Saturday, 11 March 2017

శ్రీ లక్ష్మీ జయంతి" మరీయు హోలీ-వసంతోత్సవము

శ్రీ లక్ష్మీ జయంతి" మరీయు హోలీ-వసంతోత్సవము


పాల్గుణం మాసం,శుక్లపక్ష పౌర్ణమి ఉత్తరపాల్గుణీ, ఆది వారము( 12.03.2017)

 శుభదినం "శ్రీ లక్ష్మీ జయంతి". 

                 లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 

1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 
3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 
4. తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7. వైవస్వత మన్వంతరంలో కీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. 

                ఇందులో మొదటి మన్వంతరముగా చెప్పుకుంటున్న స్వాయంభువ మన్వతరంలో -

               భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరముచే భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించెను. 
ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. 

                ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వలన నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణుడులతో కల్సి తపస్సు చేయుచుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. 

              ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేయగా, అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భసంజాత ఘటన. 

                 ఇక చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో -
పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేయగా, ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై -

             'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించెను. శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోగా, దేవేంద్రాదులు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందునిమిత్తం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యముకాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

        క్షీరసాగరమధనం :- 

              ఈ పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు".

క్షీరసాగర మధనం జరిగినప్పుడు - 
                 ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం "శివరాత్రి" అయింది. 

               దియే కాక, ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచే ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది

        ఆ తర్వాత మరల కొనసాగిన సముద్రమధనంలో 'సురభి' అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు. ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు

            . అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణశుద్ధపూర్ణిమ. మనం జీవిస్తున్నకాలం వైవస్వతమన్వంతరం కనుక ఈ విధంగా క్షీరాబ్ధి నుండి ఆవిర్భవించిన ఈ దినమునే ''లక్ష్మీజయంతి"గా జరుపుకోవాలన్నది శాస్త్రవచనం

ప్రాదుర్భవమే కాదు పరిణయం కూడా !

           ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగినదినం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది ఆ శుభసమయమునే! 

సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు 
నాదుడయ్యేనేసి నడప నోపు 
నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు 
బుష్పదామకమున బూజ సేసె !

       వక్షో నివాస మకరోత్ పరమం విభూతే / యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్' ... లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. 

          లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి - ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!

          శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి. 

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం 
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ 
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం 
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ 

అందరూ లక్ష్మీ కటాక్షమునకు పాత్రులవ్వాలని కోరుకుంటూ 

అలాగే ఈ రోజు మరొక విశేష0 అనగా హోలి పండుగ – వసంతోత్సవం

                 ప్రతి   ఒక్కరూ ఆనందోత్సాహాల తో జరుపుకునే హోలీ పండుగ వచ్చేసిం ది. ప్రతి సంవత్సరం పాల్గుణ మాసం పూర్ణిమ తిథి నాడు అత్యంత ఆనందోత్సవాలతో హోలీ పర్వదినాన్ని ఘనం గా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత రుతువు ఆగమనాన్ని తెలియజే స్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు హోలిక అనే రాక్షసిని చంపడంతో ప్రజలు ఈ పండుగ జరుపుకుంటున్నారన్నది ప్రతీతిలో ఉంది. దీన్నే కాముని పున్నమి, డోలికోత్సవం, పాల్గుణోత్స వం వంటి వివిధ నామాలతో వ్యవహరిస్తుంది

             కామదహనం తరువాత అంటే మన్మధుడు బూడిదపాలు అయిన తరువాత రతీ దేవీ పరమ శివున్ని తన భర్తని బతికించమని వేడుకొనగా ఆ పరమ శివుడు దయతో మన్మధుడిని తిరిగి బ్రతికిస్తాడు. మన్మధునికి మరో పేరే మదనుడు. అందుకే ఇది మదనోత్సవం, మధూత్సవం అన్న పేర్లతో కూడా పిలువబడుతోంది.
కాముని పున్నమి.. కామదహనం. వసంతోత్సవం. ఫల్గుణోత్సవం. డోలికోత్సవం.. హోలికాపౌర్ణమి. మదనోత్సవం. మధూత్సవం.. ఇలా ఎన్ని పేర్లున్నా చివరికి అందరి నోళ్లలోనూ నానే పేరు మాత్రం ‘హోలి’. ఫాల్గుణమాసంలో ‘శుక్ల పూర్ణిమ’ నే హోలి పండుగగా జరుపుకుంటాం.

              దేవతలందరూ వసంతోత్సవం జరుపు కుంటారు అదే హోళీ పండుగ. ఈరోజే బ్రహ్మసావర్ణి మన్వాది కూడా. అంటే బ్రహ్మ సావర్ణి దేవీ ఉపాసనతో మనువుగా వరం పొందిన గొప్ప రోజు.
కామదహనం వసంతోత్సవం ఒకానొక సమయములో కైలాసములో శివుడు, సతీ దేవీ ఉండగా దేవతలందరు కలిసి అటుగా ప్రయాణము అవుతున్న దృశ్యం వారికి కనిపించింది.

