిక్షాటన చేసే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక సిద్ధయోగి అతిథిగా వచ్చాడు. ఆ విప్రుడు అతనికి అర్ఘ్య పాద్యాదులతో మర్యాదలు చేసి నీవడిగి నట్లే ఆయోగిని అడిగాడు. అప్పుడు అతను బ్రాహ్మణోత్తమా! ఏ దేశాల మధ్య నుండి గంగ ప్రవహిస్తుందో ఆదేశాలలో వున్న నదులు, పర్వతాలు అన్నీ పవిత్రాలే. గంగకు త్రిపథ అని పేరున్న సంగతి నీకు తెలిసిందే కదా! ( స్వర్గంలో మందాకినీ, భువిపై భాగీరథి,పాతాళంలో భోగవతి) అటువంటి గంగను సేవిస్తే యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు, త్యాగాదులచే కలిగే ప్రయోజనం కంటే అధిక ఫలితం చేకూరుతుంది. 

'మేనించుక సోఁకినగంగానదితోయములుజనుల కల్మష కోటిం బో నడచి పురందర లో కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ!'

             కొంచము గంగానది నీరు శరీరానికి సోకితే చాలు మనిషి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా స్వర్గ లోక ఆనందం కలిగిస్తుంది. గతంలో ఎన్ని పాపాలు చేసివున్నా గంగలో మునిగితే - సూర్యుని రాకతో చీకట్లు వైదొలగి పోయినట్లు - ఆ పాపాలన్నీ పటా పంచలౌతాయి. మరణించిన పిమ్మట అతడు స్వర్గానికి చేరగలడు. మనిషి ఎముక గంగ నీళ్ళలో ఎన్నేళ్ళు వుంటుందో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గలోకంలో సుఖాలు పొందుతూ ఉంటాడు. 

            విప్రవర్యా! సోమంలేని యజ్ఞం, చంద్రుడులేనిరాత్రి, సూర్యుడులేని ఆకాశం, స్వధర్మంలేని ఆశ్రమం, పువ్వులు లేని చెట్లు ఎలా శోభించవో అదే విధంగా గంగ లేని దేశం కూడా శోభనివ్వదు. ఎన్ని చాంద్రాయణ వ్రతాలు చేసినా గంగ నీరు త్రాగినంత ఫలితం రాదు. సకల పాపాలు గంగలో మునిగితే పోతాయి. అగ్నిలో పడ్డ దూది వలె సమస్త జీవరాసులకు దుఖం పోగొట్టుకొనుటకు ఎన్ని మార్గాలున్నా అవి గంగతో సమానం కావు. 

'శరణంబు లేని జనులకుఁ బరమ శరణ మండ్రు మునులు భాగీరథి, ని 
ర్జరులకు నమృతము లత్తుల నరులకు గంగాజలం బనఁగ నే విందున్'

         విప్రోత్తమా! దిక్కులేని జనులకు గంగ గొప్ప దిక్కని మునులంటారు. దేవతలకు అమృతమెట్లాగో, నరులకు గంగ నీరు అటువంటిదని అనడం నేను విన్నాను. 

'తలపై జాహ్నవి వాలుకా యలికి కొనిన ఫాలతటిఁ దదంతర్మృత్సం
కలితముఁ జేసిన బాపంబులు దొలఁగు సుపర్ణు గనిన భుజగముల క్రియన్'

         తలమీద గంగ ఇసుక, నొసటిపై గంగ మన్ను రాసుకొంటే గరుత్మంతుడిని చూసిపాములు పారిపోయినట్లు పాపాలు తొలిగి పోతాయి. గంగా తరంగాల తుంపర్లు చిందే గాలి శరీరానికి తాకితే అతడి పాపాలన్నీ అప్పటికప్పుడే పోతాయి. మానవుడు గంగాస్నానం చేస్తే పదునాలుగు తరాల పితృదేవతలను పావనులౌతారు. గంగను చూసినంత మాత్రాన మాట, మనస్సు శరీరం వలన కలిగిన పాపాలన్నీపోతాయి. గంగను గురించి విన్నా, గంగ ఉత్సవాలు చేసినా, చూసినా, గంగను చేతితో తాకినా అది రెండు వంశాల (పుట్టినింటి,మెట్టినింటి) వారి పితృదేవతలను స్వర్గానికి పంపిస్తుంది అటువంటప్పుడు ఇక స్నానం చేస్తే వారికి ఎంత పుణ్యం వస్తుందో వర్ణించలేను.

'విను, గంగ గంగ యను కీర్తనములతో నొండు నీటఁ దగ మునిఁగిన య 
జ్జనులు దురితములఁ దొఱఁగుదు రని యార్యులు సెప్ప విందు సంచిత చరితా!'

          గంగా! గంగా! అంటూ పరవశంతో గంగను కీర్తిస్తూ ఏ నీటిలో మునిగినా పాపాలు పోతాయని పెద్దలంటారు. చూడడానికి శక్తి వుండి గంగను చూడని వాడు పశువుతో సమానుడు. ఇంద్రాది దేవతలే గంగ కావాలనుకొంటే నరులు అనుకోకపోవడం ఉచితమా! ప్రాణం పోయే సమయానైనా గంగను తలచినంత మాత్రాననే ముక్తి కలుగుతుంది. రాజ, చోర, పాప భయాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి. శివుడే ఆ దేవత స్వర్గము నుండి కదలి వస్తే తన నెత్తిన పెట్టుకొన్నాడు కదా! 

'మూడు పథములఁ జని లోకములకు మూఁటి కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి
యమలతర మూర్తి యగు దేవి నాశ్రయించు వాఁడు కృత కృత్యుఁడిది నిక్కువము కృతాత్మ!'

            బ్రాహ్మణోత్తమా! మూడు మార్గాలలో ప్రవహిస్తూ ముల్లోకాలకు గొప్ప అలంకార భూషణమై కీర్తిని కలిగిస్తూ ఉండే నిర్మల మూర్తి గంగాదేవిని ఎవరు ఆశ్రయిస్తారో వారు ధన్యులు. మానవులకు ఇంద్రుడు,గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు, ఎలాగో అలాగే మనుష్యులకు అన్ని విషయాలలో మాహాత్న్యం గల గంగ గొప్పది. కపిలుడు శాపం వలన సాగర పుత్రులు భస్మరాశులై ఉండగా గనగా ఆ భస్మ రాసులపై ప్రవహించి వారిని స్వర్గానికి పంపినదని చెప్పి సిద్ధుడు బ్రాహ్మణునకు నాకు తెలిసిన గంగా మాహాత్మ్యాన్ని నీకు వివరించాను కాబట్టి నీవు మనోవాక్కాయ నిర్మలుదవై గనగను సేవించు మని చెప్పి ఆకాశ మార్గంలో సిద్ధుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజా! తెలిసింది కదా గంగ గొప్పదనం నీవు కూడా గంగను ఆరాధిస్తే శాశ్విత సుఖవంతువంతుడిని చేస్తుంది, అని భీష్ముడు గంగ గొప్పదనాన్ని చెప్పాడు. 

       (స్వర్గంలో నున్న గంగ భువిపైకి ఎందుకొచ్చింది?: సగరచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా అతని యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి పాతాళంలో తపస్సు చేసుకొంటున్న కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతములో వదిలాడు. ఇది తెలియని సగర పుత్రులు అరవైవేల మంది తండ్రి ఆదేశంమేరకు అశ్వాన్ని వెదకుటకు వెళ్ళారు. భూమిపై వెదకి, వెదకి కనిపించక భూమిని త్రవ్వుకొంటూ పాతాళం దాకా వెళ్ళారు. అక్కడ కపిల ముని ఆశ్రమప్రాంతంలో అశ్వము వుండడం గమనించి కపిలుడే అశ్వాన్ని అపహరించాడని భావించి అయన పై దాడికి సిద్ధమయ్యారు. ఆసమయంలో కపిల మహర్షి చూసిన కోపదృష్టికి భస్మమై పోయారు. వారికి విముక్తి కలగాలంటే గంగను వారి భస్మ రాసులపై పవహింప చేస్తే ముక్తి కలుగుతుందని ముని చెప్పగా తరువాత ఆ వంశంలో జన్మించిన అంశుమంతుడు, దిలీపుడు మొదలగు వారు ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ తరువాత భగీరథుడు ప్రయత్నించి గంగను భువికి తెచ్చి పాతాళంలో వున్నతన ముత్తాతల భస్మరాసులపై ప్రవహింప చేసి వారికి విముక్తి కల్పించాడు.)

 భీష్ముడు : ధర్మరాజా! గంగాదేవి స్తోత్రంకూడిన ఈ పురాణ గాథను చదివినా, విన్నా రోగాలు పోవడమే కాక పాపాలు కూడా తొలిగి పోతాయిఅని చెప్పగా గంగ గొప్పదనం విన్న ధర్మరాజు తన తమ్ములతో కలిసి ఆయనకు నమస్కరించి మరొక సందేహం అడిగాడు 

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !!

           తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !! 

🌷అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ
🌷కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.

🌷కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

🌷ప్రతి ఏటా చైత్ర మాసం (ఏప్రియల్/ మార్చ్), ఆషాఢ మాసం (జూన్/జులై) లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విదియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజులపాటు వైభవంగా జరుగుతాయి.

వసతి
🌷తలుపులమ్మ తల్లి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ సుమారు 28 కాటేజీలు కలవు. నామమాత్రపు ధరల్లో ఇవి లభిస్తాయి. ఉత్సవాలు, పండుగల సీజన్లో గదులు దొరకడం కష్టం. గెస్ట్ హౌస్ లు లేవు కనుక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఉదయాన్నే వచ్చి సాయంత్రం తిరుగుప్రయాణం అవుతారు.

🌷తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి.

తుని పట్టణంలో చూడవలసినవి/ చేయవలసినవి:
🌷ఆదివారపు సంత తప్పకుండా చూడండి. కొండప్రాంతం కనుక ఇక్కడ వర్షాధార పంటలు పండిస్తారు. ముఖ్యంగా మామిడి విస్తారం. తక్కువ ధరకు రోడ్లపై విరివిగా అమ్ముతారు. రానున్నది ఎండాకాలం కనుక తుని లో మామిడిపండ్లు రుచి చూడండి.

తలుపులమ్మ లోవ ఆలయానికి ఎలా చేరుకోవాలి ?
🌷తలుపులమ్మ లోవ గుడి కాకినాడకు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 106 కి. మీ ల దూరంలో, అమలాపురానికి 176 కి. మీ ల దూరంలో, తుని కి కేవలం 8 కి. మీ ల దూరంలో కలదు. ఈ గుడి జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

🌷సమీప విమానాశ్రయం : రాజమండ్రి
సమీప రైల్వే స్టేషన్ : తుని

🌷బస్సు మార్గం : తుని వరకు బస్సులో ప్రయాణించి... అక్కడి నుంచి జీపులలో లేదా షేర్ ఆటోలలో ప్రయాణించి తలుపులమ్మ తల్లి దేవస్థానం చేరుకోవచ్చు.

తలుపులమ్మ లోవ కొత్తూరు సమీప గ్రామం అక్కడి వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు.

 మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

ఓం కారం


సమస్త వేదాల సారమైన ఓం కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనల పై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించినసత్యోపదేశాలే ‘మంత్రాలు’.

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దలవాక్కు.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి:.
మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.

2. ఛందస్సు:.
శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.

 
3. దేవత:.
ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

4. బీజం:.
మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.

5. శక్తి:.
మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.

6. కీలకం:.
మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, సర్వసిద్ధులను పొందుతాడు.

7. అంగన్యాసం:.
అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం:
చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో
అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆమంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:..

‘ఓం’..
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

వేదం ఓంకారరూపం, వేదరాశి..
ఋగ్వేదం నుండి ‘అ’ కారం,
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం:.
అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం:.
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం ‘హూం’.

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

"రం:.
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం:.
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం:.
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం:.
ఊపిరి యొక్క స్వాభావిక బీజం.
‘సో’ ఉచ్ఛ్యాసం,‘హం’ నిశ్శ్వాసం.
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

గాయత్రీ మంత్రం:.ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి

జలదానం వైశిష్ట్యం

జలదానం వైశిష్ట్యం 

చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ఠ మాసములలో జలదానం తప్పక చేయవల్సినది.

మార్కండేయ పురాణం
శ్లో- తోయాన్నదాన పరాయణు డగువాడు
వేదనారహితుడై విడుచునొడలు

భావం
నిత్యం మంచినీరు దానం చేయువాడు, రవ్వంత బాధ లేకుండా చివరి దశలో శరీరం విడిచి పెడుతాడు..

దేవీ భాగవతం... నవమ స్కంధం
జల దానం వలన విష్ణు దర్శనం అవుతుంది.
వేసవి కాలంలో నీళ్లను దానం చేసిన పుణ్యాత్ములు వేయి దివ్య సంవత్సరాల కాలం విష్ణువు చేత వైకుంఠంలో సన్మానం అందుకుని, ఆ తర్వాత మణిద్వీపానికి వెళ్తారు.


వేంకటాచల మహాత్మ్యం
ఇక్ష్వాకు వంశస్థుడైన హేమాంగుడనే రాజు కులగురువు వసిష్ఠుని మాట తిరస్కరించి జలదానం చేయక, పండితులను గౌరవించక, చాతక పక్షి, కుక్కగా జన్మలు ఎత్తి, మిథిలా నగర రాజు శ్రుతకీర్తి ఇంటి గోడపై బల్లిగా జన్మ ఎత్తుతాడు. రాజు పండితుడైన శ్రుతదేవుడ్ని కడిగిన పాదజలం బల్లిపై పడి పాపవిముక్తి పొందాడు. సప్తగిరుల్లో స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి దర్శనం, 7 రోజులు జలదానం చేసి స్వర్గం పొంది, వేంకటాద్రిలో జలదానం చేసిన పుణ్యం వల్ల వైవస్వత మన్వంతరంలో కాకుత్స్థుడిగా పుట్టాడు.

లింగ పురాణం
పూర్వజన్మలో సుభద్ర ఎన్ని తప్పులు చేసినా ఆకలితో ఉన్న పండితుడికి ఆతిథ్యం ఇచ్చి మరు జన్మలో రాకుమార్తె గా జన్మించింది.

*అందుకే అన్నదానం, జలదానం తప్పక చేసి తీరాలి*...

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి

విద్వాన్ సర్వత్ర పూజ్యతే!


విద్వాన్ సర్వత్ర పూజ్యతే!

       ధనం మూడు రకాలుగా ఉంటుంది. 
ఒకటి బాహ్యంలో ఉండే *భౌతికమైన ధనం*. 
రెండవది *మానసిక ధనం*
మూడవది *పుణ్యరూపమయిన ధనం*. 

          ఈ మూడూ సమానమైన ప్రాతిని ధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకో కపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో సర స్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసర మేనని అంటారు. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ దేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తన కున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు.

           అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశంఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవా రికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదు వున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. 'ఇవన్నీ నావి కావమ్మా. నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి' అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువ వుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం.

రెండవది మానసిక ధనం.
అంటే శాంతి.శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...'ఓంశాంతిః శాంతి శాంతిః' అంటాం.తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగల గాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేక పోయినా 'నాకేం తక్కువయిందని'..అన్నభావ నతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్య మయినా, ఆనందమయినా మానసిక మైన ధనాన్ని ఆవహించి ఉంటాయి.

*మూడవది పుణ్యధనం*.
              ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? కలుగుతుం దనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుం దిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది?

         పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు.

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి