Saturday 23 December 2017

తిరుప్పావై (తూమణి మాడత్తు చ్చుత్తుం 9వ పాశురము

తిరుప్పావై (తూమణి మాడత్తు చ్చుత్తుం
9వ పాశురము

            తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.

          ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.

          ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు .

           మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.

            మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి.

         అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.

తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము:

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

           ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.

            నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.
మీ
వేద,శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment