Thursday 21 December 2017

తిరుప్పావై (కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్) 7వ పాశురం

తిరుప్పావై (కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్) 

7వ పాశురం

              6వ పాశురంలో ఉత్తిష్ట అను చిన్నగోపికను మేలుకోల్పిరి. మరి నేడు. వేదపఠనముకు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుటతో మన ధనుర్మాసవ్రతం ప్రారంభము అయ్యింది.

          అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి.

            ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్  పాశురము: 

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.

తాత్పర్యము:

             భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.ఆ ధ్వని నీవు వినలేదా?

             ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లు చున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశము నకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?

          ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.లోకకంటకు లైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment