Monday 25 December 2017

తిరుప్పావై (కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు) 11వ పాశురము

తిరుప్పావై (కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు) 
11వ పాశురము

           ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు.

         వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము.  గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు.  నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది.

            అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండే దానను అనిపిస్తుంది.  సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు పాశురము:


కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

           లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా!

          పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా?  రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు.  నీ వాకిలి ముందు చేరియున్నారు.  నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు.

          ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి?  ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment