Thursday, 6 April 2017

సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు.

రేపు అనగా 07.04.2017 శుక్రవారము ఏకాదశి

    కామదా ఏకాదశి

           పాపవిమోచన ఏకాదశి ని  చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది.స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.

       స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమే అయినా ... దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా 'కామదా ఏకాదశి వ్రతం' కనిపిస్తుంది.
       చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే 'కామదా ఏకాదశి' అని ... 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.
       కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.
       వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు. భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది. అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.
 మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

కాల ప్రమాణము

కాల ప్రమాణము

           ధర్మం కాలాన్ని అనుసరించి మారుతూవుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు త్వరగా భోజనం చేయటం ధర్మం. సూర్యోదయానికి ముందు నిద్రలేవటం ధర్మం, రాత్రిపూట పడుకోవటం ధర్మం. మనిషితన ధర్మాన్ని కాలానుగుణంగ ఆచరించటానికి వేదాలలో కాలవిభజన ఇలా చేయబడింది

పరమాణువు (అతిసూక్ష్మమైన కాలకొలమానము) - 26.3µs (మైక్రోసెకండ్స్ ఆంటే సెకనులో 10,00,000 వ వంతు)
2 పరమాణువులు - 1 అణువు (2 *26.3µs = 52.6µs)
3 అణువులు - 1 త్రసరణువు (3 * 52.6µs = 158µs)
3 త్రసరణువులు - 1 తృటి (3 * 158µs = 474µs)
100 తృటిలు - 1 వేద (100 * 474 µs = 47.4ms (మిల్లిసెకండ్స్ ఆంటే సెకనులో 1000 వ వంతు))
3 వేదలు - 1 లవ (3 * 47.4ms = 0.14s (సెకండ్స్))
3 లవలు - 1 నిమిషా (3 * 0.14s = 0.43s)
3 నిమిషాలు - 1 క్షణ (3 * 0.43s = 1.28s)
5 క్షణాలు - 1 కస్త (5 * 1.28s = 6.4s)
15 కస్తలు - 1 లఘు (5 * 6.4s = 1.6 min(నిమిషాలు))
15 లఘులు - 1 దండ (15 * 1.6min = 24min)
2 దండలు - 1 ముహూర్తం( 2 * 24min = 48min)
30 ముహూర్తాలు - 1 అహోరాత్రం(1 రోజు)(24గంటలు)
30 అహోరాత్రాలు - 1 మాసం(1 నేల/month, 30 రోజులు)
2 మాసాలు - 1 ఋతువు(season)(2నెలలు/months,60 రోజులు)
3 ఋతువులు - 1 ఆయనం (6నెలలు/months, 180 రోజులు)
2 ఆయనాలు - 1 సంవత్సరం (12నెలలు/months, 360 రోజులు)
1 సంవత్సరం (12 నెలలు/months, 360 రోజులు) - 1 రోజు దేవతలకి,
మనుష్యుల 1సంవత్సరం దేవతలకి 1రోజు, ఉత్తరాయణం(సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన లగాయతు కర్కాటకరాశిలో ప్రవేశించే వరకు) దేవతలకి పగలు, దక్షిణాయనం(సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించిన లగాయతు మకరరాశిలో ప్రవేశించే వరకు) దేవతలకి రాత్రి.
360 దేవత రోజులు(360 మనుష్య సంవత్సరాలు) - 1 దివ్య సంవత్సరం(అంటే దేవతలకి ఒక సంవత్సరం)

71(71 * 360 = 25560 మనుష్య సంవత్సరాలు) దివ్యసంవత్సరాలు కలిపి - 1 మన్వంతరం, అంటే ఒక మనువు జీవిత కాలం, ఇది ఇంద్రుడి పదవి కాలము కూడా.
14 మన్వంతరాలు - 1 కల్పం
2 కల్పాలు - 1 బ్రహ్మకి ఒక రోజు. బ్రహ్మదేవుడు తన ఒక రోజులో 28 (28*71*360 = 715680 మనుష్య సంవత్సరాలు) మంది ఇంద్రులను చూస్తాడు. ఇలాంటివి 360 రోజులుకలిపి బ్రహ్మదేవుడుకి ఒకసంవత్సరం.

ఇలా బ్రహ్మ గారి ఆయుర్దాయం 108 సంవత్సరాలు(108 * 360 * 28 * 71 * 360 = 27,82,56,38,400 మనుష్య సంవత్సరాలు). బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తిఅయితే ప్రళయంసంభవిస్తుంది, దీన్నిప్రాకృతికప్రళయంఅంటారు.

          ఇటువంటిప్రళయంజరిగేదాక వున్నకాలం అంతాకలిపి ఎన్నికోట్లమనుష్యసంవత్సరాలు అవుతుందో అదంతా శ్రీమహాకామేశ్వరాంకనిలయ శ్రీలలితాపరాభట్టారికకి ఒకరెప్పుపాటుకాలం.

           ధర్మం కాలాన్ని అనుసరించి మారుతూవుంటుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు త్వరగా భోజనం చేయటం ధర్మం. సూర్యోదయానికి ముందు నిద్రలేవటం ధర్మం, రాత్రిపూట పడుకోవటం ధర్మం. మనిషితన ధర్మాన్ని కాలానుగుణంగ ఆచరించటానికి వేదాలలో కాలవిభజన ఇలా చేయబడింది

యుగాలు

         యుగాలు నాలుగు, అని మనపురాణాలలో చెప్పబడినది, అవి

కృతయుగము (4800 దివ్యసంవత్సరాలు అంటే 1728000 (4800 * 360) మనుష్య సంవత్సరాలు )

త్రేతాయుగము (3600 దివ్యసంవత్సరాలు అంటే 1296000 (3600 * 360) మనుష్య సంవత్సరాలు )

ద్వాపరయుగము (2400 దివ్యసంవత్సరాలు అంటే 864000 (2400 * 360) మనుష్య సంవత్సరాలు )

కలియుగము (1200 దివ్యసంవత్సరాలు అంటే 432000 (1200 * 360) మనుష్య సంవత్సరాలు )

ఈ నాలుగుయుగములను కలిపి ఒకమహాయుగము (లేదా చాతుర్ యుగము) అనిపిలుస్తారు. ఒకమహాయుగం 12,000 దివ్యసంవత్సరాలు.

మన్వంతరాలు

స్వాయంభువ మన్వంతరం
సప్తమహర్షులు – మరీచి,అత్రి,అంగీరసుడు,పులహుడు,క్రతువు,పులస్త్యుడు,వశిష్టుడు
యములు అనబడే వాళ్ళు దేవతలు
యజ్ఞుడు ఇంద్రుడు

స్వారోచిష మన్వంతరం 
సప్తమహర్షులు – ఊర్జస్తంభ,పరస్తంభ,ఋషభ,వసుమంత,జ్యోతిష్మంత,ద్యుతిమంత,రోచిష్మంత
తుషితులు అనబడే వాళ్ళు దేవతలు
రోచను ఇంద్రుడు

ఉత్తమ మన్వంతరం 
సప్తమహర్షులు – వశిష్టుడు,కాకుంది,కురుంది,దలయ,శంఖ,ప్రవంహిత,మిత,సమ్మిత
సత్య,వేద,శ్రుతాదులు అనబడే వాళ్ళు దేవతలు
సత్యజిత్తు ఇంద్రుడు

తామస మన్వంతరం 
సప్తమహర్షులు – గార్గ్య,పృథు,వాగ్మి,జన్య,ధాత,కపినక,కపివంతుడు
సత్యులు అనబడే వాళ్ళు దేవతలు
త్రిశంఖుడు ఇంద్రుడు

రైవత మన్వంతరం 
సప్తమహర్షులు – దేవబాహుడు,జయముని,వేదశిర,హిరణ్యరోమ,పర్జన్య,ఊర్ధ్వబాహు,సుధాముడు
భుతరజస్కులు అనబడే వాళ్ళు దేవతలు
విభువన ఇంద్రుడు

చాక్షుష మన్వంతరం 
సప్తమహర్షులు – సుమేధ,విరాజ,హవిష్మత్,ఉత్తమ,మధు,అభినామ,సహిష్ణు
అప్యయనులు అనబడే వాళ్ళు దేవతలు
మంత్రద్రుమ ఇంద్రుడు

వైవస్వత మన్వంతరం (ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరం)
సప్తమహర్షులు – కశ్యపుడు,అత్రి,వశిష్టుడు,విశ్వామిత్రుడు,గౌతముడు,జమదగ్ని,భరద్వాజుడు
ద్వాదశ అదిత్యులు,ఏకాదశ రుద్రులు,అష్ట వసువులు,అశ్వనీదేవతలు(వీళ్ళు ఇద్దరు) మొత్తం ౩౩ దేవతలు
పాకశాసనుడు ఇంద్రుడు

సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు – దీప్తిమత,గాలవ,పరశురామ,కృపా,ద్రుని,వ్యాస,ఋష్యశృంగ
సుతపులు దేవతలు
బలి ఇంద్రుడు

దక్ష సావర్ణి మన్వంతరం
సప్తమహర్షులు – సావన,ద్యుతిమంత,భవ్య,వసు,మేధాత్థీ,జ్యోతిష్మంతుడు,సత్య
మరీచిగర్భులు దేవతలు
అద్భుత ఇంద్రుడు

బ్రహ్మ సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు/ఋషులు – హవిష్మంతుడు,సుకృతి,సత్య,అపామూర్తి,నాభాగ,అప్రతిమౌజా,సత్యకేత
సువసనులు దేవతలు
శంభు ఇంద్రుడు

ధర్మ సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు – నిశ్చర,హవిష్మంతుడు,అగ్నితేజ,వపుష్మంతుడు,విష్ణు,అరుణి,అనఘ
విహంగములు దేవతలు
వైద్రితుడు ఇంద్రుడు

రుద్ర సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు – తపస్వి,సుతప,తపోముర్తి,తపోఅర్తి,తపోద్రితి,తపోద్యుతి,తపోధన
హరితులు దేవతలు
ఋతధామడు ఇంద్రుడు

దేవ సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు – నిర్మోహ,తత్వదర్శన,నిష్ప్రకంప,నిరుత్సుక,ద్రితిమతి,అవ్యయ,సుతప
సుకర్మ దేవతలు
దివస్పతి ఇంద్రుడు

ఇంద్ర సావర్ణి మన్వంతరం 
సప్తమహర్షులు – అగ్నిబాహు,శుచి,శుక్ర,మాఘద,గ్రిధ్ర,యుక్త,అజిత
పవిత్రులు,చాక్షుషులు దేవతలు
శుచి ఇంద్రుడు
మీ
వి.
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday, 4 April 2017

శ్రీరామనవమి

శ్రీరామనవమి'


              శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.

           ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

            రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు.
            ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు.

           చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

                ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఉత్సవంలో విశేషాలు

              ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

          ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.ఈ సందర్భంగా ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.

         తెలంగాణా రాష్ట్రం  భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

             ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

              దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది.

              శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

            శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

"ర" అక్షరం ప్రాముఖ్యత :

           చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది.

 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అధికారిక రామాలయం ఒంటిమిట్ట

        కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.
         ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.

ఆలయ చరిత్ర

              ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది.

             ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది.
             ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో శ్రీరామ, సీత, లక్ష్మణ చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం

         ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.
            ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు.

              వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

              చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే.

          ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

            ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు.

         అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది.

            ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.

            ఒంటిమిట్ట శ్రీ రామాలయం లో సుమారు 100 సంవత్సరాల కృతం బ్రిటిష్ దొరలు మనల్ని పాలిస్తున్న రోజుల్లో జరిగిన యదార్థ సంఘటన కి కధా కల్పన.  ఆ రోజుల్లో ఆ రామాలయం కి అంత రద్దీ ఉండేది కాదు.ఎప్పుడో ఒకరు ఇద్దరు వోచి వెళ్ళే వాళ్ళే కానీ రామ దాసయ్య కి మాత్రమ్ రోజూ రామయ్య ని కలిసి రామయ్య సీతమ్మ కి ఇంత తనకు దోరకిన తిండి, అదీ ఎవరో దానము చేసింది తీసుకు వొచ్చి వారి ముందు పెట్టి తినమని పెట్టి తిన్నట్టు భావించి తను కూడ తిని కాసేపు కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవాడు.

           అతని చిరిగిన దుస్తులు, చింపిరి జుట్టు వాలకం చూసి పీచ్చోడు అనుకోనేవారు చాలమంది. చాలా కాలం ఇలా జరుగుతుంటే ఓ రోజు కడప జిల్లా ను పాలించే ఆంగ్లేయ జిల్లా పరిపాలనాధికారివారికి ఈ ఆలయం గురించి తెలిసి చూడాలని సంకల్పించారు. అంతే రాజు తలచుకొంటే దేనికి కరువు ఇక క్రింద పనిచేసే ఉద్యోగుల హడావుడి చెప్పక్కర్లేదు వెంటనే హుటాహుటిన ఆలయానికి బయల్దేరారు.
           ఆ రోజు రామ దాసయ్య కి ఆహారం ఎక్కడా దొరక లేదు..ఓ పక్కన ఎండ మండించేస్తోంది..ఆహారం దొరక లేదు. ఓ ముద్ద పెట్టే తల్లే కనబదదేమి. అయ్యో నా రామయ్య కి ఆకలేస్తోన్దో ఏమిటో? అసలే సుకుమరుడు. ఆపై సీతమ్మ తల్లి ఏడు మల్లెల ఎత్తు సుకుమారి. ఎంతో ప్రయత్నిస్తే సుమారు మిట్ట మద్యాహ్నం 2:30 కి కాసింత ముద్ద దొరికింది.
            ఇక క్షణం ఆలస్యం చెయ్యలేదు తను..పరుగు పరుగున ఎలా వొచ్చి పడ్డాడో ఆ రామయ్య కె తెలుసు ఆలయం చేరేసరికే సుమారు సాయంత్రం 3 అవుతోంది..విస్తరి లో చుట్టి పట్టుకొచ్చిన అన్నము గబగబా స్వామి ముందు ఉంచి నీళ్ళు పట్టుకొచ్చే లోపల ఎప్పుడు వొచ్చేరో తెలీదు బిలబిలమంటూ కలెక్టరు దొరగారి అధికారులు, బంట్రోతులూ వొచ్చి తనను అక్కడ నుంచి  వెళ్ళిపోవాల్సింది గా ఆదేశించడం తరిమేయ్యడ0 గుడి శుభ్రం చెయ్యడం ఇలా చక చకా చేస్తూ తను స్వామికి కనీసం ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ఆరగిన్పు పెట్టనైన పెట్టనివ్వకుండా గెంటి వెయ్యడం జరిగింది..

           రామదాసయ్య కన్నీరు మున్నీరుగా గా ఏడుస్తూ అయ్యో నా రామయ్య కి నోటి ముందు పెట్టిన కూడు లాగేసారే ఎంత బాధ పడుతున్నాడో నా చిట్టి తండ్రి, అది చూసీ నా సీతమ్మ మనసు ఎంత తల్లడిల్లిపోయిందో అని బరువెక్కిన గుండె తో ఆలయం వెనక బాగము నుంచి వెళ్ళి పోతున్నాడు విలపిస్తూ ఆ పిచ్చి భక్తుడు.

             తనని తరిమేసినన్దుకు కాదు తెచ్చిన ముద్ద నా స్వామి కి తినిపించలేక పోయానే అనే భాధ తట్టుకోలేకపోతున్నాడు. ఇది ఇలా ఉండగా దొర గారు సాయంత్రం వేళకి రానే వొచ్చేరు.  పురోహితులు  దోరగారికి పూర్ణ కుంభం తో స్వాగతం పలకడం, ఆలయం ముందు మంత్రాలు చదువుతూ ఓ సారి గుడి తలుపులు తీసి నిర్ఘాంతపోయారు.
              అది చూసీ కలెక్టరు గారు లోనికి తొంగి చూసి ఏమీ జరుగుతోందో కూడా తెలియక తికమక తో నోట మాట రావడం లేదు..ఇక చుట్టూ ఉన్న ఉద్యోగుల పరిస్తితి చెప్పక్కర్లేదు. దొరగారు ఇక ఉండబట్టలేక అడిగేసారు అదేంటి సీతా రాముల విగ్రహాలు ముందు వైపు వీపు చూపిస్తూ ఆలయం వెనుకకు చూస్తున్నాయి.అని పూజారులు లేదు ప్రభూ ఈ రోజే ఇది జరిగింది ఎందుకో.స్వామి కి ఆగ్రహం కలిగింది.
           అసలు ఈ రోజు ఏం జరిగిందో సరిగ్గా తెలిస్తే గానీ అసలు దీనికి కారణమ్ భోధ పడదు అన్నారు. అంతా కలసి అనేక తర్జనభర్జనల తర్వాత రామదాసయ్య నైవేద్యం స్వామి కి పెట్టనీయకున్దా తరిమి వెయ్యడం అంతా గుర్తు తెచ్చుకొన్నారు. దాంతో తమ ఉద్యోగులు చేసిన నిర్వాకానికి దోరగారికి తీవ్ర ఆగ్రహం వొచ్చి వొళ్ళు మండి వారిని  తిట్టి ఆ మహాత్ముడు మహా భక్తుడు ఎక్కడున్నా వెతికి ఎంతో గౌరవప్రదము గా తీసుకొని రమ్మని రాకుంటే తనే వెళ్ళి స్వయం గా తీసుకు రాదలిచానని చెప్పాడు.

             వెంటనే ఆ మహా భక్తున్ని తీసుకువచ్చి జరిగింది చెప్పి క్షమాపణలు కోరి పూజారులు చేసిన నైవేద్యాన్ని ఆయనకి ఇచి స్వామీని మీరే పిలవండి మామూలు గా అవుతారు స్వామి.మీరే మాచే ఆపబడిన నైవేద్యాన్ని స్వామీ కి తినిపించినాకే మేము ఆయన దర్శనం చేసుకొంటాము అన్నారు. రామ దాసయ్యకి జరిగింది ఓ కలలా ఉంది నిజమా నా రామయ్యకి నేను తెచ్చిన నైవేద్యాన్ని పేట్టనివ్వలేదని ఇంత పని చేసాడా? ఆఖరికి ఎవ్వరికీ దర్శనము కూడా ఇవ్వకుండా అలిగి వెనక్కి తిరిగి నిలబడ్డారా నా రామయ్య సీతమ్మ లక్ష్మయ్యా ఎంత సుకృతం.
              ఆనందభాష్పాలతో నిండిన కళ్ళు తుడుచుకొని స్వామీ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇక తిను అన్నాడు అంతే స్వామీ ఒక్కసారిగా దేవేరి, సోదరుడి తో కలసి ముందుకు తిరిగాడు. ముందు ఉంచిన నైవేద్యం లో ఒక్క మేతుకూ లేకుండా మాయమయ్యిన్ది చూసావా నా స్వామి,తల్లి, లక్ష్మయ్యా  ఎంత ఆకలితో ఉన్నారో అనుకొన్నాడు..స్వామీ సంతోషించి అందరికీ దివ్య మంగళ దర్శనము ఇచ్చాడు.

          కలెక్టరు గారికి స్వామీ మహిమ భోధ పడింది. వెంటనే రామ దాసయ్య కు అక్కడే భోజన ,వసతి సౌకర్యాలు కల్పించి మొట్ట మొదటి ధర్శన నైవేద్య సేవా భాగ్యాన్ని కల్పించి సంతోషం తో తిరిగి ప్రయాణమయ్యాడు.

( ఈ కధ సరిగ్గా ప్రాముఖ్యం పొందలేదు మొదట సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి అక్కడ శ్రీరామ నవమి జరిగిన సందర్బం లో

పూజలు, ఉత్సవాలు
              ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

స్థల పురాణం

            రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.


       రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

       ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

            ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి,

         శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు.
          మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట.

             అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు
                దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

వడపప్పు పానకం
           శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు.

            శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

          ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం. పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని పోషకాలను అందిస్తూ ఉంటాయి.

          జీర్ణ సంబంధమైన మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత  పిత్త కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

                 మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

             పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం.

             పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

👏శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

👏సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Saturday, 1 April 2017

ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్ట వ్రతం.....!!

ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్ట వ్రతం.....!!

వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత వుంది.

          ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో మన పూర్వీకులు చెప్పారు.

01. ఆదివారం
            చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు.
           అయితే దీనిని ఒక వ్రతంలాగా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం
           ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి.

             ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

02. సోమవారం
                 అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం
             చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి.

             ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపురంగు వస్తువులను దానం చేయాలి.

03. మంగళవారం:
                ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవార వ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం
                ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్దిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, ఋణబాధలు ఉపశమిస్తాయి.
                రాగిపాత్ర, ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరాన్నిలేదా మూలమంత్రం పఠించాలి.

04. బుధవారం
                 స్థితికారకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం

             ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసే వారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో వుండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి.

            పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్ధాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

05. గురువారం
              మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివౄఎద్దిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, సాయినాథాడు, రాఘవేంద్రస్వామి, దత్తాత్రే యుడు లేదా తమ గురువును ఆరాధించాలి.

           గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకో వాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం

            ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ళపాటు చేయాలి. స్నానా నంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచు లోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిసిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజిం చాలి.

             అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకపూట తప్పనిసరిగా ఉపవాసం వుండి, స్వామికి నివేదించిన పదార్ధాలను స్వీకరించాలి.

06. శుక్రవారం
              దుర్గ, లక్ష్మి, సంతోషిమాతా, గాయత్రి తదితర దేవతల అనుగ్ర హాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం

            ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లప క్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

07. శనివారం
                శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహువు, కేతువు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం

             శ్రావణమాసం లేదా పుష్యమా సంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచ రణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వు లనూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి.

             నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాప నగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.

                 ఏ పూజ, వ్రతం చేసేటప్పుడైనా ఫలితం కోసం కాకుండా శ్రద్దాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మచర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా వుండాలి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం వివరణ:

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం వివరణ:

నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||

           అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.

           సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి. ఇది వైష్ణవీరూపం ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి సంకేతాలు.

నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||

         గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.

          విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో "గరుడో పరిసంస్థితా" అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు.

           ఆకాలంలో చైత్రవంశీయుడైన 'సురధుడు' అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు. కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది. కనుక కోలాసుర భయంకరి అయింది. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.

సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

            సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు

         అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ 'సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది. బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.

సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||
సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము.

          అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది . అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది. కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత. అన్ని మంత్రాలూ 'శ్రీం' బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.

ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

         ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

         అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది. ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు. సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది. అమ్మ 'యోగం' వల్ల సంభవించింది. 'యోగ'మంటే ధ్యానం. ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ "యోగజ", "యోగసంభూత" అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ "మహేశ్వరి" అనగా జ్ఞానస్వరూపిణి.

స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

     స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

          లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి. హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది. భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం. ఇది రజోగుణాత్మకం. యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం.

          ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం. ఇది రౌద్రం. ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి. అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.

పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

           లక్ష్మి పద్మం నుండి జనించింది. పద్మంలోనే నివసిన్స్తుంది. పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది. నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి.
           పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి. అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.

శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

          తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

           మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి.
              అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే ! అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !

ఫలశ్రుతి

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||

           ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు. రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు.

            మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం - పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది. శుభాలు కల్గిస్తుంది.

           ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం. భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది. సర్వం మహాలక్ష్మీ ఆధీనం. ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు. కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు.
              వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
ధ్వజస్తంభం 🌷 ప్రాముఖ్యత ⚘

           ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు.

            ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి.

            నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.

           ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు.

            మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు.వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు.

             ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు.

             ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి.

          పలాస - మోదుగ, అశ్వత్థ - రావి, బిల్వ - మారేడు, బంధూకం - వేగిస, పనస - పనస, వకుళ - బొగడ, అర్జున - మద్ది వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి. పాడైపోయినవి, ఛిద్రమైనవి, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు.

          ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మయంత్రం వేయాలి. వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడు వరసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్నిమేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి.

            ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారుచేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు. ఈ తొడుగును మేఖలకు కూడా వేస్తారు. మేఖల కింద సుదర్శన చక్రం (వైష్ణవాలయాలలో), నందీశ్వరుడు (శివాలయాలలో) ఉంటాయి.

           గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం.దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి.

             ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే. లోపలుండే మూలవిరాట్టుకు ఉత్సవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటిదే. దారురూపంగా దీన్ని భావించాలి. మూలవిరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి.

            ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తరువాత మళ్లీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు.

           దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం .

                 ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

ఈ రోజు అనగా 02.04.2017 న షష్టి దీనినే స్కంద షష్టి – షష్ఠి ప్రాశస్త్యముః


ఈ రోజు అనగా 02.04.2017 న షష్టి దీనినే స్కంద షష్టి 

సుబ్రహ్మణ్య జననము – షష్ఠి ప్రాశస్త్యముః

           అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సురస్థిరసాధ్య విద్యాధరాదులు, తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు, అది ఏమిటంటే, పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని, తారకాసురుడు, దేవతలందరినీ బాధపెడుతున్నాడు.

          మహాదేవుడు కి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అందుకోసం, దేవతలందరూ కలిసి, సత్యలోకానికి వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు…"బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.

         అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది, పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే, ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి, దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి "దేవాదిదేవా! ప్రభూ మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు.

             దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడింది కాబట్టి, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది,తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై, దేవతలందరినీ శపిస్తుంది, నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.

          అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది.

              శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుటం కోసం శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచపర్వతాన్ని భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు.

          అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు 'షణ్ముఖుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి 'కార్తికేయుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.

            ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. ఓ సనత్కుమారా నీ తపస్సు మాకెంతో నచ్చినది కాబట్టి నీకె వరం కావాలో కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది.

          ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు. అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ''ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు” అని చెప్తాడు.

        నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే

                ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవ సేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం 'శ్రీ సుబ్రహ్మణ్య షష్టి'. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.


బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి !

                త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు  నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.

నెమలి వాహనం,కోడి ధ్వజం...

            తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.

వల్లీ...దేవసేనలు.....

         శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవ సేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.

కావడి మొక్కులంటే ఇష్టం.

              పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. 

                  కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

                 సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.

బ్రహ్మచారికి పూజ

               సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

వీటికి తోడు ఈరోజు"శరవణభవ"అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.

షదాననం చందన లేపితాంగం
మహారసం దివ్య మయూర వాహనం
రుదస్య నూనుం సురలోకనాథం
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.

సుబ్రహ్మణ్య కవచం

సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః 

దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం, 
సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం 

సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః 
గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః 

శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం, 
నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ 

ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ, 
ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం 

దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః, 
కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్ 

హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ, 
హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత 

నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత 

జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి

సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు, 
దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే 

తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే

దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్ 

య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్, 
తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం 

ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్ 

యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా

సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ 

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం, 
సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్


సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందీ

           ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామంకూడా వుంది. సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె  అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది.

         అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా వుంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.

షష్టి దేవి స్తోత్రం / మంత్రం
ధ్యానం

సుపుత్రదం చ శుభదం దయా -రూపమ్ జగత్ -ప్రసూ!
శ్వేత-చంపక-వర్నాభాం రత్న భూషణ-భూషితాం !
పవిత్ర-రూపం పరమం దేవసేనం పరం భజే !!
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురొహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

Friday, 31 March 2017

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి) మరియు నాగపూజ శ్రేష్ఠం

లక్ష్మీ పంచమి ప్రత్యేకత (చైత్రశుద్ధ పంచమి) మరియు
నాగపూజ శ్రేష్ఠం

       ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది. అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.
       అలాంటి లక్ష్మీదేవిని 'చైత్రశుద్ధ పంచమి' రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
       ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఈ చైత్ర శుద్ధ పంచమి నాడు నాగపూజ శ్రేష్ఠం

          ఈ మాసమంతా ఆధ్యాత్మిక సాధనలకు చాలా విశేషం. మొదటి తొమ్మిదిరోజులు అత్యంత ప్రధానమైనటువంటివి.
చైత్ర శుద్ధ పంచమి నాడు నాగపూజ శ్రేష్ఠం. “అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ” అని మహానాగులను స్మరించి పాలు, నెయ్యి నివేదించాలి.

అనంతం వాసుకిం చైవ కాళీయం చ ధనంజయం
కర్కోటకం తక్షకం చ పద్మ మైరావతం తథా!!

మహాపద్మం చ శంఖుం చ శంఖం సంవరణం తథా
ధృతరాష్ట్రం చ దుర్ధర్షం దుర్జయం దుర్ముఖం బలం!!

గోక్షం గోకార్ముకం చైవ విరూపాదీంశ్చ శౌనక
న తేషాం ప్రవరాశ్చైవ యావత్యః సర్పజాతయః!!

కన్యకా మనసా దేవీ కమలాంశ సముద్భవా
తపస్వినీనాం ప్రవరా మహా తేజస్వినీ శుభా!!

యత్పతిశ్చ జరత్కారుః నారాయణ కులోద్భవః
ఆస్తికః తనయో యస్యాః విష్ణు తుల్యశ్చ తేజసా!!

ఏతేషాం నామమాత్రేణ నాస్తి నాగభయం నృణాం
కద్రూ వంశో నిగదితః వినతాయాః శృణుష్వమే!!

నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమో నిశి నమోస్తు నర్మదే తుభ్యం త్రాహి మాం విషసర్పతః అస్సేతిం చార్తసిద్దిమ్చ సునీతిం చ యః స్మరేత్ దివా వా యది వా రాత్రౌ నాస్తి సర్పభయం భవేత్ .!!
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు..?

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు..?

కార్యసాధనామంత్రములు:-  ఏడు విధములైన  కోరికలు నెరవేరుటకు  మంత్రములు ఇక్కడ పొందు పరచుచున్నాను.

1.    మం\\  ఓం క్లీం హ్రీం రుం ద్రుః ఘ్రీం హ్రీం భైరవాయ నమః ||

 ఈ మంత్రమును 24000  పర్యాయములు జపించిన యెడల భైరవ స్వామి స్వప్న దర్శన మగును.  శివుని సన్నిధిలో స్థిర చిత్తముతో ఏకాంతముగా జపము చేయవలెను. అట్లైన ప్రయత్నము లేకుండానే మనస్సు లోని కోరికలు నెరవేరగలవు.

2    మం\\     ఓం క్రీం క్రీం క్రీం హూం హుం హ్రీం హ్రీం భైం భద్రకాళీ భైం హ్రీం హ్రీం హుం హూం క్రీం క్రీం క్రీం స్వాహా ||
         
ఈ మంత్రమును శక్తి ఆలయంలో  ధ్యాన పూర్వకముగా 10000 సార్లు జపించి ఇష్ట బలి గావించిన కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించగలవు. ( కాని మనో నిగ్రహం బాగా ఉండాలి )

3.  మం\\   ఓం శ్రీం హ్రీం జయ లక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహయ శ్రీం హ్రీం నమః ||

ఈ మంత్రమును నృశింహ స్వామిని పూజిస్తూ 40 రోజులు లక్ష పర్యాయములు జపించిన ఊహాతీతముగా అన్ని కోరికలు నెరవేరగలవు.

4.  మం\\  సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళమ్
                  సర్వక్లేశ హరం  వందే స్మర్తృగామీ సనోనతు ||

ఈ మంత్రమును ప్రతి నిత్యము పఠించు చున్న అభీష్టసిద్ధి జయము కలుగును. జప సంఖ్య లేదు.

5. మం\\  వందే పద్మకరాం ప్రశన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
                హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానావిధై ర్భూషితాం
                 భక్తా భీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మా దిభి స్సేవితాం
                పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సధా శక్తిభిః  ||

ఈ మంత్రమును  ఆసనమున కుర్చుండి లేవకుండా 108 పర్యయములు పఠించిన భాగ్యవంతులగుట తథ్యం . దారిద్య బాధలంతరించి కోరికలన్నీ నెరవేరుతాయి.

6. మం\\  రోగానశేషా నపహంసి తుష్టా
                 దదాసికామాన్ సకలానభిష్టాన్
                 త్వామాశ్రితానాం నవిపన్నరాణాం
                 త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ||

ఈ మంత్రమును ప్రతినిత్యము 24 మార్లు భక్తిగా పఠించిన అనతి కాలంలోనే కష్టములు తీరి కోరికలు నెరవేరి సుఖపడగలరు .
       
  7.   మం\\   ఓం ఐం క్లీం సౌః క్లీం ఐం

ఈ మంత్రమును  లక్ష సార్లు జపించి జాకి పూలతో దేవి పూజ గావించి పాయస నైవేద్య మిచ్చిన తలచిన కోరికలు సత్వరమే నెరవేరగలవు.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

* 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

           వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నవి.
     
1. శ్రీరంగం 2. ఉరైయూర్ 3. తంజమా మణిక్కోయిల్ 4. తిరువన్బిల్ 5. కరంబనూర్ 6. తిరువెళ్లరై 7. పుళ్ళం పూదంగుడి 8. తిరుప్పేర్ నగర్ 9. ఆదనూర్ 10. తిరువళందూర్ 11. శిరుపులియూర్ 12. తిరుచ్చేరై 13. తలైచ్చంగణాన్మదియం 14. తిరుక్కుడందై 15. తిరుక్కండియూర్ 16. తిరువిణ్ణగర్ 17 తిరువాలి తిరునగరి 18. తిరుకన్నాపురం 19. తిరునాగై 20. తిరునరైయూర్

21. తిరునందిపురం 22. తిరువిందళూరు 23. తిరుచిత్రకూటం 24. శ్రీరామవిణ్ణగర్ 25. కూడలూర్ 26. తిరుక్కణ్ణంగుడి 27 తిరుక్కణ్ణ మంగై 28. కపిస్థలం 29. తిరువెళ్లియం గుడి 30. తిరుమణి మాడక్కోయిల్ 31. వైకుంఠ విణ్ణగరం 32. తిరుఅరిమేయ విణ్ణంగరం 33. తిరుత్తేవనార్ తొగై 34. తిరువణ్ పురుషోత్తమం 35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్ 36. తితుతైత్తియంబలం 37. తిరుమణిక్కూడం 38. తిరుక్కావళంపాడి 39. తిరువెళ్లక్కుళం 40. తిరుపార్తాన్ పళ్ళి

41. తిరుమాలిరుం శోలైమలై 42. తిరుక్కోటియూర్ 43. తిరుమెయ్యం 44. తిరుప్పల్లాణి 45. తిరుత్తంగాల్ 46. తిరుమోగూర్ 47. తెన్ మధురై 48. శ్రీ విల్లిపుత్తూరు 49. తిరుక్కురు గూర్ 50. తిరుతులై విల్లి మంగళం 51. శిరీవర మంగై 52. తిరుప్పళింగుడి 53. తెన్ తిరుప్పేర్ 54. శ్రీ వైకుంఠం 55. తిరువరగుణ మంగై 56. తిరుక్కళందై 57. తిరుక్కురుం గుడి 58. తిరుక్కోళూరు 59. తిరువనంతపురం 60. తిరువణ్ పరిశరాం

61. తిరుకాట్కరై 62. తిరుమూరీక్కళం 63. తిరుప్పలియూర్ 64. తిరుచిత్తార్ 65. తిరునావాయ్ 66. తిరువల్లవాళ్ 67. తిరువణ్ వండూరు 68. తిరువాట్టర్ 69. తిరువిత్తు వక్కోడు 70. తిరుక్కడిత్తానం 71. తిరువారన్ విళై 72. తిరువహింద్ర పురం 73. తిరుక్కోవలూర్ 74. పెరుమాళ్ కోయిల్ 75. శ్రీ అష్టభుజం 76. తిరుత్తణ్ కా 77. తిరువేళుక్కై 78. తిరుప్పాడగం 79. తిరునీరగం 80. తిరునిలాత్తింగళ్ తుండం

81. తిరువూరగం 82. తిరువెక్కా 83. తిరుక్కారగం 84. తిరుకార్వానం 85. తిరుక్కల్వనూర్ 86. తిరుపవళ వణ్ణం 87. పరమేశ్వరవిణ్ణగరం 88. తిరుప్పళ్ కుళి 89. తిరునిర్రవూర్ 90. తిరువెవ్వుళూరు 91. తిరునీర్మలై 92. తిరువిడ వెండై 93. తిరుక్కడల్ మల్లై 94. తిరువల్లిక్కేణి 95. తిరుఘటిగై 96. తిరుమల 97. అహోబిలం 98. అయోధ్య 99. నైమిశారణ్యం 100. సాలగ్రామం 101. బదరికాశ్రమం 102. కండమెన్రుం కడినగర్ 103. తిరుప్పిరిది 104. ద్వారక 105. బృందావనం 106. గోకులం 107 క్షీరాబ్ది 108. పరమపదం.

దివ్యదేశాలు

శ్రీరంగం
ఉరైయూర్
తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
తిరువెళ్ళరై (శ్వేతగిరి)
తిరుప్పుళ్ళం పూతంగుడి (కుంభ.కోణము 10 కి.మీ.)
తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
శిరుపులియూర్తి తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాండ్రు)
తిరుక్కుడందై (కుంభకోణము)
తిరుక్కండియూర్తి తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
తిరునాగై (నాగపట్నం)
తిరునరైయూర్ (కుంభకోణం 10 కి.మీ.)
నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాథన్ కోయిల్)
తిరువిందళూరు (మాయావరం) (తిరువళందూర్)
తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (శీర్గాళి)
కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
కపి స్థలమ్
తిరువెళ్ళియంగుడి మణిమాడక్కోయిల్ (తిరునాంగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
వైకుంద విణ్ణగరమ్
అరిమేయ విణ్ణగరమ్
తిరుత్తేవనార్ తొగై (కీళచాలై)
వణ్ పురుడోత్తమ్
శెంపొన్ శెయ్ కోయిల్
తిరుత్తెట్రియమ్బలమ్
తిరుమణిక్కూడమ్ (తిరునాంగూర్ తిరుపతి)
తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
తిరుపార్తన్ పళ్ళి
తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అంగర్ కోయిల్)
తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
తిరుప్పుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
తెన్ మధురై (మధుర) (తిరుక్కూడల్)
శ్రీవిల్లి పుత్తూరు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
తిరుప్పుళింగుడి తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
శ్రీ వైకుంఠము తిరువరగుణమంగై (నత్తం)
తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకొళమ్)
తిరుక్కురుంగుడి
తిరుక్కోళూరు
తిరువనంతపురమ్
తిరువణ్ పరిశారమ్
తిరుక్కాట్కరై
తిరుమూళక్కళమ్
తిరుప్పులియూర్ (కుట్టనాడు)
తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
తిరునావాయ్
తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
తిరువణ్ వండూరు
తిరువాట్టార్
తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
తిరుక్కడిత్తానమ్
తిరువాఱన్ విళై (ఆరుముళై)
తిరువయిందిర పురమ్
తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
అష్ట భుజమ్ (కాంచీ)
తిరుత్తణ్ గా (కాంచీ)
తిరువేళుక్కై (కాంచీ)
తిరుప్పాడగమ్ (కాంచీ)
తిరునీరగమ్ (కాంచీ)
నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
ఊఱగమ్ (కాంచీ)
తిరువెంకా (కాంచీ)
తిరుక్కారగమ్ (కాంచీ)
కార్వానమ్ (కాంచీ)
తిరుక్కళ్వనూర్ (కాంచీ)
పవళవణ్ణమ్ (కాంచీ)
పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
తిరుప్పుళ్ కుం (కాంచీ)
తిరునిన్ఱవూర్
తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
తిరువిడవెన్దై
తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
తిరువల్లిక్కేణి (చెన్నై)
తిరుక్కడిగై (చోళసింహపురము)
తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
తిరువయోధ్యై
నైమిశారణ్యం
శాళక్కిణామం (సాలగ్రామమ్)
బదరికాశ్రమం (బదరీనాథ్)
కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
వడమధురై (ఉత్తరమధుర)
శ్రీ ద్వారకతిరువాయిప్పాడి (గోకులము)
తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
పరమపదమ్ (తిరునాడు)
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

Tuesday, 28 March 2017

శ్రీ హేవళంబి నామ సంవత్సర రాశిఫలాలు

శ్రీ హేవళంబి నామ సంవత్సర రాశిఫలాలు

మేషం

(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 3

             శ్రీ హేవళంబినామ సంవత్సరంలో మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు అనుకూలిస్తాయి.
              ఆస్తులు పెంపొందించుకుంటారు. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పట్టుదలతో కృషి చేసినప్పుడే ఉన్నత చదువుల్లో లక్ష్యాలు సాధించగలుగుతారు.
               ఈ ఏడాది 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి.
            హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సెప్టెంబర్‌ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లభిస్తుంది.
             కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. స్నేహ, బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఏడాది 8, 9 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు.
           ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ 7- ఆగస్టు 26 తేదీల మధ్య స్పెక్యులేషన్లలో నష్టం సంభవం.
             ఆరోగ్యం మందగిస్తుంది. క్రయవిక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. పైచదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. 5, 4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా శ్రీ హేవళంబి సంవత్సరంలో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది.
             కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటపడతారు. సంతతి విషయంలో ఆందోళనకు గురవుతారు. 11, 10 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో ప్రోత్సాహకరం.
              వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాస్త ఫలితం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పైఅధికారులతో వ్యవహారాల్లో మౌనం మంచిది. దత్తాత్రేయస్వామి ఆరాధనతో చిక్కులు తొలగుతాయి.

వృషభం

(కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
 ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 7 అవమానం: 6

      హేవళంబినామ సంవత్సరంలో అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.

           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. 5-6 స్థానాల్లో గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు.

             ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్‌ వరకు గురువు వక్రగమనంలో ఉన్నందున పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.
             ఆరోగ్యం, విద్య పట్ల అధిక శ్రద్ధ చూపాలి. సెప్టెంబర్‌ 13 నుంచి గురువు తులారాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఉద్యోగ యత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. ఈ సంవత్సరం శని 7, 8 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

           స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. శతృబాధలు, రుణ బాధలు అధికం. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పనిచేసేవారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

            వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరంలో 4, 3 స్థానాల్లో రాహుసంచారం కారణంగా కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆటంకాలను అధిగమించి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బదిలీలకు అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధి స్తారు.

              ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. 10, 9 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో చికాకులు, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఖర్చులు అంచనాలు మిం చుతాయి. స్నేహానుబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షేర్ల లావాదేవీల్లో నష్టం తప్పకపోవచ్చు. ఉన్నత చదువుల్లో పట్టుదలతో శ్రమించి ఫలితం సాధిస్తారు. ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం.

మిథునం

(మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 3 అవమానం: 6

           హేవళంబినామ సంవత్సరంలో స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు.
           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచరిస్తాడు. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
            పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. గురువు వక్రగమనంలో ఉండే ఉగాది నుంచి జూన్‌ వరకు మధ్య రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

          న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నుంచి సంవత్సరాంతం వరకు గురువు పంచమంలో సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభప్రదం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. శని ఈ సంవత్సరమంతా 6, 7 స్థానాల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

         శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శని వక్రించిన ఏప్రిల్‌ 7- ఆగస్టు 26 మధ్య ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

           వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 3, 2 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు ఆస్కారం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
            వయసులో చిన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. చెడుస్నేహాలకు దూరంగా ఉండాలి. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది దూరంగా ఉండటం శ్రేయస్కరం. 9, 8 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి.

            ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆంజనేయస్వామి ఆరాధనతో సత్ఫలితాలొస్తాయి.

కర్కాటకం

(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష) ఆదాయం: 14 వ్యయం: 2 రాజపూజ్యం: 6 అవమానం: 6

        శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఈ రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్స ల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం.

           విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చు కుంటారు. ఉగాది నుంచి జూన్‌ వరకు విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురుగ్రహం సెప్టెంబర్‌ 12 వరకు కన్యలో ఆ తరువాత తులారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. దూరప్రయాణాలకు అనుకూలం.

          ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 19 వరకు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి.సెప్టెంబర్‌ తరువాత స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

          ఈ ఏడాది 5, 6 స్థానాల్లో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు.

             భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. శని వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ - ఆగస్టు మాసాల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం.

           వివాహ యత్నాలు నెమ్మదిగా నెరవేరతాయి. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 2, 1 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో నిలవదు. 8, 7 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం మంద గిస్తుంది.

         మానసిక ఆందోళన అధికం. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభాలనిస్తుంది.

సింహం

(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఆదాయం: 2 వ్యయం: 14 రాజపూజ్యం: 2 అవమానం: 2

        శ్రీ హేవళంబిలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.ఆరోగ్యం మెరుగవుతుంది.

          ఏప్రిల్‌ -జూన్‌ మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు.

          సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనందం కలిగిస్తాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.

           సెప్టెంబర్‌ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. 4,5 స్థానాల్లో శని సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

          ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్‌ 7 - ఆగస్టు 26 తేదీల మధ్య ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం.

           స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 1, 12 స్థానాల్లో రాహు సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు.

          ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. 7, 6 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యభగవానుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

కన్య

(ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు)
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 5 అవమానం: 2

          శ్రీ హేవళంబినామ సంవత్సరంలో అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. వివాహ, ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం.

          ఏప్రిల్‌ -జూన్‌ మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీవారు, శ్రీమతి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బాంధవ్యాలు బలపడతాయి.
         కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 7 నుంచి జూన్‌ 10 వరకు గురువు వక్రించిన కారణంగా అశాంతికి లోనవుతారు.
           అలర్జీలు బాధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సెప్టెంబర్‌ 13 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించు కుంటారు. శని 3, 4 స్థానాల్లో సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి.
          విద్యార్థులకు చదువుల పట్ల అఽశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్రమగమనంలో ఉన్న ఏప్రిల్‌-ఆగస్టు మాసాల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం అవుతాయి.
              శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 12, 11 స్థానాల్లో రాహుగ్రహ సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసంతా చికాకుగా ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. 6, 5 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల లాభం కలుగతుంది.

తుల

(చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 1 అవమానం: 5

         శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ప్రమోషన్లు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాల వారికి శుభప్రదం. ఉగాది నుంచి జూన్‌ వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు.
           విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. గురువు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలు ఉన్నత పదవులు అందుకుంటారు. సినీరంగానికి చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
            విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు అధికం. ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఇల్లు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికవిషయాల్లో నిదానంగా కానీ పనులు జరగవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
          పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. 2, 3 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సోదరీసోదరులు, సన్నిహితుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబపరమైన గొడవలు తలెత్తుతాయి. చదువుల పట్ల శ్రద్ధ లోపిస్తుంది.
           వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురైనా చివరకు సానుకూల ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు పట్టుదలతో కృషి చేసి చదువుల్లో రాణిస్తారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య విషయాల్లో మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 11, 10 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
          పట్టుదలతో ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 5, 4 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
           ఆస్తులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. గృహనిర్మాణ కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. శ్రీరామచంద్రుడి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది

వృశ్చికం

(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం: 8 వ్యయం: 14 రాజపూజ్యం: 4 అవమానం: 5

          శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది.

            ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది.
          వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ గమనానికి, విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం.

             ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. ఉగాది నుంచి జూన్‌ వరకు పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.ఖర్చులు పెరుగుతాయి. 1, 2 స్థానాల్లో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో అటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. స్నేహ, బాంధవ్యాల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది.
             ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. రుణబాధలు అధికం. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. దీర్ఘకాలిక దృష్టితో చేసే పెట్టుబడులు కొంతవరకు లాభిస్తాయి. వేరేవారి ఆర్థిక విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి లక్ష్యాలు సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు.

             శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 10, 9 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదని గ్రహించాలి. అనుభవం ఉన్న వారి సహకారంతో ఒక నిర్ణయానికి వస్తారు.
               4, 3 స్థానాల్లో కేతు సంచారం కారణంగా కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
 ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 7 అవమానం: 1

      శ్రీ హేవళంబిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకారరంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

        విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి. గురువు ఈ ఏడాది 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
           తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందర పాటు నిర్ణయాలు తగవు. సెప్టెంబర్‌ 13 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

              పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. 12, 1 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సహకారం, సలహాలు తీసుకుని ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి.
              ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు శని వక్రించి ఉన్న కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఓరిమితో మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 9, 8 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

             ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు ఏ మాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. 3, 2 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు అధికం. సంతానం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు పరధ్యానం కారణంగా నష్టపోతారు. మనసు చికాకుగా ఉంటుంది. గణపతి ఆరాధన వల్ల సత్ఫలితాలు సాధిస్తారు.

మకరం

(ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)
 ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 1

             శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీగమన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి.
              వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం.
             కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి.

           మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. 11, 12 స్థానాల్లో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికం. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు.

           రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు భాగస్వామి సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 8, 7 స్థానాల్లో రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించాలి.

             వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్లే అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. 2, 1 స్థానాల్లో కేతు సంచారం కారణంగా అనవసర ఖర్చులు అధికం. చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

కుంభం

(ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
 ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 6 అవమానం: 1

         శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం.

           ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆర్థిక విషయాల కారణంగా ఆందోళన అధికం అవుతుంది. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 8-9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు సంభవం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం.
             ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి. ఉగాది నుంచి జూన్‌ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

             ఈ ఏడాది 10, 11 స్థానాల్లో శని సంచారం ఫలితంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు.

            కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఒత్తిళ్లు అధికమౌతాయి. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల్లో నష్టం సంభవం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు.

            శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 7, 6 స్థానాల్లో రాహు సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకావం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. రుణబాధలు అధికం. 12, 1 స్థానాల్లో కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడి ఆరాధన శుభప్రదం.

మీనం

(పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4

            శ్రీ హేవళంబినామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఏప్రిల్‌ - జూన్‌ మాసాల మధ్య ఆందోళనలు పెరుగుతాయి.

            వృత్తిపరమైన ఒత్తిళ్ళు, న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. సెప్టెంబర్‌ 13 వరకు 7వ స్థానంలో గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు.

          ఆస్తులు పెంపొందించుకుంటారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉగాది నుంచి జూన్‌ 11 వరకు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

              శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది శని 9, 10 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల్లో చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు ఆస్కారం ఉంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది.

          మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఏప్రిల్‌ 7 నుంచి ఆగస్టు 26 వరకు ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో 6, 5 స్థానాల్లో రాహు సంచారం వల్ల రుణ బాధలు అధికం.

              ఆర్ధిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సర్జరీ చేయించుకోవాల్సి రావచ్చు. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 12, 11 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఇంటి కోసం ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. పార్వతీదేవి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి