Tuesday 19 December 2017

తిరుప్పావై (మాయనై మన్ను వడమదురై) 5వ పాశురం

తిరుప్పావై (మాయనై మన్ను వడమదురై) 

5వ పాశురం

          వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా

మాయనై మన్ను వడమదురై మైందనై పాశురము:

మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:

           మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటం కములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు.

           అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.

           అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహ ములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి.

               అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment