Friday, 24 November 2023

శని త్రయోదశి రోజు 25.11.2023 శని భగవానుడి ఆశీస్సులు


శని త్రయోదశి రోజు శని భగవానుడి ఆశీస్సులు పొందండి

కార్తీకమాసం చాలా విశేషమైన మాసం. ఈ మాసంలో ప్రతీరోజు చాలా పవిత్రమైనది. అయితే ఈ సంవత్సరం శ్రీ శోభకృత్‌ 25 నవంబర్‌ 2023 కార్తీక మాస శుక్ల పక్ష తిథి రావటం ఆరోజు శనివారం (స్థిరవారం) అవ్వడం చేత ఈ శని త్రయోదశి చాలా విశేషమైనది.

       కార్తీక మాసంలో శనివారం త్రయోదశి కలసిరావడం శనిత్రయోదశి నాడు నవగ్రహ పూజలకు, శివారాధనలకు, శని ఈతిబాధలను తొలగించుకోవడానికి ప్రత్యేకం. అటువంటి శని త్రయోదశి శివుడికి ప్రీతికరమైన కార్తీకమాసంలో రావటం చాలా విశేషమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

            గోచారపరంగా ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమశని వంటి ఇబ్బందులు పడుతున్నారో, జాతకంలో శని దోషాలు వలన శని మహర్దశ, అంతర్దశ వలన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఆ దోష నివృత్తి చేసుకోవడానికి ఒక అద్భుత అవకాశం

           ఈ సంవత్సరం శని కుంభరాశిలో సంచరించుట వలన 25వ తారీఖు వచ్చినటువంటి శని త్రయోదశి మకర కుంభ మీనరాశుల వారికి కర్కాటక మరియు వృశ్చికరాశి వారికి శని భగవానుని పూజించడానికి నవగ్రహ ఆలయాల్లో శాంతులు చేసుకోవడానికి శివాలయాల్లో అభిషేకాలు చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని, ఇలా ఆచరించడం వలన వారికి తగులుతున్న శని దోషాలు తగ్గుతాయని

కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఏమి చేయాలంటే...

           ఈరోజు ఉదయం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానమాచరించడం, తలస్నానం వంటివి ఆచరించడం మంచిది. ఈరోజు నవగ్రహ ఆలయాల్లో శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం వంటివి, నవగ్రహ ఆలయాలను దర్శించి అక్కడ శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది

            ఈరోజు శివాలయాల్లో అభిషేకం వంటివి ఆచరించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈరోజు ఉపవాసం, నక్తం వంటివి ఆచరించడం నూనె పదార్థాలు వంటివి స్వీకరించకుండా ఉండటం మంచిదని

           భారతీయులు శివుడి అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. అయితే దేవ గురు శని అనుగ్రహం కోసం కూడా శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ త్రయోదశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజు శని దేవుడు ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి రోజున శని దేవుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఏయే నియమాలతో వ్రతాన్ని పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

             ప్రతి సంవత్సరం  శుక్ల పక్షంలోని శని త్రయోదశిని జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం త్రయోదశి 25 నవంబరు వచ్చింది., రాహు-కేతు సమస్యలతో బాధపడేవారు శని దేవుడికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రతంలో భాగంగా మంత్రాలు పఠించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాన కార్యక్రమాలు చేయడం కూడా శుభ పరిణామంగా భావిస్తారు

శని త్రయోదశి రోజున చేయాల్సిన పనులు:
❃ శని త్రయోదశి రోజున తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత తలస్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
❃ మీ దగ్గరలో ఉన్న శని దేవుని ఆలయానికి లేదా హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత దేవాలయంలో ఉన్న శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి.
❃ ఇలా అభిషేకం చేసిన తర్వాత శని దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి.
❃ అంతేకాకుండా శని దేవునికి ఎంతో ఇష్టమైన వస్తువులను తైలాభిషేకం చేసిన నూనెను వికలాంగులకు, అనాధలకు దానం చేయాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత ఇంట్లో ఉన్న శని చిత్రపటానికి పూలమాలను సమర్పించి.. ఓ రాగి పాత్రలో ఆవనూనెను పోసుకొని నాణేన్ని అందులో వేయాలి.
❃ ఆ తర్వాత సాయంత్రం మీ దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ముందు ప్రదక్షిణలు చేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.


శని ప్రదోష వ్రత ప్రయోజనాలు:
శుక్లపక్షంలోని త్రయోదశి రోజున శని దేవుడికి వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి అంతేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల రాహు కేతు చెడు ప్రభావం తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ రోజున కాలభైరవుని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. 

సేకరణ

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

No comments:

Post a Comment