             వీరంతా ఎక్కడకు వెళుతున్నారని వాకబు చేయగా వారంతా దక్షయజ్ఞానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. సతీ దేవీ ఆశ్చర్యపడి, తన తండ్రి గారు ఆ విషయం తమకు ఎందుకు తెలుపలేదా అని అనుకున్న సమయంలో, పరమ శివుడు దక్షుడు తమను కించపరుస్తున్నాడని, తమను ఆహ్వానించలేదని చెపుతాడు, అయినా సతీ దేవీ అక్కడకు వెళ్లి అవమానం భరించలేక ఆత్మాహుతీ అవ్వటం మనకు తెలిసిన విషయమే.

            అంతేకాక శివుడు సతీ దేవీ ఆత్మాహుతి వార్త విని రుద్రుడై, కాలభైరవుణ్ణి సృష్టించటం, అతడు యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యటం జరిగింది. ఆ తరువాత శివుడు సతీదేవీ వియోగంతో కృంగి ఘోరతపస్సులోకి వెళ్ళటం జరిగింది. శివ జాడలేదని గ్రహించిన రాక్షసులకు ఒక పండుగగా మారి వారు చేసే దుశ్చర్యలకు ఎదురులేకపోయింది.

           దేవతలకు విషమ పరిస్థితులు ఎదురయ్యాయి, వారికి ఏమిచెయ్యాలో పాలుపోని స్థితిలో అందరు ఆలోచించి, విరాగి అయిన శివుణ్ణి తపస్సు నుంచీ తప్పించి, వారి దృష్టిని మరల్చాలని ఆశించి, దానికి ఒక్క మన్మదుడే దిక్కని తోచి మన్మధుడిని ప్రేరేపించి, శివుడి మీద మన్మధబాణాలేసి వారి దృష్టిని మార్చాలని కోరారు. దేవతలంతా ఆ విధంగా కోరగా, మన్మధుడు ఇక వారి మాట వినక తప్పలేదు. అదే తడవుగా మన్మధుడు శివునిపైకి బాణాలు వెయ్యటం జరిగింది.  
            తీవ్ర తపస్సులో వున్నా శివుడి తపస్సుకి భంగం కలిగింది. అతిరుద్రుడై కళ్ళు తెరచి చూశాడు, మన్మధుడు వరుసగా బాణాలు విసురుతున్నాడు. శువుడికి విపరీతమైన కోపం కలిగింది, క్షణాల్లో ఏం జరిగిందో ఉహించేలోగా శివుడి కోపాగ్నికి మన్మధుడు బూడిదవ్వడం జరిగిపోయింది. అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది.

              ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. మాగః శుక్ల త్రయోదశినాడు జరిగినదీ కామదహనం అనగా మన్మధ దహనం. మానవ జీవితానికి కోరికలే మొదటి శత్రువులు. కోరికలను కలిగించు కాముడే మన్మధుడు. శివునిచే జరిగిన ఈ కామదహనం అంటే తన కోపాగ్నికి కామ స్వరూపుడైన మన్మధుడిని బూడిద చెయ్యడం జరిగింది.

            ఆనాడే కామదహనం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ కామదహనం ఓ పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఆచారంగా మారింది. కామదహనం జరిగిన తరువాత మన్మధుని భార్య అయిన రాతీదేవీ వచ్చి విషయం తెలుసుకొని తన భర్త భాస్మంగా మారడం చూచి దిగ్భ్రాంతి చెంది తన భర్త కోసం శోకించటం మొదలుపెట్టింది. దేవతలందరినీ పిలిచి మీరేనా నా భర్తను శివునిపైకి పంపారు. ఇప్పుడు ఇలా అయ్యింది. అంటూ భాధపడింది. దేవతలందరూ రతీదేవిని తీసుకొని శివుని దగ్గర చేరి ప్రార్ధించి తిరిగి మన్మధుని బతికించారు.

           మన్మధునికి శరీరం లేకపోయినా ఆయన చెయ్యవలసిన బాధ్యతలు అంటే దేవతలలు మానవులకు కోరికలు ప్రేరేపించడం జరుగుతుందని భార్య రాతీదేవికి మాత్రం శరీరంతోనీ కనిపిస్తాడని శివుడు వరం ఇచ్చాడు. అలా కాముడైన మన్మధుడు తిరిగి బ్రతికినందుకు వసంతోత్సవం ఆనందంతో చేసుకున్నారని అదే హోలీ అనీ, అదే వసంతోత్సవం అని అంటాము. ఆనాడు రతీమన్మధులను పూజిస్తే కుటుంబానికి సౌభాగ్యం ఆనందం కలుగుతుందని నమ్మకం.

మరొక కథ

           హోలికను గురించి మరో కథ ప్రచారంలో వుంది. కృతయుగంలో రఘునాదుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఎంతో జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ వుండగా కొందరు ప్రజలు వచ్చి హోలిక అను రాక్షసి వచ్చి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకున్నారు. ఆ సమయములో అక్కడే వున్న నారద మహర్షి రఘునాధ మహారాజా హోలిక అను రాక్షసిని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ రోజు పూజించాలి.

          అలా పూజించిన వారి పిల్లలను ఆ రాక్షసి ఏమీ చెయ్యదు . కనుక రాజ్యంలో అందరిని వచ్చే ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలికను పూజించమని ఆదేశించండి, అన్ని బాధలు తొలగిపోతాయి అన్నాడు. రాజ్యములోని ప్రజలందరూ ఫాల్గుణ పూర్ణిమ రాత్రి కాలమందు బిడ్డలను ఇంటిలోనే ఉంచి హోలికకు పూజలు చెయ్యాలని మహారాజు ఆదేశించాడు.

             పగటిపూట పూజ చేసిన వారికి దుఃఖములు కలుగుతాయి. కనుక హోలికకు రాత్రే పూజలు చేయాలి. అలా ఈ హోళీ హోలిక పూజ వాడుకలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈ హోలిక హిరణ్య కశిపుని చెల్లెల్ని, ప్రహ్లాదుని అగ్నిలో తోయించినప్పుడు ప్రహ్లాదునితోపాటు ఈ హోలిక కూడా అగ్నిలో ప్రవేశించి మారి భస్మం అయ్యిందని అందువల్ల పిల్లల రక్షణ కొరకు ఆమెను పూజించడం ఆచారంగా మారిందని పెద్దలు చెప్తారు.

ఈ హోలికి సంబంధించిన మరొక ప్రస్తావన

శ్లో   :     సరోడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం
            ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్యపురం ప్రజేత్. ||

              పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు ఈ రోజే ఉయలలలో ప్రవేశించాడని ఈ ఫాల్గుణ పూర్ణిమనాడు ఉయలలోని కృష్ణుని పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
హోళీ అనే పదం డోల అనే పదానికి ప్రతీకమని అలా హోలి పండుగగా ప్రసిద్దమైనదనీ మరి కొందరు అంటారు. ఏదేమైనా కామదహనం తరువాత జరిగే ఈ హోళీ వసంతోత్సవం ఇంత ప్రాచుర్యాన్ని సంతరించుకొని జాతి సమక్యైతను దారి తీసే విధంగా అందరిని ఆనందిమ్పచేస్తోంది. కాబట్టి తప్పక ఆచరింప తగిన పండుగ, ఇది జాతి, మత, స్త్రీ, పురుషుల వయో భేదం లకుండా కలిసిపోయి ఆనందంగా జరుపుకునే పర్వదినం.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday, 8 March 2017

ఫాల్గుణ నృసింహ ద్వాదశి

ఫాల్గుణ నృసింహ ద్వాదశి

              ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు.

           ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం అనగా పుత్రగణపతి అని కూడా అంటారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు.

          ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి (అనగా రేపు 09.03.2017)న వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు.

          శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి గంగాస్నానం పాపనాశనమని పెద్దలు చెబుతున్నారు.

       వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం, ఆ రోజున మహిళలు సీతామాత పూజ, విష్ణుపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

       ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఇంకా ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

శ్రీ నృసింహ స్తుతి

స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్లోక0

విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.

1::ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్
నమామ్యహమ్

2::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

ప్రార్ధన శ్లోకం:

3::సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే

శ్రీ లక్ష్మి నృసింహ పంచరత్నం

1::త్వత్ప్రభుజీవప్రియమిచ్ఛసి చేన్న రహరిపూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృతిధృతికుశలో బింబాలంకృతిమాతనుతే
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీ నరసింహానఘపదసరసిజమకరందం

2::శుక్తౌ రజతప్రతిభా జాతా కటకాద్యర్థసమర్థా చేత్
దుఃఖమయీ తే సంసృతిరేషా నిర్వృతిదానే నిపుణా స్యాత్
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం

3::ఆకృతిసామ్యాచ్ఛాల్మలికుసుమే స్థలనలినత్వభ్రమమకరోః
గంధరసావిహ కిము విద్యేతే విఫలం భ్రామ్యసి భృశవిరసేస్మి
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరం

4::స్రక్చందనవనితాదీన్విషయాన్సుఖదాన్మత్వా తత్ర విహరసే
గంధఫలీసదృశా నను తేమీ భోగానంతరదుఃఖకృతః స్యుః
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం

5::తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సత తం
స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి
చేతోభృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం
భజ భజ లక్ష్మీనరసింహానఘపదసరసిజమకరందం

శ్రీ నృసింహ పంచామృత స్తొత్రం

అహూబిలం నారసింహం గత్వా రామ: ప్రతాపవా్
నమస్కృత్వా శ్రీ నృసింహం అస్తౌషీత్ కమలపతిం

గోవింద కేశవ జనార్దన వాసుదేవ
విశ్వేశ విశ్వ మధుసూధన విశ్వరూప

శ్రీ పద్మనాభ పురుషొత్తమ పుష్కరాక్ష
నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే

దేవాస్స్మస్తా:ఖలు యోగిముఖ్యా:
గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ

యత్పాదమూలం సతతం నమంతి
తం నారసింహం శరణం గతోష్మి

వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్ర గర్భాన్
విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీం

యస్య ప్రసాదాత్ సతతం (పురుషా) లభంతే
తం నారసింహం శరణం గతోస్మి

బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ
నారాయణో సౌ మరుతాం పతిశ్చ

చంద్రాక వాయ్వగ్ని మరుద్గణాశ్చ
త్వమేవ తం త్వాం సతతం సతోస్మి

స్వప్నేపి నిత్యం జగతాం త్రయాణాం
స్రష్టా చ హంతా విభురప్రమేయ:

త్రాతా త్వమేక: త్రివిధో విభిన్న:
తం త్వాం నృసింహం సతతం నతోస్మి

ఇతి స్తుత్వా రఘుశ్రేష్ఠ: పూజయామాస తం విభుం
పుష్ప వృష్టి: పపాతాశు తస్య దేవస్య మూర్ధని
సాధు సాధ్వితి తం ప్రోచు: దేవా ఋషి గణైస్సహ

రాఘవేణ కృతం స్తొత్రం పచమృతమనుత్తమం
పఠంతి యే ద్విజవరా:తేషాం స్వర్గస్తు శాశ్వత:

||శ్రీ నృసింహ పంచామృతస్తొత్రం సంపూర్ణం ||


శ్రీ ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం

1::దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

2::లక్ష్మ్యాలింగితవామాంగం భక్తానాం వరదాయకం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

3::ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

4::స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

5::సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

6::ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

7::క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

8::వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

9::య ఇదం పఠతే నిత్యం ఋణమోచనసంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్

ఇతి ఋణవిమోచననృసింహస్తోత్రం సమాప్తం


శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

1)శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

2)బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్

3)సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

4)సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

5)సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

6)సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

7)సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

8)సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

9)సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

10)సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

11)సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

12)సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

13)సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

14)బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

15)అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

16)లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

17)ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

18)ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

19)ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

20)వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

21)మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:

22)ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

23)శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా

24)యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ

25)శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే

మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday, 7 March 2017

అమలక ఏకాదశి.


 అమలక ఏకాదశి.
ఈ రోజు అనగా 08.03.2017 బుధవారం ఏకాదశి దీనినే అమలక ఏకాదశి అంటారు.                    
                      ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు  శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

               మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈ రోజు  ఉసిరి చెట్టు కి విశేష పూజలు చేస్తారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి.
               అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని  ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.

                ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు.
               స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పది ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని  ఆకాశవాణి పలుకుతుంది.
                ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ  ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.

                ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపా కటాక్షము పో0దుదాము.

"ఓం నమో నారాయణాయ"
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Wednesday, 1 March 2017

పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”

పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం”

          పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు .

         మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.

              పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

             వారసుడు కావాలనే కోరిక తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు.
               ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి  గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది  గుమ్మానికి తోరణాలుకట్టి పూజామందిరాన్ని అలంకరించాలి.

              ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి.

                  సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.

             పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

         అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

          ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి.

            పూజా మందిరంలో కలశస్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

            ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి.

           బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

           ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)
"
        ‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప డేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వార

            ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ  చవితి యందు పఠించి నువ్వలుబెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి . జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ

              స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను.

 అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా
యద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం
శరీరంతు శరీరిణామ్‌ ।। 1

శ్లో।। యచ్చాపి హసితం తేన
దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ
పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తః
కుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌
రుద్ర ఇవాపరః ।। 3

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాం
యోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా
రూపేణచ మహాత్మవాన్‌ ।। 4

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపం
కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం
తమ పశ్యతభామినీ ।। 5

శ్రీ పరమేశ్వర ఉవాచ -

శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।

అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః
సమం కాంచన కుంభ సంస్థెః ।

జలై స్తథా సావభిషిక్తగాత్రో
రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతు
దేవాస్తం గణనాయకం ।

తుష్టువుః ప్రయతాః సర్వే
త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9

దేవా ఈచుః - 9

శ్లో।। నమస్తే గజవక్త్రాయ
నమస్తే గణనాయక ।

వినాయక నమస్తేస్తు నమస్తే
చండ విక్రమ ।। 10

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖహో ।

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం-
- కురు సర్వదా ।। 11

శ్రీ పార్వత్యువాచ -

శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రా
నధనోపి ధనం లభేత్‌ ।

యం యమిచ్ఛేత్‌ మనసా
తం తం లభతి మానవః ।। 12

శ్లో।। ఏవంస్తుత స్తదా
దేవైర్మహాత్మా గణనాయకః ।

అభిషిక్తస్య రుద్రస్య
సోమస్యా పత్యతాం గతః ।। 13

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వా
భక్త్యా గణపతిం నృప ।

ఆరాధయతి తస్యాశు తుష్యతే
నాస్తి సంశయః ।। 14

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రం
యశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।

నతస్య విఘ్న జాయన్తే
నపాపం సర్వథా నృప ।। 15

         పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు .

           మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.

           పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 'పుత్రగణపతి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

        వారసుడు కావాలనే కోరిక తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు.

            ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది  గుమ్మానికి తోరణాలుకట్టి  పూజామందిరాన్ని అలంకరించాలి.

            ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను  పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి.
           ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది. పూర్వం మహారాజులు  చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు.

             తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు 'ఫాల్గుణ శుద్ధ చవితి' రోజున 'పుత్ర గణపతి' వ్రతాన్ని ఆచరించే వాళ్లు.

          అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

           ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా 'పుత్రగణపతి వ్రతం' మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి.

           పూజా మందిరంలో కలశస్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.

           ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి.

          బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.

            ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Sunday, 26 February 2017

ఫాల్గునమాసం విశిష్టత


 ఫాల్గునమాసం విశిష్టత

              పౌర్ణమినాడు ఫల్గునీ నక్షత్రం ఉన్న 'చాంద్రమాన'మాసం ఫాల్గునమాసం. ఫాల్గుణము అని వ్రాయకూడదు. ఫాల్గునము అన్న అక్షర క్రమమే సరైన శబ్ద స్వరూపము. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు పుట్టిన పాండవ మధ్యముడు ఫల్గునుడయ్యాడు. ఈ మాసం శిశిర ఋతువుకు పరాకాష్ఠ. వసంత ఋతువుకు 'ద్వారం' వంటిది.


             శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి.

                ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది.

            అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

          ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి.

           చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు.

        ఈ పూర్ణిమ శక్తితో  కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు.

                ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది.

              ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.

ఫాల్గుణ మాసం విశిష్టత

             వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ  మాసం.

             శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు  పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.

            శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ  రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

              ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు  ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల  పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.

            పౌర్ణమి - మహా ఫల్గుణి అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. ఉత్తర భారతదేశం లో  రాక్షస పీడ  తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు.

            ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. పాల్గుణ  పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది.ఈ రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు.

          అమావాస్య - ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday, 25 February 2017

మాఘ పురాణం - 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము

మాఘ పురాణం - 30వ అధ్యాయము - మార్కండేయుని వృత్తాంతము

              వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి.
                   మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి.

            అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు.

                 అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది.

               రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను.

           మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు.

               మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.

             అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి.

                మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను.

             బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.

            మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి.

             మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.

           క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది.

              ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.

           యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను.

            తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను.

         పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.

మాఘమాస ఫలశ్రుతి

          గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునీ! ధర్మప్రభోధకములగు మాసములలో మాఘమాసముత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్యకర్మలనన్నిటిని చేయుటవలన వచ్చునంతటి పుణ్యము. మాఘమాస వ్రతము నొకదానిని చేసినంతనే వచ్చును. 


           మాఘమాసవ్రతము సర్వపుణ్యక్రియ సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను గూడ కలిగించును. సర్వసుఖముల నిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచినదానిని, విన్నదానిని, తెలిసినదానిని నీకు అడుగగనే చెప్పితిని. 


               మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను, మాధవ ప్రీతికరమైన మాఘ్మాసవ్రతమును విడువక ఆచరించినచో సర్వ ధర్మములనాచరించుటవలన వచ్చుఫలితమునందును. 


                ఈ పురాణమును శ్రీహరిసన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినివారును యిహపరములయందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరిసాన్నిధ్యమును చేరును. సూతుడు శౌనకాది మహామునులతో నిట్లనెను. మాఘమాసవ్రతము సర్వ పుణ్యముల నిచ్చును. సర్వైశ్వర్యముల నిచ్చును. అన్ని రొగములను పొగొట్టి ఆయుర్దాయమును పెంచును. 


          విష్ణు సాన్నిధ్యమును కలిగించును. ముక్తిని కొరినవారికి ముక్తినిచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయవిధేయతలు కల శిష్యునకును, శ్రద్దకల వానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి యీ వ్రతమును  చేయుడని చెప్పవలెను.


            శౌనకాది మహామునులకు రోమమహర్షి పుత్రుడు నైమిశారణ్యమున మాఘమాసవ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పినవానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీపమహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్నృమదుడను మహర్షి జహ్నుమునికి చెప్పినవి. 


              మొత్తం మీద  యీ కథలనిటిని కలిసి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలనెరిగినవాడగుటచే ఆయా సందర్భములో ఆయావ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పెనని గ్రహింపవలెను.

సర్వే జానా సుఖినో భంవంతు
మాఘ పురాణం సమాప్తం
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Friday, 24 February 2017

మాఘ పురాణం - 29వ అధ్యాయము - మృగశృంగుని కథ మరియు మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

మాఘ పురాణం - 29వ అధ్యాయము - మృగశృంగుని కథ మరియు
మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.


            వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయడలని తల్లిదండ్రుల అనుమతి నండి యింటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరె తీరమును చేరెను.

                మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవల్యునను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను.

               మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. "నాయనా! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును, నా ప్రేమను సాధించితిని. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".

                మృగశృంగుడును "స్వామీ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను, ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశామున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను". శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.

            కౌత్సుడు యింటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి, ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.

               భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మ్ణుడు  నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల, ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన యిద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల, ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి.

                   కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను, చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది.

                కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.

               కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను.

                  మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను, యముని దయవలన, సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి.

              జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన యినుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో, పాపముచేసిన వానిని పడవేయుదురు.

         మరియు  తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి.

            అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి, యిష్టదైవమును పూజించి, యధాశక్తి దానము, జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి.

               ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత? చనిపొయిన వారు మరల బ్రదుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును, సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా యిట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.

             యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది యితనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను.

                క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి యితడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను.

             ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.

మృగశృంగుని వివాహములు

              వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను, మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండౄలు తలచిరి.

                  మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ యిద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి.

                మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము, ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగ యిద్దరు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందులకు? అని వాదించిరి.

                ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.

                 కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయువివాహము బ్రహ్మవివాహము, యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు.

                ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు, ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగ్స్ చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వానికి వానిని గూడ వివరించెను.

                  దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కల వానికి మృకండుడని పేరు పెట్టెను.

                మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి యిష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను, మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.

            మృగశృంగుని మిగిలిన యిద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను.

                మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను, సర్వలాభములను పొందెను, మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక, అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు.

                 మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను.

               అతడొకనాడు యీ విధముగా తలపోసెను. "కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక, మనస్సునందలి కోరికలు నెరవేరెను, అనేకమంది కశీవిశ్వనాధుని దర్శనము చేసికొని, వారి యభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును.

              మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని, కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి, ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను.

                 ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు, తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి, దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను.

                ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని స్న్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా! అయినను వారు ముగ్గురును యీశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి.

             చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి.

              మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి, ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. "మహామునీ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు" డని పలికెను.

               అంత మృకండుడు నమస్కరించి "తండ్రి! మహాదేవా! తల్లి అనంపూర్ణా! ఇవే మా నమస్కృతులు, లోకరక్షకా! మీదయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నము.

                   సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను" అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు "మునిసత్తమా! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించెను.

                   మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడవాగి "హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని" అడిగెను.

          "అటులనే అగునుగాక!" అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా! పరమపూజ్యుడును, ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.

               మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు.

మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి.

             పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు.

              పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు.

              భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి.

          అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి.

              ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది.

                దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది.

            మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు.

             దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది.

               ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు.

                దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు.

          భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.

ఫలశ్రుతి:
            సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి.

                మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.

సర్వే జనాః సుఖినో భవన్తు!!

మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Thursday, 23 February 2017

మహాశివరాత్రి

మహాశివరాత్రి

   
             మహాశివరాత్రి ఒక  పండుగ. మహాదేవుడు శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకొనే పండుగ. ఇది మహాదేవుడికి పార్వతి కి వివాహం జరిగింది ఈ రోజు. మహా శివరాత్రి పండుగను కూడా ప్రముఖంగా 'శివరాత్రి' గా పిలుస్తారు. (అంతేకాక శివరాత్రి, సివరాత్రి, శైవరాతిరి, శైవవరాత్రి, మరియు శివరాతిరి అని కూడా పలుకుతారు) మరికొందరు  శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు

మహా శివరాత్రి ప్రాశస్త్యం

       మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది.  పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.

            చాంద్రమాన నెల లెక్క ప్రకారం, రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది.  ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్ర మైనది.

        పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి, సమర్పణలు ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు . రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు.

            అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది . పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ", శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.

             తపస్సు, యోగ మరియు ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి. ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర ధృవంలోని గ్రహ స్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి.

           మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాలు శక్తి ఈ రాత్రి గొప్పగా పెరుగుతుంది.

లింగోద్భవ వేళ

                   మహా శివరాత్రి రోజున, నిషితా కాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం. లార్డ్ శివ లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిషితా కాలం జరుపుకుంటారు. ఈ రోజున, అన్ని శివాలయాలు లో, అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు

          ఈ సంవత్సరం లిందోద్భవకాలం 24-02-2017 శుక్రవారం రాత్రి తెలవారితే శనివారం రా. 12గం..27ని..12సె నుండి 12గం..34ని..48సె పాటు లింగోద్భవకాలం.అందరం లింగోద్భవకాలంలో పరమేశ్వరున్ని ధ్యానించి అనుగ్రహం పొందుదాం.
                లింగోద్భవకాలంలో  కేవలం బిల్వదళం తో కూడిన శివలింగాన్ని దర్శిస్తేనే 76 జన్మల పాపం పోతుంది అని పార్వతీ దేవికి స్వామి వారే స్వయంగా చెప్పారని మన పురాణాలు చెపుతున్నాయి.

సంసార క్లేశ దగ్ధస్య వ్రతేనానేన శంకర
&ప్రసీద సుముఖో నాథ జ్ఞాన దృష్టి ప్రదోభవ



మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆది దేవో మహానిశి
శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమ ప్రభః
తస్మాచ్ఛివస్య యా రాత్రిః సమాఖ్యాతా శివప్రియా 
తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః” 

               మాఘ కృష్ణ చతుర్దశి అర్థ రాత్రి కోటి సూర్యుల కాంతితో ఆది దేవుడైన శివుడు లింగంగా ఉద్భవించాడు కనుక ఆ రాత్రి శివరాత్రి అని ప్రఖ్యాతమయింది అని ఈశాన సంహిత తెలియ చేస్తుంది.సత్యజ్ఞానానంత స్వరూపమైన సనాతన పరబ్రహ్మ సనాతనుడు. నిర్గుణ పరబ్రహ్మ అయినా సగుణుడు.

                 నిర్వికార సచ్చిదానంద స్వరూపుడు. సృష్టి స్థితి లయ కర్త అయిన పరమాత్మ ఆయా కార్య నిర్వహణార్థమై బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా విడివడ్డాడు. అటువంటి అద్వితీయము, నిత్యము, అనంతము, పూర్ణము, అసంగము అయిన ప్రకృతి పురుషాతీతుడయిన ఈపరతత్త్వాన్నే ‘శివుడు’ అని చెప్పింది శివపురాణం.

“ శం నిత్యసుఖమానంద మికారః పురుషః స్మృతః 
వకారశ్శక్తి రమృతం మేలనం శివ ఉచ్యతే
తస్మాదేవం స్వమాత్మానం శివం కృత్వార్చయే చ్ఛివం”

              అని శివ శబ్దానికి నిర్వచనం ఇవ్వటం జరిగింది. ‘ శం’ నిత్యసుఖం. ‘ ఇ’ కారం పురుషుడు. ‘ వ’ కారం శక్తి. వాటి కలయిక అమృతం. శివ అన్న మాటలో ఉన్న ‘ శ్’, ‘ఇ’, ‘ వ’ అనేవి విడివిడిగా నిత్యసుఖాన్ని, పురుషుని, శక్తిని సూచిస్తాయి. కలిసినపుడు ఏర్పడిన ‘శివ’ అనే శబ్దం అమృతత్త్వాన్ని సూచిస్తుంది.

                అందు చేత ఒక్కసారి ‘ శివ’ అంటే ఈభావాలనన్నింటిని తలచుకున్నట్టే. శివ శబ్దానికి శుభం, మంగళము అనే అర్థాలున్నాయి కనుక శివుడు అంటే శుభప్రదుడు, మంగళప్రదుడు అని అర్థం. అటువంటి శివుని అర్చించటానికి తాను శివుడయి ఉండాలి అని చెప్పబడింది.
                   అవ్యక్తుడు, నామరూపాతీతుడైన పరమాత్మ బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతల కోరిక మీద అందరు సేవించుకునేందుకు అనువుగా, వారిని అనుగ్రహించి, లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు. దానిని దేవతలు శివుని పుట్టిన రోజుగా జరుపుకుంటూ, శివ పార్వతుల కల్యాణం చేయటమనే సంప్రదాయం ప్రారంభించారు. ఆ శుభ సమయాన్ని ‘ శివరాత్రి’ అనే పేరుతో జరుపుకుంటాము.
                     ఈ ఒక్క రోజు మాత్రమే శివుణ్ణి రాత్రివేళ అర్చించటం ఉంది. సాధారణంగా దైవాన్ని పురుష రూపంగా అర్చించవలసింది పగటి పూట. రాత్రి అమ్మవారిని ఆరాధించటానికి తగిన సమయం. తను అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు కనుక ఈ ఒక్క నాడు తనని రాత్రి అర్చించటానికి అనుమతి ఇవ్వమని అడిగితే బదులుగా తొమ్మిది రోజులు పగటి పూట పూజలు పొందే అవకాశం ఇవ్వమని అడిగిందిట పార్వతీ దేవి. అందుకని నవరాత్రులలో అమ్మవారికి రాత్రి తో పాటు పగటి పూజలు కూడా ఉంటాయి. తొమ్మిది పగటి పూజలనిచ్చి పొందిన ఒక రాత్రి పూజ కనుక శివరాత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
            మహా శివరాత్రి శివ మరియు శక్తి యొక్క వివాహం సంబంధం ఉంది.పురాణములు ప్రకారం ఈ రోజు మహాదేవుడు కి యొక్క ఇష్టమైనది అని సూచిస్తుంది మరియు శివుడు కూడా తన గొప్పతనాన్ని యొక్క వెలుగును విసురుతాడు మరియు సనాతన హిందూ ధర్మంలో దేవీ, దేవతల మీద ఈశ్వరుడు తన యొక్క ఆధిపత్యాన్ని (ప్రదర్శించుతాడు) చూపుతాడు.మహాదేవుడు 'తాండవం', విశ్వ నృత్యం చేసినప్పుడు, మహా శివరాత్రి రోజున రాత్రి జరుపుకుంటారు.

హాలాహలం సేవనం

            సముద్ర మథనం యొక్క మరొక పురాణం ప్రకారం, సముద్ర మథనం యొక్క ఉత్పత్తులలో ఒకటి అయినటు వంటిది హాలాహలం ఉద్భవించింది. శివుడు ఆ హాలాహలం మొత్తం తీసుకోవడంవలన, హాలాహలం యొక్క ఘోరమైన ప్రభావాలు నుండి ప్రపంచం మొత్తం రక్షించడం జరిగింది. శివుడు తన యోగ అధికారాలు ద్వారా తన గొంతులో హాలాహలం ఖైదు చేయుట వలన అది తన గొంతు కిందకు వెళ్ళలేదు.

         ఆయన మెడ ఆకారణంగా తన గొంతు హాలాహలం ప్రభావంతో నీలంగా మారినది మరియు ఇక మీదట ఆయన కూడా నీలా కాంతుడు, నీలకంఠం లేదా నీలకంఠుడు అంటారు ప్రపంచ నాశనం ఎదుర్కొంటున్నకథ ఆ సంబంధంలో దేవత పార్వతి అది కాపాడే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరో కథనం.  మహాదేవుడు ఈశ్వరుని  ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయేవిధంగా దేవత పార్వతి ప్రార్థించారు


శివుడు ఇష్టమైన రోజు

         భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత, భక్తులు మరియు ఆచారాలు పాటించేవారు మరియు పార్వతి దేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు. అందుకు శివుడు జవాబుగా, అమావాస్య 14 రాత్రి, ఫాల్గున నెలలో కృష్ణ పక్షంలో, తన అభిమాన రోజు అని బదులిచ్చాడు. పార్వతి, ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది. వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది.

మహా శివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

             గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు.

              ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.

          అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.


బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

       ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు.

          ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను.

            పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

            ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు.

            బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది.

            ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్య లొ ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో   సాష్టా0గం   ప్రణమిల్లుతారు.

            అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు.

        యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.

            విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి.

          ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు.

            అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు.

                అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శిక్ష మరియు వరము

శివ పురాణం, విద్వేశ్వర సంహితలోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.

ఈశ్వర ఉవాచ

అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకథురం శిశో!!
వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!!
నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ........

            శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి.

            ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, "ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము.

            ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును" అని వరమిచ్చెను.

మొగలి పువ్వుకు శాపము

         ఆతరువాత కేతకీపుష్పము (మొగిలి పుష్పం) వైపు చూసి, అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది.

              దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

              అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు;

             కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

మహాశివరాత్రి వ్రత కథ

            ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

                ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను.

               దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

              మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను.

            హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము.

              మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

             రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

             మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను.

             అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

            ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.

              "ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

             అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము.

             దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

                ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.

శివరాత్రి పూజా విధానాలు

             ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

            ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

1. శివరాత్రి ఉపవాసం

              శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి.

              మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం లో చెప్పబడింది.

                శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతం లో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో అంటాడు.

శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!

             శివరాత్రి నాడు అంటే మాఘ కృష్ణ చతుర్థినాడు ఎవరైతే శివపూజ చేస్తారో, వారు మరొకసారి తల్లి పాలను తాగ లేరని అర్థం. అంటే వారు శివపూజా ఫలం వల్ల జన్మాంతం లో శివైక్యం పొంది మళ్ళీ జన్మ ఉండదని భావం.

2. ఉపవాస విశిష్టత : 

ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ ||

                వరాహోపనిషత్తు లో గల ఈ శ్లోకం ఉపవాసానికి అర్థాన్నిచెబుతోంది. జీవుడు పరమాత్ముని సామీప్యం లో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవల భాగవదారాధనే ఉపవాసం అంటే. భవిష్యపురాణం లోనూ ఇదే అభిప్రాయం చెప్పబడింది.

3. ఉపవాసం ఎలా చేయాలి..?

                సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసుల తో చేసిన పదార్థాలు తినకూడదు. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడాలి. పాలూ పండ్లూ తినవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహారం మీదకి దృష్టి పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం.

              ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కాబట్టి సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వలన మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసం తో మందకొడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయం లో తినకూడదు.

             ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అన్నారు పెద్దలు. అంటే ఎటువంటి ధర్మకార్యాలకైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ప్రాథమిక అవసరం.

జాగరణము

            జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును.

         ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున వుపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్

రుద్రాభిషేకం

వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్ర0

            పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

ప్రధాన వ్యాసము: మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రము. దీనినే "త్రయంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

శివసహస్రనామస్తోత్రం

శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి